రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాలు బీజేపీకే
లోక్‌సభ స్పీకర్ పోస్టుపైనా ఇదే వైఖరి
న్యూఢిల్లీ: ఎన్డీఏ నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న తర్వాత మంత్రివర్గ కూర్పుపై బీజేపీ దృష్టిసారించింది. మిత్రపక్షాల నుంచి కీలకశాఖలు కావాలనే డిమాండ్లు వచి్చన నేపథ్యంలో గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర సీనియర్ నేతలు సమావేశమయ్యారు.
ప్రాథమికంగా జరిగిన చర్చల్లో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోవాలని బీజేపీ నేతల నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీకి సొంతంగా 240 సీట్లు (ఎన్డీఏకు 293) మాత్రమే వచి్చనందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ (16 సీట్లు), జేడీయూ (12 సీట్లూ)లపై పూర్తిగా ఆధారాపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పారీ్టలు నలుగురు ఎంపీలకు ఒక కేబినెట్ మంత్రి పదవిని అడుగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి నాలుగు, జేడీయూకు మూడు కేబినెట్ బెర్తులు ఇవ్వాల్సి ఉంటుంది.
టీడీపీ స్పీకర్ పదవిని కూడా అడుగుతోంది. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను కూడా కోరుతోంది. ఏడుగురు ఏంపీలున్న శివసేన (షిండే), ఐదుగురు ఎంపీలున్న ఎల్జేపీ (ఆర్‌వీ) కూడా రెండేసి మంత్రిపదవులు అడుగుతున్నాయి. గత రెండు ప్రభుత్వాల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటినందువల్ల మిత్రపక్షాలకు ముఖ్యమైన శాఖలు దక్కలేదు. ఎంపీల సంఖ్య ఆధారంగా మంత్రిపదవులు కేటాయించాల్సిన పరిస్థితిని ప్రస్తుతం బీజేపీ ఎదుర్కొంటోంది. కాబట్టి ఈసారి మిత్రపక్షాలకు మరింత ఎక్కువగా మంత్రిపదవులు దక్కనున్నాయి.
మిత్రపక్షాల నుంచి ఎంత ఒత్తిళ్లు వచి్చనా అత్యంత కీలకమైన శాఖలపై బీజేపీ రాజీపడకపోవచ్చని సమాచారం. రక్షణ, ఆర్థిక, హోంశాఖ, విదేశీ వ్యవహారాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడిన శాఖలను కూడా తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే సంక్షేమం, యువజన వ్యవహారాలు, వ్యవసాయం తదితర శాఖలను అంత సులువుగా వదులుకునేలా లేదు. పేదలు, మహిళలు, యువకులు, రైతుల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఈ శాఖలను తామే ఉంచుకోవాలని బీజేపీ ఆశిస్తోంది.
రైల్వేలు, రహదారుల విషయంలోనూ గడిచిన పదేళ్లలో తాము భారీ సంస్కరణలు తెచ్చామని.. ఈ వేగం మందగించకూడదంటే ఈ శాఖలు తమ వద్దే ఉండాలని పేర్కొంటోంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో రైల్వే శాఖ సాధారణంగా మిత్రపక్షాల చేతుల్లో ఉంటూ వచి్చంది. కానీ బీజేపీ గట్టి ప్రయత్నంలో రైల్వే శాఖను తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంది. జేడీయూకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇవ్వజూపుతున్నట్లు సమాచారం. భారీ పరిశ్రమల శాఖను ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు ఆఫర్ చేస్తోంది.
అయితే ఆర్థిక, రక్షణ తదితర కీలకశాఖల్లో మిత్రపక్షాలకు సహాయమంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందని చర్చలకు సంబంధించిన విషయాలపై సమాచారం ఉన్న విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పర్యాటక, ఎంఎస్‌ఎంఈ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, సామాజిక న్యాయ శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశముందని సమాచారం. చంద్రబాబు నాయుడు లోక్‌సభ స్పీకర్ పదవిపై పట్టుబడితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వజూపి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేయవచ్చునంటున్నారు. బీజేపీ సంఖ్యాబలం లేనందున టీడీపీ, జేడీయూలు తమ డిమాండ్లపై పట్టుబడితే.. బీజేపీ ఎంతవరకు తలొగ్గుతుంది, ఎలా బుజ్జగిస్తుందనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment