government formation
-
మణిపూర్ సీఎంగా మైతేయి వర్గం నేత..!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలనలో ఉన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మైతేయి వర్గానికి చెందిన ఎమ్మెల్యేకే ముఖ్యమంత్రిగా మళ్లీ అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ వర్గానికి చెందిన ముగ్గురి నేతలు రేసులో ఉండగా వీరికి 22 మంది ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో మార్చి 10న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సీఎం రేసులో శాసనసభ ప్రస్తుత స్పీకర్ తోక్చోమ్ సత్యవ్రత్ సింగ్ కూడా ఉన్నారు. బిరెన్ సింగ్ రెండు పర్యాయాలు సీఎంగా ఉన్నప్పుడు తోక్చోమ్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసపై బిరెన్ సింగ్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడి తోక్చోమ్ వార్తల్లో నిలిచారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న రెండో నేత యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్. ఈయన 2017– 2022 సంవత్సరాల మధ్య మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. బిరేన్ సింగ్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేబినెట్లో ఉన్నారు. తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్ సీఎం రేసులో ఉన్న మూడో నేత. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీఎం సలహాదారుగా ఉన్న రాధేశ్యామ్ సింగ్ 2017 –2022 మధ్య విద్య, కారి్మక, ఉపాధి శాఖల మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులు బిరేన్ సింగ్ రాజీనామా తర్వాత, మైతేయి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు రెండు శిబిరాలుగా విడిపోయారు. బిరేన్సింగ్ను మళ్లీ సీఎం చేయాలని ఒక వర్గం కోరుతుండగా, మరో వర్గం వ్యతిరేకిస్తోంది. అయితే మార్చి 10వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపూర్ విషయంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయతి్నంచే అవకాశాలున్నాయి. అందుకే ఆలోగా కొత్త సీఎంను ఎంపిక చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మాత్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరింతకాలం కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బలమున్నా.. కరువైన ఏకాభిప్రాయం మాజీ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ కూడా మైతేయి వర్గానికి చెందినవారే. అయితే, కుకీలతో పాటు బీజేపీకి చెందిన పలువురు మైతేయి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. కుకీ–మైతేయి వర్గాల మధ్య 2023 మే 3వ తేదీన మొదలైన హింసకు ఇప్పటికీ అడ్డుకట్టపడలేదు. హింసాకాండ సమయంలో కుకీలకి వ్యతిరేకంగా మైతేయిలను బిరెన్ సింగ్ ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన ఫిబ్రవరి 9వ తేదీన సీఎం పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఎం ఎంపికపై ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఫిబ్రవరి 13న రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రంలో ఇంకా అసెంబ్లీని రద్దు చేయని కారణంగా మార్చి 10 లోగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 27 మంది మైతేయిలు, ఆరుగురు కుకీలు, ముగ్గురు నాగాలు, ఒక ముస్లిం ఉన్నారు. నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు చెందిన ఐదుగురు సహా ఎన్డీఏకు మొత్తం 42 మంది ఎమ్మెల్యేలున్నారు. -
సీఎం పీఠం కోసం ఏక్నాథ్ షిండే పట్టు
-
ఏపీ గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం ముగిశాక నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నకున్నట్లు గవర్నర్ నజీర్‌కు లేఖ ఇచ్చారు. గవర్నర్‌ను కలిసిన వాళ్లలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల, బీజేపీ నుంచి పురందేశ్వరి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన సంఖ్యా బలం తమకు ఉందని, చంద్రబాబును తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఈ సందర్భంగా వాళ్లు ఆయన్ని కోరారు. ఆ ఎమ్మెల్యేల సంతకాల లేఖను పరిశీలించిన గవర్నర్ నజీర్.. ప్రభుత్వ ఏర్పాటునకు సాయంత్రంలోగా ఆహ్వానిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి నేతగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఎన్డీయే కూటమి నేతగా.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆమోదం తెలిపారు. ఆవెంటనే మూడు పార్టీల ఎమ్మెల్యేలు సమ్మతి తెలపడంతో సభా నాయకుడిగా చంద్రబాబు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కూటమి అద్భుత విజయం ఏపీ రాష్ట్రం సాధించిన విజయం. సమిష్టిగా పోరాడి అద్భుత విజయం సాధించాం. ఎన్డీయే కూటమి విజయం దేశవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. అద్భుతమైన మెజారిటీ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. కక్ష సాధింపులు.. వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. ఏపీ ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబుకి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రబాబు అనుభవజ్ఞుడే కాదు.. ధైర్యశాలి కూడా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం. ప్రజలకు ఎన్నో హామీలిచ్చాం. వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.:: పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించాం. ఇంతటి ఘన విజయం సాధిస్తామని ఎవరూ ఊహించలేదు. ::బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిఎన్డీయే శాసనసభా పక్ష నేతగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలు ఏకం అయ్యాయి. అధిక స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించాం. ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు. ఇది అన్‌స్టాపబుల్ విజయం. ఏపీలో ఘన విజయంతో ఢిల్లీలో గౌరవం పెరిగింది. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ::చంద్రబాబు నాయుడు శాసనసభ పక్ష నేతల ఎంపికకూటమి మీటింగ్ కంటే ముందే.. మంగళగిరి జనసేన ఆఫీస్‌లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పవన్‌ను జనసేన శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఈ పేరును ప్రతిపాదించగా.. అందుకు ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం అయ్యారు. కానీ, శాసన సభా పక్ష నేత ఎంపిక నిర్ణయం అధిష్టానానికే వదిలేసినట్లు సమాచారం. దీంతో బీజేఎల్పీపై సస్పెన్స్ కొనసాగుతోంది.రేపే ప్రమాణం.. స్టేట్ గెస్ట్‌గా చిరుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణం చేయనున్నారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. మరోవైపు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్‌గా నటుడు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు చంద్రబాబు. దీంతో ఈ సాయంత్రమే చిరు విజయవాడకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు రాం చరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. మంత్రి వర్గంపై ఉత్కంఠమరోవైపు.. రేపు(బుధవారం) ఉదయం ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులుగా కూడా ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం. టీడీపీ కోటాతోపాటు జనసేన, బీజేపీ నుంచి పేర్లతో కేబినెట్ కూర్పు ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ కూర్పు కోసం మూడు పార్టీల నేతలు సుదీర్ఘ కసరత్తులే చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయోననే ఉత్కంఠ ఆయా పార్టీ శ్రేణుల్లో నెలకొంది. -
Indian stock market: భారీ లాభాలకు అవకాశం
ముంబై: దలాల్ స్ట్రీట్ ఈ వారం భారీ కొనుగోళ్లతో కళకళలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఆర్థిక సంస్కరణల కొనసాగింపుపై మరింత స్పష్టత రావడంతో బుల్ పరుగులు తీసే వీలుందంటున్నారు. ఇక అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం నుంచి ఈ వారం మార్కెట్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే దేశీయ ద్రవ్యల్బోణ గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం ట్రేడింగ్‌ను నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేర్లు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇదే రోజున లీ ట్రావెన్యూస్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం ప్రారంభమై, బుధవారం ముగుస్తుంది. ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాలు, ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో గతవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 76,795 వద్ద కొత్త రికార్డు నమోదుతో పాటు 2,732 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 23,339 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మొత్తంగా 759 పాయింట్లు ఆర్జించింది. కళ్లన్నీ ఫెడ్ సమావేశం పైనే..! అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు గురువారం(జూన్ 13న) విడుదల కానున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా (5.25–5.50 శ్రేణిలో) ఉంచొచ్చని అంచనాలు నెలుకొన్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత తర్వాత ఫెడ్ రిజర్వ్ తొలి రేట్ల తగ్గింపు సెపె్టంబర్లోనా.? డిసెంబర్లోనా..? అనే అంశంపై స్పష్టత కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి దేశీయంగా మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా జూన్ 12న, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు జూన్ 14న విడుదల కానున్నాయి. రిటైల్ ద్రవ్యల్బోణం ఏప్రిల్‌లో 4.85%, మార్చిలో 4.83 శాతంగా నమోదైంది. ఈసారి మేలో4.8శాతంగా నమోదవ్వొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఐఐపీ డేటా 4.9% నుంచి 3.9 శాతానికి దిగిరావచ్చని భావిస్తున్నారు.రూ.14,794 కోట్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తొలి వారంలో రూ.14,794 కోట్లను వెనక్కి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడం.., అదే సమయంలో చైనా స్టాక్ మార్కెట్ ఆకర్షణీయంగా ఇందుకు ప్రధాన కారణాలు. మరోవైపు డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇక మే నెలలో ఎన్నికల ఫలితాలపై భిన్న అంచనాల కారణంగా రూ.25,586 కోట్లు ఉపసంహరించుకున్నారు. కాగా ఏప్రిల్‌లో రూ.8,700 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. -
మహాత్మునికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన ఈరోజు ఉదయాన్నే రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాలలు ఉంచి, నివాళులర్పించారు.మోదీ ప్రమాణాస్వీకారోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పలు చోట్ల దీనికి సంబంధించిన పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే లను ఆహ్వానించారు. #WATCH | Delhi: PM-designate Narendra Modi arrives at Rajghat to pay tribute to Mahatma Gandhi, ahead of his swearing-in ceremony, to be held today at Rashtrapati Bhawan.He will take the Prime Minister's oath for the third consecutive term, today at 7:15 PM. pic.twitter.com/L7u5S0uvHo— ANI (@ANI) June 9, 2024 ఇదీ చదవండి: నేడు మోదీ మూడోసారి -
ఎన్డీఏ కూటమి కీలక సమావేశం..
-
పెద్ద శాఖలు ఇవ్వలేం!
న్యూఢిల్లీ: ఎన్డీఏ నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న తర్వాత మంత్రివర్గ కూర్పుపై బీజేపీ దృష్టిసారించింది. మిత్రపక్షాల నుంచి కీలకశాఖలు కావాలనే డిమాండ్లు వచి్చన నేపథ్యంలో గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ప్రాథమికంగా జరిగిన చర్చల్లో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోవాలని బీజేపీ నేతల నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీకి సొంతంగా 240 సీట్లు (ఎన్డీఏకు 293) మాత్రమే వచి్చనందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ (16 సీట్లు), జేడీయూ (12 సీట్లూ)లపై పూర్తిగా ఆధారాపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పారీ్టలు నలుగురు ఎంపీలకు ఒక కేబినెట్ మంత్రి పదవిని అడుగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి నాలుగు, జేడీయూకు మూడు కేబినెట్ బెర్తులు ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీ స్పీకర్ పదవిని కూడా అడుగుతోంది. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను కూడా కోరుతోంది. ఏడుగురు ఏంపీలున్న శివసేన (షిండే), ఐదుగురు ఎంపీలున్న ఎల్జేపీ (ఆర్వీ) కూడా రెండేసి మంత్రిపదవులు అడుగుతున్నాయి. గత రెండు ప్రభుత్వాల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటినందువల్ల మిత్రపక్షాలకు ముఖ్యమైన శాఖలు దక్కలేదు. ఎంపీల సంఖ్య ఆధారంగా మంత్రిపదవులు కేటాయించాల్సిన పరిస్థితిని ప్రస్తుతం బీజేపీ ఎదుర్కొంటోంది. కాబట్టి ఈసారి మిత్రపక్షాలకు మరింత ఎక్కువగా మంత్రిపదవులు దక్కనున్నాయి. మిత్రపక్షాల నుంచి ఎంత ఒత్తిళ్లు వచి్చనా అత్యంత కీలకమైన శాఖలపై బీజేపీ రాజీపడకపోవచ్చని సమాచారం. రక్షణ, ఆర్థిక, హోంశాఖ, విదేశీ వ్యవహారాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడిన శాఖలను కూడా తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే సంక్షేమం, యువజన వ్యవహారాలు, వ్యవసాయం తదితర శాఖలను అంత సులువుగా వదులుకునేలా లేదు. పేదలు, మహిళలు, యువకులు, రైతుల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఈ శాఖలను తామే ఉంచుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. రైల్వేలు, రహదారుల విషయంలోనూ గడిచిన పదేళ్లలో తాము భారీ సంస్కరణలు తెచ్చామని.. ఈ వేగం మందగించకూడదంటే ఈ శాఖలు తమ వద్దే ఉండాలని పేర్కొంటోంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో రైల్వే శాఖ సాధారణంగా మిత్రపక్షాల చేతుల్లో ఉంటూ వచి్చంది. కానీ బీజేపీ గట్టి ప్రయత్నంలో రైల్వే శాఖను తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంది. జేడీయూకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇవ్వజూపుతున్నట్లు సమాచారం. భారీ పరిశ్రమల శాఖను ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు ఆఫర్ చేస్తోంది. అయితే ఆర్థిక, రక్షణ తదితర కీలకశాఖల్లో మిత్రపక్షాలకు సహాయమంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందని చర్చలకు సంబంధించిన విషయాలపై సమాచారం ఉన్న విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పర్యాటక, ఎంఎస్ఎంఈ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, సామాజిక న్యాయ శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశముందని సమాచారం. చంద్రబాబు నాయుడు లోక్‌సభ స్పీకర్ పదవిపై పట్టుబడితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వజూపి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేయవచ్చునంటున్నారు. బీజేపీ సంఖ్యాబలం లేనందున టీడీపీ, జేడీయూలు తమ డిమాండ్లపై పట్టుబడితే.. బీజేపీ ఎంతవరకు తలొగ్గుతుంది, ఎలా బుజ్జగిస్తుందనేది చూడాలి. -
NDA పక్ష నేతగా మోదీని ఎన్నుకున్న భాగస్వామ్య పార్టీలు
-
Lok Sabha Election Results 2024: ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం రండి
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై విపక్ష ఇండియా కూటమి మల్లగుల్లాలు పడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అందరి అంచనాలనూ మించి కూటమి 234 స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో కాంగ్రెస్‌తో పాటు భాగస్వామ్య పక్షాలన్నీ జోష్‌లో ఉన్నాయి. బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం జరిగింది. ఇండియా కూటమిలో చేరాల్సిందిగా పార్టీలన్నింటినీ ఆహా్వనిస్తున్నట్టు ఖర్గే ఈ సందర్భంగా ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణకు, అందులో పేర్కొన్న విలువలకు కట్టుబడ్డ పారీ్టలన్నింటికీ ఇండియా కూటమిలోకి స్వాగతమన్నారు. తమ కూటమి పక్షాలన్నీ ఎన్నికల్లో అద్భుతంగా పోరాడాయంటూ ప్రశంసించారు. ‘‘ప్రజా తీర్పు ప్రధాని మోదీకి, ఆయన విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వెలువడింది. ఫలితాలు ఆయనకు నైతిక ఓటమి. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కానీ ప్రజా తీర్పును కాలరాసేందుకు మోదీ ప్రయతి్నస్తున్నారు’’ అంటూ ఖర్గే దుయ్యబట్టారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అన్ని పారీ్టలపైనా ఉందన్నారు. సరైన సమయంలో సరైన చర్యలు భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలన వద్దని ప్రజలు స్పష్టంగా తీర్పు వెలువరించారన్నారు. దాన్ని నెరవేర్చేందుకు ఇండియా కూటమి సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందంటూ నర్మగర్భంగా మాట్లాడారు. కూటమి నేతలంతా భేటీలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు ముందుకు వెళ్లడం లేదన్నారు. మోదీ సారథ్యంలోని బీజేపీ ఫాసిస్టు పాలనపై రాజీలేని పోరు కొనసాగించాలని కూటమి నేతలంతా నిర్ణయించామన్నారు. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. దాన్ని చేరేందుకు ఇండియా కూటమికి మరో 38 సీట్లు కావాలి. పాలక ఎన్డీఏ కూటమికి మెజారిటీకి మించి 292 స్థానాలొచి్చనా బీజేపీ మాత్రం 240కే పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జేడీ(యూ), శివసేన, ఎల్జేపీ వంటి భాగస్వాములపై ఆధారపడింది. ఈ నేపథ్యంలో ఆ పారీ్టలను తమవైపు తిప్పుకునేందుకు ఇండియా కూటమి ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెబుతున్నారు. ఇండియా కూటమి భేటీలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ వద్రాతో పాటు భాగస్వామ్య పక్షాల నుంచి అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), స్టాలిన్ (డీఎంకే), సంజయ్ రౌత్ (శివసేన–యూబీటీ), శరద్ పవార్, సుప్రియా సులే (ఎన్సీపీ–ఎస్పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), చంపయ్ సోరెన్ (జేఎంఎం), సీతారాం ఏచూరి (సీపీఎం), సంజయ్ సింగ్, రాఘవ్ ఛద్దా (ఆప్), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), ఎన్కే ప్రేంచంద్రన్ (ఆరెస్పీ) తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు తదితర భావి వ్యూహాలపై నేతలంతా రెండు గంటలకు పైగా లోతుగా చర్చించారు. వేచి చూడండి: తేజస్వి భేటీకి ముందు తేజస్వి మీడియాతో మాట్లాడుతూ ‘ఏం జరగనుందో వేచి చూడండి’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన, ఎన్డీఏ భేటీలో పాల్గొనేందుకు జేడీ(యూ) చీఫ్ నితీశ్‌కుమార్ బుధవారం పట్నా నుంచి ఢిల్లీకి ఒకే విమానంలో వెళ్లడం విశేషం! ఆ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని మాటలు కలిపడంతో మీడియాలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. నితీశ్‌ను తిరిగి ఇండియా కూటమిలో చేరేలా ఒప్పించేందుకు తేజస్వి ప్రయతి్నంచారంటూ పుకార్లొచ్చాయి. దాంతో ఢిల్లీ చేరగానే విమానాశ్రయంలో మీడియా అంతా తేజస్విని చుట్టుముట్టింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. నితీశ్‌తో తన మాటలు కుశల ప్రశ్నలకే పరిమితమైనట్టు తేజస్వి బదులిచ్చారు. -
ఎగ్జిట్ పోల్ జోష్.. కుమ్మేసిన బుల్స్
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు కానుందని వెలువడిన ఎగ్జిట్ పోల్ అంచనాలతో మార్కెట్ కొత్త శిఖరాలకు పరుగులు తీసింది. ఎన్డీఏ భారీ మెజారిటీని సాధించనుందన్న అంచనా కొనుగోళ్ల జోరుకు దారిచూపింది. ఒక్కసారిగా ఊపందుకున్న పెట్టుబడులతో స్టాక్ బుల్ లాభాలతో కుమ్మేసింది. దీంతో సెన్సెక్స్ 2,507 పాయింట్ల(3.5 శాతం) పోల్‌వాల్ట్ చేసింది. 76,469 వద్ద ముగిసింది. నిఫ్టీ 733 పాయింట్లు(3.3 శాతం) ఎగసి 23,264 వద్ద స్థిరపడింది, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభాలతో ముగిశాయి. గతంలో 2021 ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజున సెన్సెక్స్, నిఫ్టీ 5 శాతం చొప్పున జంప్ చేశాయి. అంతక్రితం అంటే 2019 మే 20న సైతం ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి రెండోసారి విజయాన్ని అంచనా వేయడంతో మార్కెట్లు 3 శాతానికిపైగా పురోగమించాయి. ఇంట్రాడేలోనూ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి.సంపదే సంపదమార్కెట్లు కదం తొక్కడంతో ఒకే ఒక్క రోజులో స్టాక్ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 13.78 లక్షల కోట్లు పెరిగింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 426 లక్షల కోట్లకు చేరింది. వెరసి సరికొత్త రికార్డ్ 5.13 ట్రిలియన్ డాలర్లను తాకింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సైతం 5.09 లక్షల కోట్ల డాలర్ల(రూ. 422.48 లక్షల కోట్లు)కు చేరింది. స్పష్టమైన మెజారిటీతో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుండటంతోపాటు.. గతేడాది(2023–24) దేశ జీడీపీ ప్రపంచ దేశాలలోనే అత్యధికంగా 8.2 శాతం వృద్ధిని సాధించడం ఇన్వెస్టర్లకు ఎనలేని ప్రోత్సాహాన్నిచ్చినట్లు విశ్లేషణ.రిలయన్స్ భళా..సెన్సెక్స్ 30 షేర్లలో 25 కౌంటర్లు భారీ లాభాలతో నిలవగా.. కేవలం సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, ఇన్ఫోసిస్ నామమాత్రంగా డీలా పడ్డాయి. వీటితోపాటు ఇక నిఫ్టీ 50లో ఐషర్, ఎల్టీఐఎం, బ్రిటానియా స్వల్ప వెనకడుగు వేశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియలీ్ట, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, మీడియా, ఆటో 7–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. హెవీవెయిట్ షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 6 శాతం జంప్‌చేసి మార్కెట్లకు దన్నునిచ్చింది. రూ. 3,021కు చేరడం ద్వారా రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను జమ చేసుకుంది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 20.44 లక్షల కోట్లను దాటింది. షేరు తొలుత రూ. 3,029 వద్ద రికార్డ్ గరిష్టానికి చేరింది. ప్రభుత్వ షేర్ల పరుగుతాజా ర్యాలీలో పలు ప్రభుత్వ రంగ కౌంటర్లు లాభాల పరుగు తీశాయి. దీంతో ఎస్బీఐ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా 9.5–4.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇతర బ్లూచిప్స్‌లో శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, అ్రల్టాటెక్, ఇండస్ఇండ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ త్రయం, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, కొటక్ బ్యాంక్ 7–2.5 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో బీవోబీ, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ ఒక దశలో 52 వారాల గరిష్టాలకు చేరాయి. పీఎస్‌యూగా ఎస్బీఐ తొలిసారి రూ. 8 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించడం విశేషం!విదేశీ పెట్టుబడుల జోరు బీఎస్ఈ నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లుతాజాగా రూ. 6,851 కోట్ల పెట్టుబడులను పంప్ చేశారు. డీఐఐలు సైతం రూ. 1,914 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. గత వారాంతాన సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,613 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. బీఎస్ఈ సూచీలలో మిడ్ క్యాప్ 3.5 శాతం, స్మాల్ క్యాప్ 2 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,346 లాభపడితే.. 1,615 మాత్రమే నష్టపోయాయి.అదానీ షేర్ల మెరుపులుప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న అంచనాలకుతోడు, జఫరీస్ బ్రోకింగ్ బయ్ రేటింగ్‌తో తాజాగా అదానీ గ్రూప్ కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్ షేర్లు 4% నుంచి 16% వరకు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఫలితంగా గ్రూప్‌లోని మొ త్తం 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 19.42 లక్షల కోట్లను అధిగమించింది.రూపాయి ర్యాలీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీపై అంచనాలతో స్టాక్ మార్కెట్లతోపాటు దేశీ కరెన్సీ సైతం జోరందుకుంది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 28 పైసలు బలపడింది. తద్వారా 2023 నవంబర్ 15 తదుపరి(24 పైసలు) ఒకే రోజు రూపాయి అత్యధికంగా పుంజుకుంది. వెరసి రెండు నెలల గరిష్టం 83.14 వద్ద ముగిసింది. ఇంతక్రితం మార్చి 21న 83.13 వద్ద నిలిచింది. ఉత్పత్తిని యథాతథంగా కొనసాగించే ఒపెక్ నిర్ణయంతో చమురు ధరలు బలహీనపడటం సైతం రూపాయికి ప్రోత్సాహాన్నిచి్చనట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొలుత 83.09 వద్ద హుషారుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82.95 వద్ద గరిష్టాన్ని తాకగా.. 83.17 వద్ద కనిష్టానికీ చేరింది. చివరికి 83.14 వద్ద స్థిరపడింది. వారాంతాన రూపాయి 13 పైసలు నీరసించి 83.42 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులు, జీడీపీ, జీఎస్టీ గణాంకాలు సైతం రూపాయికి దన్నునిచి్చనట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్‌కు 55–65 సీట్లు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్‌కు ప్రచారం నేటితో ముగుస్తుండటంతో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల పోలింగ్, ప్రచారసరళిని బట్టి తాజా లెక్కల ప్రకారం బీజేపీకి 295 –305 సీట్లు రావొచ్చని బెట్టింగ్ మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. కాంగ్రెస్ ఈసారి 55–65 సీట్లు సాధించవచ్చు అని ఆయా వర్గాలు విశ్లేíÙంచాయి. బీజేపీ జనంలోకి బాగా ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయతి్నంచిన ‘ఈసారి 400 సీట్లు’ నినాదం పనిచేయకపోవచ్చని బెట్టింగ్ మార్కెట్ ఊహిస్తోంది. బీజేపీకి ఈసారి 400 సీట్లు కష్టమని, అయినాసరే ఈసారి బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. ‘‘ తొలి దశ ఎన్నికల ముందు వరకు బీజేపీ ఎక్కువ చోట్ల గెలుస్తుందన్న అంచనాలుండేవి. బీజేపీ 315–325 వరకు, కాంగ్రెస్ 45–55 వరకు గెలవచ్చు అని తొలుత భావించాం. కానీ మూడు దశలు ముగిశాక చూస్తే బీజేపీ 270–280 వరకు, కాంగ్రెస్ 70–80 వరకు గెలవచ్చు అని అంచనాలొచ్చాయి. ప్రస్తుతం చూస్తే బీజేపీ 295–305 వరకు, కాంగ్రెస్ 55–65 వరకు సీట్లు గెలువొచ్చు’’ అని ముంబైలో ఉండే ఒక కీలకమైన బుకీ బుధవారం చెప్పారు. ‘‘ బీజేపీ 400 కాదుకదా కనీసం 350 గెలుస్తుందని ఏనాడూ బెట్టింగ్‌లో గణాంకాలు రాలేదు. ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రూ.8–9 లక్షల కోట్ల మేర బెట్టింగ్ జరుగుతోంది’ మరో బుకీ వెల్లడించారు. ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో 28 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 64–66 స్థానాలు కైవసం చేసుకోవచ్చని తెలిపారు. గుజరాత్లో బీజేపీ క్వీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేశారు. -
డివిడెండ్ జోష్.. సూచీలు ఖుష్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)బోర్డు కేంద్ర ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల భారీ డివిడెండ్ ఇచ్చేందుకు ఆమోదం తెలపడంతో గురువారం స్టాక్ సూచీలు సరికొత్త రికార్డు్డలు నెలకొల్పాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో విశ్వాస్వాన్ని నింపాయి. అలాగే దేశంలో ఎగుమతులు పెరగడంతో పాటు మే నెలలో ఉద్యోగ కల్పన 18 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు వెల్లడైన గణాంకాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సూచీలు దాదాపు 2% ర్యాలీ చేసి ఈ జనవరి 29 తర్వాత అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,197 పాయింట్లు పెరిగి 75,418 ముగిసింది. నిఫ్టీ 370 పాయింట్లు బలపడి 22,968 వద్ద నిలిచింది.కొనుగోళ్ల జోరు – రికార్డు హోరు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం ఫ్లాటుగా మొదలయ్యాయి. మెటల్, ఫార్మా మినహా అన్ని రంగాల్లో కొనుగోళ్ల వెల్లువెత్తడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదలాడాయి. మిడ్‌సెషన్ నుంచి ఆర్బీఐ డివిడెండ్ ప్రకటనల బలపడటంతో ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దశలో సెన్సెక్స్ 1,279 పాయింట్లు దూసుకెళ్లి 75వేల స్థాయిపైన 75,500 వద్ద, నిఫ్టీ 396 పాయింట్లు బలపడి 22,968 వద్ద జీవిత కాల గరిష్టాలను నమోదు చేశాయి. జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకుపోవచ్చని నిపుణులు భావించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆర్బీఐ భారీ డివిడెండ్ మరోసారి స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడొచ్చన్న అంచనాలు సూచీల పరుగుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.→ జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.4.28 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.420 లక్షల కోట్లకు చేరింది. → అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ అదానీ గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ బీఎస్ఈ సెన్సెక్స్‌లో చోటు దక్కనుండడంతో ఈ గ్రూప్‌లోని తక్కిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మొత్తం గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17.23 లక్షల కోట్లకు చేరింది. → మెప్పించిన గో డిజిట్ ఆన్లైన్ వేదికగా బీమా సేవలు అందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేరు లిస్టింగ్ మెప్పించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.272)తో పోలిస్తే 3% లాభంతో ప్రీమియంతో రూ.281 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.314 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 12% లాభంతో రూ.306 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.28,043 కోట్లుగా నమోదైంది. → ఎన్ఎస్ఈ రికార్డ్ఎన్ఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. గతేడాది డిసెంబర్లో 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని అందుకుంది. -
పాక్‌లో ఎన్నికల కౌంటింగ్.. ఈసీ కీలక నిర్ణయం
పాకిస్తాన్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోన్న వేళ పలు పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్ ఆరోపణలు తీవ్రమయ్యాయి. దీంతోపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 40 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ప్రకటించింది. ఈ నెల15వ తేదీన 40 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. దేశ 12వ సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతన్న నేపథ్యంలో ఈసీ రీపోలింగ్ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలవడమే గాక పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎన్నికల గుర్తూ రద్దవడంతో స్వతంత్రులుగా బరిలో దిగిన ఆయన మద్దతుదారులు సుమారు 93 స్థానాల్లో విజయం సాధించగా ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్), 54 సీట్లొచ్చిన బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరోసారి చేతులు కలిపాయి. ఇప్పటి వరకు 256 స్థానాల్లో ఈసీ ఫలితాలను విడుదల చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పార్టీల్లో సీట్ల సంఖ్యలో మార్పులు చోటుచేసుకోనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: పాక్‌లో సంకీర్ణం..! -
పాక్‌లో సంకీర్ణం..!
ఇస్లామాబాద్/లాహోర్: పాకిస్తాన్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలవడమే గాక పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ ఎన్నికల గుర్తూ రద్దవడంతో స్వతంత్రులుగా బరిలో దిగిన ఆయన మద్దతుదారులు 100 స్థానాల్లో నెగ్గి ప్రబల శక్తిగా ఆవిర్భవించారు. అయితే 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్), 54 సీట్లొచ్చిన బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరోసారి చేతులు కలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం కాగా ఆ రెండింటికి కలిపి 127 స్థానాలున్నాయి. శుక్రవారం రాత్రే పలు దఫాలుగా చర్చోపచర్చలు జరిపి ప్రభుత్వ ఏర్పాటుకు చేతులు కలిపేందుకు పీఎంఎల్, పీపీపీ అంగీకారానికి వచ్చాయి. మెజారిటీ సాధనకు 28 స్థానాల్లో నెగ్గిన చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం శనివారమంతా జోరుగా మంతనాలు సాగాయి. నవాజ్ ప్రయత్నాలు ఫలిస్తే రికార్డు స్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అవుతారు. అయితే ప్రధానిగా బిలావల్కే అవకాశమివ్వాలని పలువురు పీపీపీ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తుండటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది! కాకపోతే సైన్యం దన్ను నవాజ్‌కు కలిసొస్తుందంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన ఇచ్చిన పిలుపుకు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా మద్దతు పలకడం విశేషం. ‘‘రాజకీయ సుస్థిరత పాక్‌కు తక్షణావసరం. అందుకు ప్రజాస్వామిక శక్తులన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఏకీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి’’ అని శనివారం ఒక ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు! నవాజ్ పేరుకు పీపీపీ ఒప్పుకోని పక్షంలో బిలావల్‌కు అవకాశమిచ్చేందుకు పీఎంఎల్ కూడా అంగీకరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు. మధ్యేమార్గంగా మరోసారి నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించవచ్చని చెబుతున్నారు. దీనికి సైన్యం నుంచి కూడా అభ్యంతరం ఉండకవపోచ్చన్నది రాజకీయ వర్గాల మాట. యథేచ్ఛగా అక్రమాలు! మొత్తం 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసి రెండు రోజులు దాటినా 10 చోట్ల ఇంకా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. నిజానికి తమకే మెజారిటీ సమకూరిందని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. కానీ అక్రమంగా ఫలితాలను పీఎంఎల్‌కు అనుకూలంగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఫలితాల వెల్లడిలో జాప్యం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. -
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్‌కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్‌ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్‌కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్‌కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్‌భవన్‌కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్‌కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్‌ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్‌లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్‌లోనూ ఆప్‌ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
Karnataka assembly election 2023: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...!
పాత మైసూరు. కర్ణాటకలో అధికార పీఠానికి రాచమార్గంగా భావించే ప్రాంతం. మెజారిటీ కావాలంటే ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుపొందాల్సిందేనని పార్టీలన్నింటికీ బాగా తెలుసు. ఈ ప్రాంతంలో ఒక్కలిగ సామాజికవర్గం ప్రభావం అధికం. వారిని ప్రసన్నం చేసుకోగలిగే పార్టీదే పాత మైసూరు. అందుకోసమే పార్టీలన్నీ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి... సాక్షి బెంగళూరు: కర్ణాటక జనాభాలో ఒక్కలిగ సామాజికవర్గం 15 శాతం ఉంటుందని అంచనా. లింగాయత్ (17 శాతం)ల తర్వాత రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం వీరే. ఉత్తర కర్ణాటక లింగాయత్ బెల్ట్ కాగా పాత మైసూరు ఒక్కలిగల కంచుకోట. ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వ ఏర్పాటులో ఈ వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. వీరు కొన్ని దశాబ్దాలుగా ఒక్కలిగలు జేడీ(ఎస్)నే ఆదరిస్తూ వస్తున్నారు. ఈసారి వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏడుగురు సీఎంలను ఇచ్చిన ప్రాంతం ► రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో పాత మైసూరు ప్రాంతంలో 51 సీట్లున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ 16 స్థానాల్లో, బీజేపీ 9 చోట్ల గెలిచాయి. ► కావేరి వివాదం, రైతు ఆత్మహత్యల వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. మేజిక్ నంబర్ సాధించడంలో ఈ ప్రాంతం కీలకం. ► గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన 17 మందిలో ఏకంగా ఏడుగురు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే! ఈ సామాజికవర్గానికి చెందిన హెచ్.డి.దేవెగౌడ ప్రధాని పదవి దాకా ఎదిగారు. ► ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి జేడీ(ఎస్) చాలా బలంగా ఉంది. ► మండ్య, హసన్, రామనగర, మైసూరు, చామరాజనగర, కోలార్, తుమకూరు, కొడగు జిల్లాలో ఒక్కలిగలు అధికంగా ఉంటారు. ► ఒక్కలిగల ఓట్లను ఒడిసిపట్టేందుకు అధికార బీజేపీ తాజాగా వారి రిజర్వేషన్లను 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. ► ఇక కాంగ్రెస్ ఒక్కలిగలకు ఎక్కువగా టికెట్లిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ► జేడీ(ఎస్) మాత్రం తన సంప్రదాయ ఓటుబ్యాంకు మళ్లీ చెక్కుచెదరబోదని ధీమాగా ఉంది. కాంగ్రెస్.. గత వైభవమే పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ ఒకప్పుడు తిరుగులేని పార్టీ. దేవెగౌడ రూపంలో బలమైన ఒక్కలిగ నేత రాకతో ఇక్కడ దాని ప్రభ మసకబారింది. ఈ ప్రాంతానికే చెందిన ముఖ్య ఒక్కలిగ నేత పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్‌పైనే ఈసారి కాంగ్రెస్ ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీ... ఇక బీజేపీది భిన్నమైన పరిస్థితి! పాత మైసూరులో పార్టీకి ఒక్కరంటే ఒక్కరు కూడా బలమైన ఒక్కలిగ నాయకుడు లేడు. దాంతో ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీ(ఎస్)ల తర్వాతి స్థానానికే పరిమితమవుతూ వస్తోంది. అయితే 2018 ఎన్నికల్లో కాస్తా పుంజుకున్న నేపథ్యంలో ఈసారీ భారీగానే ఆశలు పెట్టుకుంది. గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ బలమైన స్థానిక నేతలను చేర్చుకుని టికెట్లిచ్చింది. ఇంటిపోరు జేడీ(ఎస్)ను ముంచేనా...? దేవెగౌడ కుటుంబంలో వారసత్వ రగడ మొదలైంది. ఆయన కుమారుల్లో జేడీ(ఎస్) నేత హెచ్.డి.కుమారస్వామి రామనగర, మైసూరు, మండ్య జిల్లాల్లో గట్టి నాయకుడు కాగా సోదరుడు హెచ్.డి.రేవణ్ణ హాసన్ జిల్లాలో తిరుగులేని నేత. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. హాసన్ టికెట్ విషయంలో ఇవి రచ్చకెక్కాయి. అక్కడ రేవణ్ణ భార్య భవానీని కాదని అతి సామాన్య కార్యకర్తకు కుమారస్వామి టికెటిచ్చారు. ఈ గొడవ కొంప ముంచుతుందేమోనని జేడీ(ఎస్) వర్గాల్లో ఆందోళన నెలకొంది. -
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి
షిల్లాంగ్: మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) చీఫ్, తాజా మాజీ సీఎం కాన్రాడ్ సంగ్మా రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్‌ను కోరారు. రాష్ట్ర అసెంబ్లీలోని 60 మంది సభ్యులకు గాను 32 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని తెలిపారు. వీరి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశామన్నారు. శుక్రవారం ఆయన రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు నాకుంది. మద్దతిస్తామని బీజేపీ ఇప్పటికే తెలిపింది. హిల్ స్టేట్ డెమోక్రటిక్ పార్టీ, స్వతంత్రులు కూడా మా వెంట ఉన్నారు’అని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఈ నెల 7న ప్రమాణం చేయనుందని, ప్రధాని మోదీ కూడా ఈ కార్యక్రమానికి వస్తారని తెలిపారు. కాగా, ఎన్పీపీ యేతర, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ అంతకుముందు టీఎంసీ, కాంగ్రెస్, యూడీపీ, పీడీఎఫ్‌లు హడావుడి చేశాయి. ఫిబ్రవరి 27వ తేదీన 59 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఎన్పీపీ సొంతంగా 26, మిత్రపక్షం యూడీపీ 11 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, టీఎంసీలు చెరో ఐదు స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ రెండు సీట్లను దక్కించుకుంది. -
తాలిబన్ల తలపట్లు
ఇల్లు అలకగానే పండుగ కాదు, ముందుంది మొసళ్ల పండుగ... ఇలాంటి సామెతలన్నీ తాలిబన్లకు వర్తించేలా పరిస్థితులు మారుతున్నాయి. అఫ్గాన్‌ను స్వా«దీనం చేసుకున్న ఆనందం ఆవిరవడానికి తాలిబన్లకు ఎక్కువ సమయం పట్టడం లేదు. తాత్కాలిక ప్రభుత్వంలో వివిధవర్గాలకు ప్రాతినిధ్యం వహించే నేతల మధ్య సయోధ్య కరువవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అఫ్గాన్‌ను అమెరికా సైన్యాలు వదిలిపోవడంతో అలవోకగా స్వాదీనం చేసుకున్న తాలిబన్లు.. అది తమ ఘనవిజయంగా భావించారు. కానీ దేశానికి ఆధిపత్యం వహించే విషయంలో అగ్రనేతల మధ్య ఆరంభమైన కుమ్ములాటలు అఫ్గాన్ స్వాధీన విజయాన్ని ఆవిరి చేస్తున్నాయి. నిజానికి బయటనుంచి చూసేవారికి తాలిబన్లంతా ఒకటేనని, వారి సిద్ధాంతాల్లో తేడాలుండవని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అన్ని పారీ్టల్లాగానే తాలిబన్లలో కూడా వర్గాలు, గ్రూపులు, అభిప్రాయభేదాలు, కుమ్ములాటలు బోలెడున్నాయని తాలిబన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు అజ్ఞాతంలో బతుకుతూ అమెరికాతో యుద్దం చేయాల్సిరావడం వల్ల ఈ వర్గాలు, భేదాభిప్రాయాలు బయటపడలేదు. కానీ ఎప్పుడైతే దేశం స్వాదీనమై పాలనా పగ్గాలు చేతికి వచ్చాయో వీరిలో విభేదాలు ముదురుతున్నాయి. ఉమ్మడి శత్రువు మొఖం చాటేయగానే తాలిబన్లలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ మంటలు ముదిరి సోమవారం రెండువర్గాల మధ్య అధ్యక్ష భవనంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తాలిబన్ అగ్రనేత, సహవ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ మరణించాడని పుకార్లు షికారు చేశాయి. కానీ తాను బతికే ఉన్నానని బరాదర్ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అయినా సరే తన పరిస్థితిపై అయోమయం నెలకొంది. (చదవండి: ప్రభుత్వ ఏర్పాటుతో వేర్పాటు బీజాలు అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగానే బరాదర్ నాయకుడిగా ఉంటారని ఎక్కువమంది భావించారు. అమెరికాతో చర్చలు జరిపి, వారి సేనలు వెనక్కుమరలిపోయేలా చేయడంలో బరాదర్ కీలకపాత్ర పోషించాడు. దీనికితోడు అతను ముల్లాఒమర్కు సన్నిహితుడు. ఖతార్‌తో తనకు సత్సంబంధాలున్నాయి. అందుకే సహజంగా బరాదరే ప్రధాని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అఖుండ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయని అఫ్గాన్ పరిణామాల విశ్లేషకుడు నైమతుల్లా ఇబ్రహిమి అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వంలో కాందహార్‌కు చెందిన పాతతరం తాలిబన్లతో పాటు అల్‌కాయిదా, పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలున్న హక్కానీలకు పెద్దపీట దక్కింది. ఇరాన్ అండ ఉన్న పశ్చిమ తాలిబన్ గ్రూపునకు అసలు ప్రాధాన్యమే దక్కలేదు. గతంలో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాందహార్ గ్రూపుదే ప్రభుత్వంలో ఆధిపత్యం ఉండేది. కానీ తాజా ప్రభుత్వంలో హక్కానీలకు ప్రాధాన్యత పెరిగింది. ఐఎస్ఐ అండదండలే హక్కానీల బలం పెరిగేందుకు కారణమయ్యాయని నైమతుల్లా చెప్పారు. హక్కానీల నేత సిరాజుద్దీన్ తలపై అమెరికా కోటి డాలర్ల బహుమతి ప్రకటించింది. కానీ ప్రస్తుతం సిరాజుద్దీన్ అఫ్గాన్ ప్రభుత్వంలో కీలకమంత్రి అయ్యారు. ఇది పాశ్చాత్య దేశాలకు మింగుడుపడని అంశం. (చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు) ఉమ్మడి ప్రభుత్వమే శరణ్యం? హక్కానీల ప్రాధాన్యత పెరగడం వల్లనే అఫ్గాన్ ప్రభుత్వాన్ని యూఎస్, మిత్రపక్షాలు గుర్తించడంలో జాప్యం చేయడం, అమెరికాలోని అఫ్గాన్ బ్యాంకు నిధులు విడుదల చేయకుండా తొక్కిపట్టడం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీన్ని బరాదర్ వైఫల్యంగా హక్కానీలు ఎత్తిచూపుతున్నారు. అయితే ప్రాధాన్యం లేని పోస్టు ఇచ్చినందుకు ఈ విషయంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని బరాదర్ వర్గం భావిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం గుర్తించకపోతే అఫ్గాన్‌కు ఆర్థిక సాయం అందదు. దీంతో దేశం తీవ్ర సంక్షోభంలో మునిగే ప్రమాదం ఉంది. దీన్ని పట్టించుకోకుండా తాలిబన్– హక్కానీలు సిగపట్లు పడుతున్నారు. ఇది కేవలం అఫ్గాన్‌కే కాకుండా పొరుగుదేశాలకు కూడా ప్రమాదం తెస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అఫ్గాన్‌లోని పలు వర్గాలను ప్రభుత్వంలో చేర్చుకోకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోందని, దీనివల్ల తిరిగి దేశంలో అంతర్యుద్ధం ఆరంభం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్యుద్ధమే ఆరంభమైతే మరలా రష్యా, ఇరాన్, ఇతర దేశాలు తమ అనుకూల గ్రూపులకు సాయం చేయడం మొదలుపెడతాయి. దీంతో మరోమారు అఫ్గాన్‌లో హింసాత్మక పోరు పెచ్చరిల్లుతుందని నైమతుల్లా అభిప్రాయపడ్డారు. మరి ఇప్పటికైనా తాలిబన్లు, హక్కానీలు భేదాభిప్రాయాలు మరిచి ఇతర గ్రూపులకు కూడా ప్రభుత్వంలో స్థానం కల్పిస్తాయా? లేక గ్రూపు రాజకీయాలను పెంచుతాయా? అని అన్ని దేశాలు ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
Afghanistan: అఫ్గాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న దాదాపు మూడు వారాల అనంతరం తాలిబన్లు కొత్త ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మంగళవారం విలేకరులకు తెలిపారు. రెండుదశాబ్దాల పాటు అమెరికాతో పోరాడిన అగ్రనేతలు తాజా ప్రభుత్వంలో ప్రాధాన్యమైన పదవులు పొందారు. అమెరికాతో చర్చల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో పాటు మౌల్వీ హనాఫీలు అఖుంద్‌కు డిప్యూటీలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఏర్పాటైంది తాత్కాలిక ప్రభుత్వమేనని, శాశ్వత ప్రభుత్వం కాదని జబీహుల్లా చెప్పారు. దేశంలో ఇతర ప్రాంతాలవారిని కూడా ప్రభుత్వంలో కలుపుకునేందుకు యత్నిస్తామన్నారు. అయితే ఎంతకాలం ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వంలో మార్పులు ఎలా వస్తాయో వెల్లడించలేదు. ప్రభుత్వంలో ప్రతి మంత్రికి ఇద్దరు డిప్యూటీలుంటారని తెలిపారు. ప్రభుత్వంలో తాలిబనేతర వర్గాలకు స్థానం దక్కినట్లు కనిపించలేదు. అఫ్గాన్‌లో స్థిరత్వం కోసం దేశంలోని అన్ని తెగలను, వర్గాలను కలుపుకొని సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావాలని అంతర్జా తీయ సమాజం ఆశిస్తోంది. ప్రభుత్వ కూర్పు, అధికార పంపిణీల విషయంలో తాలిబన్లు, హకాన్నీ నెట్‌వర్క్‌కు మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా ఉండటాన్ని హక్కానీ నెట్వర్క్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో పాక్ ఐఎస్ఐ చీఫ్ మధ్యవ ర్తిత్వానికి వచ్చారు. చర్చల అనంతరం అందరికీ ఆమోదయోగ్యుడైన హసన్ అఖుంద్‌కు తాత్కాలికంగా పాలనాపగ్గాలు అప్పగించినట్లు కనపడుతోంది. మంత్రివర్గంలో అందరూ ఊహించినట్లే మహిళలకు స్థానం కల్పించలేదు. ఖారీ ఫసిహుద్దీన్ బంద్క్షనిని ఆర్మీ చీఫ్‌గా నియమించారు. తాలిబన్ అధినేత హెబతుల్లా అఖుంద్జాదా సుప్రీం లీడర్‌గా ఇరాన్ నమూనా ప్రభుత్వం ఏర్పడుతుందని చాలామంది భావించారు. కానీ తాజా ప్రభుత్వంలో హెబతుల్లా ఎలాంటి పాత్ర పోషించేది స్పష్టం కాలేదు. ఇరాన్లో అధ్యక్షుడి కన్నా ఉన్నతస్థానంలో సుప్రీంలీడర్ ఉంటాడు. అంతిమాధికారాలన్నీ అతని చేతిలోనే ఉంటాయి. ఇతర ప్రముఖులు డిప్యూటీగా నియమితులైన ముల్లా బరాదర్, తాలిబన్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2001లో తాలిబన్ల ప్రభుత్వం పడిపోయిన తర్వాత అప్పటి అఫ్గాన్ అధినేత హమీద్ కర్జాయ్‌తో సహకరిస్తామని సంప్రదింపులు జరిపినట్లు వార్తలున్నాయి. 2010లో పాక్‌లో అరెస్టయి అమెరికా ఒత్తిడితో 2018లో విడుదలయ్యారు. అప్పటినుంచి ఖతార్‌లో ఉంటున్నారు. యూఎస్ దళాల ఉపసంహరణ ఒప్పందంలో కీలకపాత్ర పోషించారు. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించాక దేశంలోకి అడుగుపెట్టారు. హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కీలకమైన హక్కానీ నెట్వర్క్ అధిపతి. సూసైడ్ బాంబర్ల వినియోగం హుక్కానీ నెట్వర్క్ ప్రాముఖ్యత. తాలిబన్ల మిలటరీ ప్రధానబలం. తాలిబన్లతో అంతగా ఈ నెట్‌వర్క్‌కు పొసగదని, పాక్ కారణంగా కలిసి ఉంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రిగా నియమితులైన ముల్లా యాకూబ్, తాలిబన్ స్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు. తాలిబన్ల ఫీల్డ్ కమాండర్లను పర్యవేక్షించే మిలటరీ కమిషన్‌కు అధిపతిగా వ్యవహరించారు. ఎవరీ అఖుంద్? ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్(65), తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌కు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారు. గత తాలిబన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, కాందహార్ గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం ఐరాస ఆంక్షల జాబితాకెక్కారు. తాలిబన్ కమాండర్లలో అత్యంత ప్రభావశాలి అని ఐరాస పేర్కొంది. అఖుంద్ పేరును స్వయంగా తాలిబన్ అగ్రనేత ముల్లా హెబతుల్లా అఖుంద్జాదా ప్రతిపాదిం చారని పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరవైఏళ్లుగా తాలిబన్ల నాయకత్వ మండలి ‘రెహబరి షురా’కు అఖుంద్ అధిపతిగా ఉన్నారు. ఈ కూటమి అగ్రనేత అఖుంద్జాదా ఆదేశాల మేరకు అన్ని రకాల మిలీషియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. కీలక మంత్రులు– శాఖలు ► అమీర్ ఖాన్ ముత్తఖీ: విదేశాంగ మంత్రి ►షేర్ మొహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్: విదేశాంగ సహాయ మంత్రి ► సిరాజ్ హక్కానీ: హోంశాఖ మంత్రి ► ముల్లా యాకూబ్: రక్షణ మంత్రి ► అబ్దుల్లా హకీం షరే: న్యాయ మంత్రి ► హిదాయతుల్లా బద్రి: ఆర్థిక మంత్రి ► షేక్ మవ్లావీ నూరుల్లా: విద్యా మంత్రి ► నూర్ మొహ్మద్ సాకిబ్: మత వ్యవహారాలు (చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!) చదవండి: క్రికెట్ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..? -
అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు మళ్లీ వాయిదా
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్న తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆ ముఠా అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగం చీఫ్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా శనివారమే అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ, చర్చలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే వారం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల మద్దతు లభించేలా ప్రభుత్వాన్ని కూర్చే పనిలో ఉండడం వల్లే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోందని తాలిబన్ చర్చల కమిటీ సభ్యుడు ఖలీల్ హక్కానీ చెప్పారు. తాలిబన్లకి ఇప్పటికే మద్దతు ప్రకటించిన జమైత్ ఏ ఇస్లామీ అఫ్గానిస్తాన్ చీఫ్, దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సోదరుడైన గుల్బుద్దీన్ హెక్మత్యార్కు ప్రభుత్వంలో చోటు లభించనుంది. పంజ్ïÙర్లో కొనసాగుతున్న పోరాటం అఫ్గానిస్తాన్‌లో పంజ్ïÙర్ లోయ ఇంకా తాలిబన్ల వశం కాలేదు. శనివారం మళ్లీ ఇరు వర్గాల మధ్య పోరాటం మొదలైంది. ఇప్పటివరకు తాలిబన్ల కన్ను పడని పంజ్ïÙర్ను ఆక్రమించుకున్నట్టుగా శుక్రవారం వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం వదంతులేనని తేలింది. పంజ్ïÙర్ తమ స్వాధీనంలోకి వచి్చందని ఇప్పటివరకు తాలిబన్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోవియెట్ యూనియన్ ఆక్రమణలో ఉన్నప్పుడు, తాలిబన్ల పరిపాలనలోనూ పంజ్ïÙర్ స్వతంత్రంగానే వ్యవహరించింది. 1996–2001 మధ్య కాలంలో తాలిబన్లు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఆ ప్రాంతాన్ని కూడా తమ వశం చేసుకోవాలని తాలిబన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలే, తాలిబన్లను తీవ్రంగా వ్యతిరేకించే అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్‌ల అ«దీనంలో పంజ్‌షీర్ లోయ ఉంటుంది. గాల్లోకి కాల్పులు.. 17 మంది మృతి! పంజ్ïÙర్ తాలిబన్ల పరమైందని వదంతులు వ్యాపించడంతో రాజధాని కాబూల్‌లో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కాల్పుల్లో 17 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. అయితే వారు అలా సంబరాలు చేసుకోవడాన్ని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తప్పు పట్టారు. ఆయుధాలనేవి ప్రభుత్వ ఆస్తి అని, వాటిని గాల్లోకి పేలుస్తూ వృథా చేయరాదని హితవు చెప్పారు. మహిళా కార్యకర్త తలకి గాయాలు మహిళలు తమ హక్కుల్ని కాపాడాలంటూ చేస్తున్న ఉద్యమాన్ని తాలిబన్లు అణగదొక్కేస్తున్నారు. మహిళలు తమ రాజకీయ హక్కుల్ని కాపాడా లంటూ అధ్యక్ష భవనం వరకు తీసిన ర్యాలీని తాలిబన్లు అడ్డుకొని బాష్పవాయువు ప్రయోగిం చారు. మహిళల్ని విచక్షణారహితంగా కొట్టినట్టుగా టోలో న్యూస్ వెల్లడించింది. ఉద్యమకారిణి నర్గీస్ సద్దాత్ను చితకబాదారు. తలకి బలమైన గాయంతో ముఖమంతా నెత్తురోడుతూ ఆమె ఆ నిరసన ప్రదర్శనలో కనిపించారు. అందరినీ కలుపుకొని పోవాలి: అమెరికా తాలిబన్లు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఆశిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఉగ్ర వాదాన్ని నిరోధించడం, మహిళలు, మైనారీ్టల హ క్కుల్ని గౌరవించడంలో తమ చిత్తశుద్ధి చూపించాలన్నారు. మరోవైపు అఫ్గాన్‌లో మానవ సంక్షోభం, ఆరి్థక సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 13న జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం కానుంది. కాబూల్‌కు ఐఎస్ఐ చీఫ్ ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు, మరోవైపు పంజ్ïÙర్లో కొనసాగుతున్న పోరాటం నేపథ్యంలో పాకిస్తాన్లో అత్యంత శక్తిమంతమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయీజ్ హమీద్ కాబూల్‌కు చేరుకున్నారు. ఆయన వెంట పాక్ అధికారుల బృందం కూడా వచి్చంది. తాలిబన్ల ఆహా్వనం మేరకే హమీద్ అఫ్గాన్ వచ్చారని, రెండు దేశాల భవితవ్యంపై చర్చలు జరిపి, కలసికట్టుగా వ్యూహరచన చేయనున్నట్టుగా పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఐఎస్ఐ చీఫ్‌ను ఆహా్వనించడంతో వారిమధ్య సుదృఢ బంధాలు తేటతెల్లమవుతున్నాయి. తాలిబన్ అగ్ర నేతలు, కమాండర్లతో ఐఎస్ఐ చీఫ్ çచర్చలు జరపనున్నారు. -
తాలిబన్లతో కర్జాయ్ చర్చలు
కాబూల్: తాలిబన్ల నేతృత్వంలో అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు వేగం పుంజుకున్నాయి. తాలిబన్ సీనియర్ నాయకుడు, హక్కాని నెట్‌వర్క్‌కు చెందిన అనాస్ హక్కానీ బుధవారం అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో కీలకభూమిక పోషించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఈ భేటీకి హాజరయ్యారు. శాంతియుతంగా అధికార బదిలీ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగాలనే ఉద్దేశంతో కర్జాయ్ సంప్రదింపులకు నేతృత్వం వహిస్తున్నారు. అనాస్‌తో భేటీ ప్రాథమిక చర్చల్లో భాగమని కర్జాయ్ ప్రతినిధి వెల్లడించారు. తాలిబన్ల రాజకీయ విభాగం సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో తదుపరి కీలకచర్చలకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. అన్ని పక్షాలను కలుపుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. యూఏఈలో అష్రాఫ్ ఘనీ తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో ఆదివారం దేశం వదిలి పారిపోయిన అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆశ్రయం కల్పించింది. మానవతా దృక్పథంతో ఘనీ, ఆయన కుటుంబాన్ని శరణార్థులుగా అనుమతించా మని యూఏఈ విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. అయితే యూఏఈలో ఎక్కడ తలదాచుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. తొలుత ఆయన తజకిస్తాన్‌కు పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
తాలిబన్లకు నిరసనల సెగ
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సన్నాహాలు చేస్తుంటే వారికి నిరసనల స్వాగతాలు ఎదురవుతున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా మహిళలు కూడా రోడ్డెక్కి గట్టిగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అఫ్గానిస్తాన్ స్వాతంత్య్ర దినం (ఆగస్టు 19)కి ఒక్కరోజు ముందు ప్రభుత్వ కార్యాలయాలపై అఫ్గాన్ పతాకం ఎగరాలని డిమాండ్లు మిన్నంటాయి. తాలిబన్లపై ప్రజలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో వారు అత్యంత కఠినంగా నిరసనల్ని అణగదొక్కేస్తున్నారు. జలాలాబాద్‌లో నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాకు బదులుగా తిరిగి అఫ్గాన్ పతాకాన్ని ఎగురవేయాలన్న డిమాండ్‌తో బుధవారం నిరసన ప్రదర్శనలకు దిగారు. అఫ్గాన్ జెండా పట్టుకొని వందలాది మంది నిరసనకారులు నడిచి వెళుతూ ఉంటే, వారిని చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నిరసనని కవర్ చెయ్యడానికి వచ్చిన జర్నలిస్టుల్ని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో కాల్పుల శబ్దాలు కూడా స్పష్టంగా వినిపించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని, డజన్ల మంది గాయపడ్డారని అల్‌జజీరా ఛానెల్ వెల్లడించింది. మహిళల నుంచే తొలి నిరసనలు కాబూల్‌లో మహిళల రూపంలో తొలిసారిగా తాలిబన్లకు నిరసనల సెగ తగిలింది. సమాన హక్కుల్ని డిమాండ్ చేస్తూ మహిళలు ప్ల కార్డులు పట్టుకొని కాబూల్ వీధుల్లో నిరసనకి దిగారు. వీరి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పక్కనే తాలిబన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా వారు బెదిరిపోలేదు. తమ హక్కుల్ని కాపాడాలని నినాదాలు చేశారు. హిజాబ్ లేదని మహిళని కాల్చి చంపారు! పేరుకే శాంతి మంత్రాన్ని వల్లిస్తున్న తాలిబన్లు ఆచరణలో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. టఖార్ ప్రావిన్స్‌లో ఒక మహిళ హిజాబ్ (తల కనిపించకుండా వస్త్రంతో చుట్టుకోవడం) లేకుండా బయటకు రావడంతో తాలిబన్లు మంగళవారం ఆమెని కాల్చి చంపినట్టుగా ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. దేశం విడిచి పారిపోవాలని కాబూల్ విమానాశ్రయానికి వస్తున్న వారిపై పదునైన ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. ఎయిర్‌పోర్టులో జనాల్ని నియంత్రించడానికి గాల్లోకి కాల్పులు జరపడం, మహిళలు, పిల్లలని చూడకుండా కర్రలతో కొట్టడం వంటివి చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. -
‘ఆ ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే’
సాక్షి, కాకినాడ: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని.. ప్రజాప్రతినిధులుగా తాము ఎంతో గర్వ పడుతున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయనతో పాటు ఎంపీ వంగా గీత, పార్టీ నగర అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ వెంకటలక్ష్మీ కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మేనిఫెస్టోను పవిత్రంగా భావించి.. మంచి మనస్సుతో సిఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హమీలను ఏడాది కాలంలోనే అమలు చేశారని పేర్కొన్నారు. (టీడీపీ కుట్రలు ఫలించవు: మల్లాది) చారిత్రాత్మక విజయం అందించిన రోజు: వంగా గీత రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా 52 శాతం ఓట్లతో ప్రజలు వైఎస్సార్సీపీకి గొప్ప విజయం అందించిన రోజు అని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటి దాకా తన పరిపాలనపై ప్రజలకు నమ్మకం కలిగించారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్ని రాద్ధాంతాలు చేసినా, కరోనా కష్టాలు వచ్చిన కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలోనే సీఎం అమలు చేశారని కొనియాడారు. సీఎం జగన్‌కు భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజల దీవెనలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు ('ఏడాది కాలంలోనే మేమేంటో నిరూపించాం') -
సుదీర్ఘ పాదయాత్రకు ఫలితం.. మే 23: ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘ పాదయాత్రకు ఫలితం.. గత ఏడాది మే 23 తేది అని ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్సీ వెల్ఫెర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇది కోట్లాది ప్రజల విజయమన్నారు. పేద ప్రజల కడుపు కొట్టి కార్పొరేట్ వర్గాలకు రాష్ట్ర సంపదను దోచిపెట్టడం నుంచి విముక్తి పొందిన రోజు అన్నారు. రాష్ట్రం అనేక వర్గాల్లో వెనుకబడిన నేపథ్యంలో ఆర్థిక స్వావలంబన తీసుకొస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల ఆశలు వమ్ము కాకుండా పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. (దేశ చరిత్రలో ఇది మరచిపోలేని రోజు: అవంతి) ఎన్నికల మెనిఫేస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా 40 కొత్త పథకాలు ఏడాది పాలనలో ప్రవేశ పెట్టిన ఘటన సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. చంద్రబాబు అధికారంకలో ఉన్నప్పుడూ.. లేనప్పుడూ కూడా ఆయన ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా ప్రజల్ని బాధ పెట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఏడాది పాలన విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రజలకు అబ్ధి చేకురే విధంగా సాగిందని వ్యాఖ్యానించారు. ఎన్నో కష్టాలు పడ్డా, న్యాయస్థానాల ద్వారా వచ్చే చిక్కులు ఎదురైనప్పటికీ ఆయనకు ప్రజల దీవెనలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (కేసీఆర్ దొంగలకు దోచి పెడుతున్నారు: బండి) -
'ఏడాది కాలంలోనే మేమేంటో నిరూపించాం'
సాక్షి, కాకినాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా మే 30వ తేదీన 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక ఓట్ల షేర్ పొంది తిరుగులేని జననేతగా సీఎం జగన్ ప్రజల ఆశీర్వాదం పొంది నేటితో ఏడాది పూర్తయిందన్నారు. ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేశారన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ది బెస్ట్ సీఎంగా దేశం మొత్తం కొనియాడుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ' నేను ఉన్నాను.. నేను విన్నాను' అని జగన్ ప్రజలకు మాట ఇస్తే .. ఆయన ఏం చేయగలడంటూ టీడీపీ విమర్శలకు దిగిందన్నారు. కానీ కరోనా వంటి కష్టకాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా అమలు చేయడం జగన్‌కే చెల్లిందన్నారు. ఏడాది కాలంలో ప్రజలకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కన్నబాబు పేర్కొన్నారు.(మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు) అమ్మ ఒడి.. రైతు భరోసా వంటి పథకాల విషయంలో జగన్ తన ధర్మాన్ని తూ.చ తప్పకుండా అమలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ పరంగా రికార్డు సృష్టిస్తున్నామన్నారు. తొలిసారిగా టమాట, పెండ్లం,మిర్చి ఇలా పలు పంటలను మార్కెటింగ్ శాఖ ద్వార కొనుగోలు చేసి బజార్లకు పంపించినట్లు వెల్లడించారు. 17 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాట ధర కల్పించామన్నారు. వేల కోట్ల భారం పడుతున్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తొలి సారిగా గ్రామ స్ధాయిలో విత్తన పంపిణీని ప్రారంభించిన ఘనత సీఎం వైఎస్ జగన్ కి దక్కుతుందని కన్నబాబు స్పష్టం చేశారు. (ఏపీ చరిత్రలో చిరస్మరణీయైన రోజు: విజయసాయిరెడ్డి) -
మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూపురంలో పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి బస్టాండ్‌లోని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ..' మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు అని ఇక్బాల్ పేర్కొన్నారు. ఏడాదిలోనే మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి'. ఇలాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రాల్లో లేరని ఇతర రాష్ట్రాల ప్రజలు మాట్లాడటంతోనే ఆయన విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని తేలిపోయిందని పేర్కొన్నారు. జననేత సుపరిపాలన చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ' ప్రతిపక్ష పార్టీలను పాతాళానికి తొక్కి వైఎస్సార్ పార్టీ తారాజువ్వాలగా ఎగిరిన రోజు మే 23 . కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ సంక్షేమాలు ఆపలేదని, నవరత్నాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయలేని పనిని, ఇచ్చిన మాటను,ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేరుస్తున్న ఓకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన వాగ్దానాలు ఎప్పటికి అమలు చేయలేడని ప్రతిపక్షాల చేసిన వాఖ్యలను తిప్పికొడుతూ ఏడాదిలోనే చేసి చూపించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎల్లపుడు ఇలాగే ఉండాలని ప్రతిపక్ష పార్టీలు,నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించాలంటూ' తెలిపారు. ప్రజారంజక నేతగా మారారు సాక్షి, చిత్తూరు : వైఎస్సార్‌పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మట్లాడుతూ.. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలు ప్రజలు విశ్వసించడంతో భారీ ఎత్తున విజయాన్ని ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్ 90 శాతం మేరకు హామీలను నెరవేర్చి ప్రజారంజక నేతగా మారారని తెలిపారు. కరోనా కష్టకాలం కావడంతో ప్రజా ప్రయోగ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ.. ' సాధారణ వ్యక్తి అయినా నన్ను వైఎస్ జగన్ ఆశీస్సులతో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో.. ముఖ్యమంత్రి అయ్యాక వాటికే ప్రాధాన్యత ఇచ్చి 90 శాతం మేరకు పూర్తి చేసిన ఘనత జగన్‌కే చెల్లింది. కరోనాను అరికట్టడానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఆమోదయోగ్యంగా ఉన్నాయి'. -
ప్రమాణ స్వీకారానికి రండి
న్యూఢిల్లీ: జార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ నెల 29వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. అనంతరం ఆయన రాహుల్ గాంధీతోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోనూ సమావేశమై, వారినీ ఆహ్వానించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఆర్పీఎన్ సింగ్ కూడా ఉన్నారు. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ అని సోనియాతో సమావేశానికి ముందు హేమంత్ సోరెన్ మీడియాతో అన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానన్నారు. తమ సంకీర్ణ ప్రభుత్వం సుస్థిరంగా ఐదేళ్లూ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్‌ను ఆహ్వానించారని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) బుధవారం తెలిపింది. మంగళవారం హేమంత్, ఇతర కూటమి నేతలతో గవర్నర్‌తో సమావేశమై తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లేఖ అందజేశారన్నారు. -
29న సీఎంగా హేమంత్ ప్రమాణం
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరెన్(44) ఈ నెల 29వ తేదీన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం హేమంత్ సోరెన్, సంకీర్ణంలోని కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) తదితర పార్టీల నేతలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ ద్రౌపది ముర్మును కలిశారు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా గవర్నర్ అంగీకరించారని, ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అనంతరం హేమంత్ సోరెన్ తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ..ఈ చట్టం కారణంగా తమ రాష్ట్రంలోని ఏ ఒక్కరికి నష్టం జరిగే అవకాశమున్నా అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకుముందు జేఎంఎం ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ వర్కింగ్గా ఉన్న ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్‌ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్, ఆర్జేడీ నేతలతోపాటు కూటమికి మద్దతు ప్రకటించిన జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్) చీఫ్ బాబూలాల్ మరాండీతో కూడా సమావేశం అయ్యారు. ఎన్నికలకు ముందే ఏర్పాటైన జేఎంఎం– కాంగ్రెస్– ఆర్జేడీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ సోరెన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో శాసనసభలోని 81 స్థానాలకు గాను సంకీర్ణానికి 47 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. బీజేపీ క్షీణతకు నిదర్శనం జార్ఖండ్:పవార్ ముంబై: దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాభవం తగ్గుతోందని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం నేత, జార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు శరద్ పవార్ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై హేమంత్ ట్విట్టర్లో స్పందిస్తూ..మహారాష్ట్రలో పవార్ సాగించిన పోరాటం తమకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. -
సేనకు హోం, ఎన్సీపీకి ఆర్థికం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖలు ఖరారయ్యాయి. కీలక హోం మంత్రిత్వ శాఖను శివసేన తన వద్ద అంటిపెట్టుకుంది. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ షిండేకు హోంతో పాటు పట్టణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటక, పార్లమెంటరీ వ్యవహారాలు శాఖలు, మరో శివసేన మంత్రి సుభాష్ దేశాయ్‌కి పరిశ్రమలు, ఉన్నత, సాంకేతిక విద్య, యువజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. ఎన్సీపీ మంత్రి జయంత్ పాటిల్‌కు ఆర్థిక శాఖను, గృహనిర్మాణం, మరికొన్ని శాఖల బాధ్యతలు అప్పగించారు. మరో ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్భల్కు నీటి పారుదల, గ్రామీణాభివృద్ది శాఖలు కేటాయించారు. కాంగ్రెస్ మంత్రి బాలాసాహెబ్ తోరట్‌కు రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖలు ఇచ్చారు. మరో కాంగ్రెస్ మంత్రి నితిన్ రౌత్‌కు పీడబ్ల్యూడీ, గిరిజనాభివృద్ధి శాఖలు అప్పగించారు. కాగా. గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ 79వ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆయన నివాసంలో పూలగుచ్ఛం అందజేశారు. -
'రెండు చక్రాల కన్నా మూడు చక్రాలే ఉత్తమం'
ముంబై: మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. 'ఆటోరిక్షా కూడా మూడు చక్రాలపై నడుస్తుంది. అయితే.. మూడు చక్రాలు కూడా ఒకే దిశలో కాకుండా తలో దిశలో వెళ్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి నెలకొంటుందని' వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 'రెండు చక్రాల కన్నా మూడు చక్రాలే ఉత్తమం' అని వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఉమ్మడి కార్యాచరణ విషయంపై చవాన్‌ను విలేకరులు ప్రశ్నించగా బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ రికార్డుల కెక్కారు. గతంలో 1963లో ముఖ్యమంత్రి మారోతరావ్ కన్నంవార్ మరణానంతరం 1963 నవంబరు 25వ తేదీ సావంత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కాగా సావంత్ కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు మరోసారి నవంబర్ నెలలోనే 23వ తేదీన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ అత్యల్పంగా కేవలం మూడున్నర రోజులలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. -
ఉద్దవ్ ఠాక్రేకే పీఠం..
ముంబై: మహారాష్ట్ర రాజకీయ డ్రామా క్లైమాక్స్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మార్గం సుగమమైంది. ఠాక్రే కుటుంబ తొలి సీఎంగా నవంబర్ 28న శివాజీ పార్క్‌లో ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు నెల రోజులుగా అనూహ్య, ఉత్కంఠ భరిత మలుపులతో సాగుతున్న ‘మహా’నాటకంలో మంగళవారం మరిన్ని కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రారంభమైన కీలక ఎపిసోడ్.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను తమ నేతగా, తదుపరి సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ముగిసింది. ఆ తరువాత ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఈ మధ్యలో పలు ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కాసేపటికి డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా తనకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతుందని అజిత్ పవార్ చెప్పడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, అయితే, అజిత్ రాజీనామా చేయడంతో మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం తమవద్ద లేకపోయిందని, అందువల్ల రాజీనామా చేస్తున్నానని బీజేపీ నేత ఫడ్నవీస్ వివరించారు. అనంతరం, రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి రాజీనామా లేఖను అందించారు. ఈ లోపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్యే కాళీదాస్ కొలాంబ్కర్‌ను గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. కాళీదాస్ కొత్తగా ఎన్నికైన 288 ఎమ్మెల్యేలతో బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఫడ్నవీస్ రాజీనామా అనంతరం, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ముంబై శివార్లలోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఆయా పార్టీల శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడ జరిగిన కార్యక్రమంలో మూడు పార్టీల కూటమి ‘మహా వికాస్ అఘాడి’నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. దాంతో, మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఆయనే కానున్నారు. ఉద్ధవ్ తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హయాం నుంచి ఠాక్రే కుటుంబం దశాబ్దాలుగా మహారాష్ట్రలో చక్రం తిప్పుతున్నా.. ప్రభుత్వ పదవిని ఠాక్రే కుటుంబం చేపట్టడం ఇదే ప్రథమం కానుంది. ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ తోరట్ ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యే అవకాశముందని ఆయా పార్టీల అంతర్గత సమాచారం. ఉద్ధవ్ ఠాక్రే సీఎం కానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ముంబైలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు కూడా సేన శ్రేణులు బాణాసంచా కాల్చి, ఠాక్రే అనుకూల నినాదాలతో హోరెత్తించారు. కాగా, మూడు పార్టీలు ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించే కనీస ఉమ్మడ ప్రణాళిక(కామన్ మినిమమ్ ప్రొగ్రామ్)పై కూడా ఒక అంగీకారానికి వచ్చారని సేన వర్గాలు తెలిపాయి. కూటమి పేరును ‘మహారాష్ట్ర వికాస్ అఘాడీ’గా నిర్ణయించారని పేర్కొన్నాయి. కక్ష సాధింపు ఉండదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఢిల్లీ వెళ్లి పెద్దన్నయ్యను కలుసుకుంటానని, ప్రధాని నరేంద్రమోదీ పేరును నేరుగా ప్రస్తావించకుండా, ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రేను తన చిన్న తమ్ముడిగా మోదీ అభివర్ణించిన విషయం తెలిసిందే. అలాగే, తమ ప్రభుత్వానికి ఎవరిపైనా పగ, ప్రతీకారం లేవని ఎవరిపై కక్షసాధింపు చేపట్టబోమని స్పష్టం చేశారు. ట్రైడెంట్ హోటల్లో జరిగిన కూటమి ఎమ్మెల్యేల భేటీలో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి ఉద్ధవ్ ఠాక్రే కృతజ్ఞతలు తెలిపారు. ‘వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీలు నేడు కలిశాయి. 30 ఏళ్లు స్నేహితులుగా ఉన్నవారు మమ్మల్ని నమ్మలేదు. ఎవరికి వ్యతిరేకంగా 30 ఏళ్లు పోరాడామో వారు మమ్మల్ని విశ్వసించారు. ఈ ప్రభుత్వం మాదని ప్రతీ సామాన్యుడు అనుకునేలా పాలన సాగిస్తాం’అన్నారు. ఈ సందర్భంగా శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేను శరద్ పవార్ గుర్తు చేశారు. ‘రాజకీయంగా ప్రత్యర్థులమైనా.. వ్యక్తిగతంగా మేమిద్దరం మంచి స్నేహితులం’అన్నారు. నవంబర్ 28న శివాజీ పార్క్‌లో కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్న అనంతరం కూటమి నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలుసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని పేర్కొంటూ, కూటమి పార్టీలతో పాటు, ఇతర ఎమ్మెల్యేల మద్దతు పత్రాలను అందించారు. మెజారిటీ నిరూపించుకునేందుకు అవసరమైన లేఖలను సమర్పించేందుకు గవర్నర్ ఉద్ధవ్ ఠాక్రేకు డిసెంబర్ 3వ తేదీ వరకు సమయమిచ్చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో శివసేన నేత ఎక్నాథ్ షిండే, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ తోరట్, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, ఎస్పీ నేత అబూ అజం తదితరులున్నారు. అనంతరం, ఈ నెల 28న శివాజీ పార్క్ గ్రౌండ్లో ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేస్తారని శివసేన నేత ఒకరు వెల్లడించారు. మిగతా కేబినెట్ ప్రమాణ స్వీకారం త్వరలో ఉంటుందన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం నవంబర్ 28వ తేదీన ఉంటుందని కాంగ్రెస్ నేత బాలా సాహెబ్ తోరట్ సైతం స్పష్టం చేశారు. అయితే, అంతకుముందు, కూటమి భేటీలో.. ప్రమాణ స్వీకారం డిసెంబర్ 1న ఉంటుందని శరద్ పవార్ ప్రకటించారు. కానీ గవర్నర్‌ను కలిసిన అనంతరం ప్రమాణ స్వీకార తేదీలో మార్పు చోటు చేసుకుంది. కుటుంబ సెంటిమెంట్ అజిత్‌పవార్‌ను మళ్లీ ఎన్సీపీలోకి తీసుకువచ్చేందుకు పవార్ కుటుంబం తీవ్రంగా కృషి చేసిందని, అజిత్ తిరిగి ఎన్సీపీలోకి వచ్చేందుకు వీలుగానే శరద్ పవార్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 23న బీజేపీతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అజిత్ పవార్‌ను మళ్లీ వెనక్కు తీసుకువచ్చేందుకు ఎన్సీపీ నేతలు, పవార్ కుటుంబం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అజిత్‌ను వెనక్కు రావాల్సిందిగా ట్వీటర్ వేదికగా పవార్ కుటుంబ సభ్యులు విజ్ఙప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రజలు మాకే అధికారం ఇచ్చారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమకే అధికారం అప్పగించారని, అయితే, కలిసి పోటీ చేసిన శివసేన అధికారం కోసం తమకు దూరమైందని రాజీనామా ప్రకటన సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. ఇకపై బాధ్యతాయుత ప్రతిపక్షంగా, అసెంబ్లీలో ప్రజా వాణిని వినిపిస్తామని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే స్థాయికి దిగజారలేమని వ్యాఖ్యానించారు. ‘అజిత్ పవార్ మీకు మద్దతివ్వడం శరద్ పవార్ వ్యూహంలో భాగమనుకుంటున్నారా?’అని ప్రశ్నించగా, ‘ఆ ప్రశ్న శరద్ పవార్‌ను అడగండి. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని అజిత్ పవార్ నాతో చెప్పారు’అని స్పందించారు. ఈ సందర్భంగా శివసేనపై ఫడ్నవీస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఎన్నికల ఫలితాలు బీజేపీ–శివసేన కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తామని సేన నేతలు వ్యాఖ్యానించారు. ఆ తరువాత మాతో అబద్దాలు చెబుతూ.. వేరే పార్టీలతో చర్చలు ప్రారంభించారు. హిందూత్వ సిద్ధాంతాలు చెప్పే శివసేన ఈ రోజు సోనియాగాంధీ ముందు మోకరిల్లింది. ఆమె పేరుతో ప్రతిజ్ఞలు కూడా చేశారు’అని విమర్శించారు. ఎన్నికల ఫలితాలను, పోటీ చేసిన స్థానాలను, గెలిచిన సీట్లను విశ్లేషిస్తే.. బీజేపీనే మళ్లీ అధికారంలోకి రావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఐదేళ్లు ఉద్ధవ్ ఠాక్రేనే ఫడ్నవీస్ రాజీనామా అనంతరం శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రే సీఎం కాబోతున్నారని, వచ్చే ఐదేళ్లు ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మళ్లీ తమవైపే వచ్చారన్నారు. టైడెంట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కూటమి నేతగా, తదుపరి సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే పేరును ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్ మద్దతు పలికారు. ఈ కార్యక్రమానికి శరద్‌పవార్‌తో పాటు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్, సమాజ్‌వాదీ పార్టీ నేత అబూ అజం, స్వాభిమాని షేట్కారీ సంఘటన చీఫ్ రాజు షెట్టి తదితరులు హాజరయ్యారు. కానీ, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌పవార్ మాత్రం హాజరుకాలేదు. అసెంబ్లీ ప్రత్యేక భేటీ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రంలోగా ఫడ్నవీస్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే కాళీదాస్ కొలాంబ్కర్‌ను గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఆయన బుధవారం ఉదయం కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. శరద్ పవార్ ఇంటికి అజిత్ కాగా, తిరుగుబాటు చేసి బీజేపీ క్యాంప్‌తో చేతులు కలిపిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. శరద్ పవార్ ఇంటికి అజిత్ మంగళవారం రాత్రి వచ్చారు. ఆ తరువాత ఛగన్ భుజ్‌బల్, ప్రఫుల్ పటేల్ కూడా శరద్ పవార్ నివాసానికి వచ్చారు. -
పార్లమెంటులో ‘మహా’ సెగలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై సోమవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలనను ఎత్తేసీ ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు లోక్‌సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. మహారాష్ట్ర పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విపక్షాలు సభను హోరెత్తించాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యం ఖూనీని నివారించండి అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని ఎంపీలు వెల్‌లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. వెల్‌లోకి వచ్చిన కాంగ్రెస్ సభ్యులు, హిబి ఈడెన్, ప్రతాపన్లను వెనక్కి వెళ్లాలంటూ స్పీకర్ చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో సభ నుంచి బయటకు పంపేయాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు జారీ చేయడంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. మార్షల్స్కి, సభ్యులకి మధ్య తోపులాట జరిగింది. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. భద్రతా సిబ్బంది చేయి చేసుకున్నారు: మహిళా ఎంపీల ఫిర్యాదు మహారాష్ట్ర విషయంలో సభలో గందరగోళం నెలకొన్నప్పుడు భద్రతా సిబ్బంది తమపై చేయి చేసుకున్నారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు . తమపై భద్రతా సిబ్బంది చేయి చేసుకున్నారంటూ కాంగ్రెస్ ఎంపీలు జోతిమణి, రమ్య హరిదాస్లు ఆరోపించారు. మహారాష్ట్రలో అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. ఆమె వెంట పార్టీ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, అధీర్ రంజన్ చౌధరి, శశిథరూర్‌లు కూడా నిరసన కార్యక్రమంలో నినాదాలు చేశారు. రాజ్యసభలోనూ అదే సీన్ రాజ్యసభ మహారాష్ట్ర అంశంపై దద్దరిల్లింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, డీఎంకేలు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రాత్రికి రాత్రి ఎందుకు ఎత్తివేశారని, దానిపై చర్చించాలంటూ పట్టు పట్టారు. చైర్మన్ వెంకయ్య రాష్ట్రపతి పాలన విధించడానికి ముందు, లేదంటే ఎత్తివేయడానికి ముందు సభ చర్చించాలని, ఎత్తివేశాక దానిపై చర్చ జరపలేమన్నారు. అయినా, సభలో గందరగోళం ఆగలేదు. ప్రజాస్వామ్యాన్ని హత్యచేస్తున్నారంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. మధ్యాహ్నం తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో డిప్యూట్ చైర్మన్æ మంగళవారానికి సభను వాయిదా వేశారు. పార్లమెంటులో నేడు రాజ్యాంగ దినోత్సవం భారతదేశ రాజ్యాంగ సభ తనదైన సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగాన్ని ఆమోదించుకుని సరిగ్గా ఏడు దశాబ్దాలు. 1949 నవంబర్ 26న మన దేశ రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది. ఆ తరువాత రెండు నెలల అనంతరం 1950 జనవరి 26న ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1947 ఆగస్టు నెలలో వలస పాలన నుంచి విముక్తిపొందిన భారతదేశం.. రెండేళ్ళ అనంతరం తనదైన రాజ్యాంగాన్ని రూపొందించుకుని నవంబర్ 26న ఆమోదింపజేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏటా రాజ్యాంగ దినోత్సవం– ‘సంవిధాన్ దివస్’ జరుపుకుంటున్నాం. 70ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో మంగళవారం ఉభయసభల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. -
గవర్నర్లు.. కింగ్మేకర్లు!
సాక్షి, ముంబై: దేశంలో గత మూడేళ్లలో అయిదు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్లు పోషించిన పాత్ర వివాదాస్పదం అయింది. ఈ రాష్ట్రాల్లో గవర్నర్లు బీజేపీ కోసం గేమ్ చేంజర్లుగా మారారు. 2017లో... గోవాలో 2017 ఎన్నికల్లో అసెంబ్లీలోని 40 స్థానాలకు 18 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, గవర్నరు మృదులా సిన్హా ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకే అవకాశమిచ్చారు. ఈ విషయంపై కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో గవర్నర్ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతోపాటు, 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో 28 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ 21 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అయినప్పటికీ, గవర్నర్ కాంగ్రెస్‌ను కాదని, బీజేపీకి చాన్సివ్వడంతో కమలదళం ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 2018లో... కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం గవర్నర్ వజూభాయ్ వాలా అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించారు. అయితే, బలపరీక్షలో బీజేపీ ఓడిపోయింది. సీఎం యడియూరప్పరాజీనామా చేయడంతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. అనంతర పరిణామాల్లో అధికార కూటమిలోని 17 మంది ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఆపై మళ్లీ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్– జేడీఎస్ వాదనలను గవర్నర్ వినిపించుకోలేదన్న ఆరోపణలున్నాయి. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను 21 స్థానాలతో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. గవర్నర్ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీని, దాని మిత్రపక్షం 19 సభ్యులున్న ఎన్పీపీని ఆహ్వానించడం వివాదాస్పదమైంది. -
‘శరద్‌కు కేంద్ర పదవులు’
పట్నా: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎన్డీయేలో చేరితే కేంద్రప్రభుత్వంలో కీలక పదవి లభించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను కూడా శరద్ కలుపుకుపోవాలని అన్నారు. శివసేన–బీజేపీ సంక్షోభం గురించి మాట్లాడుతూ.. రెండు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే, సమస్యలున్నా సర్దుకుపోయి ఉండేవన్నారు. కానీ పరిస్థితి చేజారిందన్నారు. ‘అభినవ చాణక్య’ అమిత్‌షా వేగాన్ని ఆయా పార్టీలు అందుకోలేకపోయాయన్నారు. ఎన్సీపీని తమతో చేర్చుకున్న బీజేపీ.. కాంగ్రెస్, శివసేనలకు షాకిచ్చిందని చెప్పారు. మరోవైపు బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ బీజేపీ–ఎన్సీపీ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజును విజయ్ దివాస్‌గా జరుపుకుంటామన్నారు. -
‘మహా’ సీఎం ఉద్ధవ్!
న్యూఢిల్లీ/ సాక్షి, ముంబై: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే సస్పెన్స్ వీడింది. శివసేన నేతృత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందన్న స్పష్టత వచ్చినప్పటికీ.. శివసేన తరఫున ముఖ్యమంత్రి ఎవరవుతారనే విషయంలో ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనా? లేక ఆయన కుమారుడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే సీఎం అవుతారా? అనే విషయంలో శుక్రవారం వరకు సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మధ్య ముంబైలో శుక్రవారం జరిగిన చర్చల అనంతరం ఆ సందిగ్ధతకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ తెర దించారు. సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రేనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని వెల్లడించారు. ‘సంకీర్ణ ప్రభుత్వ నేత ఎవరనే విషయం పెండింగ్‌లో లేదు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై ఏకాభిప్రాయం ఉంది’ అన్నారు. ఈ మూడు పార్టీల మధ్య చర్చలు నేడు(శనివారం) కూడా కొనసాగనున్నాయి. చర్చల ప్రక్రియ శుక్రవారం ముగుస్తుందని, ఆ తరువాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ మూడు పార్టీలు కలిసి అధికారిక ప్రకటన చేస్తాయని తొలుత అంతా భావించారు. కానీ చర్చించాల్సిన విషయాలు కొన్ని ఉన్నందున, మూడు పార్టీల నేతల భేటీ శనివారం కూడా కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తెలిపారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, అనేక విషయాల్లో ఒక అంగీకారానికి వచ్చామని చర్చల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ పేర్కొన్నారు. ముంబైలోని నెహ్రూ సెంటర్లో జరిగిన ఈ చర్చల్లో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో పాటు.. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, సంజయ్ రౌత్, సుభాష్ దేశాయి, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్, మల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండే, బాలాసాహెబ్ తోరట్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, జయంత్ పాటిల్, అజిత్ పవార్ పాల్గొన్నారు. చర్చలు సంతృప్తికరంగా జరిగాయని, త్వరలో వివరాలు మీడియాకు వివరిస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేనే సీఎం అవుతారని శరద్ పవార్ చెప్పారని శివసేన నేత ఏక్నాథ్ షిండేతో విలేకరులు ప్రస్తావించగా.. ‘ఆ విషయం ఈ రోజు చర్చల్లో ప్రస్తావనకు రాలేదు’ అని తెలిపారు. శివసేన శాసనసభాపక్ష నేతగా షిండే ఎన్నికయిన విషయం తెలిసిందే. కాగా, ఉద్ధవ్ ఠాక్రేనే సీఎం కావాలని పవార్ పట్టుబడుతున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఉద్ధవ్ ఠాక్రేనే అన్నారు. చర్చల అనంతరం సంజయ్ రౌత్, సుభాష్ దేశాయి, ఆదిత్య ఠాక్రేలతో శివాజీ పార్క్‌లోని మేయర్స్ బంగళాలో ఉద్ధవ్ సమావేశమయ్యారు. మిత్రపక్షాలతో కాంగ్రెస్– ఎన్సీపీ భేటీ శివసేనతో చర్చలకు ముందు.. మిత్రపక్షాల నేతలతో కాంగ్రెస్– ఎన్సీపీ నాయకులు చర్చలు జరిపారు. సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం, స్వాభిమాన్ ప„Š , పీజంట్స్ వర్కర్స్ పార్టీ, జనతాదళ్ తదితర పార్టీల ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ‘శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మా మిత్రపక్షాలు ఆమోదం తెలిపాయి’ అని ఆ తరువాత ఎన్సీపీ నేత జయంత్‌పాటిల్ తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతర మిత్ర పక్షాలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ) ముసాయిదాను రూపొందించా యని, దీనిపై పార్టీల అగ్ర నేతలు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ వెల్లడించారు. ‘మా మద్దతు కావాలంటే శివసేన కొన్ని విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. మతవాదాన్ని నిర్మూలించేందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. దళితులు, మైనారిటీలు, రైతులకు అనుకూలంగా ప్రభుత్వం ఉండాలి’ అని ఎస్పీ నేత అబూ అజ్మీ స్పష్టం చేశారు. ఇంద్ర పదవి ఇస్తామన్నా.. బీజేపీతో మళ్లీ పొత్తుకు అవకాశాలు లేవని శివసేన నేత సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. ‘ఇంద్రుడి సింహాసనం ఇస్తామన్నా బీజేపీకి మద్దతివ్వం’ అని స్పష్టం చేశారు. శివసేనతో పొత్తుకు బీజేపీ మళ్లీ ప్రయత్నిస్తోందన్న వార్తలపై ఆయన పై విధంగా స్పందించారు. అవకాశవాద పొత్తు: బీజేపీ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల పొత్తు అవకాశవాద రాజకీయమని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ విమర్శించారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకే సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ.. ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. వారి ప్రభుత్వం ఆర్నెల్లు మించి సాగదన్నారు. -
ఆగని ‘మహా’ వ్యథ
సాక్షి ముంబై: అతివృష్టి లేదంటే అనావృష్టి.. ఆదుకునే నాథుడు లేడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రపతి పాలన పెట్టడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక మహారాష్ట్రలో అన్నదాతలు కుంగిపోతున్నారు. గత కొన్నేళ్లుగా కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడిన రైతాంగం ఈ ఏడాది కురిసిన వర్షాలకు ఆనందం చెందారు. తమ పంట పండిందని సంబరాలు చేసుకున్నారు. అయితే అక్టోబర్‌లో రుతుపవనాల తిరుగు ప్రయాణ సమయంలో భారీగా వర్షాలు కురవడంతో చేతికందిన పంట నీళ్లపాలైంది. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. కేవలం మరాఠ్వాడా ప్రాంతంలో 41 లక్షల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, కందితో పాటు ఇతర పండ్ల తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లడంతో రైతన్నలు తట్టుకోలేకపోయారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో 68 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జనవరి నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో 746 మంది బలవన్మరణం పొందారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై తమను ఆదుకుంటుందేమోనని రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలోనే రాష్ట్రపతి పాలన పెట్టడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అయితే రాష్ట్ర గవర్నర్ పంట నష్టపోయిన వారికి ప్రతీ హెక్టార్‌కు రూ.8 వేలు, పండ్ల తోటలకు ప్రతీ హెక్టార్‌కు రూ.18 వేలు ప్రకటించడం కాస్త ఊరటనిచ్చినా కష్టాల ఊబి నుంచి రైతుల్ని బయటపడవేయలేకపోయాయి. ప్రభుత్వ లెక్కలన్నీ తప్పులే ‘సాక్షి’తో పి. సాయినాథ్ రైతు కష్టాల్లో మహారాష్ట్ర అత్యంత దయనీయ స్థితిలో ఉందని సీనియర్ జర్నలిస్టు, ది హిందూ పత్రిక గ్రామీణ వ్యవహారాల మాజీ ఎడిటర్ పి. సాయినాథ్ అన్నారు. రైతుల ఆత్మహత్య వివరాల్లో ప్రభుత్వ గణాంకాలన్నీ తప్పుడువేనని చెప్పారు. ఈ విషయమై ఆయన సాక్షితో మాట్లాడుతూ 1995 నుంచి 2015 వరకు 20 ఏళ్లలో మహారాష్ట్రలో 65 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెబుతున్నారు కానీ, ఇది సరైనది కాదని అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలను సేకరించే పద్ధతిలో లోపాలున్నాయని అన్నారు. వారు సరిగ్గా లెక్కలు వేసి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న డేటా కూడా మూడేళ్ల నాటిదని సాయినాథ్ వ్యాఖ్యానించారు. రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలోనే కనీసం ప్రభుత్వం కూడా లేకపోవడం పులి మీద పుట్రవంటిదేనని వ్యాఖ్యానించారు. -
నేడు శివసేనతో భేటీ
న్యూఢిల్లీ/ సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కొత్త కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. త్వరలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడనుంది. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ సిద్ధమయ్యాయి. శివసేనతో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు గురువారం విజయవంతంగా ముగిశాయి. ఈ చర్చల్లో అన్ని అంశాల్లో ‘పూర్తి ఏకాభిప్రాయం’ సాధించినట్లు చర్చల అనంతరం రెండు పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, పొత్తుకు తుదిరూపమిచ్చేందుకు శుక్రవారం శివసేనతో భేటీకానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేసిన సమాజ్‌వాదీ, సీపీఎం, స్వాభిమాని ప„Š , పీజంట్స్ వర్కర్స్ పార్టీలతో శుక్రవారం చర్చించి, ఆ తరువాత శివసేనతో కూటమి కూర్పుపై, కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్– సీఎంపీ)పై యోచిస్తామని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించాయి. తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై ముంబైలో అధికారికంగా తుది ప్రకటన ఉంటుందన్నాయి. ఆ తర్వాత మూడు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీకి లేఖ ఇస్తాయి. నవంబర్ 26న ప్రమాణ స్వీకారం ఉండొచ్చని శివసేన వర్గాలు తెలిపాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన, కాంగ్రెస్–ఎన్సీపీ కూటములు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన విషయం తెలిసిందే. ఉద్ధవ్నా? ఆదిత్యనా? శివసేన తరఫున ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. సేన యువనేత, పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేకు ఆ స్థానం అప్పగించే ఆలోచన ఉందని శివసేన వర్గాలు తెలిపాయి. కానీ, ఉద్ధవ్ ఠాక్రే సీఎం కావాలని ఎన్సీపీ, కాంగ్రెస్ పట్టుబడుతున్నాయని, తొలిసారి ఎమ్మెల్యే అయిన, రాజకీయ అనుభవం పెద్దగా లేని ఆదిత్యకు పెద్ద బాధ్యత అప్పగించడం సరికాదని భావిస్తున్నాయని పేర్కొన్నాయి. మరోవైపు, సీఎంగా ఉద్ధవ్, ఆదిత్య కాకుండా.. శివసేన సీనియర్‌నేతలు సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయిల పేర్లూ శివసేన వర్గాల్లో వినిపిస్తున్నాయి. కానీ, ఠాక్రేలు కాకుండా, వేరే ఎవరు సీఎం అయినా, పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. సీడబ్ల్యూసీ ఆమోదం ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ నివాసంలో గురువారం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగాయి. ‘అన్ని అంశాలపై కూలంకషంగా చర్చలు జరిపాం. రెండు పార్టీల మధ్య పూర్తిస్థాయిలో ఏకాభిప్రాయం కుదిరింది’ అని చర్చల అనంతరం కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ ప్రకటించారు. సీఎంపీ ప్రకటన సందర్భంగా కొత్త ప్రభుత్వ వివరాలను వెల్లడిస్తామన్నారు. సీఎం పదవిని పంచుకోవడంపై వస్తున్న వార్తలను మీడియా ప్రస్తావించగా.. ‘అవన్నీ ఊహాగానాలే’ అని కొట్టివేశారు. ఎన్సీపీతో చర్చల వివరాలను కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత వేదిక సీడబ్ల్యూసీకి నేతలు వెల్లడించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరిగిన భేటీలో శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని ఆ తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోనియా, ఉద్ధవ్ భేటీ ఉండదు సోనియాగాంధీతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యే అవకాశాలు లేవని సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘ఒకటి, రెండు రోజుల్లో మూడు (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయి. ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తి స్పష్టత వస్తుంది’ అని గురువారం మీడియాతో చెప్పారు. పవార్, ఠాక్రే భేటీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో గురువారం రాత్రి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సమావేశమయ్యారు. దక్షిణ ముంబైలోని శరద్ పవార్ నివాసంలో ఈ భేటీ జరిగింది. అయితే, వారు ఏం చర్చించారనే విషయం వెల్లడి కాలేదు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు ‘డిప్యూటీ’ ప్రభుత్వ కూర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై ముంబైలో మరికొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఐదేళ్ల పాటు శివసేన నేతనే ఉంటారని, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభిస్తాయని, కీలక మంత్రి పదవులు మాత్రం మూడు పార్టీలకు సమానంగా లభిస్తాయని, స్పీకర్ పదవి కాంగ్రెస్‌కేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరఫున బాలాసాహెబ్ తోరట్ ఉంటారని తెలుస్తోంది. పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు పార్టీలకు మంత్రిపదవులు లభించనున్నాయనే వార్తలొచ్చాయి. -
‘మహా’ ఉత్కంఠకు తెర!
న్యూఢిల్లీ/సాక్షి, ముంబై: మహా ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బుధవారం కొంత స్పష్టత వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించారు. సైద్ధాంతికంగా తీవ్ర విబేధాలున్న శివసేనకు కాంగ్రెస్ మద్దతివ్వడంపై నెలకొన్న అనుమానాలు తొలగాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్, ఎన్సీపీ సీనియర్ నేతలు ఢిల్లీలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో 4గంటలకుపైగా చర్చలు జరిపారు. త్వరలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత ప్రకటించారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చెప్పారు. బీజేపీతో సేన తెగతెంపులయ్యాక ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్న వార్తలు రావడం మొదలయ్యాక ఈ విషయమై స్పష్టమైన ప్రకటన రావడం ఇదే ప్రథమం. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగుతాయని, కూటమికి సంబంధించి మరి కొన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని పృథ్వీరాజ్ చౌహాన్ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ప్రకటన చేసే అవకాశముందని సమాచారం. శివసేన ఫస్ట్.. ఎన్సీపీ నెక్ట్స్ ముఖ్యమంత్రి పీఠాన్ని మొదట శివసేన, ఆ తరువాత ఎన్సీపీ చెరో రెండున్నరేళ్లు పంచుకునేందుకు, కాంగ్రెస్‌కు ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. ‘పూర్తిగా ఐదేళ్లు శివసేనకే ముఖ్యమంత్రి పీఠం అప్పగించలేం. చివరి రెండున్నరేళ్లు ఎన్సీపీ నేత సీఎంగా ఉంటారు’ అని తెలిపాయి. శివసేన, ఎన్సీపీల మధ్య సీట్ల తేడా కూడా రెండు మాత్రమేనని ఎన్సీపీ నేత ఒకరు గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్, ఎన్సీపీ చర్చల్లో సీఎం పదవిపై చర్చ జరగలేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికలు జరిగే నవంబర్ 30లోపే ప్రభుత్వ ఏర్పాటవుతుందని ఎన్సీపీ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య జరిగిన చర్చల్లో కాంగ్రెస్ తరఫున మల్లిఖార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, బాలా సాహెబ్ తోరట్ తదితరులు.. ఎన్సీపీ నుంచి నవాబ్ మాలిక్, సుప్రియా సూలె, జయంత్‌పాటిల్, అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా సీఎంపీ(కామన్ మినిమమ్ ప్రోగ్రాం)పై చర్చ జరిగిందని, శివసేనతో సైద్ధాంతిక విబేధాల గురించి ప్రస్తావన రాలేదని ఎన్సీపీ రాజ్యసభ సభ్యుడు మజీద్ మెమన్ వెల్లడించారు. త్వరలోనే కొత్త ప్రభుత్వం: ప్రభుత్వ ఏర్పాటుపై అడ్డంకులు దాదాపు తొలగినట్లేనని, అతి త్వరలోనే శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రైతాంగ సంక్షోభాన్ని ప్రధానికి వివరించేం దుకు సీనియర్ నేత, మాజీ వ్యవసాయ మంత్రి అయిన శరద్ పవారే సరైన వ్యక్తి అని భావించి.. తామే ఆయనను ప్రధానిని కలిపే ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించమని కోరామన్నారు. తాను కూడా పవార్‌తో భేటీ అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ పరిణామాలపై ఎప్పటికప్పుడు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు, యువనేత ఆదిత్య ఠాక్రేకు సమాచారమిస్తున్నామన్నారు. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడంపై విభేదాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోవడం, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం తెలిసిందే. -
ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదు
న్యూఢిల్లీ/ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 26 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న శివసేన ఆశలు నెరవేరడం లేదు. తాజాగా, ఢిల్లీలో ప్రెస్మీట్లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఈ మూడు పార్టీల మధ్య పొత్తు దిశగా అడుగులు పడటం లేదనే సంకేతాలిస్తున్నాయి. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఢిల్లీలో సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుపై ఆమెతో చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని సోనియాకు వివరించానన్నారు. ‘మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వివరంగా చర్చించాం. మహారాష్ట్రలో పరిస్థితులను నిశితంగా గమనిస్తుంటాం. భవిష్యత్ కార్యాచరణపై ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు చర్చలు కొనసాగిస్తారు’ అని పవార్ వివరించారు. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మద్దతిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేసిన పవార్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తమ ప్రధాన ప్రత్యర్థి అన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదో ఆ పార్టీలనే అడగండి’ అన్నారు. పవార్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవని, ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నామనేదే పవార్ వ్యాఖ్యల అర్థం అని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, రాజకీయాల్లో ఆరితేరిన పవార్.. పొత్తు చర్చల్లో శివసేనపై ఒత్తిడి తెచ్చి, కొత్త ప్రభుత్వంలో పై చేయి సాధించేందుకే ఇలా వ్యాఖ్యానించారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పవార్ తాజా వ్యాఖ్యలపై శివసేన స్పందించలేదు. కానీ, పవార్ నివాసంలో ఆయనతో శివసేన నేత సంజయ్‌రౌత్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘త్వరలో శివసేన నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని అన్నారు. మహారాష్ట్ర రైతుల సమస్యలపై ప్రధాని మోదీని కలిసే అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించాలని కోరేందుకు పవార్‌ను కలిశానన్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభలో వ్యవహరించే తీరుపై ఎన్సీపీపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. పార్లమెంట్లో శివసేన సభ్యులకు విపక్ష సభ్యుల వైపు స్థానాలు కేటాయించడంపై సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వం ఏ ఒక్క పార్టీ సొత్తో కాదు. కానీ, కొందరు తమను తాము దేవుళ్లుగా భావిస్తుంటారు’ అని వ్యాఖ్యానించారు. నవంబర్ 24న అయోధ్య వెళ్లాలనుకున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే.. తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. -
వద్దన్న బీజేపీ... మళ్లీ ముందుకు!
తీర్పు స్పష్టంగానే వచ్చింది. కానీ పార్టీలే మాట తప్పాయి. ఇక్కడ ఏ పార్టీ మాట తప్పిందంటే... చెప్పటం కష్టం. మహారాష్ట్రలో బీజేపీ– శివసేన కూటమికి జనం అధికారమిచ్చినా... రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకుంటామని ముందు చెప్పి, తరవాత మాట తప్పుతున్నందుకే తాము బీజేపీతో కలవటం లేదని శివసేన చెబుతోంది. తాము అలాంటి హామీనే ఇవ్వలేదని, శివసేనే మాట మారుస్తోందని బీజేపీ చెబుతోంది. అందుకే... ఇద్దరి పొత్తూ పెటాకులైంది. బీజేపీకి సింగిల్‌గా బలం చాలదు కనక... గవర్నరు పిలిచినా... చేతులెత్తేసింది. శివసేనను పిలిచినా అదే కథ. కాకపోతే ఈ పార్టీ కొంచెం సమయం కావాలంది. దానికి నిరాకరిస్తూ మరో పార్టీ ఎన్సీపీని కూడా పిలిచారు గవర్నరు. అంతలోనే ఈ గొడవ తేలదంటూ ఈ వారం మొదట్లో గవర్నరు రాష్ట్రపతి పాలనకూ సిఫారసు చేశారు. కేంద్రం ఓకే చేసేసింది. ఇది అన్యాయమంటూ శివసేన సుప్రీంకోర్టుకు వెళ్లింది కూడా. 288 సీట్ల మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలున్నాయి. బీజేపీగానీ, శివసేనగానీ లేకుండా ఏ ప్రభుత్వమూ ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. అందుకే సేన కూడా మొండిపట్టు పడుతోంది. ప్రాంతీయ శక్తుల ఎదుగుదలకు అవకాశమున్న మహారాష్ట్రలో ముందుముందు బలోపేతం కావాలంటే అధికార పీఠం తన చేతిలో ఉండాలన్నది సేన మనోగతం. అందుకే మునుపటిలా బీజేపీకే ఐదేళ్లూ అవకాశం ఇవ్వకుండా తనకూ రెండున్నరేళ్లు సీఎం పీఠం కావాలంది. ఇదే ప్రతిపాదనతో ఎన్సీపీ– కాంగ్రెస్‌లతోనూ సంప్రదింపులు జరుపుతోంది. ఎన్సీపీ ఓకే అంటున్నా... కాంగ్రెస్ మాత్రం సైద్ధాంతిక వైరుధ్యాల దృష్ట్యా అంత సుముఖత వ్యక్తం చేయలేదు. కాకపోతే దేశ ఆర్థిక రాజధాని ముంబైని బీజేపీకి దూరం చేయాలంటే సేనకు మద్దతివ్వక తప్పదు. అందుకే ముగ్గురూ కలిసి ఓ అవగాహనకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి కాంగ్రెస్ కూడా సై అనే ప్రకటించింది. కాంగ్రెస్ ఎలాగూ శివసేనతో కలవదని, సేన తమ చెంతకే వస్తుందని ధీమాగా ఉన్న బీజేపీకి ఇది షాకే. అందుకే వేగంగా పావులు కదిపింది. తమకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, కాబట్టి ప్రభుత్వానికి అవకాశమివ్వాలని గవర్నరును శనివారం కోరింది. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. ఏమో!! ఏం జరుగుతుందో... గవర్నరు ఏం చేస్తారో చూడాల్సిందే!!. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమ’ని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. -
రాష్ట్రపతి పాలన మాటున బేరసారాలు
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కాలని ప్రయత్నాలు చేస్తున్న శివసేన చిరకాల మిత్రుడైన కమలదళంపై కస్సుమంటోంది. రాష్ట్రపతి పాలన ముసుగులో బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తోందని శివసేన పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌లు తమ పార్టీకి 119 (స్వతంత్ర అభ్యర్థులు 14 మందితో కలిపి) ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమ పార్టీ సహకారం లేకుండా మరెవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టింది. మేజిక్ ఫిగర్ అయిన 145 మంది ఎమ్మెల్యేలు మద్దతు లేకపోవడం వల్లే బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించిందని గుర్తు చేసింది. క్రికెట్లోనూ, రాజకీయాల్లోనూ ఆఖరి క్షణంలో ఏదైనా జరగొచ్చునన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపైనా సామ్నా ఎడిటోరియల్ విరుచుకుపడింది. ఇవాళ, రేపు క్రికెట్ అంటే ఆట తక్కువ, వ్యాపారం ఎక్కువ అన్నట్టుగా తయారయ్యాయని వ్యాఖ్యానించింది. అంతేకాదు క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ సర్వసాధారణమైపోయిందని, అప్పుడే విజయం వరిస్తోందని పేర్కొంది. బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై వలవేసి రాజకీయ క్రీడలో గెలవాలని చూస్తోందని సామ్నా తన సంపాదకీయంలో ఆరోపించింది. మరోవైపు ఎన్సీపీ కూడా బీజేపీపై ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. తమ పార్టీ త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఇతర పార్టీల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఎమ్మెల్యేలను తమ గూటికి లాగాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌తో భేటీ వాయిదా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ఇంకా ముందుకు కదలలేదు. వాస్తవానికి శనివారమే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి చర్చించి, ఆ తర్వాత గవర్నర్‌తో భేటీ కావాలని భావించారు. కానీ ఈ సమావేశాలన్నీ వాయిదా పడ్డాయి. ఆదివారం శరద్ పవార్, సోనియాతో కలిసే అవకాశాలున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అనుసరించాల్సిన విధివిధానాలపై పవార్ సోనియాతో చర్చించాక మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠపై ఒక స్పష్టత రానుంది. ఎన్డీయే భేటీకి సేన దూరం ఈ నెల 18న ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ఎన్డీయే సమావేశం కానుంది. ఈ సమావేశానికి తాము హాజరు కాబోమని శివసేన స్పష్టం చేసింది. ఎన్డీయేకి రాం రాం చెప్పడం ఇక లాంఛనప్రాయమేనని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ విలేకరులకు చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉన్న శివసేనకు చెందిన ఒకే ఒక మంత్రి అరవింద్ సావంత్ ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఎప్పుడైతే 50:50 ఫార్ములాకు బీజేపీ అంగీకరించలేదో అప్పట్నుంచే తాము ఎన్డీయేకి దూరమయ్యామని రౌత్ స్పష్టం చేశారు. పార్లమెంటులో విపక్ష స్థానాల్లో సేన ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో శివసేన పార్టీ ఎంపీలు కూర్చొనే స్థానాలు ఇకపై మారిపోనున్నాయి. శివసేన ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షం వైపు అయిదో వరసలో ఇక కూర్చోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
మహా సంకీర్ణం!
-
శివసేన నేతృత్వంలో సంకీర్ణం
నాగ్‌పూర్/ముంబై: మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. అభివృద్ధే లక్ష్యంగా ఏర్పడబోయే తమ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం కొనసాగుతుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. విభిన్న సైద్ధాంతిక భావాలున్న తమ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం శివసేన నేతృత్వంలో ఏర్పాటుకానుందని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ప్రాథామ్యాలపై కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)పై మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. ముఖ్యమంత్రి పదవిలో శివసేన నేత ఉంటారని ఎన్సీపీ నేత మాలిక్ తెలిపారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శుక్రవారం నాగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘త్వరలో అధికారంలోకి రానున్న సేన–ఎన్సీపీ–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుంది. అభివృద్ధే లక్ష్యంగా మా సర్కారు సుస్థిర పాలన అందిస్తుంది. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదు’అని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామంటూ మాజీ సీఎం ఫడ్నవీస్ చెప్పడంపై స్పందిస్తూ.. ‘ఫడ్నవీస్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ, ఆయన జ్యోతిష్యం కూడా నేర్చుకున్న సంగతి తెలియదు. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ఆయన పదేపదే అంటున్నారు. అది తప్ప మరేదైనా కొత్త విషయం చెప్పమనండి. మా సంకీర్ణం లౌకిక భావాల ప్రాతిపదికన పనిచేస్తుంది. ఏ మతానికీ వ్యతిరేకం కాదు’అని స్పష్టం చేశారు. 25 ఏళ్లు అధికారంలో ఉంటాం: సంజయ్ రౌత్ శివసేన నేతృత్వంలో త్వరలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తెలిపారు. ‘మా పార్టీ రానున్న ఐదేళ్లే కాదు..మరో 25 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగనుంది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు సీఎంపీ రూపొందించాం. ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునే విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో పార్టీల సిద్ధాంతాల ప్రస్తావన లేదు. గతంలో కూడా సీఎంపీ ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి’అని పేర్కొన్నారు. వీర్ సావర్కర్‌కు భారతరత్న, ముస్లిం రిజర్వేషన్ వంటి డిమాండ్లను శివసేన వదులుకుంటుందా అన్న ప్రశ్నకు రౌత్ స్పందించలేదు. కాగా, శరద్ పవార్ 17వ తేదీన ఢిల్లీలో సోనియా గాంధీతో సమావేశమై సీఎంపీ, ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇలా ఉండగా, తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ తెలిపారు. -
ఉమ్మడి ముసాయిదా ఖరారు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన.. రాష్ట్రపతి పాలన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటు దిశగా పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై దాదాపు ఒక అంగీకారం కుదిరిందని, ఆదివారం నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. గురువారం తొలిసారిగా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలు సమావేశమై కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)తోపాటు అధికారంలో సమాన వాటా అంశంపై చర్చలు జరిపారు. ముసాయిదాను శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ చీఫ్‌లు ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్, సోనియా గాంధీలకు తుది నిర్ణయం కోసం అందించనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మహాశివ్ కూటమి ప్రభుత్వం ఈ 17వ తేదీన ఏర్పడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎంపీలో ఏముంటుంది?: కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ)లో ఏ ఏ అంశాలున్నాయనే దానిపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యత అంశాలతోపాటు పదవుల పంపకంపై మూడు పార్టీల నేతల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదిరింది. ఒక అంచనా ప్రకారం..శివసేన, ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి పదవులతోపాటు చెరో 14 మంత్రి పదవులు.. అయిదేళ్లపాటు కాంగ్రెస్‌కు ఉపముఖ్యమంత్రి పదవి, 11 మంత్రి పదవులు లభించనున్నట్టు తెలుస్తోంది. మరో అంచనా ప్రకారం.. శివసేన, కాంగ్రెస్‌లకు చెరో రెండేళ్లు, కాంగ్రెస్‌కు ఏడాది పాటు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయంపై అంగీకారం కుదిరిందని తెలిసింది. దీంతోపాటు మంత్రి పదవులు ఎన్సీపీ, శివసేనలకు సమానంగా ఉండగా కాంగ్రెస్‌కు మూడు మంత్రి పదవులు తక్కువ కానున్నాయని సమాచారం. -
మహారాష్ట్రలో 50:50 ఫార్ములానే!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు 50:50 ఫార్ములాను రూపొందించినట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీలకు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవితోపాటు చెరో 14 మంత్రి పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్‌కు అయిదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు 11 మంత్రి పదవులు ఇవ్వాలనే విధంగా ఒప్పందం కుదరనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై తొలుత ఎన్సీపీ, కాంగ్రెస్‌లు చర్చలు జరిపి, ఆ తరువాత శివసేనతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పేర్కొన్నాయి. సరైన దిశలో చర్చలు సాగుతున్నాయి: ఉద్ధవ్ ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో బుధవారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు థోరాత్, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్, మాణిక్ రావు సమావేశమయ్యారు. చర్చలు సరైన దిశలో కొనసాగుతున్నాయని మీడియాతో ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ‘గడువు తిరస్కరణ’ను ప్రస్తావించని శివసేన న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా పార్టీల నుంచి మద్దతులేఖను సాధించేందుకు తాము అడిగిన మూడ్రోజుల గడువును గవర్నర్ కోష్యారీ తిరస్కరించారనే విషయాన్ని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో శివసేన ప్రస్తావించలేదు. మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన ఇప్పటికే అమల్లోకి వచ్చినందున, మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా.. ‘మూడ్రోజుల సమయం ఇచ్చేందుకు గవర్నర్ ఒప్పుకోని’ అంశాన్ని పిటిషన్లో ప్రస్తావించలేదని శివసేన లాయర్లు బుధవారం మీడియాకు చెప్పారు. గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ, వెంటనే దీనిపై అత్యవసర విచారణకు ఆదేశించాలని శివసేన మంగళవారం సుప్రీంకోర్టు తలుపుతట్టడం, దీనిపై రిట్ పిటిషన్ దాఖలుచేయాలని శివసేనను కోర్టు ఆదేశించడం తెల్సిందే. అయితే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ చేసిన సిఫార్సును తప్పుబడుతూ తాము మరో పిటిషన్‌ను సిద్ధంచేశామని శివసేన లాయర్లు వెల్లడించారు. అయితే, ఇప్పటికే రాష్ట్రపతిపాలన అమల్లోకి వచ్చినందున, నెమ్మదిగా పిటిషన్ వేస్తామని, ఈ పిటిషన్ దాఖలుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని లాయర్లు చెప్పారు. -
‘మహా’ డ్రామాలో మరో ట్విస్ట్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాను మించిన ట్విస్ట్‌లతో మహారాష్ట్రలో రాజకీయ డ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, దాంతో ‘మహా’ ఉత్కంఠకు తెరపడనుందని సోమవారం ఉదయం వరకూ అంతా భావించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చోటు చేసుకున్న వరుస నాటకీయ పరిణామాలు, అనూహ్య మలుపులు.. ‘మహా’ ఉత్కంఠను పెంచాయి. మద్దతు లేఖ ఇవ్వకుండా కాంగ్రెస్ ఆఖరి నిమిషంలో ఇచ్చిన ట్విస్ట్‌తో శివసేన కంగుతిని, అధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. గవర్నర్‌ను కలిసిన ఆదిత్య ఠాక్రే మరో 48 గంటలు గడువు ఇచ్చేందుకు గవర్నర్ కోష్యారీ నిరాకరించడంతో రాజ్‌భవన్ నుంచి శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే బృందం నిరాశగా వెనుతిరిగింది. ఆ తరువాత, అనూహ్యంగా, ప్రభుత్వ ఏర్పాటు రేసులో ఎన్సీపీ ముందుకు వచ్చింది. ఎన్సీపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. స్పందించేందుకు 24 గంటల గడువు విధించి, నేటి(మంగళవారం) రాత్రి 8.30 వరకు ఏ విషయం చెప్పాలన్నారు. దాంతో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు ఏం చేయబోతున్నాయన్నది సస్పెన్స్‌గా మారింది. ఉదయం నుంచి చర్చోపచర్చలు.. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమై, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు కోరిన నేపథ్యంలో.. సోమవారం ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీలో చర్చలు కొనసాగాయి. తొలుత పార్టీ చీఫ్ సోనియా నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో మరోసారి భేటీ అయ్యారు. సీనియర్ నేతలు ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ తదితరులతో సోనియా చర్చలు జరిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్.. తదితరులు భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా శివసేనకు మద్దతివ్వాలా? వద్దా? ఇస్తే.. ప్రభుత్వంలో చేరాలా? లేక బయటనుంచి మద్దతివ్వాలా? మద్దతిచ్చేందుకు ఎలాంటి షరతులు విధించాలి? మద్దతివ్వడం లేదా ప్రభుత్వంలో చేరడం వల్ల పార్టీకి ఎలా ప్రయోజనకరం? తదితర అంశాలపై వారు చర్చించారు. శివసేనకు మద్దతివ్వడాన్ని కొందరు నేతలు వ్యతిరేకించారని, సైద్ధాంతికంగా విభేదాలున్న శివసేనకు మద్దతిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పలువురు నేతలు గట్టిగా వాదించినట్లు తెలిసింది. శివసేనకు మద్దతివ్వాలని, ప్రభుత్వంలో తమ భాగస్వామ్యం ఉండాలని మెజారీటీ ఎమ్మెల్యేలు కోరుకున్నట్లు సమాచారం. చివరకు, శివసేనకు మద్ధతిచ్చేందుకు పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఖండించారు. ‘ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తామని హామీ ఇస్తూ ఎలాంటి లేఖను శివసేనకు కాంగ్రెస్ ఇవ్వలేదు. శివసేనకు మద్దతివ్వడానికి సంబంధించి కాంగ్రెస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సోనియాకు ఫోన్; పవార్‌తో భేటీ ఇదే సమయంలో, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సోనియాగాంధీకి ఫోన్ చేసి, మద్దతు కోరారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, సోనియా ఠాక్రేకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామని ఠాక్రేకు చెప్పారని వెల్లడించాయి. సోనియాగాంధీకి ఉద్ధవ్‌ఠాక్రే చేసిన ఫోన్ కాల్‌పై ప్రశ్నించగా.. ‘అది మర్యాదపూర్వక ఫోన్‌కాల్ మాత్రమే’ అని ఆ తరువాత వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌తో ముంబైలోని ఒక హోటల్లో దాదాపు గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘ముంబైలో ఎన్సీపీ నేతలతో మంగళవారం తదుపరి చర్చలు జరుగుతాయని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సోనియాగాంధీ నివాసంలో నేడు ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. ఎన్సీపీకి పిలుపు రాత్రి 8 గంటల సమయంలో అనూహ్యంగా, మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ పంపారు. దాంతో, ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అజిత్ పవార్ నేతృత్వంలో పార్టీ బృందం గవర్నర్‌ను కలిసి, తమ మిత్రపక్షం కాంగ్రెస్‌తో చర్చించేందుకు సమయం కావాలని, మంగళవారం రాత్రిలోగా తమ నిర్ణయం చెబుతామని వివరించారు. శివసేనకు షాక్ కాంగ్రెస్ ప్రకటనతో ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు లభిస్తుందని, వారి నుంచి మద్దతు లేఖలు వస్తాయని ఆశించిన శివసేన ఒక్కసారిగా షాక్ తిన్నది. సాయంత్రం 7.30కు గవర్నర్ గడువు ముగియనున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌కు ఆదిత్య ఠాక్రే బృందం వెళ్లి, మరో 48 గంటల గడువు కావాలని కోరింది. అందుకు గవర్నర్ నిరాకరించడంతో వారు నిరాశతో వెనుతిరిగారు. ‘గడువు పొడిగించేందుకు గవర్నర్ నిరాకరించారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మా ప్రతిపాదనను తిరస్కరించలేదు’ అని ఆదిత్య చెప్పారు. మరోవైపు, మోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వంలో శివసేన ఏకైక మంత్రి అరవింద్ సావంత్ సోమవారం మంత్రిపదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము మద్దతివ్వాలంటే ముందు ఎన్డీయే నుంచి వైదొలగాలంటూ శివసేనకు ఎన్సీపీ చేసిన డిమాండ్ నేపథ్యంలో సావంత్ ఆ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖతో అరవింద్ సావంత్ -
బీజేపీ వెనక్కి.. శివసేన ముందుకు
-
బీజేపీ వెనక్కి.. శివసేన ముందుకు
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రెండు వారాలకు పైగా నెలకొన్న రాజకీయ అనిశ్చితిలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఆదివారం సాయంత్రం వేగంగా పరిణామాలు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత చూపింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ బీజేపీని శనివారం గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ వెనకడుగు వేయడంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. సీఎం పదవి విషయంలో శివసేనతో అంతరం పెరిగిపోవడం, ప్రభుత్వం ఏర్పాటుకు చాలినంత బలం కూడగట్టలేక బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకే మొగ్గు చూపింది. దీంతో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానం పంపారు. ఈ విషయంలో అభిప్రాయం తెలపాలంటూ సోమవారం సాయంత్రం 7.30 గంటల వరకు గవర్నర్ ఆ పార్టీ శాసనసభా నేత ఏక్నాథ్ షిండేకు గడువిచ్చారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్లో మకాం వేసిన శివసేన ఎమ్మెల్యేలంతా గవర్నర్ ఆహ్వానం అనంతరం పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి తరలివెళ్లారు. అంతకుముందు సేన చీఫ్ ఠాక్రే నగరంలోని ఓ హోటల్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలతో తమ పార్టీ నేత సీఎం పీఠం ఎక్కనున్నారంటూ ప్రకటించారు. ప్రతిపక్షం మద్దతుతో సర్కారు ఏర్పాటుకు గల అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ కూడా తెలిపారు. ఏదేమైనా తమ పార్టీ నేతే సీఎం అవుతారన్నారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామన్నారు. ఈ పరిణామాలతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య చర్చలు ఊపందుకున్నాయి. శివసేన ఎన్డీఏ నుంచి వైదొలిగితేనే.. శివసేన–ఎన్సీపీ సంకీర్ణానికి కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జైపూర్‌లో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యులు అంతిమ నిర్ణయాన్ని సోనియా గాంధీకి వదిలివేసేందుకు ఆమోదం తెలిపారు. ఎన్సీపీ చీఫ్ పవార్ మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం సోనియాతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ.. ‘సేన–ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పక్షంలో కాంగ్రెస్ మద్దతిస్తుంది. కాంగ్రెస్‌కు స్పీకర్ పోస్టు దక్కే అవకాశముంది’ అన్నారు. కాంగ్రెస్ తమకు విరోధి కాదంటూ సామ్నా పేర్కొనడంపై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. సేనకు మద్దతు తెలపాలంటే, ముందుగా ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాలి. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా చేయాలి’ అన్నారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్‌లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శివసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం అప్పగించరాదని కొందరు, కాంగ్రెస్–ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వానికి శివసేన మద్దతిస్తే చాలునని మరికొందరు అంటున్నారు. రాష్ట్రపతి పాలన రావాలని తమ పార్టీ కోరుకోవడం లేదని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉండేందుకు బీజేపీ నిర్ణయం ఇటీవలి ఎన్నికల్లో శివసేనతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ ఆదివారం ప్రభుత్వం ఏర్పాటులో అన్ని ప్రయత్నాలు చేసింది. శివసేన ససేమిరా అనడంతో గవర్నర్‌ను కలిసి ప్రతిపక్షంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. శివసేన పట్టు కారణంగా ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయానికి వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ‘శివసేన ప్రజల తీర్పును అపహాస్యం చేసింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అందుకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాం’అని ఆయన అన్నారు. అందరి చూపు కాంగ్రెస్ వైపు మహారాష్ట్ర పరిణామాలు మరోసారి కర్ణాటక రాజకీయాలను జ్ఞప్తికి తెస్తున్నాయి. అక్కడ ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ కొన్ని స్థానాలు మాత్రమే గెలుచుకున్న జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి, తలబొప్పి కట్టించుకుంది. మహారాష్ట్రలో.. శివసేనతో కలిసి ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ అతిపెద్ద పార్టీ గా అవతరించింది. శివసేనతో సీఎం పీఠం విషయంలో పొసగక తెగదెంపులు చేసుకుంది. స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చినప్పటికీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు 25 సీట్ల దూరంలో ఉండిపోయింది. అయితే, గవర్నర్ ఆహ్వానంతో సైద్ధాంతిక విభేదాలున్న కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టేందుకు సేన సిద్ధమయింది. అయితే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక భాగస్వామ్య పక్షాలతో సాధారణంగా తలెత్తే విభేదాల కారణంగా తమ ఎమ్మెల్యేలు ప్రతిపక్షం వలలో పడే అవకాశముందని కర్ణాటక అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని కాంగ్రెస్ భయపడుతోంది. సంకీర్ణంలో భాగస్వామి అవుతుందా? లేక బయటి నుంచి మద్దతిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను ఎక్కడ బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందోననే భయంతో శివసేన కూడా క్యాంపు నడుపుతున్న విషయం తెలిసిందే. శివసేన తన ప్రయత్నాల్లో ఉందా? బీజేపీ మద్దతు లేకుండానే శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రావడం ఆసక్తి కరంగా మారింది. కొన్ని రోజులుగా శివసేన నేత సంజయ్ రౌత్ ‘త్వరలోనే మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందంటూ’ మాట్లాడటం వెనుక అంతరార్థం ఇదా అని విశ్లేషకులు విస్తుపోతున్నారు. శివసేన నేత సంజయ్ రౌత్ వారం రోజుల్లో మూడు సార్లు పవార్ ఇంట్లో భేటీ కావడం అంతర్గతంగా ఏదో ఒప్పందం జరిగి ఉండొచ్చని అనే ఊహాగానాలకు తావిస్తోంది. దీంతోపాటు, సోమవారం శివసేన సంజయ్ రౌత్ సోనియా గాంధీతో భేటీ అయేందుకు డిల్లీ వెళుతున్నట్లు సమాచారం. -
సుప్తచేతనావస్థలోకి మహారాష్ట్ర అసెంబ్లీ!
ముంబై: మహారాష్ట్రలో కనుచూపు మేరలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు సాధ్యంకాని నేపథ్యంలో ఆ రాష్ట్ర కొత్త అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లనుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీని గవర్నర్ తొలిసారి సమావేశపర్చేవరకూ 14వ అసెంబ్లీ సుప్తచేతనా వస్థలోనే ఉంటుందని అసెంబ్లీ వ్యవహరాల మాజీ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర 13వ అసెంబ్లీ పదవీకాలం శనివారం రాత్రితో ముగిసింది. అయితే బీజేపీ, శివసేనల మధ్య ఎలాంటి సయోధ్య కుదరకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి శనివారం రాజ్‌భవన్‌లో కలిసి ఈ అంశంపై చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ సాధించినా ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య పీటముడి కొనసాగుతోంది. శనివారం అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. అసెంబ్లీని సమావేశపర్చే వరకూ అంతే.. ‘కొత్త అసెంబ్లీని గవర్నర్ సమావేశపర్చనంత వరకూ మహారాష్ట్ర 14వ అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్తుంది’అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ ముఖ్య కార్యదర్శి అనంత కల్సే చెప్పారు. సుప్తచేతనావస్థలో ఎంత కాలం ఉంచాలన్న దానిపై నిర్దిష్ట సమయమేదీ లేదన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ సమయంలో జీతాలు, ఇతర అలవెన్సులు అందుకుంటారన్నారు. ‘రాష్ట్రపతి పాలనే చివరి ప్రత్యామ్నాయం. కేబినెట్ సిఫార్సు లేకుండా గవర్నర్ కూడా కొత్త అసెంబ్లీని సమావేశపర్చలేరు. ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ లేదు’అని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 సీట్లకు గాను బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 సీట్లు గెలుచుకోగా.. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించండి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయాలని కోరుతూ గవర్నర్ కోషియారీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు శనివారం లేఖ రాశారు. సీఎం పీఠం విషయంలో బీజేపీ, శివసేన మధ్య పక్షం రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ సూచన చేయడం గమనార్హం. ప్రభుత్వం ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని ఆ లేఖలో కోరారు. ఈ పరిణామంపై ఎన్సీపీ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పక్షంలో శాసనసభలో తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేసింది. శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలతో క్యాంపులు నడుపుతున్నాయి. -
సస్పెన్స్ సా...గుతోంది!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్‌లైన్ ముంచుకొస్తోంది. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఫలితాలు విడుదలైన దగ్గర్నుంచి చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని డిమాండ్ చేస్తున్న శివసేన పట్టిన పట్టు వీడడం లేదు. రొటేషన్ పద్ధతిలో సీఎం పదవిని పంచుకోవడానికి సిద్ధపడితే బీజేపీతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమేనని శివసేన ప్రకటించింది. 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి 182 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విస్తృతంగా ప్రచారం జరగడంతో శివసేనలో చీలికలు వస్తాయన్న ఆందోళన మొదలైంది. అందుకే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై గంటకు పైగా చర్చలు జరిపారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు పార్టీ అధినేతకే కట్టబెడుతూ ఎమ్మెల్యేలందరూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని అధ్యక్షుడు నివాసమైన మాతోశ్రీకి సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్‌కి తరలించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు పనిచేయవు శివసేనలో చీలికలు రావడం ఖాయమని 25 మందికిపైగా సేన ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కమలదళంపై కస్సుమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాల్ని పనిచేయవని అన్నారు. గవర్నర్‌తో బీజేపీ చర్చలు బీజేపీ సీనియర్ నాయకులు గురువారం గవర్నర్ భగత్ సింగ్ కొషియారిని కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతూ ఉండడంతో ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకులపై గవర్నర్‌తో చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, మంత్రులు సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్ తదితరులు గవర్నర్‌ని కలిసిన వారిలో ఉన్నారు. అసెంబ్లీ గడువు ముగిసేలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోతే అతిపెద్ద పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి రేసులో తాను లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌నే ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారని తెలిపారు. ఏం జరిగే అవకాశాలున్నాయ్ ! ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. ఈ లోపల ప్రభుత్వ ఏర్పాటుపై ఏదో ఒక స్పష్టత రావాలి. లేదంటే జరిగే పరిణామాలు ఏవంటే.. ► ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వచ్చే వరకు దేవేంద్ర ఫడ్నవీస్‌నే సీఎంగా కొనసాగాలని గవర్నర్ ఆదేశించే అవకాశం. ► మహారాష్ట్ర గవర్నర్‌ని బీజేపీ ఎమ్మెల్యేల బృందం కలిసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం. సభలో బల నిరూపణకు గవర్నర్ సమయాన్ని ఇవ్వడం. ► బీజేపీయేతర పక్షాలన్నీ చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ని కోరడం. ► మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించడం. -
మహా రాజకీయం : డెడ్‌లైన్ చేరువైనా అదే ఉత్కంఠ
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 13 రోజులైనా తదుపరి సీఎం ఎవరనేది ఇంతవరకూ వెల్లడికాలేదు. అధికార పంపంకంపై బీజేపీ, శివసేనల మధ్య చిక్కుముడి వీడకపోవడం, శివసేనతో కలిసేందుకు ఇతర విపక్షాలు ముందుకురాని పరిస్థితితో తదుపరి మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు ఈనెల 9న నూతన ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్‌లైన్ తరుముకొస్తుండటంతో రాజకీయ పార్టీలతో పాటు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డెడ్‌లైన్ నేపథ్యంలో గురువారం మహారాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ ప్రతినిధి బృందం కలవనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌కు ఆ పార్టీ చాలా దూరంలో నిలిచిన క్రమంలో ఈ ప్రతినిధి బృందానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దూరంగా ఉన్నారు. శివసేన లేకుండా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సుముఖంగా లేదని చెబుతున్నారు. మరోవైపు డెడ్‌లైన్ ముగిసిన తర్వాత ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. సిద్ధాంత వైరుధ్యాల నేపథ్యంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువుతీరే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చినందున ప్రభుత్వ ఏర్పాటుకు ఇరు పార్టీలు చొరవ చూపాలని అన్నారు. కాగా శివసేన మాత్రం తనతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమని విస్పష్టంగా పేర్కొంటోంది. బీజేపీపై ఒత్తిడి పెంచేలా సేన వ్యాఖ్యలున్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన నివాసంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. -
పాత కూటమి... కొత్త సీఎం?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శనివారంతో ముగుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత వచ్చినట్లే కనిపిస్తున్నా ఎప్పుడు ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ కావటం, బీజేపీ– సేన తెరవెనుక చర్చలు, గురువారం బీజేపీ నేతలు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారిని కలవనుండటం ఇవన్నీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టతనిచ్చాయి. కానీ గవర్నరును కలిసే బీజేపీ నేతల్లో ఫడ్నవీస్ లేరు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ నేతృత్వంలో గవర్నర్‌ను కలవనున్నట్లు పార్టీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ చెప్పారు. పలు అంశాలను చర్చించడానికే తప్ప ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడటానికి కాదని కూడా చెప్పారాయన. గవర్నరును కలవటంపై తమకు ఆహ్వానంలేదని శివసేన స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో... తెరవెనక పరిణామాలు చాలానే జరుగుతున్నట్లు తెలిసింది. వాటిలో గడ్కరీని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. మహా పీఠంపై గడ్కరీ? మంగళవారం రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిశారు. ప్రతిష్టంభన తొలగాలంటే గడ్కరీని సీఎంను చేయడమే పరిష్కారమని ఆరెస్సెస్ చీఫ్ భావిస్తున్నారనేది రాజకీయ వర్గాల సమాచారం. దీనికి శివసేన తేలిగ్గా అంగీకరిస్తుందన్న అంచనాలున్నాయి. ఎందుకంటే ఆది నుంచీ శివసేనతో గడ్కరీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దివంగత అధ్యక్షుడు బాల్ థాకరేకు గడ్కరీ అత్యంత సన్నిహితుడు. థాకరే జీవించి ఉన్న రోజుల్లో గడ్కరీ ఆయన నివాసం మాతోశ్రీకి తరచూ వెళ్లేవారు. బీజేపీ – సేన మధ్య ఎప్పుడు విభేదాలొచ్చినా గడ్కరీయే మధ్యవర్తిత్వం నెరిపి పరిష్కరించేవారు. గడ్కరీని సీఎంను చేస్తే శివసేన 50–50 ఫార్ములాపై పట్టు వీడవచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. కాకపోతే ఇప్పటికే ఫడ్నవీస్‌ను తమ శాసనసభా పక్ష నేతగా మహారాష్ట్ర బీజేపీ ఎన్నుకుంది. సీఎంగా ఆయనే ఉంటారని బీజేపీ స్పష్టంగా చెప్పింది కూడా. తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ నితిన్ గడ్కరీతో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ తాను మహారాష్ట్ర రైతులకు రవాణా సౌకర్యాలపై మాట్లాడటానికే కలిశానని పటేల్ చెప్పారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: పవార్ ప్రజా తీర్పును గౌరవించి మహారాష్ట్రలో వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ, శివసేనలకు శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని చెప్పారాయన. శివసేన నేత సంజయ్ రౌత్ తనను కలిశాక పవార్ విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, శివసేన బంధం 25 ఏళ్లుగా ఉందని, ఆ రెండు పార్టీలే రేపో మాపో ఒక అవగాహనకు వస్తాయని చెప్పారాయన. 170 మంది ఎమ్మెల్యేల మద్దతుతో శివసేన సీఎం పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై పవార్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అంత మంది ఎమ్మెల్యేను శివసేన ఎలా తెస్తుందో చూడాలని ఆసక్తి ఉందన్నారు. సోనియా వద్దనడంతో..! 50–50 ఫార్ములాపై గట్టిగా కూర్చున్న శివసేన ఒక దశలో ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌ను సంప్రతించి బీజేపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేసింది. కాకపోతే శివసేన–ఎన్సీపీ కలిసినంత మాత్రాన ఏమీ జరగదు. కాంగ్రెస్ సహకరించాలి. అందుకే పవార్ వెళ్లి సోనియాను కలిసి శివసేనకు మద్దతిచ్చేలా ఒప్పించబోయారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కర్ణాటక ఉదంతం చూసిన సోనియా... సేనకు మద్దతిచ్చి బీజేపీకి అధికారాన్ని దూరంచేస్తే కర్ణాటకలో జరిగినట్లు తమ ఎమ్మెల్యేల్ని లాగేస్తారని సందేహపడ్డారు. దీనికితోడు బీజేపీ హిందూత్వ విధానాల్ని సేనను నమ్మితే ముస్లిం ఓట్లు దూరమవుతాయని సోనియా భయపడ్డారు. మొదటికే మోసం వచ్చి అది కూడా బీజేపీకి కలిసివస్తుందని కూడా ఆమె భావించారు. అందుకే ఈ ప్రతిపాదనకు సుతరామూ అంగీకరించలేదు. వేరే దారిలేని శివసేన బీజేపీతో ముందుకెళ్లేందుకు సిద్ధపడుతోంది. ఇక పవార్ కూడా తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని గట్టిగా చెప్పేశారు. -
...అయిననూ అస్పష్టతే!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోజంతా ఎవరికి వారు సమావేశాలు జరిపినా ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టతలేదు. అధికారాన్ని పంచుకోవడంలో బీజేపీ, శివసేన మధ్య రేగిన సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. శివసైనికులు మహారాష్ట్ర గవర్నర్‌ను కలిస్తే, ముఖ్యమంత్రి∙ఫడ్నవీస్ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ఈ అధికార పోరాటంలో అవసరమైతే శివసేనకు మద్దతునివ్వాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము ప్రజాతీర్పుకనుగుణంగా ప్రతిపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేశారు. సేనకు మద్దతునిచ్చే అంశంలో ఎవరూ తమను సంప్రదించలేదని, తమకు సంఖ్యా బలం లేదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ, శివసేన తమ తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గవర్నర్‌ని కలిసిన శివసైనికులు శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, ఇతర నేతలతో కలిసి సోమవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ కోష్యారీని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే తాము గవర్నర్‌ని కలిశామన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభనకు తాము కారణం కాదని గవర్నర్‌కు చెప్పామని సంజయ్ వెల్లడించారు. అమిత్ షాతో ఫడ్నవీస్ మంతనాలు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి తొందర లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి మహారాష్ట్రలో ఏర్పడిన ప్రతిష్టంభనపై చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం లేదు. నేను కచ్చితంగా చెబుతున్నా. ప్రభుత్వమైతే ఏర్పాటవుతుంది’అని చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను ఫడ్నవీస్ కలుసుకున్నారు. రౌత్ ఒక భేతాళుడు: మరాఠీ పత్రిక హేళన మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సంక్షోభానికి శివసేన నేత సంజయ్ రౌత్ కారణమనే ఉద్దేశంతో ఆయనను ఒక మరాఠీ పత్రిక భేతాళుడిగా చిత్రీకరించింది. ఆరెస్సెస్‌కు మద్దతుగా నిలిచే తరుణ్ భారత్‌లో రాసిన ఒక వ్యాసంలో విక్రమార్కుడి భుజంపై వేళ్లాడే భేతాళుడు సంజయ్ అని, బీజేపీ–శివసేన అధికారంలోకి రాకుండా ఆయన అడ్డుకుంటున్నారని తిట్టిపోసింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో అత్యంత కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు ముందన్న నేపథ్యంలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు జరగడం అత్యంత ముఖ్యమని పేర్కొంది. గడ్కరీ మధ్యవర్తిత్వం ? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రంగంలోకి దింపితే బీజేపీ, శివసేన మధ్య నెలకొన్న సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తారని శివసేన పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు సలహాదారుడైన కిషోర్ తివారీ సోమవారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఒక లేఖ రాశారు. గడ్కరీని శివసేనతోచర్చలకు పంపాలని అన్నారు. -
‘శివ’సైనికుడే సీఎం
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం గడిచినా.. మెజారిటీ సాధించిన మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య అధికారం పంపిణీపై అవగాహన కుదరకపోవడంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబర్ 7వ తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడనట్టయితే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని బీజేపీ నేత, ఆర్థికమంత్రి ముంగంతివార్ పేర్కొన్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి నవంబర్ 8వ తేదీతో ముగుస్తుంది. దీపావళి పండుగ కారణంగా శివసేన, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభం కాలేదని, ఒకట్రెండు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని ముంగంటివార్ తెలిపారు. ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వలేదని, బీజేపీ, సేన కూటమికి వారు మద్దతిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘మా కూటమి ఫెవికాల్ కన్నా, అంబుజా సిమెంట్ కన్నా దృఢమైనది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, శివసేన వ్యక్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ సేన నేత సంజయ్ రౌత్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘సేన కోరుకుంటే.. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టుకోగలదు’అన్నారు. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే ప్రతిపాదనకే మహారాష్ట్ర ప్రజలు ఓటేశారన్నారు. అతివృష్టితో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందాల్సి ఉందని శివసేన పత్రిక సామ్నా పేర్కొంది. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తాం ఒకవేళ బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే.. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తాముప్రయత్నిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. మరోవైపు, అదే పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాత్రం.. ప్రతిపక్షంలో కూర్చోమనే ప్రజలు తీర్పిచ్చారని, తాము అదే పాటిస్తామని వక్కాణించారు. గురువారం రాత్రి శరద్‌పవార్ నివాసంలో ఎన్సీపీ నేతల భేటీ అనంతరం అజిత్ పవార్ పై వ్యాఖ్యలు చేశారు. అది బీజేపీ, శివసేన డ్రామా బీజేపీ, శివసేన డ్రామాలో పావు కావద్దొని కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేత సంజయ నిరుపమ్ సూచించారు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. బీజేపీ, శివసేనల మధ్య విభేదాలను ‘అధికారంలో ఎక్కువ వాటా కోసం ఆడుతున్న తాత్కాలిక డ్రామా’అని ఆయన అభివర్ణించారు. ‘బీజేపీ నీడ నుంచి శివసేన ఎన్నటికీ బయటకు రాదు’అని కాంగ్రెస్‌లో చేరకముందు శివసేనలో కీలక నేతగా వ్యవహరించిన సంజయ్ వ్యాఖ్యానించారు. పొత్తు తేలే దాకా నేనే సీఎం! ఔరంగాబాద్: రాజకీయ అనిశ్చితి కొనసా గుతున్న మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బీజేపీ, శివసేనల మధ్య ఒప్పందం కుదిరేవరకూ తనను ముఖ్యమంత్రిగా చేయాలని ఓ రైతు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో బీడ్ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ విష్ణూ గడాలే గురువారం కలెక్టర్‌ను కలిసి సీఎం పీఠంపై అస్పష్టత తొలిగే వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి, రైతుల సమస్యలు పరిష్కరిస్తానంటూ వినతి పత్రం అందించారు. లేదంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనకు దిగుతా నంటూ ఆ రైతు హెచ్చరించడం కొసమెరుపు! -
సీఎం పీఠమూ 50:50నే!
ముంబై: ‘మహా’ సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం రోజులు దాటుతున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారాన్ని సమంగా పంచుకునే తమ డిమాండ్ విషయంలో వెనక్కు తగ్గబోమని శివసేన గురువారం మరోసారి స్పష్టం చేసింది. సమ అధికార పంపిణీ అంటే.. ముఖ్యమంత్రి పదవిని సమానంగా పంచుకోవడమేనని తేల్చిచెప్పింది. దాంతో, డిమాండ్ల విషయంలో సేన మెత్తబడిందని, త్వరలో శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని వచ్చిన వార్తలకు తెరపడింది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కాగా, మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం పలు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు, తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కాకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదిత్య ఠాక్రేనే షిండే పేరును ప్రతిపాదించారు. ఉద్ధవ్ సూచన మేరకే ఎల్పీ నేతగా షిండే తెరపైకి వచ్చారని సమాచారం. పలువురు పార్టీ నేతలతో కలిసి ఉద్ధవ్ రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ కోషియారీని కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు పంటలను దారుణంగా దెబ్బతీశాయని, అందువల్ల రాష్ట్రంలో అతివృష్టి వల్ల ఏర్పడిన కరువు నెలకొన్నట్లుగా ప్రకటించాలని గవర్నర్‌ను కోరారు. కాగా, శివసేన కార్యాలయం ముందు ‘ఆదిత్య ఠాక్రేనే మహారాష్ట్ర సీఎం’ అని రాసి ఉన్న భారీ హోర్డింగ్‌ను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. మరోవైపు, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత మల్లిఖార్జున్ ఖర్గే ముంబైలో సమావేశమయ్యారు. త్వరలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. వాడుకుని వదిలేసే విధానం వద్దు బీజేపీ వాడుకుని వదిలేసే విధానాన్ని అవలంబిస్తోందని శివసేన ఆరోపించింది. పొత్తు సమయంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం పేర్కొంది. అధికార పంపిణీ విషయంలో సేన మెత్తబడిందన్న వార్తలు వదంతులేనని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆదిత్య ఠాక్రే విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి తుది నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రేదేనని స్పష్టం చేశారు. ఢిల్లీ ముందు తలొంచం ఎన్సీపీ కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్తలు ఒక భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ‘ఢిల్లీ సింహాసనానికి మహారాష్ట్ర ఏ నాటికి తలొంచదని చరిత్ర చెబుతోంది’ అని ఆ హోర్డింగ్‌పై రాసి ఉంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై కేసు పెట్టినప్పుడు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ చేసిన వ్యాఖ్య అది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ బాగా పుంజుకున్న విషయం తెలిసిందే. 2014లో కన్నా 13 స్థానాలు ఎక్కువగా, మొత్తం 54 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ(105), శివసేన(56)కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి. పవార్‌తో సంజయ్ రౌత్ భేటీ బీజేపీ, శివసేనల మధ్య విభేదాలతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి పదవిని శివసేనతో సమంగా పంచుకునేందుకు బీజేపీ వ్యతిరేకత చూపుతున్న పరిస్థితుల్లో.. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సమీకరణాలు మారుతున్నాయని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను ఎన్సీపీ ఖండించింది. సేన, బీజేపీల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం సంజయ్ రౌత్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసానికి వెళ్లడంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాట్లపై ఊహాగానాలకు మరోసారి తెరలేచింది. -
తేరే మేరే బీచ్ మే
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: తేరే మేరే బీచ్ మే కైసా హైయే బంధన్ అంజానా. ఇదీ 1981లో విడుదలైన హిందీ చిత్రం ఏక్ దూజే కేలియేలో సూపర్ హిట్ సాంగ్. నీకూ, నాకూ మధ్య ఎంత వింత అనుబంధం ఉంది. అదేంటో నీకూ తెలీదు, నాకూ తెలీదు అన్న అర్థంలో ఆ పల్లవి సాగుతుంది. మహారాష్ట్ర బీజేపీ మంత్రి సుధీర్ ముంగన్‌తివార్ ఈ పాటను గుర్తుకు చేస్తూ బీజేపీ, శివసేన మధ్య అధికారాన్ని పంచుకోవడంలో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఇరుపార్టీల మధ్య ఏదో తెలియని బంధముందని వ్యాఖ్యానించారు. శాసనసభా పక్ష నాయకుడిగా ఫడ్నవీస్ మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా బుధవారం నాడు దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యారు. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ ఉపాధ్యక్షుడు అవినాష్ రాయ్ ఖన్నాల సమక్షంలో అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 105 మంది ఎమ్మెల్యేలు సమావేశమై తమ నాయకుడిగా ఫడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచిన ఎమ్మెల్యేలకు ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. శివసేన లేకుండా ప్రభుత్వమే లేదు: ఫడ్నవీస్ మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో వచ్చిన ప్రత్యామ్నాయాలన్నింటినీ దేవేంద్ర ఫడ్నవీస్ ఒక్క వ్యాఖ్యతో తోసిపుచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత ఫడ్నవీస్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయం గురించి బయటకు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని, కేవలం వినోదం కోసమే వాటిని ప్రచారం చేశారని అన్నారు. ‘ఎన్నికల్లో ప్రజలు బీజేపీ–శివసేన కూటమికే ఓట్లు వేశారు. పూర్తి స్థాయి మెజార్టీని అప్పగించారు. అందుకే ఆ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 56 స్థానాలు గెలిచిన శివసేన ఆరుగురు స్వతంత్రుల మద్దతుతో బలాన్ని 62కు పెంచుకుంది. తమ గౌరవానికి భంగం కలగకుండా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం శివసేనకు అవసరమని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ చెప్పారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన కొంచెం మెత్తబడినట్లయిందని భావిస్తున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లది ప్రతిపక్ష పాత్రే.. ప్రజా తీర్పుకి అనుగుణంగా కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రతిపక్షంలోనే కూర్చుంటాయని మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ స్పష్టం చేశారు. శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతునిస్తాయని ఊహాగానాలు రేగుతున్న నేపథ్యంలో పాటిల్ ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పు ఇచ్చారు. మేము దానిని పాటిస్తాం‘‘అని పాటిల్ చెప్పారు. ఎన్సీపీలో మరో కీలక నాయకుడు అజిత్ పవార్ మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ సరైన దారిలో వెళ్లేలా చేస్తామని అన్నారు. శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి? ఉప ముఖ్యమంత్రి సహా ఇతర కీలక శాఖల్ని శివసేనకు అప్పగించడానికి బీజేపీ ముందుకొచ్చింది. ఈ మేరకు శివసేన పార్టీతో మంతనాలు సాగిస్తోందని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో కూడా మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్దమైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హోంశాఖ, ఆర్థిక, రెవిన్యూ శాఖ బీజేపీ తన దగ్గర ఉంచుకోనుందని ప్రచారం జరిగింది. మహా కార్టూన్ మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య ప్రతిష్టంభనకు ఈ కార్టూన్ అద్దం పడుతోంది. బీజేపీ గుర్తు కమలంపై, శివసేన గుర్తు బాణం వేళ్లాడుతున్నట్టుగా వేశారు. దాని కింద క్యాప్షన్ రూపంలో ఒక సామెత ఉంది. ‘మెడపై కత్తి వేలాడుతోంది’ అని మరాఠీలో రాశారు. -
బీజేపీ మదిలో గత కాలపు జ్ఞాపకాలు
ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అదే సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. శివసేనకు రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని అప్పగిస్తామని తామెన్నడూ హామీ ఇవ్వలేదని కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే. సీఎం పదవిని 50:50 ఫార్ములా ప్రకారం పంచుకుంటే గతంలో ఉత్తరప్రదేశ్, కర్ణాటకలలో ఎదురైన అనుభవాలు ఇక్కడ కూడా వెంటాడుతాయా అనే భయం బీజేపీని కలచివేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని సీఎం ఫడ్నవీస్ ప్రకటించిన కొన్ని గంటలకే శివసేన తీవ్రస్థాయిలో స్పందించింది. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య జరుగాల్సిన చర్చలను శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది. అప్పటి మాటేంటి సీఎం గారూ..? బీజేపీతో ఉన్న అవగాహన ఒప్పందాన్ని తాజాగా శివసేన నేత హర్షల్ ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. తదుపరి ప్రభుత్వంలో ఐదేండ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పిన సందర్భంగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీతో జరిగిన ఒప్పందాలను ఠాక్రే సన్నిహితుడు హర్షల్ ప్రధాన్ బయటపెట్టాడు. 50-50 ఫార్ములాపై ఫడ్నవీస్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేసి ఆయనకు కౌంటర్ ఇచ్చింది. మళ్లీ మేం అధికారంలోకి వస్తే, పదవులు, బాధ్యతలు సమానంగా పంచుకోవాలని నిర్ణయించాం అని ఫిబ్రవరి 28న ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతున్న ఓ వీడియోను ఠాక్రే సన్నిహితుడు హర్షల్ ప్రధాన్ విడుదల చేశారు. 'హామీని కాస్త గుర్తు తెచ్చుకోండి' అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు. అయితే దీనికి బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. శివసేనకు మేము సీఎం పదవి విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ మధ్య జరిగిన శివసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలను శివసేన తాజాగా ప్రస్తావిస్తున్నది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరైన ఆ కార్యక్రమంలో రానున్న రోజుల్లో శాసనసభను కాషాయ రంగుతో నింపేస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 54వ వ్యవస్థాపక దినోత్సవం రోజున శివసేన పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో పాలుపంచుకొంటారు అని అధికార పత్రిక సామ్నాలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా బయటపెడుతున్నారు. చదవండి : డౌటే లేదు.. నేనే సీఎం: ఫడ్నవిస్ బీజేపీని వెంటాడుతున్న గత అనుభవాలు : అన్ని విషయాలను పక్కనపెట్టి శివసేనకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తే గతంలో యూపీలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకొని ఈ విషయంపై తర్జనభర్జన పడుతోంది. 1997లో ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. ఆ సమయంలో బీజేపీ 175 స్థానాల్లో, బీఎస్పీ 67 స్థానాల్లో గెలిచి ఓ ఒప్పందం ప్రకారం మాయావతి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఒప్పందం ప్రకారం కొద్ది రోజులకు బీజేపీ అభ్యర్థి కల్యాణ్‌సింగ్‌కు సీఎం బాధ్యతలు అప్పగించినా బలనిరూపణ సమయంలో బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకొని బీజేపీకి గట్టి షాకిచ్చింది. 2004 ఎన్నికలలో కూడా కర్ణాటకలో ఇదే విషయం పునరావృతమైంది. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని పెద్ద పార్టీగా ఆవిర్భవించినా జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం ధరమ్‌సింగ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పడిపోయింది. ఈ సమయంలో బీజేపీ నేత యడియూరప్ప జేడీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు కుమారస్వామికి అందించారు. ఒప్పందం ప్రకారం జేడీఎస్ కాలపరిమితి ముగిసాక బీజేపీకి మద్దతివ్వడానికి నిరాకరించింది. కాగా నేడు శివసేన విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయేమోనన్న భయం బీజేపీని వెంటాడుతోంది. అందుకోసమే సీఎం పీఠం విషయంపై బీజేపీ ఇంత రాద్ధాంతం చేస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చదవండి : ( ఎవరి పంతం వారిది! ) -
బీజేపీ, శివసేన మధ్య ‘50:50’పై పీటముడి
ముంబై: ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి (ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో ఫేమస్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌ను ఉటంకిస్తూ దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యంపై విమర్శలు గుప్పిస్తూ సోమవారం పార్టీ పత్రిక సామ్నాలో శివసేన సంపాదకీయం రాసింది. మాంద్యం మూలంగా దీపావళి రోజు కళకళలాడాల్సిన మార్కెట్లలో నెలకొన్న స్తబ్దతను మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ ఆ డైలాగ్‌ను శివసేన వాడుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాజకీయంగానూ మహారాష్ట్రలో ఒక రకమైన నిశ్శబ్దమే నెలకొని ఉండటమే ఇక్కడ విశేషం. రాష్ట్రంలో అధికారాన్ని సమంగా పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌కు బీజేపీ అంగీకరిస్తుందా?, బీజేపీ ఒత్తిడి తెస్తే ఆ డిమాండ్‌ను శివసేన వదిలేస్తుందా?’ తదితర ప్రశ్నలకు ప్రస్తుతం నిశ్శబ్దమే సమాధానంగా వస్తోంది. హరియాణాలో స్మూత్.. ‘మహా’ ఉత్కంఠ ఒకేసారి ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హరియాణాల్లో నిజానికి హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటులో కొంత అస్థిరత, ఉత్కంఠ నెలకొనాల్సి ఉండగా.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సజావుగా సాగింది. ప్రాంతీయ పార్టీ జననాయక జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో బీజేపీ సీఎం ఖట్టర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీజేపీ– శివసేన కూటమికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ.. ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత, ఉత్కంఠ కొనసాగుతున్నాయి. శివసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ వస్తుందని బీజేపీ ఆశించింది. అలా జరిగితే బీజేపీకి సమస్య ఉండకపోయేది. కానీ, అలా జరగలేదు. 288 స్థానాల అసెంబ్లీలో 2014లో కన్నా 17 స్థానాలు తక్కువగా 105 సీట్లకే బీజేపీ పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం అనివార్యమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకున్న శివసేన పొత్తుకు ముందు అంగీకరించిన షరతులను తెరపైకి తీసుకువచ్చింది. 50 : 50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడ్తున్న ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రేకు ప్రభుత్వంలో ‘సముచిత’ గౌరవం లభించాలన్నది సేన ఆలోచన. ముఖ్యమంత్రిత్వం తప్పితే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి కూడా శివసేన సుముఖంగా లేదని తెలుస్తోంది. సంకీర్ణ ధర్మం పాటించాలి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పార్టీ నేత సంజయ్ రౌత్ తదితరులు తమ డిమాండ్లు చెప్పారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల ముందే.. పొత్తు చర్చల సమయంలోనే ఈ విషయమై ఒక అంగీకారానికి వచ్చాం’ అని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేస్తున్నారు. అధికార పంపిణీకి సంబంధించిన ఫార్మూలాను అమలు చేస్తామని ప్రభుత్వ ఏర్పాటుపై జరిపే చర్చలకు ముందే తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని సేన ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై బీజేపీ నుంచి స్పందన లేదు. కానీ, ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తే ఉంటారనే విషయంలో ఎలాంటి రాజీ లేదనే సంకేతాలు మాత్రం ఇస్తోంది. జూనియర్ పార్ట్నర్గా శివసేన సంకీర్ణ ధర్మం పాటించాలని, ప్రభుత్వంలో చేరి ఆదిత్య ఠాక్రే సీనియర్ అయిన సీఎం ఫడ్నవిస్ వద్ద పాఠాలు నేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 1989లో శివసేన బీజేపీల తరఫున బాల్ ఠాక్రే, ఎల్కే అద్వానీల మధ్య పొత్తు కుదిరినప్పుడు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చారు. అయితే, 2009 నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తూ వస్తోంది. 2014 శాసనసభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, శివసేనలు వరుసగా 122, 63 సీట్లు గెల్చాయి. త్వరలో∙బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు సోమవారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని, విపక్ష కూటమి అయిన కాంగ్రెస్(44), ఎన్సీపీ(54)లు కలిసి సాధించిన సీట్ల కన్నా తాము ఎక్కువ సీట్లలోనే గెలిచామని ఆయన వివరించారు. బుధవారం బీజేపీ చీఫ్ అమిత్ ముంబై రానుండటంతో అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. రాముడు సత్యమే మాట్లాడేవాడు.. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే విషయంలో అమిత్– ఉద్ధవ్‌ల మధ్య గతంలోనే ఒక అంగీకారానికి వచ్చిన విషయంపై నిజాలు మాట్లాడాలని సంజయ్‌రౌత్ డిమాండ్ చేశారు. ‘బీజేపీ ఎప్పుడూ శ్రీరాముడిని స్మరిస్తూ ఉంటుంది. రాముడు సత్యవాక్పరిపాలకుడు. ఇప్పుడు బీజేపీ కూడా 50:50 ఫార్ములాపై నిజాలు మాట్లాడాలి’ అని రౌత్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలిసిన ఇరు పార్టీల నేతలు బీజేపీ నేత, సీఎం ఫడ్నవిస్, శివసేన నాయకుడు దివాకర్ రౌతె సోమవారం రాష్ట్ర గవర్నర్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. చర్చల వివరాలు వెల్లడి కాలేదు కానీ.. అవి మర్యాదపూర్వకమైనవేనని రాజ్‌భవన్ అధికారులు చెప్పారు. అక్టోబర్ 21న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు! ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతివ్వనున్నాయని ముంబై వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సమీకరణాలు నిజమైతే.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు.. మొత్తం 154 సీట్లతో 288 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ సులభంగానే లభిస్తుంది. శివసేన నుంచి ప్రతిపాదన వస్తే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ వ్యాఖ్యానించారు. సామ్నాలో బీజేపీపై విమర్శలు సోమవారం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం కూడా బీజేపీపై నిప్పులు చెరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్లనే ఆర్థికమాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించింది. దీపావళి సమయంలో మార్కెట్లలో స్తబ్దత నెలకొనడంపై స్పందిస్తూ.. ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి(ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ అనే షోలే సినిమా డైలాగ్‌ను ఉటంకించింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి నెలకొందనే కథనాలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ‘అమ్మకాలు తగ్గిపోయాయి. కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఉద్యోగాలు పోతున్నాయి. దీపావళి సమయంలోనే మార్కెట్లలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మరోవైపు, పలు విదేశీ కంపెనీలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా అమ్మకాలు జరిపి మన డబ్బుల్తో తమ ఖజానాలను నింపుకుంటున్నాయి’ అని పేర్కొంది. -
హై‘కమాండ్’ కోసం ఎదురుచూపులు
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక బీజేపీ చీఫ్, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరులోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయం ‘కేశవ కృప’లో బుధవారం సంఘ్ పెద్దలను కలుసుకున్న అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘నేను ఢిల్లీ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నా. ఎప్పుడు అవసరమైనా నేను బీజేపీ శాసనసభా పక్షాన్ని సమావేశపర్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలుసుకోగలను. కానీ ఇందుకోసం పార్టీ హైకమాండ్ నుంచి తొలుత స్పష్టత రావాలి’ అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షకు అనుకూలంగా 99 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా, 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. దీంతో విశ్వాసతీర్మానం వీగిపోయి సీఎం కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆరెస్సెస్ ఆశీర్వాదం వల్లే.. ఆరెస్సెస్ పెద్దల ఆశీర్వాదం, సహకారం కారణంగానే తాను తాలూకా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతగా, ముఖ్యమంత్రిగా ఎదిగానని యడ్యూరప్ప తెలిపారు. ‘తదుపరి కార్యాచరణను చేపట్టేముందు ఆరెస్సెస్ పెద్దల ఆశీస్సులు తీసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. విశ్వాసపరీక్ష సందర్భంగా మా ఎమ్మెల్యేలు బలంగా, ఐకమత్యంతో నిలిచారు. మాకు రాబోయే కాలంలో కీలకమైన పరీక్షలు ఎదురుకానున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నింటిని దీటుగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’ అని వెల్లడించారు. మరోవైపు విశ్వాసపరీక్షకు డుమ్మా కొట్టిన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని బీజేపీ అధిష్టానం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిపై స్పష్టత వచ్చాకే కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ముందుకెళ్లాలని భావిస్తోంది. కాగా, ముంబైలో ఆందోళన చెందుతున్న రెబెల్ ఎమ్మెల్యేలకు సర్దిచెప్పేందుకు బీజేపీ నేతలు అశ్వంత్ నారాయణ్, ఆర్.అశోక ముంబైకి బయలుదేరివెళ్లారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక దూత.. కర్ణాటకలో నాటకీయ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను సాఫీగా జరిగేలా చూసేందుకు త్వరలోనే ప్రత్యేక పరిశీలకుడిని పంపనుంది. కర్ణాటకలో విశ్వాసపరీక్షకు మొత్తం 17 మంది అధికార కూటమి సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీరిపై స్పీకర్ చర్యలు తీసుకునేవరకూ వేచిఉండాలన్న ధోరణితోనే బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ స్పీకర్ సుప్రీంకోర్టుకెళ్లిన 15 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదించి లేదా అనర్హత వేటేస్తే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 210కి, కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం(బీఎస్పీ ఎమ్మెల్యేతో కలుపుకుని) 103కు చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106కు తగ్గుతుంది. దీంతో 107 ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ కూటమి(బీజేపీ 105, ఇద్దరు స్వతంత్రులు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమౌతుంది. అయితే స్వతంత్రుల దయాదాక్షిణ్యాలపై బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగించాల్సి ఉంటుంది. -
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి
పణజి: గోవా రాజకీయం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధమంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) దీర్ఘకాల అనారోగ్యం, ఆస్పత్రిలో చేరిక.. అనంతర పరిస్థితులను అంచనా వేసేందుకు వచ్చిన ముగ్గురు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం ప్రస్తుతం రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం గమనార్హం. మొత్తం 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్టీ నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలో సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే, గవర్నర్ మృదులా సిన్హా లేకపోవడంతో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కవ్లేకర్ విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ నాయకత్వం తమాషాలు చేస్తోంది. ఏడాదిన్నరలోనే మరోసారి ఎన్నికలు జరపడం అంటే రాష్ట్ర ఖజానాపై భారం వేయడమే. అందుకే అసెంబ్లీని రద్దు చేయడానికి బదులు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాం. మాకు అవకాశమిస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని తెలిపాం’ అని ఆయన అన్నారు. కాగా, సంకీర్ణంలోనే ఉంటామని, సమస్య పరిష్కారం కోసం బీజేపీ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా తమకుఆమోదయోగ్యమేనంటూ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. అసెంబ్లీలోని 40 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 16 మంది సభ్యులుండగా ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఐదుగురు సభ్యుల మద్దతుంటే సరిపోతుంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ (14), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (3), గోవా ఫార్వర్డ్ పార్టీ (3), ఎన్సీపీ (1), స్వతంత్రులు(3) కలుపుకుని 21 మంది సభ్యుల మద్దతుంది. -
14 లోపు ఇమ్రాన్ ప్రమాణం
ఇస్లామాబాద్ / కరాచీ: పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 14 లోపే ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించాయి. జూలై 25న జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, మాజీ ప్రధాని షరీఫ్‌కు చెందిన పీఎంఎల్(ఎన్) 64 సీట్లు, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నేతృత్వంలోని పీపీపీకి 43 సీట్లు వచ్చాయి. 272 సీట్లున్న జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటు కోసం 172 సీట్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీటీఐ నేత నయీనుల్ హక్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న చర్చలు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. ఆగస్టు 14 లోపే ఇమ్రాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. మారనున్న బలాబలాలు.. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అదనంగా గెలుచుకున్న స్థానాలకు రాజీనామా చేయాలి. దీని ప్రకారం ఐదు నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన పీటీఐ ఇమ్రాన్ ఖాన్ నాలుగు సీట్లకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలాగే పీటీఐ నేత గులామ్ సర్వార్ ఖాన్ కూడా ఓ స్థానంలో రాజీనామా చేయాలి. ఇలా అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ పార్టీ బలం 109 సీట్లకు పడిపోతుంది. తాజాగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న పీటీఐ నేతలు ఎంక్యూఎం(పీ), జీడీఏ, పీఎంఎల్(క్యూ), బలూచిస్తాన్ నేషనల్ పార్టీ(మెంగల్), అవామీ నేషనల్ పార్టీతో పాటు 13 మంది ఇండిపెండెంట్లతో జోరుగా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కరాచీ, సియాల్ కోట్ నగరాల్లో రెండు బ్యాలెట్ బాక్సు లు, పలు బ్యాలెట్ పేపర్లు రోడ్ల పక్కన లభ్య మయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఓడిపోయిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. చేతులు కలపనున్న పీఎంఎల్–పీపీపీ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు పీఎంఎల్(ఎన్), పాకిస్తాన్ పీపు ల్స్ పార్టీ(పీపీపీ) చేతులు కలిపే అవకాశముందని స్థానిక మీడియా తెలిపింది. ఇందులోభాగంగా రెండు పార్టీలు ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చాయనీ, త్వరలోనే నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించింది. దిగజారిన షరీఫ్ ఆరోగ్యం ప్రస్తుతం రావల్పిండిలోని అదియాలా జైలులో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం దిగజారింది. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో వెంటనే జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(పీఐఎంఎస్)కు తరలించాలని పంజాబ్ ప్రావిన్సు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు వెంటనే నవాజ్ షరీఫ్‌ను ఆస్పత్రికి తరలించారు. షరీఫ్ శరీరంలో రక్తప్రసరణ తగ్గిపోవడంతో పాటు అక్కడక్కడా రక్తం గడ్డకట్టిందని వైద్యులు ప్రభుత్వానికి తెలిపారు. ఆయన గుండె స్పందన కూడా సరిగా లేదని వెల్లడించారు. దీంతో ఉన్నతస్థాయి ఖైదీల కోసం పీఐఎంఎస్లో ప్రత్యేకంగా రూపొందించిన విభాగంలో షరీఫ్‌కు చికిత్స అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
కశ్మీర్లో తొలి బీజేపీ సర్కారు?
న్యూఢిల్లీ/శ్రీనగర్: మెహబూబా ముఫ్తీ రాజీనామా తర్వాత కశ్మీర్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగ్, ప్రధాని మోదీలు బుధవారం ప్రధాని కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. నిర్మల్ సింగ్‌తో భేటీకి ముందు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, పార్టీ జాతీయ కార్యదర్శి రామ్మాధవ్తోనూ మోదీ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పీడీపీ రెబల్స్, ఇతర పార్టీల చీలిక వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తొలిసారి కశ్మీర్లో హిందువును సీఎంగా నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితమే కశ్మీర్లో బీజేపీ సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. ఢిల్లీ, శ్రీనగర్‌లోని బీజేపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్న విషయం సుస్పష్టమే. రామ్‌మాధవ్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోనీతో సమావేశమవడం, తర్వాత లోనే ఢిల్లీకి వచ్చి మోదీతో భేటీ కావడం తెల్సిందే. -
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం చల్లారకముందే పార్లమెంటు ఎన్నికలతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని భావిస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో విఫలమైందని ఆరోపిస్తూ, పార్టీ శ్రేణులను ఎన్నికలను సన్నద్ధం చేసేలా మంగళవారం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనుంది.బీజేపీకి తామే సరైన ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు ఏ అస్త్రాలను కాంగ్రెస్ నేతలు ఎంచుకుంటారనేది ప్రశ్నార్థకమే. -
‘డిప్యూటీ’పై సిగపట్లు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారులో డిప్యూటీ సీఎం పదవికోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. పలువురు సీనియర్ నేతలు దీనికోసం తమకు తోచిన మార్గాల్లో లాబీయింగ్ చేసుకుంటున్నారు. జేడీఎస్‌తో పొత్తును ప్రకటించిన మరుక్షణం నుంచే డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రిత్వ శాఖలపై ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆంతరంగిక సమావేశాల్లోనూ పలువురు నేతలు మంత్రిత్వ శాఖలపై పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పదవిపై సోనియా గాంధీ, రాహుల్‌లతో కుమారస్వామి చర్చించినట్లు సమాచారం. అయితే.. రెండు ఉప ముఖ్యమంత్రుల పదవులను ఏర్పాటుచేసి ఒకటి లింగాయత్‌లకు, మరొకటి దళితులకు ఇవ్వాలని చర్చ జరుగుతోంది. పోటీలో డీకే, శివశంకరప్ప, పరమేశ్వర్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలను నడిపిస్తున్న కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే శివకుమార్ కూడా డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. కేపీసీసీ అధ్యక్ష పదవి శివకుమార్‌కు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా.. డిప్యూటీ సీఎంకే ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. తమ సామాజిక వర్గం అధ్యక్షుడు శ్యామనూరు శివశంకరప్పకు ఉపముఖ్యమంత్రి పదవి అప్పగించాలని లింగాయత్‌లు కోరుతున్నారు. ఇక దళితుల కోటాలో కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ ఆ పదవిని ఇష్టపడుతున్నారు. మంత్రుల విషయంలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురు లాబీయింగ్‌లు ప్రారంభించారు. మరో మూడ్రోజుల్లో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో శాఖల కేటాయింపు అంశం పీటముడిగా మారినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు మంత్రివర్గ కూర్పుపై చర్చించలేదని ఇరుపార్టీలు బహిరంగంగా చెబుతున్నప్పటికీ లోలోపల ఎమ్మెల్యేల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. -
ఐదేళ్లు నడుపుతా.. మద్దతివ్వండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్, జేడీఎస్ కలసి సుహృద్భావపూర్వకంగానే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నట్లు జేడీఎస్ నేత కుమారస్వామి స్పష్టం చేశారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న స్వామి.. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియా గాంధీలతో సమావేశమయ్యారు. తుగ్లక్ లేన్‌లోని రాహుల్ నివాసంలో 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో కన్నడనాట ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు, మంత్రిత్వ శాఖల పంపకం పైనే ప్రధానంగా చర్చ జరిగింది. కర్ణాటకలో సుస్థిరమైన పాలన అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. కీలకాంశాల్లో రాహుల్ మద్దతు, సలహాలు, సూచనలు కావాలని కుమారస్వామి కోరగా.. రాహుల్ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పారని సమాచారం. భేటీ అనంతరం కుమార స్వామి మాట్లాడుతూ.. ‘మేం ఇకపై కలసి ముందుకెళ్లాలని నిర్ణయించాం. అందుకే వారి (సోనియా, రాహుల్) సూచనలు తీసుకుందామనే ఇక్కడికి వచ్చాను. మంత్రివర్గ శాఖల పంపకంలో ఎలాంటి బేరసారాల్లేవు. మేం సుహృద్భావపూర్వక వాతావరణంలో చర్చించుకుని నిర్ణయిస్తాం’ అని పేర్కొన్నారు. ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్ రావాలని ఆయన ఆహ్వానించారు. బెంగళూరులోనే నిర్ణయం డిప్యూటీ సీఎం ఎంపికపై స్పందిస్తూ.. ‘దీనికి సంబంధించిన విధివిధానాలను రాహుల్ చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కేసీ వేణుగోపాల్‌కు దీనిపై చర్చించేందుకు పూర్తి అనుమతులిచ్చారు. కర్ణాటక సీనియర్ నేతలతో మంగళవారం బెంగళూరులో సమావేశమై మంత్రివర్గ కూర్పుపై తుది నిర్ణయం తీసుకుంటాం’ అని కుమారస్వామి వెల్లడించారు. జేడీఎస్–కాంగ్రెస్ కూటమి కర్ణాటకకు సుస్థిరమైన పాలన అందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా నడిచేందుకు ఓ సమన్వయ కమిటీని ఏర్పాటుచేసేందుకు ఇరుపార్టీలు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఆరుగురు సభ్యుల కమిటీలో ఇరుపార్టీల్లోని చెరో ముగ్గురు సీనియర్ నేతలుండాలని నిర్ణయించారు. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్నందున స్పీకర్ పోస్టును తమకే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదించగా.. కుమారస్వామి అంగీకరించినట్లు తెలిసింది. అయితే, కాంగ్రెస్ తరపున ఎవరు ఉపముఖ్యమంత్రిగా ఉండాలనే అంశంపై మంగళవారం జేడీఎస్‌తో చర్చల్లోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తుండగా.. కుమారస్వామి తిరస్కరించినట్లు తెలుస్తోంది. పరస్పర ప్రయోజనాలపై చర్చ ఈ భేటీ జరిగిన కాసేపటికే.. స్వామి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘కుమారస్వామిని కలవటం ఆనందంగా ఉంది. కర్ణాటకలో ఇరువురి పరస్పర ప్రయోజనాల అంశాలను, రాజకీయ పరిస్థితులను చర్చించుకున్నాం. బెంగళూరులో ఆయన ప్రమాణస్వీకారానికి నేను వెళ్తున్నా’ అని రాహుల్ ట్వీట్ చేశారు. సోనియా, రాహుల్‌లను కలవకముందే.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని స్వామి కలిశారు. 2019 ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రయత్నించాలన్న అంశంపై వీరిద్దరు చర్చించినట్లు తెలిసింది. రేపు సాయంత్రం 4.30కు కర్ణాటక సీఎంగా కుమారస్వామి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు విధానసౌధలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ వజూభాయ్ వాలా పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతోపాటుగా బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్ సహా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరు కానుండగా.. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, ఎస్పీ నేత అఖిలేశ్‌యాదవ్. బీఎస్పీ అధినేత్రి మాయావతిలు కూడా ప్రమాణస్వీకారంలో పాల్గొనవచ్చని తెలుస్తోంది. 12 ఏళ్లలో కుమారస్వామి సీఎంగా బాధ్యతలు తీసుకోవటం ఇది రెండోసారి. కాగా, మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి కేబినెట్లో స్థానం దక్కని పక్షంలో తిరుగుబాటు రావొచ్చన్న ఆందోళనతో.. కుమారస్వామితోపాటు కొందరితోనే మంత్రులుగా ప్రమాణం చేయించాలని సోనియా, రాహుల్ సూచించినట్లు సమాచారం. విశ్వాస పరీక్ష తర్వాత కేబినెట్‌ను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో రాహుల్, సోనియాలతో కుమారస్వామి. చిత్రంలో డానిష్ అలీ, కేసీ వేణుగోపాల్ -
వజూభాయ్ తీరు సిగ్గుచేటు: రామ్ జెఠ్మలాని
న్యూఢిల్లీ: తగినంత సంఖ్యాబలం లేని బీజేపీని గవర్నర్ వజూభాయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సిగ్గుచేటని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని మండిపడ్డారు. యడ్యూరప్పను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని సవాలుచేస్తూ జెఠ్మలాని సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్ విచారణ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జెఠ్మలాని వాదనలు వినిపిస్తూ..అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడమంటే అవినీతికి బహిరంగంగా ఆహ్వానం పంపినట్టేనని అన్నారు. -
రాజ్‌భవన్ ముట్టడి యత్నం విఫలం
సాక్షి, బెంగళూరు: గవర్నర్ వజూభాయ్ వాలా సంఖ్యాబలం లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాజ్‌భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్వీన్స్క్రాస్ రోడ్డులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. రాజ్‌భవన్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసి సమీపంలోని కబ్బన్పార్కుకు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. గవర్నర్, పోలీసుల తీరును నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ సమీపంలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమంలో ఎంపీ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధారాలతో ఆడియో క్లిప్పును విడుదల చేసింది. చిత్రదుర్గ గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దడ్డల్కు మంత్రి పదవితో పాటు భారీగా డబ్బు ఆశచూపినట్లు అందులో ఉంది. -
వంద శాతం గెలుస్తాం
బెంగళూరు: బల పరీక్షలో వంద శాతం గెలుస్తానని కర్ణాటక సీఎం యడ్యూరప్ప అన్నారు. ‘ఈ రాజకీయ క్రీడలో మేం మా ఆధిక్యాన్ని నిరూపించుకుంటాం. బలపరీక్షలో నెగ్గుతాం’ అని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత సాధారణ ఆధిక్యం లేకుండానే సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప.. పీఠమెక్కిన దాదాపు 55 గంటల్లోనే విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్నారు. మా ఎమ్మెల్యేను ఢిల్లీలో ఉంచారు: ఆజాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ని బీజేపీ అధిష్టానం బేరసారాల కోసం ఢిల్లీకి పిలిపించుకుందనీ, అక్కడ నుంచి ఆయన తిరిగిరాకుండా కట్టడి చేస్తోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్థానం లో ఉన్న గవర్నర్.. ఆయన చేతులతోనే రాజ్యాంగం పీక నొక్కుతున్నారని ఆజాద్ మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారనడానికి సుప్రీం ఉత్తర్వులే నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగ బద్ధంగా లేదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. రెండు ప్రధాన పార్టీలు మెజారిటీ ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరినా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా, ప్రజాస్వామ్యయుతంగా చేయకుండా రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం ఎంత వరకు న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో పర్యటించారు. వలేటివారిపాలెం మండలం పోకూరులో నీరు–ప్రగతి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అదే మండలంలోని నూకవరం, బడేవారిపాలెం తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రచ్చబండ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పట్టిసీమ ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం జిల్లా మీదుగా సోమశిలకు తరలిస్తామన్నారు. కాగా ముఖ్యమంత్రి ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభదిన శుభాకాంక్షలు తెలిపారు. -
మావీ ‘అతిపెద్ద’ పార్టీలే!
న్యూఢిల్లీ/పణజి/పట్నా: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని ఆయుధంగా మార్చుకోనున్నాయి. గోవా, మణిపుర్, మేఘాలయతో పాటు బిహార్‌లో అతిపెద్ద పార్టీలుగా నిల్చిన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను కోరేందుకు సిద్ధమయ్యాయి. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరుతూ 16 మంది ఎమ్మెల్యేల సంతకాల లేఖను శుక్రవారం రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హాకు అందజేయనున్నట్లు గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షనేత చంద్రకాంత్ కవ్లేకర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గానూ కాంగ్రెస్ 17 సీట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. గవర్నర్‌తో సమావేశంలో గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుని కర్ణాటక తరహాలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరతామన్నారు. మరోవైపు మణిపుర్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్, మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాలు శుక్రవారం ఆయా రాష్ట్రాల గవర్నర్లతో సమావేశం కానున్నారు. మణిçపూర్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉన్నందున తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరతామని ఇబోబీ సింగ్ తెలిపారు. బిహార్ గవర్నర్‌తో భేటీ కానున్న తేజస్వీ కర్ణాటక ఉదంతం నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి బిహార్ గవర్నర్ సత్యపాల్‌తో శుక్రవారం భేటీ అవుతానని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నితీశ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి కర్ణాటక తరహాలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతామన్నారు. -
1996లో అలా.. 2018లో ఇలా!
ఇప్పుడు కర్ణాటకలో తమను కాదని గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీ నేత యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించడాన్ని కాంగ్రెస్, దేవెగౌడ పార్టీ జేడీఎస్ అన్యాయం, అక్రమమని గొంతు చించుకుంటున్నాయి. అయితే, ఒకప్పుడు గుజరాత్లో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ సర్కారును అక్రమంగా గద్దెదించడంలో కాంగ్రెస్ పార్టీ, దేవెగౌడ తమ పాత్రలను మరచిపోయినట్లు కనిపిస్తోంది. గవర్నర్ సిఫార్సుతో మెహతా బర్తరఫ్! అది 1996 సెప్టెంబర్. గుజరాత్లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీనియర్ నేత శంకర్‌సింహ్ వాఘేలా వర్గీయులు తిరుగుబాటు చేశారు. మెహతా ప్రభుత్వానికి అసెంబ్లీలో 121 మంది బీజేపీ శాసనసభ్యుల మద్దతు ఉండగా, వారిలో 40 మంది తనను సమర్థిస్తున్నారని వాఘేలా ప్రకటించి, ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. వాఘేలా, కాంగ్రెస్‌కు చెందిన పారిఖ్ కలిసి సురేశ్మెహతా సర్కారుపై అవిశ్వాసం ప్రకటించి, తిరుగుబాటు చేయడంతో బీజేపీ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి చెందిన స్పీకర్ హెచ్ఎల్ పటేల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో సభను నడిపిన కాంగ్రెస్‌కు చెందిన ఉపసభాపతి చందూభాయ్ ధాబీ వాఘేలా–పారిఖ్ వర్గానికి గుర్తింపు ఇచ్చారు. మళ్లీ కోలుకుని అసెంబ్లీకి వచ్చిన స్పీకర్ పటేల్ డెప్యూటీ స్పీకర్ ఉత్తర్వును రద్దు చేయడం గందరగోళం, కొట్లాటలకు దారితీసింది. అసెంబ్లీలో రభస జరగడంతో బలపరీక్షకు ఓటింగ్ నిర్వహించడం కుదరలేదు. వాఘేలా వర్గం, కాంగ్రెస్ నేతలు గవర్నర్ కృష్ణపాల్ సింగ్‌ను కలసి మెహతా సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కారు రద్దుకు గవర్నర్ సిఫార్సు దాంతో మెహతా ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశా>రు. ఆ సమయంలో దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటినుంచి మద్దతిస్తోంది. దేవెగౌడ ప్రభుత్వం గుజరాత్ నుంచి గవర్నర్ నివేదిక అందిన వెంటనే సురేశ్ మెహతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఇప్పటి కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా అప్పుడు గుజరాత్ బీజేపీ అధ్యక్షుని హోదాలో తమ పార్టీ సర్కారుకు జరిగిన ‘అన్యాయాన్ని’ కళ్లారా చూశారు.. అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అదే దేవెగౌడ కొడుకు కుమారస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కోరినా వజూభాయ్ పట్టించుకోలేదు. వాజ్‌పేయి ఔట్.. దేవెగౌడ ఇన్ 1996లోనే సభలో మెజారిటీ నిరూపించుకోలేక ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత 161 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అటల్ బిహారీ వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ఆహ్వానించారు. బలపరీక్ష నాటికి అవసరమైన మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో.. ఓటింగ్‌కు ముందే వాజ్‌పేయి రాజీనామా చేశారు. అయితే, విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వాజ్‌పేయి చేసిన ఆవేశపూరిత ప్రసంగాన్ని నేటికీ గుర్తు చేసుకుంటారు. అనంతరం, కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడే సంకీర్ణ సర్కారుకు మద్దతివ్వడానికి కాంగ్రెసేతర జాతీయ. ప్రాంతీయపార్టీలు అంగీకరించకపోవడంతో.. కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ ప్రభుత్వానికి దేవెగౌడ నేతృత్వం వహించడం కొసమెరుపు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వజూభాయ్ కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారు
న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్పను ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. వజూభాయ్ బీజేపీ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘వజూభాయ్ గవర్నర్ కార్యాలయ గౌరవాన్ని దిగజార్చారు. రాజ్యాంగాన్ని అణగదొక్కారు. చట్టాలను దుర్వినియోగం చేసి బీజేపీ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదేశాలతో వజూభాయ్ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. ఆయన రాజ్యాంగ విలువల్ని కాకుం డా బీజేపీ అధిష్టానం ఆదేశాలను పాటించాలని నిర్ణయించుకున్నారు’ అని ట్వీట్ చేశారు. -
గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకు కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించటంపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం రాత్రి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాను కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యుల బృందం కలిసింది. కర్ణాటక గవర్నర్ నిర్ణయం చాలా తీవ్రమైన అంశమని.. దీనిని బుధవారం అర్ధరాత్రే విచారణకు స్వీకరించాలని సీజేఐ కోరింది. గురువారం ఉదయం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నందున.. తక్కువ సమయం కారణంగా అత్యవసర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. అనంతరం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం చేరుకున్న కాంగ్రెస్ బృందం.. ఈ కేసును రిజిస్టర్ చేసింది. ‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయటం అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. అక్రమంగా బీజేపీ గద్దెనెక్కడం దారుణం’ అని వ్యాఖ్యానించింది. -
పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్
-
శ్రీనగర్‌లో దిగిన టాప్ సీక్రెట్ విమానం!
శ్రీనగర్: ఊహించనివిధంగా, ఉన్నపళాన ఓ టాప్ సీక్రెట్ విమానం శ్రీనగర్‌లో ల్యాండ్ అయింది. ఒక్కసారిగా దిగిన ఈ విమానాన్ని ట్రాక్ చేసిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా రాష్ట్రంలో ఏదో జరుగుతుందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇంతకు ఆయన వ్యక్తం చేసిన అనుమానం రాజకీయమైనది. బీజేపీ-పీడీపీ ప్రభుత్వ ఏర్పాటుపై రహస్యంగా ఏదో గూడుపుఠాణి జరుగుతున్నదంటూ ఒమర్ ఈ మేరకు ట్విట్టర్లో అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేత రాంమాధవ్ బుధవారం సాయంత్రం శ్రీనగర్ వచ్చి.. పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీతో భేటీ అయిన నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్స్ చేశారు. నిజానికి బీజేపీ నేత రాంమాధవ్ కనీసం జర్నలిస్టులకు కూడా చెప్పాపెట్టకుండా శ్రీనగర్‌లో దిగారు. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే భారత రాజకీయ నేతల్లో ఒకరైన ఒమర్.. తన మొబైల్ లోని ట్రాకర్ యాప్‌తో వేళ కాని వేళ అనూహ్యంగా శ్రీనగర్‌లో దిగిన చార్టర్ విమానాన్ని పట్టేశారు. దీని గురించి వెంటనే ఆయన ట్వీట్ చేశారు. 'మామూలు ఆపరేషన్స్ సమయంలో కాకుండా ఓ అన్‌షెడ్యూల్ విమానం శ్రీనగర్‌లో దిగింది. పీడీపీ-బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏదో గూడుపుఠాణి జరుగుతున్నది' అని ఆయన పేర్కొన్నారు. మెహబూబా-రాం మాధవ్ రహస్య భేటీ గురించే ఈ అనూహ్య విమానం దిగిందని ఓ నెటిజన్ బదులివ్వగా.. ఫ్లయిట్ ట్రాకర్ యాప్ ఇచ్చిన అమేజింగ్ అలర్ట్‌తో దీనిని పట్టేశానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
-
కశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ లో బీజేపీ-పీడీపీ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టికల్ 370, సైనికబలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం రద్దు విషయంలో ఇరు వర్గాలు తమవిభేదాలను పక్కనపెట్టి మంగళవారంఒక అంగీకారానికి రావచ్చని సమాచారం. కామన్ మినిమం ప్రోగ్రామ్ పత్రం రూపొందించే క్రమంలో , జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370కు భద్రత కల్పించడం, సైనికబలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం అంశాలపై తమకున్న భిన్నవాదనలపై ఎవరికివారు అప్రమత్తంగా ఉన్నట్టు సమాచారం. ఇరు పార్టీలు సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్చలు ప్రారంభించాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు మరికొన్ని విషయాలను పరిష్కరించుకోవాల్సి ఉందని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై పీటముడి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, పీడీపీల మధ్య చాన్నాళ్లుగా అనధికారికంగా సాగుతున్న చర్యలు ఇప్పట్లో కొలి క్కి వచ్చేలా కనిపించడంలేదు. కీలకమైన 370 రాజ్యాంగ అధికరణం, సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ).. ఈ రెండింటిపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర లేదు. అయితే, చర్చలు ఫలప్రదంగా కొనసాగుతున్నాయని, కామన్ మినిమమ్ ప్రొగ్రామ్(సీఎంపీ) పత్ర రూపకల్పన తుది దశలో ఉందనిరెండు పార్టీలూ చెబుతున్నాయి. -
ఒమర్ అబ్దుల్లాతో కమలనాథుల చర్చలు
జమ్ము కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ బీజేపీ పరిశీలిస్తోంది. ఇప్పుడు తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులతో కూడా చర్చలు సాగిస్తోంది. అందులో భాగంగా తాజా మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కమలనాథులు బుధవారం చర్చలు జరిపారు. బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 87 స్థానాలుండగా, బీజేపీ 25 స్థానాలు గెలుచుకుంది. పీడీపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ రెబెల్స్‌గా వివిధ పార్టీల తరఫున పోటీచేసి గెలిచిన ఆరుగురు ఎవరికైనా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ 15 స్థానాలు గెలుచుకుంది. రెబెల్స్, బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ కలిస్తే.. ఈ బలం 46కు చేరుకుంటుంది. ఈ లెక్కన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో పాటు పార్టీ జాతీయకార్యదర్శి అరుణ్ సింగ్‌ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు జమ్ము కాశ్మీర్‌కు పంపింది. అక్కడ లెజిస్లేచర్ పార్టీ నాయకుడి ఎన్నికకు వీరు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి, జమ్ము కాశ్మీర్ వ్యవహారాలను చూసుకున్న వారణాసి రాం మాధవ్ తెలిపారు. -
కాశ్మీర్లో కీలకం కానున్న కాషాయం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించనుంది. ఆ పార్టీ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆరేళ్ల ప్రభుత్వంలో మొదటి మూడు సంవత్సరాలు తమ పార్టీకీ ... అది కూడా హిందువును సీఎం అభ్యర్థిని ఎంపిక చేసి తెర మీదకు తీసుకువచ్చేందుకు బీజేపీ తన చర్యలను ముమ్మరం చేసింది. అందుకోసం ఆ పార్టీ ఇప్పటికే ఎన్సీ, పీడీపీలతో చర్చలు ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం 87 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల అయిదు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లు, ఎన్సీ 15 సీట్లు, కాంగ్రెస్ 12 సీట్లు, స్వతంత్ర్య అభ్యర్థులు 7 సీట్లను కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 44 సీట్లు అవసరమవుతాయి. అయితే రాష్ట్రంలోని ఎన్సీ, పీడీపీలు బద్ద శత్రువులు గల పార్టీలు. ఈ నేపథ్యంలో ఎన్సీ కానీ, పీడీపీ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీతో కలవడం తప్పని సరి పరిస్థితి. దాంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తుంది. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికైన ఏడుగురు కూడా కీలకంగా మారనున్నారు. కాగా ఎన్సీ, బీజేపీతో కలసి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలా అయితే ఎన్ సీ, బీజేపీలు మొత్తం సభ్యుల సంఖ్య 40కు చేరుతుంది. మరో నాలుగురు సభ్యులను తమతో కలుపుకుని బీజేపీ, ఎన్సీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గురువారం న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి, అరుణ్ జైట్లీ, బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్‌తో భేటీ అయ్యారు. జమ్మూలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై వారంతా చర్చిస్తున్నారు. అసలైతే ఒమర్ గురువారం లండన్ బయలుదేరవలసి ఉంది. కానీ ప్రభుత్వ ఏర్పాటు విషయంపై చర్చించేందుకు ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
రాష్ట్రపతి పాలన ఎత్తేస్తారా?
కాంగ్రెస్ వైఖరి పరాకాష్ఠకు చేరింది. తమ పార్టీలో టీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు.. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగని పక్షంలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ లేదా మరో తెలంగాణ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసి అసెంబ్లీ ఎన్నికలు కూడా వాయిదా వేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు కనపడుతోంది. లోక్‌సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఏమాత్రం నోరు విప్పడంలేదు. అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గత కొంత కాలంగా అధిష్ఠానాన్ని కోరుతున్నారు. కానీ తెలంగాణ నేతలు మాత్రం అలా వాయిదాలు వద్దంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎటూ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో పరాభవం తప్పదని, అలాంటప్పుడు ఆ ప్రభావం తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల మీద స్పష్టంగా ఉంటుందని భయపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం టీఆర్ఎస్ నిర్ణయాన్ని బట్టి ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ క్రీడల కోసం ఇప్పటికే రాష్ట్రాన్ని బలిపీఠం మీదకు నెట్టేసి.. రాష్ట్రపతి పాలన విధించి, ఇప్పుడు మళ్లీ తన సొంత ప్రయోజనాల కోసం అవసరమైతే మైనారిటీ సర్కారునైనా ఏర్పాటుచేయాలని తలపెడుతోంది. -
హస్తినలో నేతల హడావుడి, మంతనాలు
న్యూఢిల్లీ : రాష్ట్ర రాజకీయాలతో హస్తిన మరోసారి వేడెక్కింది. కిరణ్ రాజీనామాతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. రాష్ట్రపతి పాలనా లేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమా అనే దానిపై చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, స్పీకర్ నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ఇక హస్తినలోనే మకాం వేసిన కేసీఆర్ వరుసపెట్టి కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ప్రణబ్‌తో కేసీఆర్ సుమారు 15 నిమిషాలు పాటు సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆయన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. -
'ప్రభుత్వ ఏర్పాటుపై సాయంత్రంలోగా నిర్ణయం'
హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సోమవారం సాయంత్రంలోగా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ రెండు ప్రాంతాల్లోను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి కృషి చేస్తామన్నారు. టీఆర్ఎస్తో పొత్తా, విలీనమా అనేది రెండు రోజుల్లో తేలనుందని జేడీ శీలం తెలిపారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చించారు. మరోవైపు ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా సోనియాతో సమావేశం అయ్యారు. అలాగే స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా సోనియాతో భేటీ అయినవారిలో ఉన్నారు. -
కొనసాగుతున్న అనిశ్చితి!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటుపై ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అంతిమ నిర్ణయానికి రాలేకపోయింది. ఆప్ విధించిన అన్ని షరతుకు కాంగ్రెస్ అంగీకరించినప్పటికీ ఆ పార్టీని విశ్వసించడానికి సంశయిస్తోంది. కేజ్రీవాల్ లేఖకు కాంగ్రెస్ నుంచి బదులు రావడంతో దానిపై చర్చించడానికి ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం ఉదయం ఘజియాబాద్‌లోని కేజ్రీవాల్ నివాసంలో సమావేశమైంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, కుమార్ బిశ్వాస్‌తోపాటు 9 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ రెండు గంటలు చర్చోపచర్చలు జరిపింది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయానికి రాలేకపోయింది. పార్టీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని ఈ సున్నితమైన అంశంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావించారు. దీంతో మధ్యాహ్నం ఆప్ ఎమ్మెల్యేలు అందరినీ సమావేశపరిచి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయాన్ని చర్చించారు. ఇందులోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ప్రజాభిప్రాయం కోరాలని నిర్ణయించారు. సమావేశం తరువాత కే జ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా అన్న ధర్మసంకటంలో పడ్డామని చెప్పారు. కొందరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, మరికొందరు వద్దంటున్నారని తెలిపారు. అందుకే ప్రజాభిప్రాయం కోరాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 18 అంశాలపై మద్దతు కోరుతూ కాంగ్రెస్, బీజేపీకి లేఖ రాశాం. కాంగ్రెస్ ఈ లేఖకు సమాధానమివ్వగా, బీజేపీ కనీస మర్యాదనైనా పాటించకుండా జవాబు రాయలేదు. మా 18 షరతుల్లో 16 షరతులు పాలనాపరమైనవని, వాటికి మా మద్దతు అవసరం లేదని, రెండింటికి మాత్రం సహకరిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఆప్ మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినందువల్ల ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయాన్ని మేం పరిశీలించాం. కాంగ్రెస్‌ను విశ్వసించలేమని, గతంలో చరణ్‌సింగ్, చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కూల్చినట్లుగానే మన ప్రభుత్వాన్ని కూడా కూల్చవచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు’ అని ఆయన తెలిపారు. ప్రభుత్వాలను కూల్చడమనేది కాంగ్రెస్ రక్తంలోనే ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే లోక్‌సభ ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి, ఆరునెలల వరకు కాంగ్రెస్ తమ ప్రభుత్వాన్ని కూల్చకపోవచ్చన్న నమ్మకమూ కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఆరు నెలలైనా సుపరిపాలన అందించాలని కొందరు సూచించారని కేజ్రీవాల్ వివరించారు. ప్రజలు కోరితే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి తాము వెనుకాడబోమని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆప్ ప్రయత్నిస్తోందన్న విమర్శలకు స్పందిస్తూ ఎన్నికల్లో పోటీచేసి సత్తా నిరూపించుకున్న ఆప్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా కఠినమైన విషయం కాదన్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఢిల్లీవాసులకు 25 లక్షల లేఖలు రాస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా అనేదానిపై ఢిల్లీవాసులు తమ అభిప్రాయాన్ని 08806110335 నంబరుకు ‘యస్’ లేదా ‘నో’ అని ఎస్ఎంఎస్ చేయవచ్చు. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఆప్ వెబ్సైట్ లేదా ఫేస్బుక్ పేజీ ద్వారా తెలియజేయవచ్చు. 272 మున్సిపల్ వార్డుల్లో జనసభల ద్వారా కూడా ప్రజాభిప్రాయం సేకరిస్తారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించి సోమవారం తుదినిర్ణయానికి రానున్నట్లు ఆయన చెప్పారు. సగం మంది వ్యతిరేక అభిప్రాయాలు వెలువరించినా ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని కేజ్రీవాల్ ఈ సందర్భంగా స్పష్టీకరించారు. నగరంలో రాష్ట్రపతి పాలన విధించిన తరువాత కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. యుద్ధానికి మళ్లీ సిద్ధం: బీజేపీ న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై సంది గ్ధం నెలకొనడంపై బీజేపీ స్పందించింది. మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంగళవారం ప్రకటించింది. ఢిల్లీ బీజేపీ ఎన్నికల వ్యూహబృందం సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జ్ నితిన్ గడ్కారీ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీవాసుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ కార్యకర్తలు మరింత శ్రమించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చి నా ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ఆద్మీ పార్టీ ముం దుకు రాకపోవడంపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజ య్ గోయల్ మండిపడ్డారు. మరోసారి ఎన్నికలకు వెళ్లడానికి తాము సిద్ధపడుతున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం మూడంచెల ప్రచార వ్యూ హాన్ని సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ ఎన్నికలకు ఆపే కారణమన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తమకు ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞత లు చెప్పడానికి నియోజకవర్గాల వారీగా ‘విజ యోత్సవాలు’ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. -
ప్రజాభిప్రాయ సేకరణకు అపూర్వ స్పందన: ఆమ్ ఆద్మీ
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుపై డిసెంబర్ 23 తేదిన తుది నిర్ణయం తీసుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఎస్ఎమ్మెఎస్, వెబ్ సైట్, ఐవీఆర్ రూపంలో తమ అభిప్రాయాల్ని ప్రజలు వెల్లడించాలని ఏఏపీ కోరింది. అయితే ఏఏపీ విజ్జస్తికి అపూర్వ స్పందన లభిస్తోందని ట్విటర్ లో వెల్లడించారు. కేవలం నాలుగు గంటల్లోనే వివిధ రూపాల్లో 3 లక్షల మెసేజ్ లు వచ్చాయని, వెబ్ సైట్ లోనే 35 వేల మంది స్పందించారని తెలిపారు. తమ అభిప్రాయాలను తెలుపడానికి 08806110335 నెంబర్ కు కాల్ చేయవచ్చని ఏఏపీ వెల్లడించింది. ఫోన్ చేసిన వ్యక్తి 'యస్' లేదా 'నో' అని చెప్పాలని తెలిపారు. ప్రజలు 'యస్' లేదా 'నో' అని తమ అభిప్రాయన్ని వెల్లడించాలని ఆయన కోరారు. ఎక్కువ మంది ప్రజలు 'యస్' అంటే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేజ్రివాల్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఏఏపీ నేత అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. 70 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించకపోవడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. అసెంబ్లీలో 31 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయకపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. 18 కీలక సమస్యలపై బేషరతుగా మద్దతు తెలుపాలని కాంగ్రెస్, బీజేపీలకు కేజ్రివాల్ లేఖ రాయగా, అందుకు 16 అంశాలకు మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ జవాబిచ్చింది.