'ప్రభుత్వ ఏర్పాటుపై సాయంత్రంలోగా నిర్ణయం'
హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సోమవారం సాయంత్రంలోగా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ రెండు ప్రాంతాల్లోను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి కృషి చేస్తామన్నారు. టీఆర్ఎస్తో పొత్తా, విలీనమా అనేది రెండు రోజుల్లో తేలనుందని జేడీ శీలం తెలిపారు.
మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చించారు. మరోవైపు ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా సోనియాతో సమావేశం అయ్యారు. అలాగే స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా సోనియాతో భేటీ అయినవారిలో ఉన్నారు.