సాక్షి, కాకినాడ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా మే 30వ తేదీన 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక ఓట్ల షేర్ పొంది తిరుగులేని జననేతగా సీఎం జగన్ ప్రజల ఆశీర్వాదం పొంది నేటితో ఏడాది పూర్తయిందన్నారు. ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేశారన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ది బెస్ట్ సీఎంగా దేశం మొత్తం కొనియాడుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ' నేను ఉన్నాను.. నేను విన్నాను' అని జగన్ ప్రజలకు మాట ఇస్తే .. ఆయన ఏం చేయగలడంటూ టీడీపీ విమర్శలకు దిగిందన్నారు. కానీ కరోనా వంటి కష్టకాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా అమలు చేయడం జగన్‌కే చెల్లిందన్నారు. ఏడాది కాలంలో ప్రజలకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కన్నబాబు పేర్కొన్నారు.(మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు)
అమ్మ ఒడి.. రైతు భరోసా వంటి పథకాల విషయంలో జగన్ తన ధర్మాన్ని తూ.చ తప్పకుండా అమలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ పరంగా రికార్డు సృష్టిస్తున్నామన్నారు. తొలిసారిగా టమాట, పెండ్లం,మిర్చి ఇలా పలు పంటలను మార్కెటింగ్ శాఖ ద్వార కొనుగోలు చేసి బజార్లకు పంపించినట్లు వెల్లడించారు. 17 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాట ధర కల్పించామన్నారు. వేల కోట్ల భారం పడుతున్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తొలి సారిగా గ్రామ స్ధాయిలో విత్తన పంపిణీని ప్రారంభించిన ఘనత సీఎం వైఎస్ జగన్ కి దక్కుతుందని కన్నబాబు స్పష్టం చేశారు. (ఏపీ చరిత్రలో చిరస్మరణీయైన రోజు: విజయసాయిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment