సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో జరిగిన హత్యాయత్నం ఘటనలో కుట్ర కోణం దాగి ఉందని తాము భావిస్తుంటే, ఎల్లో మీడియాకు బాధ ఎందుకో అర్థం కావడం లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు.
శనివారం మీడియాతో మాట్లాడిన కన్నబాబు.. ‘కుట్ర కోణం ఉందని మేం అంటుంటే మీరు భుజాలెందుకు తడుముకుంటున్నారు. ఎన్‌ఐఏ లోతుగా విచారించాలని మేం కోరితే తప్పేంటి?, కోర్టులు ఏం చెప్పకుండానే ఎల్లో మీడియా తీర్పులు ఇస్తోంది. దాడి చేసిన వ్యక్తిపై కేసులు లేవంటూ కథనాలు రాశారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని విచారణలో తేలింది.
ఘటన వెనుక నిజాలను తేల్చమంటుంటే మీకెందుకు బాధ?, సీఎం జగన్‌ను కించపరిచేలా మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఎగతాళిగా మాట్లాడారు. ఘటన వెనుక కుట్న కోణం ఉందని మేం భావిస్తున్నాం. డీఎల్ రవీంద్రారెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. సీఎం సతీమణి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కనీసం సంస్కారం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదు’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment