
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం చల్లారకముందే పార్లమెంటు ఎన్నికలతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని భావిస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో విఫలమైందని ఆరోపిస్తూ, పార్టీ శ్రేణులను ఎన్నికలను సన్నద్ధం చేసేలా మంగళవారం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనుంది.బీజేపీకి తామే సరైన ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు ఏ అస్త్రాలను కాంగ్రెస్ నేతలు ఎంచుకుంటారనేది ప్రశ్నార్థకమే.
Comments
Please login to add a commentAdd a comment