
పట్నా: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎన్డీయేలో చేరితే కేంద్రప్రభుత్వంలో కీలక పదవి లభించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను కూడా శరద్ కలుపుకుపోవాలని అన్నారు. శివసేన–బీజేపీ సంక్షోభం గురించి మాట్లాడుతూ.. రెండు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే, సమస్యలున్నా సర్దుకుపోయి ఉండేవన్నారు. కానీ పరిస్థితి చేజారిందన్నారు. ‘అభినవ చాణక్య’ అమిత్‌షా వేగాన్ని ఆయా పార్టీలు అందుకోలేకపోయాయన్నారు. ఎన్సీపీని తమతో చేర్చుకున్న బీజేపీ.. కాంగ్రెస్, శివసేనలకు షాకిచ్చిందని చెప్పారు. మరోవైపు బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ బీజేపీ–ఎన్సీపీ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజును విజయ్ దివాస్‌గా జరుపుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment