Ramdas Athavale
-
రోజురోజుకి కాంగ్రెస్ పతనం: రాందాస్ అథవాలే
సాక్షి, విశాఖపట్నం: కాంగ్రెస్ రోజురోజుకి పతనం అవుతోందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ హయాంలో కూడా జరిగిందన్నారు. ‘‘మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోని అంశం. కేంద్రం పరిధిలో లేదని’’ కేంద్రమంత్రి స్పష్టం చేశారు. చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని -
సేనకు సీఎం, పవార్‌కు పెద్దపోస్టు: బీజేపీ ఆఫర్
సాక్షి, ముంబై : మహారాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పాతమిత్రపక్షం శివసేనను తిరిగి తమవైపుకు తిప్పుకునేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ఈ మేరకు శివసేనతో మంతనాలు చేసేందుకు దూతలను దేశ ఆర్థిక రాజధాని ముంబైకు పంపుతోంది. దీనిలో భాగంగానే కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సోమవారం ముంబై చేరుకున్నారు. నేతలతో ముఖ్య సమావేశం నిర్వహించి స్థానిక రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పాతమిత్రుడు శివసేనను తిరిగి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా రానున్న ఏడాది కాలంపాటు సీఎం పదవి కూడా ఉద్ధవ్ ఠాక్రేకే అప్పగిస్తామని, కేంద్రంలోనూ కీలక పదవులు కట్టబెడతామని హామీ ఇచ్చారు. (‘ఎన్డీయే రెండు సింహాలను వదులుకుంది) ఒకవేళ ఉద్ధవ్ వెనకడుగు వేస్తే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎన్డీయే కూటమిలో చేరొచ్చని ఆహ్వానించారు. మహా వికాస్ ఆఘాడీని నుంచి పవార్ వైదిలిగి తమతో చేతులు కలపాలని కోరారు. ఎన్సీపీ మద్దతుతో బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా కేంద్రంలో శరద్ పవార్‌కు కీలక పదవి అప్పగిస్తామని, ఈ మేరకు పార్టీ పెద్దలు కూడా అంగీకరించారని వ్యాఖ్యానించారు. కాగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ పార్టీకి కొంత లోటు ఏర్పడింది. దీనిని శివసేనతో పూడ్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇదిలావుండగా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ గతవారం శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో రహస్య సమావేశమైన విషయం తెలిసిందే. బీజేపీ పెద్దల సలహా మేరకు ఫడ్నవిస్, రౌత్ మధ్య సమావేశం జరిగిందని రాజకీయ వర్గల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శివసేనను తిరిగి తమవైపుకు తిప్పుకునే విధంగా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. (ఇక వైదొలుగుతాం : అమిత్ షాకు లేఖ) గతంలోనూ ఠాక్రే మనసు మార్చేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సేనలు మాత్రం కాషాయదళంతో కలిసేందుకు ససేమిరా అంటున్నారు. అయితే వ్యూహరచనలో దిట్టగా పేరొందిన బీజేపీ నేతలు శివసేనకు చెక్ పెట్టేందుకు మరోదారిని ఎంచుకున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు గాలం వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కేంద్రం పెద్ద పదవినే ఆఫర్ చేసినట్లు అప్పట్లో వచ్చిన వార్తలు పెను దుమారాన్నే రేపాయి. ఈ క్రమంలోనే మరోసారి రామ్‌దాస్ అంతవాలే శివసేన, ఎన్సీలను ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రతిపాదనలకు తలొగ్గేది లేదని మహా వికాస్ ఆఘాడీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ ఎన్ని విఫల ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందని చెబతున్నారు. -
సుశాంత్ తండ్రిని కలిసిన కేంద్ర మంత్రి
ఛండీగడ్ : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రిని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే పరామర్శించారు. హర్యానాలోని ఫరిదాబాద్‌లో సుశాంత్ తండ్రి కేకె సింగ్, సోదరి రాణిసింగ్‌తో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా సుశాంత్‌కు న్యాయం జరుగుతుందని, నిజనిజాలు త్వరలోనే బయటపడుతాయని ధైర్యం చెప్పారు ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ జూన్ 14న మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై శుక్రవారం సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సుశాంత్ బ్యాంకు ఖాతాలోని డబ్బులను పెద్ద మొత్తంలో మళ్లించారన్న సుశాంత్ తండ్రి కేకే సింగ్ బిహార్ పోలీసులకు ఇచ్చిన కేసు ఆధారంగా మేరకు సీబీఐ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. (సుశాంత్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారా?) అయితే కేసు విచారణలో తనతో పాటు తన కుటుంబం సహకరిస్తున్నా సోషల్ ట్రోలింగ్‌తో తమను మానసికంగా ఇబ్బందికి గురిచేస్తున్నారని రియా చక్రవర్తి ఆరోపించారు. ఈ సందర్భంగా రియా సోషల్ మీడియా వేదికగా 'నా కుటుంబ సభ్యుల జీవితం ప్రమాదంలో ఉంది. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను, దర్యాప్తు అధికారులను కోరాము. ఎవరూ మాకు సాయం చేయలేదు. మేము ఎలా ముందుకువెళ్లాలి? కేవలం విచారణకు వెళ్లేందుకు మాకు రక్షణ కల్పించాలని అడుగుతున్నాం. ఈ విషయంలో మాకు ఎలాగైనా సాయం చేయాలని ముంబై పోలీసులను అభ్యర్థిస్తున్నా' అని పేర్కొంది. (దయచేసి సాయం చేయండి: రియా చక్రవర్తి ) Union Minister Ramdas Athawale meets actor #SushantSinghRajput's father KK Singh and his sister Rani Singh in Faridabad. pic.twitter.com/JsWASzWe90 — ANI (@ANI) August 28, 2020 -
బాయ్‌కాట్ చైనా
న్యూఢిల్లీ: సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో భారత్‌లో చైనా ఆహార పదార్థాలను అమ్ముతున్న అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే పిలుపునిచ్చారు. చైనాకు చెందిన ఆహారాన్ని బహిష్కరించాలన్నారు. రోజూవారీ కార్యకలాపాల్లో చైనా ఉత్పత్తుల వాడకాన్ని బహిష్కరించాలంటూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా వైఖరిని అందరం చూస్తున్నామని అందుకే చైనా ఉత్పత్తులను వాడరాదని ఆయన అన్నారు. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇకపై బీఐఎస్ నాణ్యత ఉండేలా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చైనా నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చే ఫర్నీచర్ వంటి వాటిలోనూ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
‘చైనా రెస్టారెంట్లను బాయ్‌కాట్ చేయండి’
న్యూఢిల్లీ : గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనీస్ ఫుడ్‌ను విక్రయించే రెస్టారెంట్లపై భారత్‌లో నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.(భారత సైన్యంపై చైనా నిందలు) అన్యాయంగా 20 మంది భారత జవాన్లను చైనా పొట్టనపెట్టుకుందని మండిపడ్డారు. ప్రజలంతా స్వచ్ఛందంగా చైనా ఆహార పదార్థాలను, వాటిని అమ్మే రెస్టారెంట్లను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఆహార పదార్థాలే కాకుండా, చైనాలో తయారైన అన్ని రకాల వస్తువులను వదిలించుకోవాల్సిన సమయం వచ్చిందని ట్విటర్లో పేర్కొన్నారు.(చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే!) चीन धोका देनेवाला देश है.भारत मे चीन के सभी वस्तुओंका बहिष्कार करना चाहीये.चायनीज फूड और चायनीज फूड के हॉटेल भारत मे बंद करने चाहीये ! pic.twitter.com/ovL2sOLUo4 — Dr.Ramdas Athawale (@RamdasAthawale) June 17, 2020 लडाख के गलवाणमें भारतीय सीमापर चीन के साथ हुई हिंसक झडप मे भारत के 20 जवान शहीद हुये है. वीरगती प्राप्त भारतीय जवानोंको विनम्रतापूर्ण श्रद्धांजली! शहिद जवानोंकी शहादत व्यर्थ नही जायेगी. शहीद जवानोंके परिजन के साथ भारत सरकार और सारे भारतीय खडे है! pic.twitter.com/CGgmW0WE4e — Dr.Ramdas Athawale (@RamdasAthawale) June 17, 2020 -
‘శరద్‌కు కేంద్ర పదవులు’
పట్నా: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎన్డీయేలో చేరితే కేంద్రప్రభుత్వంలో కీలక పదవి లభించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను కూడా శరద్ కలుపుకుపోవాలని అన్నారు. శివసేన–బీజేపీ సంక్షోభం గురించి మాట్లాడుతూ.. రెండు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే, సమస్యలున్నా సర్దుకుపోయి ఉండేవన్నారు. కానీ పరిస్థితి చేజారిందన్నారు. ‘అభినవ చాణక్య’ అమిత్‌షా వేగాన్ని ఆయా పార్టీలు అందుకోలేకపోయాయన్నారు. ఎన్సీపీని తమతో చేర్చుకున్న బీజేపీ.. కాంగ్రెస్, శివసేనలకు షాకిచ్చిందని చెప్పారు. మరోవైపు బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ బీజేపీ–ఎన్సీపీ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజును విజయ్ దివాస్‌గా జరుపుకుంటామన్నారు. -
సేనకు సీఎం పీఠం ఇవ్వాలి: కేంద్రమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కేంద్రమంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రామ్‌దాస్ అంథ్‌వాలే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎం పదవిని శివసేనకు ఇచ్చేలా బీజేపీ నాయకత్వంలో ఆలోచన చేయాలని సలహా ఇచ్చారు. శివసేనకు కొన్నేళ్ల పాటు సీఎం పదవిని ఇచ్చి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై చర్చిచేందుకు ఆదివారం ఎన్డీయే పక్షాలు ఢిల్లీలోభేటీ అయ్యాయి. ఈ సమావేశం అనంతరం అంథ్‌వాలే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం పీఠాన్ని శివసేనకు ఇవ్వడంలో తప్పేమీలేదని అన్నారు. దీనిపై బీజేపీ మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా సీఎం పీఠం పంపకంపై మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన మధ్య విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందుకు కూటమిగా పోటీచేసిన రెండు పార్టీలు అనంతరం పదవుల పంపకాలపై పట్టుబట్టాయి. సీఎం కుర్చీని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన పావులు కదుపుతోంది. -
పాకిస్తాన్‌ను సమర్థిస్తే జైలుకే
సాక్షి, విజయవాడ : జమ్మూకశ్మీర్ విషయంలో ఎవరైతే పాకిస్తాన్‌ను సమర్థిస్తారో వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని కేంద్ర సామాజికన్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి ,రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన పలు విషయాలు వెల్లడించారు. తెలంగాణ విభజన తర్వాత కూడా రిపబ్లికన్ పార్టీ రెండు రాష్ట్రాలలో చైతన్యంగా ఉందని, మా పార్టీకి అన్ని కులాలు సమానమని తెలిపారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఏపీ ప్రెసిడెంట్‌గా బ్రహ్మానందరెడ్డి ఉన్నారని, ప్రజలందరికీ మాపార్టీ దగ్గరవుతోందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ వచ్చిందని, ఏపీలో వైఎస్సార్సీపీ మంచి సంఖ్యలో సీట్లు గెలిచిందన్నారు. ఏపీ సీఎం జగన్ ఈబీసీ కోటాపై సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1,47,857 ఇళ్లు మంజూరు చేశామన్నారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం చాలా మంచిదని, ఇకపై కశ్మీర్లో తీవ్రవాదం తగ్గి పరిశ్రమలు వస్తాయని తెలిపారు. తలాక్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం హర్షణీయన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథీలో ఓడిపోయారు. ఇప్పుడు సోనియాగాంధీ అధ్యక్షురాలైనా ఆ పార్టీలో పెద్దగా మార్పు ఉండదన్నారు. రాబోయే 20 సంవత్సరాలు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. -
ఎన్డీయేలో చేరండి: జేడీఎస్‌కు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఏ క్షణానా ఏ ఎమ్మెల్యే గోడుదూకుతారోనని ఇటు జేడీఎస్ అటు కాంగ్రెస్ నేతల్లో భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శనివారం ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. జేడీఎస్‌ను ఎన్డీయే కూటమిలో చేరవల్సిందిగా ఆహ్వానించారు. ‘‘ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న కుమారస్వామి ప్రభుత్వాన్ని ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్‌కి కటీఫ్ చెప్పి మాతో కలిస్తే డిప్యూటీ సీఎం పదవిని ఇస్తాం. కుమారస్వామి ప్రభుత్వం దినదిన గండంగా గడుస్తోంది. మాతో కలిస్తే జేడీఎస్‌కు మంచి భవిష్యత్ ఉంటుంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ నేతలే కుట్రపన్నుతున్నారు. ప్రజలకు మంచి చేయాలని కుమారస్వామికి ఉన్నా.. దానికి కాంగ్రెస్ అడ్డుపడుతోంది. ఆయన సీఎం అయినప్పటి నుంచి బహిరంగ సభల్లోనే అనేక సార్లు కన్నీరుపెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతలు తీవ్ర వేదనకు గురిచేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. తూమకూరు మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి కూడా స్థానిక హస్తం నేతలే అని రాందాస్ అథవాలే ఆరోపించారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20 చోట్ల, జేడీఎస్ మిగిలిన 8 స్థానాల్లో పోటీచేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య సహకారం, ఓట్ల బదిలీ అనుకున్నంతగా జరగలేదు. మాజీ సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు, కుమారస్వామి నేతృత్వంలోని ఒకరిని మరొకరు విశ్వాసంలోకి తీసుకోలేదు. దీంతో చాలా చోట్ల క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ అన్నది సాఫీగా జరగలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితితో తమ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ఇటు కుమారస్వామి, అటు సిద్దరామయ్య పార్టీ నేతలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాందాస్ అథవాలే వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయం మరింత వేడెక్కనుంది. దీనిపై జేడీఎస్ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు. -
‘ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి షాక్’
సాక్షి, న్యూఢిల్లీ : గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఈసారి మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ సీట్లు వస్తాయని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఎస్సీ-బీఎస్పీ-ఆరెల్డీ కూటమితో యూపీలో బీజేపీకి 10 నుంచి 15 సీట్లు తగ్గుతాయని మహారాష్ట్ర దళిత నేత అంచనా వేశారు. 2014లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్‌తో కలిసి యూపీలోని 80 స్ధానాల్లో 73 స్ధానాలను గెలుచుకుందని, అయితే ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ వేర్వేరుగా పోటీచేశాయని గుర్తుచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆ మూడు పార్టీలు జట్టు కట్టడంతో బీజేపీకి దక్కే స్ధానాలు తగ్గనున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో సైతం 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 5-6 సీట్లు తగ్గుతాయని ఆయన అంచనా వేశారు. కాగా ఈ రెండు రాష్ట్రాల్లో తగ్గే స్ధానాలను బీజేపీ పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో భర్తీ చేస్తుందని, ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి గణనీయంగా లోక్‌సభ స్ధానాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అధికార పగ్గాలు చేపడతారని జోస్యం చెప్పారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విస్పష్ట మెజారిటీతో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని శివసేన నేత సంజయ్ రౌత్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
ప్యాకేజీకి ఒప్పుకున్నది చంద్రబాబే
సాక్షి, అమరావతి : ఆయనో దళిత ఉద్యమకారుడు. కార్మిక సంఘం నాయకుడిగా.. జర్నలిస్టుగా.. రాజకీయ నేతగా.. అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్రంలో సామాజిక న్యాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ వచ్చిన ఆయన.. ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే.. వైఎస్సార్ సీపీ విజయం ఖాయం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నది ముఖ్యమంత్రి చంద్రబాబే కదా. ప్యాకేజీని ఆహ్వానించి తర్వాత ప్లేటు ఫిరాయించారు. ఏపీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందా? ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారా? అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. నాలుగేళ్లు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చంద్రబాబు ఉన్నారు. మంత్రివర్గంలో టీడీపీ ఎంపీలూ భాగం పంచుకున్నారు. వారికి తెలియకుండా ఏమీ జరగలేదు. కేంద్రంలో జరిగిన అన్ని వ్యవహారాల్లో వారి భాగస్వామ్యం ఉంది. నాలుగేళ్ల తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందంటే ఎలా? ఎవరు నమ్ముతారు? ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ గెలుస్తుంది. ‘సత్యం’ కేసులో బాబు పాత్రను బయటపెట్టింది నేనే సత్యం రామలింగరాజు కంపెనీలో గూడుపుఠాణీ జరుగుతోందని.. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో సరైన పత్రాలు చూపించకుండా రూ.కోట్ల డిపాజిట్లు వేసినట్టు ఐటీ శాఖ గుర్తించిందని పేర్కొంటూ 2003 ఆగస్టు 18న సెబీ (సెక్యూరిటీ అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా)కి లేఖ రాశాను. లోక్‌సభలోనూ ఇదే విషయాన్ని నేను లేవనెత్తాను. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. సత్యం కంపెనీ యజమాని రామలింగరాజు మధ్య ఉన్న సంబంధాలను ప్రస్తావించాను. ‘సత్యం’ కుంభకోణానికి బీజాలు పడుతున్న దశలో నేను లోక్‌సభలో ప్రస్తావించాను. విచారణ జరిపించాలని డిమాండ్ చేసినా.. ఈ దిశగా చర్యలు చేపట్టలేదు. విచారణ జరగకుండా అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అడ్డుపడ్డారు. స్కాముల చంద్రబాబు గురించి తొలుత హెచ్చరించింది నేనే. వైఎస్సార్ గొప్పనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు నేను కూడా ఎంపీగా ఉన్నా. ఆయనతో నాకు పరిచయం ఉంది. గొప్ప నాయకుడు. నిరంతరం ప్రజల గురించి ఆలోచించే మనిషి. మాయావతి పోటీలో ఉన్నా.. ఓట్లు చీలవు ‘దళితుల ఓట్లు చంద్రబాబుకు వెళ్లవు. దళితుల అభ్యున్నతికి ఆయన ఏం చేశారని వారంతా ఓట్లేస్తారు? కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా ప్రచారం చేసుకోవడం తప్ప చంద్రబాబు దళితులకు చేసిందేమీ లేదు. మాయావతి ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో పొత్తు పెట్టు కుని పోటీ చేస్తున్నారు. ఆ పార్టీకి దళితుల ఓట్లు పడవు. చివరకు మాయావతి పోటీలో ఉన్నా.. దళితుల ఓట్లు చీలవు. టీడీపీకి గట్టిపోటీ ఇస్తున్న పార్టీ (వైఎస్సార్ సీపీ)కే దళితులు ఓట్లేస్తారు.’ ఐటీ దాడులంటే భయమెందుకు? ఆదాయపు పన్ను కట్టలేదనే అనుమానం ఉంటే ఐటీ అధికారులు దాడులు చేస్తారు. అది వారి డ్యూటీ. ఐటీ దాడులకు, ప్రభుత్వానికి సంబంధం లేదు. అధికారులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తారు. ఆదాయపు పన్ను చెల్లించి ఉంటే, వ్యాపారాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ ఐటీ శాఖకు చూపించి ఉంటే.. ఇక భయమెందుకు? ప్రభుత్వ ప్రతినిధిగా చెబుతున్నా.. టీడీపీ వ్యాపారుల (నాయకుల)పై జరుగుతున్న ఐటీ దాడులకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ముఖ్యమంత్రి ధర్నా ఎలా చేస్తారు? పన్నులు చెల్లించని వ్యాపారుల మీద ఐటీ అధికారులు దాడులు చేయకుండా ఉండాలంటే.. పన్నులు సక్రమంగా చెల్లించమని చంద్రబాబు వారి పార్టీ నాయకులకు సూచిస్తే సరిపోతుంది. -
మీ ఖాతాల్లోకి ఆ 15 లక్షలు వచ్చేస్తాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో నల్లధనాన్ని భారత్‌కు రప్పిస్తే ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ 15 లక్షలు జమచేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాందాస్ అథవలే స్పందించారు. విపక్షాలు పదేపదే ఈ హామీ గురించి మోదీని టార్గెట్ చేస్తున్న క్రమంలో కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి ఖాతాలోకి రూ 15 లక్షలు ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా చేరుతాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదని, ఆర్బీఐని నిధులు సమకూర్చాలని కోరితే ఇవ్వడం లేదని చెప్పారు. అందుకే అంతమొత్తం సమీకరించలేకపోయామన్నారు. ఆర్బీఐ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చినా సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయన్నారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంపై అథవలే వ్యాఖ్యానిస్తూ కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపొందినా, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మోదీ తిరిగి ప్రధాని అవుతారన్నారు. -
అట్రాసిటీ చట్ట పరిరక్షణకు ఆర్డినెన్స్: అథవాలే
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించేందుకు త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకొస్తామని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతిపై శనివారం ఆయన ఇక్కడ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై త్వరలో ప్రధాని మోదీతో మాట్లాడతానన్నారు. ఓబీసీ వర్గీకరణపై అధ్యయనం జరుగుతోందని, ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకమైనా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపడి ఎన్డీఏ నుంచి తప్పుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఎన్డీయేలోనే కొనసాగి ఉంటే ప్రత్యేక హోదా అంశంపై మోదీ సానుకూలంగా స్పందించే వారని పేర్కొన్నారు. పార్టీని రక్షించుకోలేని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని రక్షిస్తానని చెప్పటం హాస్యాస్పదమని రాందాస్ ఎద్దేవా చేశారు. -
రాహుల్...దళిత యువతిని పెళ్లాడు!
ముంబై: దళిత మహిళను వివాహం చేసుకోవాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. ఆయన కోసం అవసరమైతే జోడీని వెతకడానికి సాయం చేస్తానని అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రాహుల్... విధి తలచినప్పుడే తనకు వివాహమవుతుందని వ్యాఖ్యానించడం తెలిసిందే. ‘రాహుల్ అప్పుడప్పుడు దళితుల ఇళ్లలోకి వెళ్లి వారితో కలసి భోజనం చేస్తున్నారు. ఆయన దళిత మహిళను వివాహం చేసుకుంటే మంచిది. అవసరమైతే, వధువును వెతకడానికి సాయం చేస్తా’ అని అథవాలే అన్నారు. ఆయన దేశానికి ఆదర్శంగా ఉండాలనే కులాంతర వివాహాన్ని ప్రతిపాదిస్తున్నానన్నారు. రాహుల్ ఇక ‘పప్పు’ కాదని, ఇప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలు మెరుగయ్యాయని కితాబిచ్చారు. -
సీటే ముఖ్యం.. పార్టీ కాదు
పింప్రి, న్యూస్‌లైన్ : సీటే ముఖ్యం.. పార్టీ కాదు.. అన్నట్టుగా అభ్యర్థులు ఉన్నారు. ఇన్నాళ్లు పార్టీల జెండాలను మోయడానికే పరిమితమైన రెండవ తరగతి నాయకులకు తమ పార్టీ టెక్కెట్ ఇవ్వక పోవడంతో గుర్తింపు పొందిన పార్టీలో చేరి ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ-రిపబ్లికన్ మధ్య పొత్తు ఉండేనా.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తోనే ఉండాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అధ్యక్షుడు రాందాస్ అఠావలే ప్రకటించినా ఆ పార్టీ అభ్యర్థులు అనేక మంది పలు నియోజక వర్గాల్లో నామినేషన్లు వేశారు. పుణే లోని వడగావ్ శేరి నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దిలీప్ కాంబ్లే నామినేషన్ వేయగా ఆర్పీఐ నుంచి నవనాథ్ కాంబ్లే పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ తుదివరకు పోటీకి నిలబడుతుందో వేచి చూడాలి. ఆయా పార్టీ నాయకుల మాటలను అభ్యర్థులు ఎంత వరకు పాటిస్తారో? అధినాయకత్వం వీరిపై ఏ చర్యలు తీసుకోనుందో తేలాల్సి ఉంది.? మూడు పార్టీలు మారిన జగతాప్... ఐదేళ్ల కిందట చించ్వడ్ నుంచి కాంగ్రెస్‌కు సీటు లభించలేదు. పొత్తులో భాగంగా ఎన్సీపీకి సీట్ కేటాయించారు. దీంతో లక్ష్మణ్ జగతాప్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా మావల్ నుంచి శేత్గారి కామ్‌గార్ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. తిరిగి ఎన్సీపీ గూటికి చేరుతాడన్న ఊహాగానాలు ఉండగా, చివరికి బీజేపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ అభ్యర్థిగా చించ్వడ్ అసెంబ్లీ నుంచి నామినేషన్ వేశారు. పార్టీలు మారిన నాయకులు... పుణే మాజీ ఉప మేయర్ దీపక్ మానకర్ కాంగ్రెస్‌ను వీడి ఎన్సీపీ నుంచి నామినేషన్ వేయగా, గతంలో ఎన్సీపీ నుంచి పోటీ చేసిన సచిన్ తావరే శివసేన పార్టీ అభ్యర్థిగా ఈసారి పోటీ చేస్తున్నారు. శివసేన మాజీ ఎమ్మెల్యే శరద్ డమాలే ఈసారి భోర్ బీజేపీ అభ్యర్థిగా నిలిచారు. బీజేపీకి చెందిన కార్పొరేటర్ మిలింద్ ఏక్బోటే శివాజీనగర్ నుంచి శివసేన తరఫున పోటీ చేస్తున్నారు. ఆంబేగావ్లో శివసేన ఎంపీ శివాజీరావు ఆడల్రావుకు కుడి భుజంగా ఉన్న జైసింగ్ ఎరండే బీజేపీలోకి వెళ్లి పోటీ చేస్తున్నారు. జున్నర్‌లో శివసేన మాజీ పంచాయతీ సమితి సభ్యుడు నేతాజీ డోకే బీజేపీ అభ్యర్థిగా అవతారమెత్తారు. శివాజీ నగర్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ దత్తా బహరట్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగించడం, ఓటర్ల మనస్సు గెలుచుకోవడం, అభ్యర్థులకు ఈసారి కత్తిమీద సాముగా మారనుంది. -
24 గంటలు గడవకముందే చిచ్చు
సాక్షి, ముంబై: మహాకూటమిలోకి స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ చేరి 24 గంటలు గడవకముందే లోక్‌సభ సీట్ల పంపకంపై చిచ్చు మొదలైంది. ఆ పార్టీ నాయకుడు, ఎంపీ రాజు శెట్టి మంగళవారం మహాకూటమిలో చేరిన సంగతి తెలిసిందే. పశ్చిమ మహారాష్ట్రలో రైతుల సమస్యలపై పోరాడుతున్న శెట్టికి అక్కడ మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించిన మహాకూటమి నాయకులు శెట్టితో సంప్రదింపులు జరిపి తమలో చేర్చుకున్నారు. అంతవరకూ బాగానే ఉన్నప్నటికీ సీట్ల పంపకాల విషయంలో అప్పుడే రగడ మొదలైంది. స్వాభిమాన్ కంటే తమ పార్టీ పెద్దదని, అందువల్ల ఆ పార్టీకి రెండు సీట్లు కేటాయిస్తే తమకు కనీసం మూడు లోక్‌సభ స్థానాలు ఇవ్వాలంటూ ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. మరోవైపు ఆర్పీఐకి ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై బీజేపీ, శివసేనలు ఇప్పటికే మల్లగుల్లాలు పడుతుండగా స్వాభిమాన్కంటే తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఆర్పీఐ డిమాండ్ చేయడం మహాకూటమికి తలనొప్పిగా పరిణమించింది. ఇది మున్ముందు మరింత జటిలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. -
‘ముంబై మెట్రోగా మార్చండి’
ముంబై: అత్యంత ప్రతిష్టాత్మకమైన సిటీ మెట్రోకి ‘రిలయన్స్ మెట్రో’గా నామకరణం చేయడంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ ముంబై మెట్రోగా మార్చాలని డిమాండ్‌చేస్తూ బుధవారం స్థానిక అంధేరీ ప్రాంతంలోని మెట్రో స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రాందాస్ అథవాలే మాట్లాడుతూ మెట్రో రైళ్లు, ప్లాట్‌ఫాంలపై రిలయన్స్ మెట్రో అని రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు బదులు ముంబై మెట్రో అని రాయాలన్నారు. ఏడురోజుల్లోగా అవసరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్‌తోపాటు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారులను ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
నాలుగు ఎంపీ సీట్లు కావాలి: ఆర్పీఐ
ముంబై: తదుపరి ఎన్నికల్లో తమ పార్టీకి ఒక రాజ్యసభ స్థానంతోపాటు మూడు ఎంపీ సీట్లు కేటాయించాలని తాము డిమాండ్ చేశామని ఆర్పీఐ అధినేత రాందాస్ అథవాలే పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించేందుకు మహాకూటమి సుముఖత వ్యక్తం చేసిందని, అయితే ఈ నెల 14వ తేదీన జరగనున్న బీజేపీ, శివసేన, ఆర్‌పీఐలతోపాటు కొత్తగా చేరిన స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ నేతృత్వంలోని మహాకూటమి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. శివసేన నాయకుడు ఉద్ధవ్‌ఠాక్రే రాష్ర్ట బీజేపీ నాయకులతోపాటు జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌లతో చర్చలు జరుపుతున్నారన్నారు. బీజేపీ, శివసేన, ఆర్పీఐల, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ నేతృత్వంలోని మహాకూటమి తాజాగా పీజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీతోనూ సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవార్‌కు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో పోటీచేసిన రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ నాయకుడు మహాదేవ్ జంకార్ కాషాయకూటమిలో భాగస్వామేనన్నారు. -
హంగ్ కోరుకుంటున్నారు
కొల్హాపూర్: వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత హంగ్ రావాలని ఎన్సీపీ అధ్యక్షుడు, శరద్‌పవార్ కోరు కుంటున్నారని బీజేపీ అగ్ర నాయకుడు గోపీనాథ్ ముండే ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీకిగానీ లేదా ఏ కూటమికిగానీ స్పష్టమైన మెజారిటీ రాకూడదని పవార్ అభిలషిస్తున్నారని విమర్శించారు. యూపీఏకిగానీ లేదా ఎన్డీయేకిగానీ మెజారిటీ రాకూడదనేదే ఆయన అభిమతమన్నారు. ఆ విధంగా జరిగితే ప్రధానమంత్రి పదవిని తాను చేపట్టొచ్చనేదే ఆయన అసలు ఉద్దేశమన్నారు. విజేతగా నిలిచే కూటమికి ఎనిమిది లేదా తొమ్మిది స్థానాలు తక్కువ రావాలని పవార్ కోరుకుంటున్నారన్నారు. అయితే ఆయన కలలు ఎన్నటికీ సాకారం కావన్నారు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సొంత పార్టీకి చెందిన నాయకులపై ఆయనఒత్తిడి చేస్తున్నారన్నారు. తద్వారా తన బంధువైన అజిత్‌పవార్‌కు రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే కూడా పాల్గొన్నారు. -
‘కాషాయం’ మెరిసేనా..!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో గత 15 సంవత్సరాల కాలంలో మూడు పర్యాయాలు అధికారాన్ని దక్కిం చుకోవడంలో విఫలమైన శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమి నాలుగోసారి అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని కఠిన నిర్ణయం తీసుకుంది. అందుకు మిత్రపక్షాల నాయకులతో కలిసి కొత్త వ్యూహం పన్నాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే యోచిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కాషా య కూటమిలోని శివసేన, బీజేపీ కలిసి పోటీచేశాయి. కాని ఆశించిన మేర మెజారిటీ సాధించకపోవడంతో అధికారాన్ని దక్కించుకోలేకపోయాయి. కాని ప్రస్తుతం కాషాయకూటమితో రాందాస్ ఆఠవలే వర్గానికి చెందిన ఆర్పీఐ జతకట్టడంతో ఇది మహాకూటమిగా అవతరించింది. ఆఠవలే శివసేన, బీజేపీతో జతకట్టిన తర్వాత శాసనసభ ఎన్నికలు రావడం ఇదే ప్రథమం. దీంతో మహాకూటమి ఎమ్మెల్యేలందరూ ఒక నిర్ణయానికి వచ్చి వారే కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారని బీజేపీ నాయకులు చెప్పారు. గతంలో బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే విషయంలో మొదట్లోనే విభేదాలు పొడసూపి, పరోక్షంగా రెండుపార్టీలు ఒకదానికొకటి నష్టపరుచుకోవడంతో మూడు పర్యాయాలుగా ఆ కూటమి అధికారంలోకి రాకుండా పోతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కూటమిలో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి లాభించేవని, ఇకపై అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని శివసేన నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని శాసనసభ్యులే ఎంపిక చేసుకుంటారని శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే చేసిన ప్రతిపాదనకు బీజేపే వర్గాలు స్పం దించాయి. అంతేకాకుండా ఇక నుంచి ఎలాంటి ఆం దోళనలు, సభలు, ర్యాలీలు చేపట్టాలంటే ఉమ్మడిగా నిర్వహించాలని మహాకూటమి ఇదివరకే నిర్ణ యం తీసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కూడా అనవసరంగా వివాదం తలెత్తకూడదనే ఉద్దేశంతో ఉద్ధవ్ ఈ బృహత్తర నిర్ణయం తీసుకున్నారు. కాగా మహా రాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలుండగా ఇందులో గత ఎన్నికల్లో 171 స్థానాల్లో శివసేన, 117 స్థానాల్లో బీజేపీ పోటీచేసింది. గత శాసనసభ ఎన్నికల్లో బీజే పీ తక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ శివసేన కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. కేవలం ఇద్ద రు ఎమ్మెల్యేలను ఎక్కువ గెలిపించుకోవడంతో విధాన సభలో ప్రతిపక్ష పదవి బీజేపీకి వచ్చింది. 48 లోక్‌సభ స్థానాల్లో శివసేన, బీజేపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాని శాసనసభ ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పదవి దక్కాలనే దురుద్దేశంతోనే పరోక్షంగా ఒకరి కాలు మరొకరు లాక్కుంటున్నారు. అయితే 2014లో జరిగే ఎన్నికల్లో మహాకూటమి నాయకులు విబేదాలు పక్కన బెడితే తప్ప అధికారంలోకి వచ్చే సూచనలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘మహా’ సంగ్రామానికి సిద్ధం
సాక్షి, ముంబై: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాస్వామ కూటమి (డీఎఫ్)ని గద్దె దింపేందుకు శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమి సిద్ధంగా ఉందని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే మరోసారి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ మహాకూటమి నుంచి బయటకు రాదని బుధవారం మీడియాకు తెలిపారు. వచ్చే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో డీఎఫ్ కూటమి పరాజయం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. మూడు లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానం కావాలని అడుగుతున్నామన్నారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల సర్దుబాటుపై శివసేన, బీజేపీ నాయకులతో అఠవలే ప్రాథమిక చర్చలు జరిపాం. గతంలో తాము ఇరు పార్టీల నాయకులతో ఏడు లోక్‌సభ స్థానాలు కావాలని కోరాం. కానీ కాషాయ కూటమి నాయకులతో చర్చలు జరిపిన తర్వాత పట్టు సడలించి మూడు స్థానాలు కావాల’ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఏ పార్టీ తమకు ఎన్ని స్థానాలు ఇవ్వనుంది...? అవి ఏ నియోజక వర్గానివో...? వచ్చే వారంలో కాషాయకూటమి నాయకులతో చర్చలు జరిపిన తర్వాత తెలుస్తుందని అథవాలే స్పష్టం చేశారు. పుణే, లాతూర్, సాతార, వర్ధా, రామ్టేక్ తదితర నియోజక వర్గాలు ఆర్పీఐకీ అనుకూలంగా ఉన్నాయని, ఇక్కడి నుంచి పోటీచేస్తే ఆర్పీఐని విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దళితుల ఓట్లపై కన్నేసిన డీఎఫ్ కూటమి ప్రకాశ్ అంబేద్కర్‌కు చెందిన బీఆర్పీ, జితేంద్ర కవాడేకు చెందిన పీఆర్పీలను అక్కున చేర్చుకుందన్నారు. అయితే వారి ప్రభావం మహాకూటమిపై ఉండదన్నారు. ఆర్పీఐ కాషాయకూటమిలో చేరే ముందు ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో అంబేద్కర్, కవాడేలు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నప్పటికీ దళితులు మాత్రం తమతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనుకుంటున్నానని, అయితే రాజ్యసభకు వెళ్లాలని పార్టీ కార్యకర్తలు పట్టుబడుతున్నారని చెప్పారు. దీంతో వచ్చే వారంలో శివసేన, బీజేపీ నాయకులతో జరిగే చర్చల్లో సీట్ల సర్దుబాటు, రాజ్యసభ సీటు తదితర అంశాలపై చర్చిస్తామని, ఆ తర్వాత తుది నిర్ణయం ఉంటుందన్నారు. -
బీఎస్పీతో పొత్తుకు రెడీ
సాక్షి, ముంబై: శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమితో జతకట్టినప్పటికీ ఆశించివేమీ దొరక్కపోవడంతో అసంతృప్తికి గురైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే ప్రత్యామ్నాయాల మార్గాల వేటలోపడ్డారు. శివసేన, బీజేపీతో తెగతెంపులు చేసుకోకుండానే బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)తో పొత్తులు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై బీఎస్పీ అధినేత్రి మాయవతితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఠవలే స్పష్టం చేశారు. అఠవలే ప్రతిపాదన పై మాయవతే తుదినిర్ణయం తీసుకుంటారని బీఎస్పీ ప్రదేశ్ అధ్యక్షుడు విలాస్ గరుడ్ అన్నారు. శివసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తరువాత మొదటిసారిగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అఠవలే డిమాండ్ చేసిన స్థానాలను ఆర్పీఐకి కేటాయించేందుకు సేన, బీజేపీలో ఏ ఒక్కటీ సిద్ధంగా లేదు. క నీసం తనను రాజ్యసభకు పంపించాలన్న ఆఠవలే అభ్యర్థననూ పట్టించుకోలేదు. దీంతో కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న అఠవలే కాషాయకూటమితో తెగతెంపులు చేసుకుంటామని ఇది వరకే హెచ్చరించారు. ఈనెల మూడో తేదీన ఔరంగాబాద్‌లో జరిగిన ఆర్పీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ బీఎస్పీతో జతకట్టనున్నట్లు సూచనాప్రాయంగా వెల్లడించారు. దళిత-బహుజన సమాజం ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే జాతీయస్థాయిలో బీఎస్పీ, ఆర్పీఐ ఒక తాటిపైకి రావల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బీఎస్పీ జాతీయ పార్టీ. వివిధ రాష్ట్రాల్లో దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్పీఐకి సైతం అనేక రాష్ట్రాలలో యూనియన్లు ఉన్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు ఒకేతాటిపైకి వస్తే దళితవర్గం రాజకీయంగా, సామాజికంగా మరింత బలపడుతుందని ఆఠవలే అభిప్రాయపడ్డారు. 1996లో పుణేలో జరిగిన ఆర్పీఐ సమావేశంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకుందామని ప్రతిపాదిం చారు. అనివార్య కారణాలవల్ల అప్పుడు పొత్తు కుదుర్చుకోలేకపోయామని ఆఠవలే అన్నారు. ఆ కల నెరవేరడానికి ఇప్పుడు సమయం దగ్గరపడిందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై త్వరలో బీఎస్పీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, ఎంపీ వీరసింహ్తో చర్చిస్తానని ప్రకటించారు. తదనంతరం మాయవతితో కూడా చర్చలు జరుపుతానని అఠవలే పేర్కొన్నారు. ఆర్పీఐ ప్రతిపాదనపై మాయవతి ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి. -
పుణే సీటిస్తే పోటీ చేస్తా: అథవాలే
పింప్రి, న్యూస్‌లైన్: దళితుల సంఖ్య అధికంగా ఉన్న పుణే సీటును రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)కు కేటాయించాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనలను కోరారు. అవకాశమిస్తే తానే పోటీచేస్తానని స్పష్టం చేశారు. పుణేలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 30 నుంచి 35, లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు, ఐదు సీట్లను కేటాయించాలని మహాకూటమిలో మిత్రపక్షాలైన శివసేన, బీజేపీలను కోరుతామన్నారు. దీనిపై త్వరలో జరగబోయే మహాకూటమి సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని నిప్పులు చెరిగారు. దళితులపై నేటికి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అట్రాసిటి యాక్ట్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. దళితులకు అన్యాయం జరుగుతోందని, అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న అంశంపై త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలలో దళిత పరిషత్‌ను ఏర్పాటుచేయనున్నట్లు అథవలే పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర ఆర్పీఐ అధ్యక్షులు మహేంద్ర కాంబ్లే, ఎం.డి.శేవాలే, నగర కార్పొరేటర్లు డాక్టర్ సిద్ధార్థ్ దేండే, మహేష్ షిండే తదితరులు పాల్గొన్నారు.