సాక్షి, ముంబై: రాష్ట్రంలో గత 15 సంవత్సరాల కాలంలో మూడు పర్యాయాలు అధికారాన్ని దక్కిం చుకోవడంలో విఫలమైన శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమి నాలుగోసారి అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని కఠిన నిర్ణయం తీసుకుంది. అందుకు మిత్రపక్షాల నాయకులతో కలిసి కొత్త వ్యూహం పన్నాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే యోచిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కాషా య కూటమిలోని శివసేన, బీజేపీ కలిసి పోటీచేశాయి. కాని ఆశించిన మేర మెజారిటీ సాధించకపోవడంతో అధికారాన్ని దక్కించుకోలేకపోయాయి. కాని ప్రస్తుతం కాషాయకూటమితో రాందాస్ ఆఠవలే వర్గానికి చెందిన ఆర్పీఐ జతకట్టడంతో ఇది మహాకూటమిగా అవతరించింది.
ఆఠవలే శివసేన, బీజేపీతో జతకట్టిన తర్వాత శాసనసభ ఎన్నికలు రావడం ఇదే ప్రథమం. దీంతో మహాకూటమి ఎమ్మెల్యేలందరూ ఒక నిర్ణయానికి వచ్చి వారే కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారని బీజేపీ నాయకులు చెప్పారు. గతంలో బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే విషయంలో మొదట్లోనే విభేదాలు పొడసూపి, పరోక్షంగా రెండుపార్టీలు ఒకదానికొకటి నష్టపరుచుకోవడంతో మూడు పర్యాయాలుగా ఆ కూటమి అధికారంలోకి రాకుండా పోతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కూటమిలో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి లాభించేవని, ఇకపై అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని శివసేన నిర్ణయించింది.
ఈమేరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని శాసనసభ్యులే ఎంపిక చేసుకుంటారని శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే చేసిన ప్రతిపాదనకు బీజేపే వర్గాలు స్పం దించాయి. అంతేకాకుండా ఇక నుంచి ఎలాంటి ఆం దోళనలు, సభలు, ర్యాలీలు చేపట్టాలంటే ఉమ్మడిగా నిర్వహించాలని మహాకూటమి ఇదివరకే నిర్ణ యం తీసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కూడా అనవసరంగా వివాదం తలెత్తకూడదనే ఉద్దేశంతో ఉద్ధవ్ ఈ బృహత్తర నిర్ణయం తీసుకున్నారు. కాగా మహా రాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలుండగా ఇందులో గత ఎన్నికల్లో 171 స్థానాల్లో శివసేన, 117 స్థానాల్లో బీజేపీ పోటీచేసింది. గత శాసనసభ ఎన్నికల్లో బీజే పీ తక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ శివసేన కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది.
కేవలం ఇద్ద రు ఎమ్మెల్యేలను ఎక్కువ గెలిపించుకోవడంతో విధాన సభలో ప్రతిపక్ష పదవి బీజేపీకి వచ్చింది. 48 లోక్‌సభ స్థానాల్లో శివసేన, బీజేపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాని శాసనసభ ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పదవి దక్కాలనే దురుద్దేశంతోనే పరోక్షంగా ఒకరి కాలు మరొకరు లాక్కుంటున్నారు. అయితే 2014లో జరిగే ఎన్నికల్లో మహాకూటమి నాయకులు విబేదాలు పక్కన బెడితే తప్ప అధికారంలోకి వచ్చే సూచనలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.
‘కాషాయం’ మెరిసేనా..!
Published Sun, Nov 17 2013 11:56 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement