సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో నల్లధనాన్ని భారత్‌కు రప్పిస్తే ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ 15 లక్షలు జమచేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాందాస్ అథవలే స్పందించారు. విపక్షాలు పదేపదే ఈ హామీ గురించి మోదీని టార్గెట్ చేస్తున్న క్రమంలో కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతి ఒక్కరి ఖాతాలోకి రూ 15 లక్షలు ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా చేరుతాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదని, ఆర్బీఐని నిధులు సమకూర్చాలని కోరితే ఇవ్వడం లేదని చెప్పారు. అందుకే అంతమొత్తం సమీకరించలేకపోయామన్నారు. ఆర్బీఐ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చినా సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయన్నారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంపై అథవలే వ్యాఖ్యానిస్తూ కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపొందినా, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మోదీ తిరిగి ప్రధాని అవుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment