ముంబై: దళిత మహిళను వివాహం చేసుకోవాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. ఆయన కోసం అవసరమైతే జోడీని వెతకడానికి సాయం చేస్తానని అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రాహుల్... విధి తలచినప్పుడే తనకు వివాహమవుతుందని వ్యాఖ్యానించడం తెలిసిందే.
‘రాహుల్ అప్పుడప్పుడు దళితుల ఇళ్లలోకి వెళ్లి వారితో కలసి భోజనం చేస్తున్నారు. ఆయన దళిత మహిళను వివాహం చేసుకుంటే మంచిది. అవసరమైతే, వధువును వెతకడానికి సాయం చేస్తా’ అని అథవాలే అన్నారు. ఆయన దేశానికి ఆదర్శంగా ఉండాలనే కులాంతర వివాహాన్ని ప్రతిపాదిస్తున్నానన్నారు. రాహుల్ ఇక ‘పప్పు’ కాదని, ఇప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలు మెరుగయ్యాయని కితాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment