సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూపురంలో పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి బస్టాండ్‌లోని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ..' మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు అని ఇక్బాల్ పేర్కొన్నారు. ఏడాదిలోనే మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి'. ఇలాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రాల్లో లేరని ఇతర రాష్ట్రాల ప్రజలు మాట్లాడటంతోనే ఆయన విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని తేలిపోయిందని పేర్కొన్నారు. జననేత సుపరిపాలన చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ' ప్రతిపక్ష పార్టీలను పాతాళానికి తొక్కి వైఎస్సార్ పార్టీ తారాజువ్వాలగా ఎగిరిన రోజు మే 23 . కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ సంక్షేమాలు ఆపలేదని, నవరత్నాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయలేని పనిని, ఇచ్చిన మాటను,ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేరుస్తున్న ఓకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన వాగ్దానాలు ఎప్పటికి అమలు చేయలేడని ప్రతిపక్షాల చేసిన వాఖ్యలను తిప్పికొడుతూ ఏడాదిలోనే చేసి చూపించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎల్లపుడు ఇలాగే ఉండాలని ప్రతిపక్ష పార్టీలు,నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించాలంటూ' తెలిపారు.
ప్రజారంజక నేతగా మారారు
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్‌పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మట్లాడుతూ.. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలు ప్రజలు విశ్వసించడంతో భారీ ఎత్తున విజయాన్ని ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్ 90 శాతం మేరకు హామీలను నెరవేర్చి ప్రజారంజక నేతగా మారారని తెలిపారు. కరోనా కష్టకాలం కావడంతో ప్రజా ప్రయోగ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ.. ' సాధారణ వ్యక్తి అయినా నన్ను వైఎస్ జగన్ ఆశీస్సులతో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో.. ముఖ్యమంత్రి అయ్యాక వాటికే ప్రాధాన్యత ఇచ్చి 90 శాతం మేరకు పూర్తి చేసిన ఘనత జగన్‌కే చెల్లింది. కరోనాను అరికట్టడానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఆమోదయోగ్యంగా ఉన్నాయి'.
Comments
Please login to add a commentAdd a comment