
న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్పను ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. వజూభాయ్ బీజేపీ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘వజూభాయ్ గవర్నర్ కార్యాలయ గౌరవాన్ని దిగజార్చారు. రాజ్యాంగాన్ని అణగదొక్కారు. చట్టాలను దుర్వినియోగం చేసి బీజేపీ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదేశాలతో వజూభాయ్ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. ఆయన రాజ్యాంగ విలువల్ని కాకుం డా బీజేపీ అధిష్టానం ఆదేశాలను పాటించాలని నిర్ణయించుకున్నారు’ అని ట్వీట్ చేశారు.