పాకిస్తాన్‌లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోన్న వేళ పలు పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్ ఆరోపణలు తీవ్రమయ్యాయి. దీంతోపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 40 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ప్రకటించింది. ఈ నెల15వ తేదీన 40 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది.
దేశ 12వ సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతన్న నేపథ్యంలో ఈసీ రీపోలింగ్ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలవడమే గాక పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎన్నికల గుర్తూ రద్దవడంతో స్వతంత్రులుగా బరిలో దిగిన ఆయన మద్దతుదారులు సుమారు 93 స్థానాల్లో విజయం సాధించగా ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్), 54 సీట్లొచ్చిన బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరోసారి చేతులు కలిపాయి. ఇప్పటి వరకు 256 స్థానాల్లో ఈసీ ఫలితాలను విడుదల చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పార్టీల్లో సీట్ల సంఖ్యలో మార్పులు చోటుచేసుకోనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: పాక్‌లో సంకీర్ణం..!
Comments
Please login to add a commentAdd a comment