సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘ పాదయాత్రకు ఫలితం.. గత ఏడాది మే 23 తేది అని ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్సీ వెల్ఫెర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇది కోట్లాది ప్రజల విజయమన్నారు. పేద ప్రజల కడుపు కొట్టి కార్పొరేట్ వర్గాలకు రాష్ట్ర సంపదను దోచిపెట్టడం నుంచి విముక్తి పొందిన రోజు అన్నారు. రాష్ట్రం అనేక వర్గాల్లో వెనుకబడిన నేపథ్యంలో ఆర్థిక స్వావలంబన తీసుకొస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆశలు వమ్ము కాకుండా పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. (దేశ చరిత్రలో ఇది మరచిపోలేని రోజు: అవంతి)
ఎన్నికల మెనిఫేస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా 40 కొత్త పథకాలు ఏడాది పాలనలో ప్రవేశ పెట్టిన ఘటన సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. చంద్రబాబు అధికారంకలో ఉన్నప్పుడూ.. లేనప్పుడూ కూడా ఆయన ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా ప్రజల్ని బాధ పెట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఏడాది పాలన విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రజలకు అబ్ధి చేకురే విధంగా సాగిందని వ్యాఖ్యానించారు. ఎన్నో కష్టాలు పడ్డా, న్యాయస్థానాల ద్వారా వచ్చే చిక్కులు ఎదురైనప్పటికీ ఆయనకు ప్రజల దీవెనలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (కేసీఆర్ దొంగలకు దోచి పెడుతున్నారు: బండి)
Comments
Please login to add a commentAdd a comment