golla Babu Rao
-
సుదీర్ఘ పాదయాత్రకు ఫలితం.. మే 23: ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘ పాదయాత్రకు ఫలితం.. గత ఏడాది మే 23 తేది అని ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్సీ వెల్ఫెర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇది కోట్లాది ప్రజల విజయమన్నారు. పేద ప్రజల కడుపు కొట్టి కార్పొరేట్ వర్గాలకు రాష్ట్ర సంపదను దోచిపెట్టడం నుంచి విముక్తి పొందిన రోజు అన్నారు. రాష్ట్రం అనేక వర్గాల్లో వెనుకబడిన నేపథ్యంలో ఆర్థిక స్వావలంబన తీసుకొస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల ఆశలు వమ్ము కాకుండా పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. (దేశ చరిత్రలో ఇది మరచిపోలేని రోజు: అవంతి) ఎన్నికల మెనిఫేస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా 40 కొత్త పథకాలు ఏడాది పాలనలో ప్రవేశ పెట్టిన ఘటన సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. చంద్రబాబు అధికారంకలో ఉన్నప్పుడూ.. లేనప్పుడూ కూడా ఆయన ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా ప్రజల్ని బాధ పెట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఏడాది పాలన విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రజలకు అబ్ధి చేకురే విధంగా సాగిందని వ్యాఖ్యానించారు. ఎన్నో కష్టాలు పడ్డా, న్యాయస్థానాల ద్వారా వచ్చే చిక్కులు ఎదురైనప్పటికీ ఆయనకు ప్రజల దీవెనలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (కేసీఆర్ దొంగలకు దోచి పెడుతున్నారు: బండి) -
చంద్రబాబుపై నక్కలపల్లి పీఎస్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు
విశాఖపట్నం: దళిత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు నక్కలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రతి సందర్భంలో దళితులను అవమానించడం అలవాటైపోందన్నారు. చదవండి: 'కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టావ్' గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ అనేక సందర్భాల్లో దళితులను హేళన చేస్తూ మాట్లాడారు. ఇప్పటికీ ఆయన వైఖరి మార్చుకోవడం లేదన్నారు. దళిత అధికారిని అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేసు నమోదు చేయకపోతే దళితుల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీలో ఉన్న దళితులు ఇప్పటికైనా చంద్రబాబు నైజం తెలుసుకోవాలన్నారు. చదవండి: విజయకుమార్గాడు మాకు చెబుతాడా! -
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేసింది శూన్యం
-
‘తెలుగుతో పాటు ఆంగ్లం కూడా ముఖ్యమే’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు తెలుగు భాష ఎంత అవసరమో ఆంగ్ల భాష కూడా అంతే అవసరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. విశాఖలోని పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి పాల్గోని లక్ష్మి హోమం, సహస్ర పద్మాహవనం, పూర్ణాహుతి హోమాలను జరిపించారు. ఈ సందర్భంగా ప్రకాష్ విద్యాసంస్థల జాయింట్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్ దంపతులు స్వామివారికి స్వర్ణ పుష్పార్చనను నిర్వహించారు. ఈ క్రమంలో అశేష భక్త జనం విద్యార్థులను ఉద్దేశించి స్వరూప నందేంద్ర స్వామి వారు అనుగ్రహభాషణం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం స్వరూప నందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఆంగ్ల భాషపై జరుగుతున్న చర్చ తనకు అర్థం కాని విధంగా ఉందని, ఈ సృష్టిలో ఎంత ప్రయోజకుడైన గురువు అధరణ వల్లే ప్రయోజకులు అవుతారని వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఈ రోజు గురువవు ఆదరించే విధానం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. భారతదేశంలో ఈ రోజు విశాఖ శారదా పీఠంకు ప్రత్యేక స్థానం ఉందని, ధర్మ పరిరక్షణలోను హిందూ ఆలయాల భూములు కాపాడడంలోనూ న్యాయం కోసం ఎంత పోరాటానికైనా వెనకాడని పీఠంగా శీ శారదా పీఠం ఉందని సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుతో పాటు తుని ఎమ్మెల్యే, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ప్రభుత్వ వీప్ దాడిశెట్టి రాజాలు పాల్గొన్నారు. అనంతరం విద్యాసంస్థల జాయింట్ డైరెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ వీప్, తదితరులు స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు. -
పదవుల కోసం ఇంత నీచ రాజకీయాలా?
వైఎస్సార్ సీపీ నేత గొల్ల బాబూరావు ఆవేదన కోటవురట్ల: పదవుల కోసం పాకులాడి నీచ రాజకీయాలు చేసేవారిని ప్రజలు క్షమించరని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వ్యాఖ్యానించారు. పాములవాకలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కొందరు ఎమ్మెల్యేల టీడీపీలో చేరిని విషయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎంతో విలువ ఇచ్చి కుటుంబసభ్యుల్లా చూసుకుంటే ఇటువంటి నీచానికి దిగజారడం దారుణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనకు పిలిచి అసెంబ్లీ సీటు ఇచ్చారని, ఆయన పేరుతో గెలిచినా పదవిని సైతం త్యజించి మళ్లీ వైఎస్సార్ సీపీ జెండాతో ఉప ఎన్నికకు వెళ్లి అత్యధిక మెజార్టీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాణం ఉన్నంత వరకు మన కోసం ఆలోచించిన వారి వెంటే ఉంటానని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి గెలిచే సత్తా లేక అడ్డదారులు తొక్కుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆయనకు ఆది నుండి మోసాలు చేయడం అలవాటేనన్నారు. మామను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన ఆయన అవే రాజకీయాలను నడుపుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతు కావడంతో ఇక్కడ మైండ్ గేమ్ మొదలెట్టారని విమర్శించారు.