
విశాఖపట్నం: దళిత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు నక్కలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రతి సందర్భంలో దళితులను అవమానించడం అలవాటైపోందన్నారు.
చదవండి: 'కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టావ్'
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ అనేక సందర్భాల్లో దళితులను హేళన చేస్తూ మాట్లాడారు. ఇప్పటికీ ఆయన వైఖరి మార్చుకోవడం లేదన్నారు. దళిత అధికారిని అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేసు నమోదు చేయకపోతే దళితుల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీలో ఉన్న దళితులు ఇప్పటికైనా చంద్రబాబు నైజం తెలుసుకోవాలన్నారు.
చదవండి: విజయకుమార్‌గాడు మాకు చెబుతాడా!