సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు తెలుగు భాష ఎంత అవసరమో ఆంగ్ల భాష కూడా అంతే అవసరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. విశాఖలోని పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి పాల్గోని లక్ష్మి హోమం, సహస్ర పద్మాహవనం, పూర్ణాహుతి హోమాలను జరిపించారు. ఈ సందర్భంగా ప్రకాష్ విద్యాసంస్థల జాయింట్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్ దంపతులు స్వామివారికి స్వర్ణ పుష్పార్చనను నిర్వహించారు. ఈ క్రమంలో అశేష భక్త జనం విద్యార్థులను ఉద్దేశించి స్వరూప నందేంద్ర స్వామి వారు అనుగ్రహభాషణం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం స్వరూప నందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఆంగ్ల భాషపై జరుగుతున్న చర్చ తనకు అర్థం కాని విధంగా ఉందని, ఈ సృష్టిలో ఎంత ప్రయోజకుడైన గురువు అధరణ వల్లే ప్రయోజకులు అవుతారని వ్యాఖ్యానించారు.
విద్యార్థులు ఈ రోజు గురువవు ఆదరించే విధానం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. భారతదేశంలో ఈ రోజు విశాఖ శారదా పీఠంకు ప్రత్యేక స్థానం ఉందని, ధర్మ పరిరక్షణలోను హిందూ ఆలయాల భూములు కాపాడడంలోనూ న్యాయం కోసం ఎంత పోరాటానికైనా వెనకాడని పీఠంగా శీ శారదా పీఠం ఉందని సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుతో పాటు తుని ఎమ్మెల్యే, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ప్రభుత్వ వీప్ దాడిశెట్టి రాజాలు పాల్గొన్నారు. అనంతరం విద్యాసంస్థల జాయింట్ డైరెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ వీప్, తదితరులు స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment