parvata poorna chandra prasad
-
ఆ వార్తలు అవాస్తవం.. నా జీవితకాలం వైఎస్ఆర్సీపీతోనే
-
ఫైల్స్ మోసావ్.. ఎమ్మెల్యే సీటు ఇప్పించారు
సాక్షి, తూర్పుగోదావరి : ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయింది నువ్వు.. నేను కాదు. ఆనాడు తోట సుబ్బారావు వెనుక మావయ్య మావయ్య అంటూ ఫైల్స్ మోసావ్. ఆయనకు ఎంపీ సీటు రావడంతో తన వారిని కాదని నీకు ఎమ్మెల్యే సీటు ఇప్పించారు. తోట సుబ్బారావు వల్లే నీకు అదృష్టం కలిగింది. సీఎం వైఎస్ జగన్ మిమ్మల్ని నమ్మి సీటు ఇస్తే.. టీడీపీకి అమ్ముడు పోయి పార్టీని మోసం చేశారు’ అంటూ మండిపడ్డారు. (‘ఈటలను ఓడించకుంటే నా పేరు కౌశిక్ కాదు’) శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఎం వైఎస్ జగన్ వల్లే నాకు ఎమ్మెల్యే పదవి వచ్చింది. రాష్ట్రంలో దేవాలయాలపై టీడీపీ దాడులు చేయించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తోంది. జరుగుతున్న అవాంఛనీయ సంఘటనల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఎలా అప్రతిష్టపాలు చెయ్యాలని టీడీపీ ఇలాంటి కుయుక్తులు పన్నుతోంది. కుల,మతాలు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేద్దాం అంటే ఎప్పటికీ చెల్లు బాటు కాద’’ని అన్నారు. -
‘తెలుగుతో పాటు ఆంగ్లం కూడా ముఖ్యమే’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు తెలుగు భాష ఎంత అవసరమో ఆంగ్ల భాష కూడా అంతే అవసరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. విశాఖలోని పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి పాల్గోని లక్ష్మి హోమం, సహస్ర పద్మాహవనం, పూర్ణాహుతి హోమాలను జరిపించారు. ఈ సందర్భంగా ప్రకాష్ విద్యాసంస్థల జాయింట్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్ దంపతులు స్వామివారికి స్వర్ణ పుష్పార్చనను నిర్వహించారు. ఈ క్రమంలో అశేష భక్త జనం విద్యార్థులను ఉద్దేశించి స్వరూప నందేంద్ర స్వామి వారు అనుగ్రహభాషణం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం స్వరూప నందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఆంగ్ల భాషపై జరుగుతున్న చర్చ తనకు అర్థం కాని విధంగా ఉందని, ఈ సృష్టిలో ఎంత ప్రయోజకుడైన గురువు అధరణ వల్లే ప్రయోజకులు అవుతారని వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఈ రోజు గురువవు ఆదరించే విధానం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. భారతదేశంలో ఈ రోజు విశాఖ శారదా పీఠంకు ప్రత్యేక స్థానం ఉందని, ధర్మ పరిరక్షణలోను హిందూ ఆలయాల భూములు కాపాడడంలోనూ న్యాయం కోసం ఎంత పోరాటానికైనా వెనకాడని పీఠంగా శీ శారదా పీఠం ఉందని సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుతో పాటు తుని ఎమ్మెల్యే, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ప్రభుత్వ వీప్ దాడిశెట్టి రాజాలు పాల్గొన్నారు. అనంతరం విద్యాసంస్థల జాయింట్ డైరెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ వీప్, తదితరులు స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన పూర్ణ చంద్రప్రసాద్
హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పర్వత పూర్ణ చంద్రప్రసాద్తో పాటు, పీసీసీ అధికార ప్రతినిధి కుమార్ రాజు, పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా వైఎస్ఆర్ సీపీలో చేరారు. కాగా 2014 ఎన్నికల్లో పూర్ణ చంద్రప్రసాద్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు.