వైఎస్ఆర్ సీపీలో చేరిన పూర్ణ చంద్రప్రసాద్
హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పర్వత పూర్ణ చంద్రప్రసాద్తో పాటు, పీసీసీ అధికార ప్రతినిధి కుమార్ రాజు, పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా వైఎస్ఆర్ సీపీలో చేరారు. కాగా 2014 ఎన్నికల్లో పూర్ణ చంద్రప్రసాద్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు.