వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ తీరు
ముస్లిం మైనార్టీలను టార్గెట్ చేస్తున్న వైనం
తెలుగుదేశంపార్టీకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యం
కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలో టీడీపీకి పరోక్ష సహకారం
సాక్షి ప్రతినిధి, కడప: సార్వత్రిక ఎన్నికల పర్వంలో రాజకీయ పక్షాల అపవిత్ర కలయికలు తెరపైకి వస్తున్నాయి. తాము గెలవడం కంటే తమ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదురుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కొనసాగుతున్న మైత్రి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాము ఎటూ గెలవలేం, వైఎస్సార్‌సీపీని నియంత్రించడమే లక్ష్యం కావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటోంది. వెరసి తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.
ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకువచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంతో అభివృద్ధి చేశాం.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. మరోమారు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. తమ పాలనలో లబ్ధి చేకూరి ఉంటేనే ఆశీర్వదించండని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం కోరుతున్నారు. చరిత్రలో తన వల్ల మేలు చేకూరి ఉంటే ఓట్లు వేయండనే రాజకీయ నేత ఇంతవరకూ ఎవరూ లేరని ప్రజలు కొనియాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కుట్రలు, కుయుక్తులతో లబ్ధి పొందాలనే వైఖరిని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీకి గణనీయంగా పట్టు ఉన్న ఓటర్లలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మైనార్టీ ఓట్లు చీల్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.
వ్యూహాత్మకంగానే అఫ్జల్‌ఖాన్ అభ్యర్థిత్వం
జిల్లాలో వైఎస్ కుటుంబం అన్నా, వైఎస్సార్‌సీపీ అన్నా పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారీ్టలు అండగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనేక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే కడపలో రెండు పర్యాయాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎస్‌బి అంజద్‌బాషా విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మరోమారు తలపడుతున్నారు. ఈమారు వైఎస్సార్‌సీపీని ఎన్నికల్లో ఎలాగైనా నియంత్రించాలనే లక్ష్యంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. ఓవైపు విద్వేషాలు రెచ్చగొడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్‌తో చేతులు కలిపింది.
వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం మైనారీ్టల ఓట్లు చీల్చేందుకు శతవిధాలా ప్రయతి్నస్తోంది. ఆమేరకే కడపలో అఫ్జల్‌ఖాన్‌ను కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో దించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అఫ్జల్‌ఖాన్ అభ్యర్థిత్వం ఎంచుకోవడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ముస్లిం మైనార్టీలలో పఠాన్ తెగకు చెందిన వారిని తమ వైపు మరల్చుకోవాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించేందుకు రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కడప శివార్లలోని జయరాజ్ గార్డెన్‌లో తెలుగు కాంగ్రెస్ నేతలు సమావేశమై అఫ్జల్‌ఖాన్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలలో ఎందుకంటే...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ముస్లిం కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరింది. తద్వారా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కడపలో ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు 90వేలు ఉన్నారు. వీరి మద్దతు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీకి కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగా కూడా టీడీపీకి వ్యతిరేకంగా నిలవనున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఓట్లలో చీలిక తీసుకువస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే దిశగా టీడీపీ నాయకులు అడుగులు వేశారు. ఆ మేరకు కాంగ్రెస్ పారీ్టతో చేతులు కలిపి కడపలో అఫ్జల్‌ఖాన్‌ను కాంగ్రెస్‌అభ్యర్థిగా ఎంపిక చేయించారు.
ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పంథాను కొనసాగించారు. ప్రొద్దుటూరులో దాదాపు 45వేలు ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరిలో భారీగా చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో మహమ్మద్ నజీర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాయచోటిలో కూడా అల్లాబ„Š ఎంపిక వెనుక కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చడమే అసలు లక్ష్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇలా అవసరమైన మేరకు సహకరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో నిత్యం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి జిల్లాలో తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు తెర ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment