గుంటూరు, సాక్షి: ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. రెట్టించిన జోష్‌తో కదిలాయి. పోలింగ్ సరళి, మహిళలు..వృద్ధులు.. దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వైఎస్సార్‌సీపీలో ఉత్సాహం ఉరకలేసింది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటూ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
సజ్జల రామకృష్ణారెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిపై ఒక అంచనాకు వచ్చారు. పోటెత్తిన ఓటర్లు.. మహిళలు, వృద్దులు, గ్రామీణులే విజయాన్ని డిసైడ్ చేశారంటున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ 59 నెలల సంక్షేమ పాలనను మెచ్చి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 4 వరకు ఉత్కంఠ అక్కర్లేదంటూ.. ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెబుతున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి.
ఇదీ చదవండి: ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలత
ఇక.. ‘‘ఓ వైపు కవ్వింపులు.. దాడులు.. మరోవైపు అసహనంతో టీడీపీ-జనసేన శ్రేణుల తీరు. పోలింగ్ సరళి మేరకు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతోంది. అసహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాయి ఆ పార్టీ కేడర్‌లు. ఇక ఓటర్లు సైతం ప్రలోభాలకు లొంగలేదు. ఓటమి భయంతో పచ్చ మూకల విధ్వంసకాండ దిగినా ఓటర్లు బెదర్లేదు. పోలింగ్ జరిగిన తీరు, ఉదయాన్నుంచే బారులు తీరిన ఓటర్లే వైఎస్సార్‌సీపీ గెలుపునకు సాక్ష్యం అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు.
Comments
Please login to add a commentAdd a comment