ఫైల్స్ మోసావ్.. ఎమ్మెల్యే సీటు ఇప్పించారు | MLA Parvatha Purna Chandra Prasad Fires On Jyothula Nehru | Sakshi
Sakshi News home page

జ్యోతుల నెహ్రూపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే ఫైర్‌

Published Fri, Sep 18 2020 8:54 PM | Last Updated on Fri, Sep 18 2020 10:09 PM

MLA Parvatha Purna Chandra Prasad Fires On Jyothula Nehru - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయింది నువ్వు.. నేను కాదు. ఆనాడు తోట సుబ్బారావు వెనుక మావయ్య మావయ్య అంటూ ఫైల్స్ మోసావ్. ఆయనకు ఎంపీ సీటు రావడంతో తన వారిని కాదని నీకు ఎమ్మెల్యే సీటు ఇప్పించారు. తోట సుబ్బారావు వల్లే నీకు అదృష్టం కలిగింది. సీఎం వైఎస్ జగన్ మిమ్మల్ని నమ్మి సీటు ఇస్తే.. టీడీపీకి అమ్ముడు పోయి పార్టీని మోసం చేశారు’ అంటూ మండిపడ్డారు. (‘ఈటలను ఓడించకుంటే నా పేరు కౌశిక్‌ కాదు’)

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఎం వైఎస్‌ జగన్ వల్లే నాకు ఎమ్మెల్యే పదవి వచ్చింది. రాష్ట్రంలో దేవాలయాలపై టీడీపీ దాడులు చేయించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తోంది. జరుగుతున్న అవాంఛనీయ సంఘటనల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఎలా అప్రతిష్టపాలు చెయ్యాలని టీడీపీ ఇలాంటి కుయుక్తులు పన్నుతోంది. కుల,మతాలు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేద్దాం అంటే ఎప్పటికీ చెల్లు బాటు కాద’’ని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement