
తూర్పుగోదావరి, జగ్గంపేట: జిల్లాకు చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై మంగళవారం మధ్యాహ్నం విశాఖకు చెందిన ఐటీ అధికారులు దాడి చేశారు. ఆయన స్వగ్రామం ఇర్రిపాక నివాసంలో ఐటీ శాఖాధికారులు మంగళవారం మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించారు. అదే గ్రామంలో మరికొందరి ఇళ్లపై దాడులు జరిగినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించనున్నట్టు ఐటీ వర్గాల ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment