టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు గుండెపోటు | TDP Leader Jyothula Nehru Get Ill | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు గుండెపోటు

Published Mon, Aug 16 2021 9:35 PM | Last Updated on Tue, Aug 17 2021 4:37 PM

TDP Leader Jyothula Nehru Get Ill - Sakshi

జగ్గంపేట: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. పొలంలో ఉండగా సాయంత్రం ఆయనకు గుండెపోటు వచ్చింది. జగ్గంపేట నుంచి వైద్యులు హుటాహుటిన చేరుకుని, ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జగ్గంపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. నెహ్రూకు డాక్టర్‌ రమేష్‌ ఆక్సిజన్‌ అందించి ఉపశమనం కల్పించారు. అనంతరం రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ఆయన అపాయం నుంచి బయటపడ్డారని టీడీపీ నేతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement