సాక్షి, విశాఖపట్నం: ఇటలీ, స్పెయిల్ వంటి దేశాలలో సైతం కరోనా వైరస్ తీవ్రస్థయిలో విజృంభిస్తున్న తరుణంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అనకాపల్లిలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచాన్ని కరోనా ఏవిధంగా వణికిస్తోందో మనం చూస్తూనే ఉన్నామన్నారు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఎక్కడికక్కడ స్తంభించి పోయిన పరిస్థతులు వచ్చాయని పేర్కొన్నారు. ఇక మన రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ స్ధాయిలో కృషి చేస్తున్నారో కూడా మనం చూస్తున్నామన్నారు. వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా ప్రతీ ఇళ్లు జల్లెడ పట్టడానికి అవకాశం ఏర్పడిందని, వాలంటీర్లతో ఏపిలో చేపడుతున్న కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల అప్పులు మిగిల్చిన గత ప్రభుత్వం తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వం మేటర్ పీక్....పబ్లిసిటీ వీక్.. అదే చంద్రబాబు అయితే మేటర్ వీక్...పబ్లిసిటీ పీక్ అని ఎద్దేవా చేశారు. (తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోండి)
ఒకవేళ ఇపుడు చంద్రబాబు ఉంటే ఏ స్ధాయిలో పబ్లిసిటీ చేసుకునేవారో... ఆయన విమర్శలు చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరనా సమయంలోనూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కరకట్ట పారిపోయిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. రాష్ట్రానికి ఆపద వస్తే మీరు హైదరాబాద్ పారిపోతారా? అని ప్రశ్నించారు. బాబు రాష్ట్రానికి పట్టిన 40 ఏళ్ల పొలిటికల్ వైరస్ అని.. కరోనా వైరస్ అయినా కొన్ని నెలల తర్వాత తగ్గుతుంది కానీ చంద్రబాబు వైరస్ చాలా ప్రమాదకరం అని విమర్శించారు. జనతా కర్ఫ్యూ రోజున ఆయన మనవడికి ఇంగ్లీష్ బోధిస్తున్న వీడియో చూశానని, రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం రాకుండా కుట్రలు చేసిన బాబు.. ఆయన మనవడకి సుమతి శతకాలు ఎందుకు బోధించలేదన్నారు. మీరు దీపం... కొడుకు కొవ్వొత్తి.. మనవడు టార్చ్ లైట్ పట్టకున్న మీ ఇంట్లోనే ఐక్యత లేదు ఇక అఖిలపక్షం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు చందాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, హుద్ హుద్ తుఫాన్ నుంచి రాజధాని వరకు చందాలు వసూలు చేసిన ఘనత మీదే అని విమర్శించారు. 2001 సంవత్సరంలో గుజరాత్‌లో భూకంపం వస్తే.. కూడా ఏపి ప్రజలని వదలకుండా చందాలు వసూలు చేసిన మిమల్ని చందాల నాయుడు అంటే బాగుంటుందని విమర్శించారు. (ఆనంద్ మహీంద్ర లుంగీ గిఫ్ట్, హెయిర్ కటింగ్ కష్టాలు)
మీరు, మీ పత్రికలు ఈనాడు, ఆంద్రజ్యోతి కూడా చందాలు వసూలు చేసి ఎపుడైనా లెక్కలు చెప్పారా.. హుద్ హుద్ తుఫాన్ సమయంలో వెయ్యి కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే.. రూ. 600 కోట్లు ఇవ్వలేదా...అందులో రూ. 200 కోట్లతో కూరగాయలు కొనుగోలు చేశామని మీ హోంమంత్రి అసెంబ్లీలో దొంగలెక్కలు చెప్పలేదా అన్నారు. తుఫాన్ సమయంలో విశాఖలో పెట్టుబడులు పెట్టవద్దని మీ ఎంపి మాట్లాడితే.. నోరు ఎందుకు పెగలలేదన్నారు. యుద్దంలో గెలిచినా... ఓడినా వీరుడంటాం...కానీ ఆట మధ్యలో వెళ్లిపోయిన వారిని ఆటలో అరటిపండు అంటామన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్సలు కూడా ఆటలో అరటి పండులాంటివే అని పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన గబ్బిలమని, విశాఖలో కేసులు దాచి పెడుతున్నామని విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి అయ్యన్నకు మందు దొరకక ప్రిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో పాజిటివ్ కేసులు దాచుకోవాల్సిన అవసరం ఏముందని, మీ నాయకుడి మెప్పుకోసం విశాఖపై తప్పుడు వ్యాఖ్యలు చేయోద్దని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment