gudiwada amarnath
-
లోకేష్.. అవన్నీ నీ కళ్లకు కనిపించడం లేదా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్ట్‌లు తమ ప్రభుత్వంలో వచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఏ శాఖ మీదా అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటంబం అని చెప్పారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే. వైఎస్ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్ మీద మాటలాడి లోకేష్ అభాసు పాలయ్యారు. ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారు. 15ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుండేది.ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రిసెర్చ్ సెంటర్, మూలపేట పోర్ట్ నిర్మాణం లోకేష్‌కు కనిపించలేదా?. మెడికల్ కాలేజీలు, భోగాపురం ఎయిర్‌పోర్టు ఎవరి హయాంలో నిర్మాణ పనులు జరిగాయి. ఇన్ఫోసిస్ ఐటీ పరిశ్రమ ఎవరి హయాంలో వచ్చింది. మేము తెచ్చిన టీసీఎస్ మీరు తెచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటంబం. రుషికొండపై అద్భుతమైన భవనం వైఎస్ జగన్ కట్టారు. ఆ భవనాన్ని ప్రధాని, రాష్ట్రపతి అవసరాల కోసం వాడుకోవచ్చు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధానితో లోకేష్ చెప్పించగలరా?. స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పగలరా?. ఈ ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది. వరదలు విపత్తులకు వైఎస్ జగనే కారణం అంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు నేను మంత్రిగా ఉన్న సమయంలో ఒప్పందం జరిగింది. 1300 ఎకరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాజెక్టుకు అన్ని అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చింది. 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారత దేశం నుంచి బల్క్ డ్రగ్ పార్క్ సాధించాము. రైల్వే జోన్‌కు 52 ఎకరాల భూములు జనవరి నెలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. టీడీపీ హయాంలో బకాయిలు పెట్టిన రూ.50వేల కోట్లు వైఎస్ జగన్ చెల్లించారు. అప్పు తెచ్చిన లక్ష 20వేల కోట్లు ఏం చేశారు?.పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతారు అంటున్న లోకేష్, వైఎస్సార్సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమవి అని ఎలా చెప్పుకుంటారు. వాలంటీర్లకు 10వేల రూపాయలు ఇస్తామని ఎలా మేనిఫెస్టో పెట్టారు. గంజాయి రవాణా చేసే ఖైదీలు ఉండాల్సిన సెంట్రల్ జైల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. హోం మంత్రి ముందు తన పేషీలో ఉన్న గంజాయి మొక్కను తొలగించారా లేదా?. రోజుకొక మంత్రి అవినీతి బాగోతం బయటపడుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధమవ్వాలి: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతోందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రైతులకు మద్దుతుగా వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించింది. కూటమికి దోచుకోవడమే కావాలి.. ప్రజలతో సంబంధం లేదన్నారు.విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు , ధర్మశ్రీ, వదురు కళ్యాణి, ఎంపీ తనూజ రాణి, కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్, కాయల వెంకట రెడ్డి, చెంగల వెంకట్రావు, కొండ రాజీవ్, తైనల విజయ కుమార్, చొక్కాకుల వెంకట రావు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.అనంతరం, ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ..‘ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషం. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయం వేదికగా విజయం సాధించామో మళ్ళీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరితో కలిసి ముందుకు సాగాలి. కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు. నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి.జమిలి ఎన్నికలు వస్తాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది. మహిళలకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారు. నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ..‘పార్టీ జిల్లా కార్యాలయం ఎండాడలో ఉంది. నగర పార్టీ కార్యాలయం మద్దిలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేశారు. నగర కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతుంది. రైతు పోరాటానికి విశేషమైన స్పందన లభించింది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైఎస్ జగన్ సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ఆరు నెలల్లో చంద్రబాబు 72వేల కోట్లు అప్పు తెచ్చి, సంక్షేమానికి 200 కోట్లు ఖర్చు చేశారని అన్నారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చాలా సంతోషం. పార్టీ చేసే పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. 27వ తేదీన కరెంట్ చార్జీలు పెంపుపై నిరసన కార్యక్రమం ఉంది. కూటమికి ప్రజలతో సంబంధం లేదు. మీడియాను పట్టుకొని హడావుడి చేస్తోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.అరకు ఎంపీ తనూజ రాణి మాట్లాడుతూ..అందరం కష్టపడి పని చేద్దాం. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. కూటమి పాలనలో నిత్యవసర ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగాయి. వైఎస్సార్సీపీ బలం కార్యకర్తలే అని చెప్పారు. -
కూటమి పాలనలో అప్పు రోజుగా ‘మంగళవారం’: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇదే సమయంలో బీసీలుకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారని చెప్పారు. రాజ్యసభ పదవుల్లో బీసీలకు అవకాశం ఇచ్చారని తెలిపారు.మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విశాఖలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు వైఎస్సార్సీపీ నేతలు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ..‘వెనుక బడిన తరగతుల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారు. బీసీలకు సముచితమైన మార్గం చూపించారు. అలాగే, బీసీలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవుల్లో అగ్రస్థానం కల్పించారు. రాజ్య సభ పదవుల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించారు.పేద వానికి సంక్షేమాన్ని కూటమి పాలన దూరం చేసింది. కూటమి పాలనలో మంగళవారం అప్పు రోజుగా మారింది. ఆరు నెలల పాలనలో 60 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. రాష్ట్రంలో 2.5 లక్షల వాలంటీర్లను తొలగించారు. చంద్రబాబు తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అతీగతీ లేదు. ఒక్క హామీని కూడా ఆరు నెలల కాలంలో నిలబెట్టుకోలేదు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాల ఉసే లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్‌కు ఎలా అంటగడతారు?’
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. రుషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సోమవారం విశాఖలో అమర్నాథ్ మాట్లాడారు.. ‘‘వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్.. ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలి. రుషికొండపై కట్టిన భవనాల్లో వైఎస్ జగన్ ఏమీ ఉండరు. ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి... నాలుగు నెలలు క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారు. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటుంబం మీద బురద జల్లాలని చూడటం ఎంతవరకు సమంజసం? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్ కో..ఆక్రమణలు జరిగింది రుషికొండలో కాదు.. గీతం యూనివర్సిటీలో జరిగాయి. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేది. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండపై శాశ్వత భవనాలు నిర్మించారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలి. రుషికొండ భవనం గురించి మీడియోలు, ఫోటోలు తీసి చూపించారు. అదే సమయంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూపించండి. .. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కట్టిన ఆసుపత్రిని చూపించండి. వాటర్ ప్రాజెక్ట్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం, కురపం కాలేజీ, మూలపేటలో పోర్టు నిర్మాణం, పలు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి అవి చూపించండి. .. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆనాడు ప్రభుత్వధనం ఏమైంది?. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. టీడీపీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. అధికార పార్టీ ఇలాంటివి మానుకోవాలని కోరారు. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టీడీపీ నేతలు గుర్తించాలి’ అంటూ గుడివాడ అమర్నాథ్ వైఎస్సార్సీపీ తరఫున ఎల్లో ముఠాకు కౌంటర్ ఇచ్చారు. -
టికెట్‌పై భయం లేదు.. నా భవిష్యత్తు సీఎం నిర్ణయిస్తారు: మంత్రి అమర్నాథ్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అల్ట్రాటెక్ పరిశ్రమను ప్రారంభించబోతున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రూ. 2,500 కోట్లతో అల్ట్రాటెక్ పరిశ్రమ ఏర్పాటుపై నేడు( బుధశారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించినట్లు పేర్కొన్నారు. తనకు టికెట్ భయం లేదని.. తన భవిష్యత్తును సీఎం నిర్ణయిస్తారని మంత్రి తెలిపారు. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పానని అన్నారు. అంబటి రాయుడు రాజకీయాల్లో ఇమడలేరని అన్నారు మంత్రి అమర్నాథ్. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయాలని, స్టార్లు గ్రౌండ్ లెవల్లో పనిచేయడం కష్టమని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పార్టీ కోసం పనిచేయాల్సిందేనని తెలిపారు. అలా చేయనివారు వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోతేనే మంచిదన్నారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం వస్తుందన్నారు. కాగా దేశంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది. కర్నూలు జిల్లాలోని పెట్నికోట గ్రామం సమీపంలో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది దీనికి పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.2,500 కోట్లు. చదవండి: టీడీపీకి కేశినేని నాని రాజీనామా -
‘బాబు, పవన్.. ప్రజల ముందుకొచ్చి చెప్పే దమ్ముందా?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో జరిగిన బోట్ల అగ్ని ప్రమాదంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వ సాయంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. దత్తపుత్రుడు ఈరోజు 50వేలు, రేపు టీడీపీ నాయకులు లక్ష ఇస్తామని వచ్చారు. రాజకీయం కోసం తప్ప వీరికి ప్రజలపై ప్రేమ లేదని ఘాటు విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, మంత్రి అమర్నాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ రావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించలేరు. సీఎం ఎక్కడ నుంచైనా ప్రజల కోసం పాలన సాగించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో, అంతక ముందు గానీ విశాఖను రాజధాని చేయాలన్న ప్రతిపాదన ఉంది. సీఎం జగన్ వైజాగ్ వస్తే తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం పోతుందన్న భయంలో టీడీపీ ఉంది. సీఎం జగన్ రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగడం వీరికి నచ్చదు. అందుకే విశాఖ నుంచి పాలనపై విషం చిమ్ముతున్నారు. ఉత్తరాంధ్రకు మంచి భవిష్యత్తు తీసుకువస్తున్న సీఎం నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలు మద్దతుగా నిలుస్తారు. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా మార్చడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు, పచ్చ మీడియా నేతల మాదిరిగా హైదరాబాద్ నుంచి కాకుండా మన విజయవాడ నుంచి సీఎం జగన్ విశాఖ వస్తున్నారు. సీఎం జగన్ ప్రజల సౌలభ్యం కోసం 26 జిల్లాల ఏర్పాటు.. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు నిజంగా కొత్త జిల్లాల ఏర్పాటు.. సచివాలయ వ్యవస్థను వ్యతిరేకిస్తే ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. చంద్రబాబు, పవన్ పొలిటికల్ టూరిస్ట్‌లు. ఈ ఇద్దరు పొలిటికల్ టూరిస్టులు వికేంద్రీకరణ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరికి అమరావతి నుంచి పాలన జరగాలన్న కోరిక ఉంది. అమరావతి అనే భ్రమను ప్రజల్లో ఇంకా ఉంచాలని చూస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘చంద్రబాబు పెద్ద కట్టప్ప.. నాదెండ్ల మనోహర్ చిన్న కట్టప్ప’
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను నాదెండ్ల భాస్కర్ చదువుతున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే, నాదెండ్ల భాస్కర్ చిన్న కట్టప్ప అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, గుడివాడ అమర్నాథ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘పవన్‌తో పాటు, నాదెండ్ల మనోహర్ కూడా ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. పవన్ కల్యాణ్‌కు మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే.. మనోహర్ చిన్న కట్టప్ప. టీడీపీ పాలనలో జీఎస్డీసీ 22వ స్థానంలో ఉంది. నేడు జీఎస్డీపీ ఒకటో స్థానంలో ఉంది. జీఎస్డీపీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. తలసరి ఆదాయం టీడీపీ హయాంలో 174వ స్థానంలో ఉండగా.. నేడు తొమ్మిదో స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ద్వారా లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. MSME ద్వారా 13 లక్షల మందికి ఉపాధి కల్పించాం. టీడీపీ పాలనలో వ్యవసాయం రంగంలో 27 స్థానంలో ఉన్నాము. నేడు ఆరో స్థానంలో రాష్ట్రం ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే నేడు మూడో స్థానంలో ఉంది. గుజరాత్ తరువాత మన రాష్ట్రంలో పెట్టుబడులు అధికంగా వచ్చాయి. ఈజ్ ఆఫ్ డుయింగ్‌లో గత మూడేళ్ల నుంచి రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎంఎస్ఎంఈకి పెద్ద పీట వేశారు. గత ప్రభుత్వం కన్నా ఎంఎస్ఎంఈ రంగంలో 650 శాతం అభివృద్ధి సాధించింది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగులో 20 వేల కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్ క్లియరెన్స్ ఇచ్చారు. ఉన్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తున్నాము. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్క్‌ను నిర్మిస్తున్నాం’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ప్రజలతోనే మా పొత్తు: సీఎం జగన్ -
బడుగు బలహీనర్గాలకే కీలక పదవులు: బూడి మూత్యాల నాయుడు
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో గురువారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బహిరంగ సభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, ఉమా శంకర్ గణేష్, గొల్ల బాబూరావు, అడీప్ రాజు, ఎమ్మెల్సీ కళ్యాణి, విశాఖ డెయిరీ చైర్మెన్ అడారి ఆనంద్. తదితరులు హాజరయ్యారు. ఎంపీ సత్యవతి పాయింట్స్ ►పేదరికం నుంచి బయట పడడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ ప్రవేశ పెట్టారు. ►సీఎం జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. ►ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ►వచ్చే ఎన్నికల్లో 175 కు 175 వైఎస్సార్సీపీ సాధిస్తుంది. బూడి ముత్యాల నాయుడు పాయింట్స్ ►ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ►పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అందిస్తున్నారు. ►ముడు వంతుల్లో రెండు వంతులు బడుగు బలహీన వర్గాలు స్థానం కల్పించారు. ►కీలకమైన పదవులు బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు. ►నాడు నేడు ద్వారా విద్యా వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తెచ్చారు. ►కార్పొరేట్ స్కూల్‌కు ధీటుగా ప్రభుత్వ పాటశాలను మార్చారు. ►ఇంగ్లీష్ మీడియంను అలీబాబా 40 దొంగలు హేళన చేశారు. ►చంద్రబాబు, గంటా, అయ్యన్న, బండారు మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ►పేదలు పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవ కూడదు అంటా. ►ఇంగ్లీష్ మీడియం చదువులు లేక గతంలో ఎంతో మంది పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయారు. ►దివంగత నేత ఫీజ్ రియంబర్స్ మెంట్ వలన పేదల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు. ►బడుగు బలహీనర్గాలకు సీఎం జగన్ పాలనలో న్యాయం జరిగింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు పాయింట్స్ ►స్వాతంత్ర్యం తరువాత చాలామంది పేదలకు న్యాయం జరగలేదు. ►కొన్ని వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ►దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. ►సీఎం జగన్ పథకాలపై విమర్శలు చేసిన వారు నేడు ప్రశంసిస్తున్నారు. ►సీఎం జగన్ పథకాలను చంద్రబాబు కాఫీ కొట్టారు ►ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేశారా? ►రైతు డ్వాక్రా రుణా మాఫీ చేశారా? ►ఇచ్చిన హామీల్లో ఒకదాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ►అధికారం కోసమే చంద్రబాబు హామీలు ఇచ్చారు. ►పేద వారు తమ అవసరాలు కోసం కోర్టులకు వెళ్ళలేరు. ► పాలకులు ప్రజలు కష్టాలు తెలుసుకొని పాలన చేయాలి. ►దేశానికి ఆదర్శంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. ►సమాజంలో అంతరాలను తగ్గించడం వంటివి సైకోలు చేస్తారా లోకేష్. ►ఒక రోడ్డు, ఒక బిల్డింగ్ వేస్తే అభివృద్ధి కాదు. ►ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంచడం నిజమైన అభవృద్ధి. ►టీడీపీ జెండా కట్టిన వారికే పథకాలు ఇచ్చారు. ►సీఎం జగన్ పాలన పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నారు. ►సీఎం జగన్ ఒక రూపాయి అవినీతి లేకుండా పాలన చేస్తున్నారు. ►చంద్రబాబు కూడా అవినీతి జరిగిందని చెప్పలేక పోతున్నారు. ►గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పై టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. ►కంటి ఆపరేషన్ కోసం బెయిల్ ఇస్తే న్యాయం గెలిసింది అని టిడిపి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ►271 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ►అన్ని ఆధారాలు తోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ►చంద్రబాబు నిజాయితీ పరుడు అయితే కోర్టులో నిరూపించుకోవాలి. ►టీడీపీ పాలనలో నాయకుల అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. ►సీఎం జగన్ పాలనలో పేదల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ►ఎన్నికలు ముందు మయ మాటలతో చంద్రబాబు ప్రజలు ముందుకు వస్తారు రాజన్న దొర డిప్యూటీ సీఎం ►మనకు మంచి ఎవరు చేస్తున్నారో గుర్తు పెట్టుకోవాలి. ►పేదలు కోసం సీఎం జగన్ పని చేస్తున్నారు. ►టీడీపీ నాయకుల మయ మాటల ఎవరు నమ్మొద్దు. ►బలహీన వర్గాలకు సీఎం పెద్ద పీట వేశారు. ►సమాజాన్ని సమ సమాజంగా సీఎం జగన్ మార్చారు. ►గిరిజనులు కోసం 20 వేల కోట్ల కర్చు చేశారు. ►పేదలు పక్ష పాతి సీఎం జగన్ ►బురద మా మీద జల్లలని చూస్తే పందుల్లా మీదే బురద పడుతుంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ పాయింట్స్ ►సామాజిక న్యాయానికి ముత్యాల నాయుడే ఒక ఉదాహరణ. ►రాజకీయాలలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సీఎం జగన్, ముత్యాల నాయుడిని పక్కన పెట్టుకున్నారు. ►సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ►దేశంలో ఎక్కడ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ►2 లక్షల 40 వేల కోట్లు ప్రజల ఖాతాల్లో ఏ నాయకుడు వేయలేదు. ►కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. ►మళ్ళీ 28 రోజుల తరువాత జైలుకు వెళ్లాల్సిందే. ►ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన సీఎం జగన్ సింగిల్‌గానే పోటీ చేస్తారు. ►చంద్రబాబుకు 1000 కోట్ల చేతి కర్ర పవన్ రూపంలో దొరికింది. -
‘ఏపీలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను’
సాక్షి, విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ పేర్కొన్నారు. తనను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించడంతో పాటు ఏసీఏ(ఆంధ్రక్రికెట్ అసోసియేషన్) మంచి సహాయ సహకారాలు అందించిన కారణంగానే దేశం తరఫున ఆడే అవకాశం దక్కిందన్నాడు. శుక్రవారం విశాఖలో క్రికెటర్ భరత్‌ను మంత్రి గుడివాడ్ అమర్నాథ్, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మాట్లాడిన శ్రీకర్ భరత్.. ‘నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒకరికి ధన్యవాదాలు. నా తల్లి దండ్రులు ఎంతగానో నన్ను ప్రోత్సహించారు. ఏసీఏ మంచి సహాయ సహకారాలు అందించింది. నా ఎదుగుదలలో ఏసీఏది కీలక పాత్ర. ఏసీఏ సహాయ సహకారాలు మర్చిపోలేనిది. పట్టుదలతో విజయం సాధించవచ్చు. దేశానికి ఆడడం గర్వంగా భావిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. సీఎం జగన్ సార్ ను కలిశాను. సీఎం జగన్ సార్ ఎంతగానో ప్రోత్సహించారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర అనేది మంచి కార్యక్రమం’ అని భరత్ స్పష్టం చేశాడు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘దేశానికి గర్వకారణం భరత్. 140 కోట్ల మంది ప్రజల్లో భారత్ క్రికెట్ జట్టుకు భరత్ ఎంపిక కావడం సంతోషం. అడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలను సీఎం వైఎస్ జగన్ ప్రోత్సహిస్తున్నారు. వత భరత్, రాయుడును ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చెప్పారు. గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం, 1000 చదరపు గజాల స్థలం ఇవ్వడానికి సీఎం జగన్ నిర్ణయించారు. భరత్ అకాడమీ పెడితే సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధోనీలా భరత్‌కు మంచి భవిష్యత్ ఉంది. క్రికెట్ ఆడే యువతకు భరత్ ఆదర్శం’ అని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి పాయింట్స్ మాట్లాడుతూ.. ‘పట్టుదలతో శ్రీకర్ భరత్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.దేశం గర్వించదగ్గ బిడ్డను మనకు భరత్ తల్లి దండ్రులు అందించారు.పట్టుదలతో వరల్డ్ టెస్ట్ మ్యాచ్ లో స్థానం సంపాదించారు.రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ భరత్‌కు ఉంది. యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంచడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము.ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తారు. ఏసీఏ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..త్వరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అన్ని రకాల క్రీడలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు. -
ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ షాక్..
సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ పార్టీ కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వివరాల ప్రకారం.. ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో అనకాపల్లి టీడీపీ నేత మలశాల భరత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణరావు, మాజీ ఎంపీపీ ధనమ్మ, విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రాజా ఉన్నారు. సీఎం జగన్‌కు వీరికి వైఎస్సార్సీపీ పార్టీ కండువా తప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మీ నాన్ననే ఉరికించాం.. నువ్వెంత..: మంత్రి జోగి రమేష్ -
పబ్లిసిటీ కాదు.. బాధితులకు సేవచేయడం ముఖ్యం: మంత్రి అమర్నాథ్
సాక్షి, తాడేపల్లి: రైలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎ జగన్ ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. తనతోపాటు ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందం ఒడిశాకు వెళ్లి.. విశాఖ, భువనేశ్వర్, ఇతర ఆసుపత్రిలో బాధితులను చేర్పించి, పరామర్శించామని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. కోరమండల్లో ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది, యశ్వంత్‌పూర్ రైలులో 33 మంది ఉన్నారని పేర్కొన్నారు. రెండు రైళ్లలో ప్రయాణించిన 342 మందిలో 329 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. 12 మందికి స్వల్ప గాయాలైనట్లు గుర్తించామన్నారు. విశాఖ ఆసుపత్రిలో 9 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వ రెస్క్యూ ఆపరేషన్లను కేంద్ర మంత్రులు అభినందిచారని చెప్పారు. అంబులెన్స్‌లు, మహాప్రస్థానం వాహనాలను ఒడిశాలోనే ఉంచామని తెలిపారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఒడిశాలోనే ఉన్నారన్నారు. రైలు ప్రమాదం ఘటనలో బాలాసోర్‌లో నివాసముంటున్న శ్రీకాకుళం జిల్లా వ్యక్తి మరణించాడని, బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం అందిస్తున్నామని తెలిపారు. ‘ఏపీకి చెందిన వారి కోసం కాల్స్ రాలేదు. ఖమ్మం వ్యక్తి అంబటి రాములు విజయవాడ నుంచి వెళ్తున్నట్లు కాల్ వచ్చింది. పక్క రాష్ట్రం అయినప్పటికీ సమాచారం కోసం ఆరా తీస్తున్నాం. ఒడిశా రైలు ప్రమాదంలో 276 మంది చనిపోగా.. 187 మృతదేహాలను మార్చురీలో ఉన్నాయి. కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటున్నాం. మన అంబులెన్స్‌లు, మహాప్రస్థానం వాహనాలు కావాలని కేంద్ర మంత్రులు అడిగారు. మన ప్రభుత్వం చేసినంత సాయం ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ మాట కేంద్ర మంత్రులే చెప్పారు. పక్క రాష్ట్రాల వారికి కూడా సహకారం అందిస్తున్నాం. బాధితులు ఆస్పత్రుల నుంచి బయటకు వచ్చేంత వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. బాధితులకు సేవచేయడం ముఖ్యం.. పబ్లిసిటీ కాదు’ అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. సీఎం జగన్ తక్షణ స్పందన ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం గురించి తెలియగానే సీఎం జగన్ తక్షణమే స్పందించారు. అదే రాత్రి సీనియర్ అధికారులతో సమావేశమైన ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు మర్నాడు ఉదయమే నేను, ముగ్గురు ఐఏఎస్‌లు, మరో ముగ్గురు ఐపీఎస్‌లు కలిసి రోడ్డుమార్గం ద్వారా అక్కడకు వెళ్లి, వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మేం అక్కడ పరిస్థితుల్ని సమీక్షిస్తుండగానే అదే రోజు సాయంత్రం విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కొందరు అధికారులు వచ్చి మాతో జాయిన్ అయ్యారు. వివిధ శాఖల సమన్వయంతో..: రెస్క్యూ ఆపరేషన్‌లో ఇక్కడ్నుంచి వెళ్లిన మాతో పాటు, 27 మంది సపోర్టింగ్ సిబ్బంది పాల్గొన్నారు. నలుగురు తహశీల్దార్లు, ఒక డిప్యూటీ డీఎంహెచ్‌వో, 9 మంది డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్వోలు, పోలీసు, ఆర్టీవో సిబ్బంది మాతో కలిపి పని చేశారు. ఆయా శాఖల్ని సమన్వయం చేసుకుంటూ రైలు ప్రమాద ప్రయాణికుల్ని గుర్తించగలిగాం. 108 సర్వీసులు 20.. ఇంకా 19 ప్రైవేటు అంబులెన్స్‌లు, 15 మహాప్రస్థానం వెహికల్స్‌ను వెంట తీసుకెళ్లాం. ఒక్కో 108 సర్వీస్‌లో నలుగురు చొప్పున సిబ్బంది ఉన్నారు. రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ వద్ద 5 అంబులెన్స్‌లతో సేవలందించాం. ఇంకా సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇచ్చాపురం సరిహద్దులో కొన్ని అంబులెన్సులతో పాటు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఇప్పటికీ మన రెస్క్యూ బృందాలు భువనేశ్వర్, కటక్, బాలాసోర్‌లో ఉన్నాయి. కేంద్ర మంత్రుల ప్రశంస ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలియగానే మనం శరవేగంగా స్పందించి రాష్ట్రంలో పలు చోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాం. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర రైల్వేస్టేషన్లలో కంట్రోల్ రూంకు అందిన ఫోన్ల సమాచారం ద్వారా.. ఎక్కడికక్కడ రిజర్వేషన్ల ఛార్ట్‌ల్లో ఉన్న ప్రయాణికుల కాంటాక్టు నెంబర్ల ప్రకారం వారితో మాట్లాడి వారి ఆచూకి తెలుసుకోవడం, వారు సేఫ్‌గా స్వస్థలాలకు చేరే వరకు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ పరిస్థితుల్ని సమన్వయం చేస్తున్న కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ధర్రేంద్ర ప్రధాన్గార్లను కూడా కలిసి మాట్లాడాం. సీఎంగారి ఆదేశాల మేరకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ను వివరించాం. మన ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాపైనా చెప్పాం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గురుమూర్తి కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.5 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ఇస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రులకు వివరించాం. తమిళనాడు, బీహార్.. తదితర రాష్ట్రాల్లో కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్‌లే ఏర్పాటు చేయగా, మన దగ్గర కంట్రోల్ రూమ్‌లతో పాటు, వివిధ జిల్లా కేంద్రాల్లో అధికారుల్ని అప్రమత్తం చేసి చేపట్టిన రెస్యూ్క ఆపరేషన్ విధానం, మన చొరవను కేంద్ర మంత్రులు అభినందించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చదవండి: ‘మార్గదర్శి’ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీంలో విచారణ -
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి అమర్నాథ్ భేటీ
భువనేశ్వర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద ప్రాంతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆదివారం కటక్‌లో మంత్రి అమర్నాథ్ సమావేశమయ్యారు. రైలు ప్రమాద ఘటనపై సహాయక చర్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రైలు ప్రమాద క్షతగాత్రులకు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. కాల్ సెంటర్లు నిర్వహణ ద్వారా బాధితులను త్వరగా గుర్తించి సహాయం అందించామని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాకు ఒక కాల్ సెంటర్ నిర్వహణను రైల్వే మంత్రి అభినందించారు. చదవండి: ఒడిశా మహా విషాదం.. చుట్టూ కారు చీకటి.. 40 నిమిషాలు ఏం జరిగింది? అంతకుముందు మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. . కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందినవారు 342 ప్రయాణిస్తున్నారని వారిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు మరోవైపు ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనకు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు. సిగ్నలింగ్ పాయింట్లో మార్పులు చేసిన వారిని కూడా గుర్తించామని వెల్లడించారు. త్వరలో వారిపై చర్యలు ఉంటాయన్నారు. కవచ్‌కు, రైలు ప్రమాదానికి సంబంధం లేదన్నారు. అయితే ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు బహిర్గతమవుతాయని మంత్రి వెల్లడించారు. చదవండి: ‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’ -
AP: మీ వాళ్ల ఫొటో, వివరాలు వాట్సాప్ చేయండి.. నెంబర్ ఇదే..
సాక్షి, అమరావతి: ఒడిషాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీవాసుల వివరాలు, భద్రత కోసం ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో క్షత్రగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇచ్చింది. మిస్సయిన వారి సమాచారం కోసం ఈ 1070, 112, 18004250101 ఫోన్ చేయాలని సూచించింది. అలాగే, 8333905022 నెంబర్‌కు ప్రయాణికుడి ఫొటో, ఇతర వివరాలను వాట్సాప్‌లో పంపించాలని తెలిపింది. అనంతరం, వివరాల ఆధారంగా పోలీసు శాఖతో సమన్వం చేసుకుని బాధితులకు వివరాలు తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పద్దుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించిన అనంతరం మంత్రి అమర్నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం ఆదివారం ఉదయం బాలాసోర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది ఏపీకి చెందినవారు ప్రయాణిస్తున్నారు. అలాగే, ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 342 మందిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. గుర్తించిన వారిలో 14 మంది క్షతగాత్రులని, వీరిలో 10 మంది రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో, నలుగురు క్షతగాత్రులు జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పారు. ఇదే బోగీలో ప్రయాణిస్తున్న గురుమూర్తి అనే ఒక వ్యక్తి మాత్రం మరణించారని అమర్నాథ్ వెల్లడించారు. కాగా, ఇంకా గుర్తించవలసిన వారి వివరాల కోసం అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదని, ఇప్పటికీ తమ వారి ఆచూకీ కోసం 8333905022 నంబర్ వాట్సాప్‌కు ఆచూకీ లభ్యం కాని వారి ఫోటోలు పంపిస్తే అధికారులు వారి వివరాలు సేకరిస్తారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఇలా ఉండగా రాష్ట్రానికి చెందిన 16 అంబులెన్స్‌లను, 10 మహాప్రస్థానం వాహనాలను భువనేశ్వర్ లో అందుబాటులో ఉంచామని, మరో ఐదు అంబులెన్సులను బాలాసోర్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొంతమందిని భువనేశ్వర్ లోని అపోలో హాస్పిటల్ తరలించామని, ఇద్దరిని విశాఖలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కు, ఒకరిని విశాఖ ఆరిలోవలోని అపోలోకు తరలించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా.. -
సెప్టెంబర్ నుంచి విశాఖ వేదికగా పరిపాలన: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుండే పరిపాలన కొనసాగుతుందన్నారు. వ్యవస్థలన్నీ విశాఖపట్నం నుంచే పనిచేస్తాయని స్పష్టం చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనను ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చు. వ్యవస్థలన్నీ విశాఖ నుంచే పనిచేస్తాయి. మే 3వ తేదీన భోగాపురం ఎయిర్‌పోర్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. విశాఖ రాజధానిగా టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. -
‘ఏపీలో ఎవరు పెట్టుబడులు పెడతామన్నా ఆహ్వానిస్తాం!’
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్-2023 నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 3,4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కోసం ముందస్తు సన్నాహక సదస్సు జరిగిందని చెప్పారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్‌ను విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ఈ సదస్సుకు 48 దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారని చెప్పారు. ఈ అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సును విజయవంతం చేసేందుకు దేశంలోని ముఖ్య నగరాలలో వివిధ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి, అభివృద్ధి పథంలో నడిపేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. అందులో భాగంగా తొలుత న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సదస్సుకి దేశంలోని విభిన్న పారిశ్రామిక వేత్తలు, సంఘాల ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని.. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చేస్తున్న రాష్ట్రంగా ఉందన్నారు. దేశంలోకి 11 ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తున్నాయి అందులో మూడు ఏపీకే రావడం శుభపరిణామని చెప్పారు. అలాగే 69 వేల ఎకరాల పారిశ్రామిక భూములు ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు. నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఏపీ విధానాలను కోనియాడుతున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఎవరూ పెట్టుబడులు పెడతామన్న సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిని ప్రపంచానికి తెలియ జెప్పే క్రమంలోనే విశాఖలో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం అని అన్నారు. అంతేగాదు ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక వేత్తలే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారని అమర్నాథ్ తెలిపారు. (చదవండి: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్) -
విశాఖను ఐటీ కేంద్రంగా మారుస్తాం : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
అనకాపల్లిలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
-
పెట్టుబడులు తరలిపోతున్నాయంటూ అవాస్తవ ప్రచారం : గుడివాడ అమర్నాథ్
-
లోకేష్ పాదయాత్ర పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
-
విశాఖలో ఐటీ సమ్మిట్
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నంలో వచ్చే ఏడాది జనవరిలో ఐటీ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ఐటీ అసోసియేషన్ (ఐటాప్), ఏపీఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఏపీఐఎస్, ఎస్టీపీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్ఫినిటీ వైజాగ్–2023 ఐటీ సమ్మిట్ పోస్టర్, వెబ్‌సైట్‌ని మంత్రి అమర్నాథ్ శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు. జనవరి 20, 21 తేదీల్లో స్థానిక మారియట్ హోటల్లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తొలి రోజున ఎస్టీపీఐ ద్వారా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, స్టార్టప్‌లతో పాటు ఐటీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, రెండో రోజున బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం)తో పాటు ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలపై ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు, ఐటీ రంగ నిపుణులు చర్చిస్తారని వివరించారు. ఐటాప్ అధ్యక్షుడు శ్రీధర్ కొసరాజు పాల్గొన్నారు. -
సీఎం ప్రసంగం.. మంచి మెసేజ్‌లా ఉంది
సాక్షి, విశాఖపట్నం: తమకు రాజకీయాలు, పార్టీలు ముఖ్యం కాదని రాష్ట్ర శ్రేయస్సు మాత్రమే ముఖ్యమని సీఎం వైఎస్ జగన్ స్పష్టంచేసిన తీరు మంచి నాయకత్వం, ఉత్తమ పరిపాలన విధానమని.. అలాగే, సీఎం ప్రసంగం రాబోయే తరాలకు మంచి మెసేజ్ ఇచ్చినట్లుగా ఉందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ప్రభుత్వ విధానాన్ని, పెండింగ్ సమస్యలను ఆయన స్పష్టంగా.. క్లుప్తంగా వివరించి వాటన్నింటినీ పరిష్కరించాలని ప్రధానిని కోరారన్నారు. తాను ఎందరో సీఎంల వద్ద పనిచేసినప్పటికీ ఈ రోజు ముఖ్యమంత్రి ప్రసంగం తీరుచూశాక జగన్‌పట్ల ప్రత్యేక స్థానం ఏర్పడిందన్నారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి బొత్స మీడియాతో మాట్లాడారు. విశాఖలో ప్రధాని బహిరంగ సభకు తరలివచ్చిన లక్షలాది మంది ఉత్తరాంధ్ర వాసులందరికీ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పవన్‌ది అజ్ఞానం.. రామోజీ కండ కావరం నిన్న ఇక్కడికి ఒక సెలబ్రిటీ వచ్చి.. తనను ప్రధాని కలవమన్నారని చెప్పారు. ప్రధానిని కలిసొచ్చిన తర్వాత మీడియాతో.. తాను ప్రభుత్వంపై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. అంతేకానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవి అడిగానని చెప్పలేదు. అలా చెప్పిఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ, పవన్ ఒక అజ్ఞానిలా ప్రవర్తించాడు. ఇక వారికి వత్తాసు పలికే ఈనాడు పత్రిక ‘కొండ కావరం’ అని రుషికొండపై మరీ దిగజారి వార్త రాసింది. అది నిజానికి రామోజీరావుకు, ఈ పత్రికకు ఉన్న కండ కావరం. ఉత్తరాంధ్ర భాషలో దానిని ఒళ్లు బలుపు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం మీద, ఉత్తరాంధ్రపైనా ఎంత అక్కసు, కక్ష ఉందో ఈ వార్త ద్వారా అర్థమవుతోంది. రుషికొండపై నిర్మాణాల్లో తప్పేమిటి? రుషికొండపై ఎందుకు వారు తప్పుడు కథనాలు రాస్తున్నారు? రుషికొండ మీద ప్రభుత్వం కొన్ని భవనాలు కడుతోంది. అందులో తప్పేముంది? రుషికొండ మీద గతంలోనే గెస్ట్‌హౌస్ ఉంది. శిథిలమైన దాన్ని తొలగించి ఇప్పుడు కొత్త భవనాలు కడుతుంటే ఏమిటి తప్పు? ప్రభుత్వం ఏమైనా రామోజీ ఫిల్మ్‌సిటీ మాదిరిగా వేల ఎకరాల్లో భవనాలు కడుతోందా? సుమారు రూ.11 వేల కోట్ల పనులకు సంబంధించి శంకుస్థాపనలు జరిగాయి. ఇంకా అభివృద్ధి పనులు జరగాలని ఆలోచించాలే తప్ప ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడమేమిటి? రాష్ట్ర ప్రయోజనాలే సీఎంకు ముఖ్యం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సీఎం జగన్ చెబుతుంటారు.. అందుకు తగ్గట్లే ఆయన వ్యవహరిస్తున్నారు. సీఎంకి రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధిని కూడా కాంక్షిస్తున్నారు. అభిమానం ఉండబట్టే విశాఖ సభకు లక్షలాది మంది తరలివచ్చారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు, పచ్చ మీడియా వాస్తవాలు గుర్తించి ప్రజల ఆకాంక్షను గౌరవించాలి. జగనన్న లేఅవుట్ చూస్తాడట.. చూడనివ్వండి పవన్‌కళ్యాణ్ ఆదివారం మా జిల్లా విజయనగరానికి వెళ్తాడట. జగనన్న లేఅవుట్ కాలనీ చూస్తాడట. చూడనివ్వండి. ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద లేఅవుట్ అది. సుమారు 400 ఎకరాల్లో 12 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వారిలో 10 వేల మందికి ఇళ్లు కూడా మంజూరు చేశాం. పనులు సాగుతున్నాయి. అది కాలనీ కాదు. ఒక ఊరు అని చెప్పాలి. 10 వేల ఇళ్లు అంటే దాదాపు 40 వేల జనాభా. అంటే ఒక పట్టణంలా ఉంటుంది. మా ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే. రాష్ట్రంలో సొంత ఇల్లులేని ఒక్క నిరుపేద కూడా ఉండకూడదు. కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. -
ప్రధానితో పవన్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
పవన్ కంటే కేఏ పాల్ నయం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ నయమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో కేఏ పాల్ 175 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారని.. పవన్ కూడా 175 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం నోవాటెల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన కార్యకర్తలు పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే.. ఆయన మాత్రం చంద్రబాబును సీఎం చేసేందుకు రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు జనసైనికులు బానిసలుగా బతకాలన్నారు. పవన్.. వంగవీటి గురించి మాట్లాడిన మాటలు, ఆయనను హత్య చేసిన వారిని కౌగిలించుకున్న విషయాలను ఎలా చూడాలని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అమరావతి రైతులు పాదయాత్ర మానుకోవాలని కోరారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం మహిళా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి అమర్నాథ్ అన్నారు. నగరంలోని ఒక హోటల్లో మంగళవారం అసోసియేషన్ ఆఫ్ లేడి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా 100 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. -
ముద్రగడపై దాడి జరిగినప్పుడు పవన్ ఎక్కడున్నారు : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
కాపుల సంక్షేమానికి పెద్దపీట
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో కాపుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని కాపు సామాజికవర్గ ప్రజా ప్రతినిధులు తెలిపారు. కాపులకు గత మూడేళ్లలో పలు పథకాల ద్వారా రూ.27 వేల కోట్ల మేర లబ్ధి చేకూర్చారని, గ్రామ గ్రామాన దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై చర్చించేందుకు కాపు సామాజిక వర్గ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు. త్వరలో విజయవాడలో కాపు సామాజికవర్గ ప్రజా ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ తమకు పది సీట్లు ఇవ్వాలని ఎవరినో కోరారంటే పార్టీని తాకట్టు పెట్టేందుకే కదా? అని కాపు ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. పవన్‌కు ధైర్యం ఉంటే 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తామని ప్రకటించాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న వైఎస్సార్సీపీనే వచ్చే ఎన్నికల్లో సైతం అధికారంలోకి రానుందని స్పష్టం చేశారు. కాపు యువతకు వివరిద్దాం.. అధికారంలో ఉండగా కాపులను అణగదొక్కిన చంద్రబాబుకు తన సామాజిక వర్గాన్ని తాకట్టు పెడుతున్న పవన్‌కళ్యాణ్ రాజకీయ దిగజారుడుతనాన్ని కాపు ప్రజాప్రతినిధులు తూర్పారబట్టారు. వంగవీటి మోహన్‌రంగా హత్యకు కారకుడైన చంద్రబాబుతో పవన్ అంటకాగటాన్ని తప్పుబట్టారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడ్చేసి వేలాది మంది కాపులపై పోలీసు కేసులతో వేధింపులకు గురిచేసిన చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ చేస్తోన్న కుట్రలను తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కాపు యువతకు అర్థమయ్యేలా వివరించాలని తీర్మానించారు. ఇటీవల కాపు సామాజికవర్గ ప్రజాప్రతినిధులపై పవన్ చేసిన వ్యాఖ్యలను సమావేశం ముక్తకంఠంతో ఖండించింది. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, ఎంపీలు వంగా గీత, బాలశౌరి, బి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, గెడ్డం శ్రీనివాసనాయుడు, గ్రంధి శ్రీనివాస్, పుప్పాల శ్రీనివాసరావు, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌బాబు, సామినేని ఉదయభాను, కిలారి వెంకట రోశయ్య, ఆరాని శ్రీనివాసులు, బొత్స అప్పల నరసయ్య, మద్దిశెట్టి వేణుగోపాల్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా నాగశేషు తదితరులు పాల్గొన్నారు. భేటీలో చర్చించిన అంశాలను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వివరించారు. పవన్ కుమ్మక్కు రాజకీయాలు: కొట్టు టీడీపీ కాపుల సంక్షేమానికి ఏటా రూ.వెయ్యి కోట్లిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లలో రూ.1,824 కోట్లు మాత్రమే విదిల్చింది. ముఖ్యమంత్రి జగన్ కాపులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూ ఇప్పటిదాకా డీబీటీ ద్వారా రూ.16,485 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.10 వేల కోట్లతో మొత్తం రూ.27 వేల కోట్లు కాపులకు అందచేశారు. 70,83,377 మంది కాపులకు సాయం చేశారు. టికెట్లు, మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కుమ్మక్కై కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. చెప్పులు చూపిస్తూ అసభ్యంగా మాట్లాడటం సిగ్గుచేటు. విచక్షణ కోల్పోయి ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. రంగాకు రక్షణ కల్పించని టీడీపీ సర్కారు:దాడిశెట్టి రాజా, మంత్రి శాసనసభ సాక్షిగా తనకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని నాడు వంగవీటి రంగా కోరితే టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. నాడు మంత్రిగా ఉన్న హరిరామ జోగయ్య రంగా హత్యపై రాసిన పుస్తకాన్ని పవన్ చదవలేదా? కాపుల్లో ఉద్వేగాన్ని రగిల్చే కుట్ర: కురసాల కన్నబాబు, మాజీ మంత్రి టీడీపీ హయాంలో కాపు సామాజిక వర్గాన్ని సంఘ వ్యతిరేక శక్తిగా చూపించాలనుకున్న చంద్రబాబు పాలనలో కాపులపై కేసులు పెట్టడమే కాకుండా వృద్ధులు, మహిళలని కూడా చూడకుండా పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టారు. విశాఖలో సెక్షన్ 30 ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు ఆయన అధికారంలో ఉండగా రాజమహేంద్రవరంలో మూడేళ్ల పాటు సెక్షన్ 30 అమలు చేసిన విషయం గుర్తు లేదా? రంగా హత్య కుట్రను వక్రీకరించి కాపుల్లో ఉద్వేగాన్ని రేపాలని కుట్రలు పన్నుతున్నారు. కాపులకు చంద్రబాబు కంటే సీఎం జగన్ లక్ష రెట్లు మేలు చేస్తున్నారన్నారు. సీఎం దృష్టికి తెస్తాం: మంత్రి బొత్స వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యే టికెట్ల నుంచి మంత్రులు, నామినేటెడ్ పదవుల వరకు ముఖ్యమంత్రి జగన్ కాపులకు పెద్దపీట వేశారు. కాపులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. అన్ని సామాజికవర్గాలతోపాటు కాపులకు సమాన ప్రాతినిధ్యం కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. భేటీలో చర్చించిన అంశాలను క్రోడీకరించి కార్యాచరణతో సీఎం దృష్టికి తెస్తాం. ఇటీవల ఓ సెలబ్రిటీ పార్టీ అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతోంది. కాపు రిజర్వేషన్లపై ఆది నుంచి ప్రభుత్వం ఒకే విధానంతో ఉంది. వాస్తవాలను వక్రీకరించి అపోహలు కల్పించడం లేదు. రాజ్యాంగపరంగా ఎంతవరకు చేయగలమో అది చేస్తాం. కేంద్రం ఈడబ్లు్యఎస్‌కు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లలో రాష్ట్రానికి సౌలభ్యం కల్పిస్తే అత్యధికంగా 25 శాతానికి పైబడి ఉన్న కాపులకు మేలు చేయవచ్చు. గంటలోనే బాబును కలసిన పవన్: మంత్రి అంబటి రాంబాబు టీడీపీ కాపుల వ్యతిరేక పార్టీ. అధికారంలో ఉండగా కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని అణచివేసి ఆయన కుటుంబ సభ్యులను వేధించింది. కాపులను గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ. కాపు సామాజిక వర్గానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, మేయర్లు పార్టీలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభంపై చంద్రబాబు సర్కారు బనాయించిన అక్రమ కేసులను సీఎం జగన్ ఎత్తివేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, కాపు ప్రజా ప్రతినిధులను దూషించిన విధానం గర్హనీయం. ఆయన రాజకీయాలకు అనర్హుడు. రంగా హత్య జరుగుతుందని తెలిసినప్పుడు ప్రతి గ్రామం నుంచి కాపులు వెళ్లి ఎందుకు కాపలా కాయలేదని ప్రశ్నించిన పవన్ అనంతరం గంటలోనే దీనికి కారకుడైన చంద్రబాబును కలవడం ఎంత వరకు సమంజసం? 3 తీర్మానాలకు ఆమోదం 1) జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అన్ని నామినేటెడ్ పదవుల్లో ఉన్న కాపు నేతలను ఆహ్వానించి కాపు సంక్షేమ రోడ్ మ్యాప్ రూపొందించేలా భారీ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయం. 2) కాపుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, సంక్షేమ పథకాల లబ్ధిని ఇంటింటికీ చేర్చే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆమోదం. 3) సీనియర్ కాపు నేతలతో చర్చించి కాపుల సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయం.