సాక్షి, విశాఖపట్నం :విశాఖలో చంద్రబాబుకు ప్రజాగ్రహం కనిపించిందని అనకాపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబును ప్రజలను అడ్డుకుంటే ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదని, ప్రజలను రెచ్చగొట్టి బాబు లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో విశాఖలో భూరికార్డులు తారుమారు అయ్యాయని మండిపడ్డారు. చంద్రబాబుపై టీడీపీలోని ఓ వర్గం వారే చెప్పులు వేసినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. (చంద్రబాబు తీరుపై మండిపడ్డ పోలీసు సంఘం)
పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, ఏం జరిగినా పులివెందుల పేరు చెప్పడం చంద్రబాబుకు అలవాటు అయిపోయిందని గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాతో ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారని.. అందుకే ప్రజలు బాబును అడ్డుకున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను చంద్రబాబు అవమానపరుస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టే లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘ఉమ్మేస్తారన్నా కూడా బాబుకు సిగ్గు లేదు’)
‘‘చంద్రబాబుకు అమరావతి తప్ప.. రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు. తన బినామీల కోసమే అమరావతి పేరుతో డ్రామాలు అడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అందుకే ఎయిర్‌పోర్టులో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. బాబు, టీడీపీ నేతలు భూదందాలు చేసి వేరే వాళ్లపై నెట్టేస్తున్నారు. నిన్న(గురువారం) విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగింది చూసి జనం కర్మ సిద్ధంతం అంటున్నారు. చేసిన తప్పుకు వెంటనే శిక్ష ఉంటుందని ఇప్పుడు రుజువైంది. ఇప్పటికైనా ప్రజలకు చంద్రబాబు క్షమపణలు చెప్పాలి.’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
చదవండి : ప్రజాగ్రహానికి తలొగ్గిన చంద్రబాబు..
Comments
Please login to add a commentAdd a comment