వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష పోస్టర్ను విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్ శనివారం విడుదల చేశారు.
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష పోస్టర్ను విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్ శనివారం విడుదల చేశారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న మోసపూరిత విధానాలను నిరసిస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు రోజుల పాటు తణుకులో వైఎస్ జగన్ దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ దీక్షకు భారీగా పార్టీ శ్రేణులు తరలి వెళ్లనున్నాయని తెలిపారు. కాగా ఈ నెల 27న వైఎస్ జగన్ ...సింహాద్రి అప్పన్నను దర్శించుకుని, శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారన్నారు. వచ్చే నెల 8న కార్పొరేట్ స్థాయిలో జిల్లా వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభిస్తామని అమర్నాథ్ తెలిపారు.