raithu-deeksha
-
ఆలోచన రగిలించిన జగన్ రైతు దీక్ష
-
'బాబు పొరపాటున కూడా నిజం చెప్పరు'
-
ముగిసిన వైఎస్ జగన్ రైతు దీక్ష
-
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం: బోస్
-
'భూములు ఇవ్వకపోతే బ్రతక లేరని బెదిరిస్తున్నారు'
తణుకు: భూములు ఇవ్వకపోతే బ్రతక లేరని తమను బెదిరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ ప్రాంత రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్ జగన్ చేపట్టిన రైతు దీక్ష సభాస్థలికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని రైతులు చెప్పారు. తమ భూములు బలవంతంగా లాక్కొంటున్నారని వెల్లడించారు. తమ భూములను తీసుకోవద్దని రైతులు కోరారు. ఈ విషయంలో వైఎస్ జగన్ తమకు సాయం చేయాలని విన్నవించారు. -
రైతులు సమ్మె చేస్తే ప్రభుత్వమే స్తంభిస్తుంది
-
''ప్రతిపక్షంగా మా భాద్యతను నిర్వహిస్తున్నాం''
-
రైతులు సమ్మె చేస్తే ప్రభుత్వమే స్తంభిస్తుంది
తణుకు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు సమ్మె చేస్తే ప్రభుత్వమే స్తంభించిపోతుందని హెచ్చరించారు. బాబు హామీలను నమ్మి రైతులు మోసపోయారని సీతారాం విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టిన రైతు దీక్షలో ఆయన ప్రసంగించారు. రైతులను రోడ్డుమీద నిలబెట్టిన ఘనత బాబుదేనని సీతారాం మండిపడ్డారు. బ్యాంక్‌లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని చెప్పారు. పరిపాలించడమెలాగో దివంగత మహానేత, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలనను చూసి నేర్చుకోవాలని సీతారం హితవు పలికారు. చంద్రబాబు పాలన ఇలాగే కొనసాగితే బడుగు, బలహీన వర్గాలు, రైతులు, మహిళలు ఎదురుతిరిగే రోజు వస్తుందని హెచ్చరించారు. -
జగన్ బాటలోనే మేము..సైతం
తూర్పుగోదావరి (పెద్దాపురం): అన్నదాత కష్టాలను మరిచి సింగపూర్ చక్కర్లు కొడుతున్న చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ అధినేత తలపట్టిన రైతు దీక్షకు పెద్ద ఎత్తున ప్రజామద్దతు లభిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రారంభించిన దీక్షకు మద్దతుగా ఆదివారం పెద్దాపురం నుంచి 25 బస్సులు తరలి వెళ్లాయి. పెద్దాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో వందలాది మంది తమ అభిమాన నాయకుడు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలపడానికి బయలుదేరారు. -
టీడీపీకి ఓట్లు వేసినవారు బాధపడుతున్నారు
తణుకు: టీడీపీ ఓటు వేసిన వాళ్లు బాధపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. పశ్చిమగోదావరి జల్లా తణుకులో చేపడుతున్న ఈ దీక్షలో భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు దొరికింది దొరికినట్టు దోచుకుంటున్నారని ఆరోపించారు. -
వైఎస్ జగన్ రైతు దీక్షకు భారీగా తరలివస్తున్న ప్రజలు
తణుకు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు దీక్ష రెండో రోజుకు చేరింది. పశ్చిమగోదావరి జల్లా తణుకులో చేపట్టిన ఈ దీక్షకు ఆదివారం ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. వైఎస్ జగన్‌కు రైతులు, మహిళలు మద్దతు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రైతు దీక్షకు మేము సైతం
జిల్లానుంచి హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు ఒంగోలు: రైతు దీక్షకు మేము సైతమంటూ జిల్లా నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు కదిలివెళ్లాయి. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శని, ఆదివారాలలో రైతు దీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డికి సంఘీభావంగా ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, రాష్ట్ర అధికారప్రతినిధి, సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్, యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావు, అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్‌లు జగన్మోహన్రెడ్డిని దీక్షావేదిక వద్ద కలుసుకొని సంఘీభావం ప్రకటించారు. వీరితోపాటు జిల్లాలో రైతుల సమస్యలను కూడా జగన్మోహన్రెడ్డి వద్ద ప్రస్తావించారు. ఇక కొండపి , చీరాల, పర్చూరు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జులైన వరికూటి అశోక్‌కుమార్, యడం బాలాజీ, గొట్టిపాటి భరత్, బొర్రా మధుసూదన్‌యాదవ్‌లు హాజరయ్యారు. -
జనహో.. జయహో
రుణవంచనపై తిరగబడ్డ రైతన్న కదం తొక్కిన మహిళా లోకం వెల్లువెత్తిన యువకులు, పార్టీ శ్రేణులు సర్కారుకు వ్యతిరేకంగా మిన్నంటిన నినాదాలు బాబు మోసాలపై నిప్పులు చెరిగిన నేతలు ఇది ఆరంభమే.. నిరంతర పోరాటాలకు పిలుపు తణుకు నుంచి సాక్షి ప్రతినిధి :తమ కోసం నిరశన దీక్ష చేపట్టిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిన సంఘీభావం ప్రకటించారు. అంచనాలకు మించి రైతులోకం, నారీజనం రైతు దీక్షకు తరలివచ్చారు. చంద్రబాబు రుణవంచనపై రైతన్న తిరగబడ్డాడు. నారా వారి నయా మోసంపై మహిళా లోకం గర్జించింది. ఉద్యోగాలిప్పిస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన మాయమాటలపై యువత నిప్పులు చెరిగింది. ఎడాపెడా పింఛన్ల కోతపై వృద్ధులు, వికలాంగులు కదం తొక్కారు. అధికారం దన్నుతో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడుతున్న వేధింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కన్నెర్ర చేశాయి. వెరసి తణుకులో జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు దీక్షకు ప్రజ పోటెత్తింది. ఎనిమిది నెలల తెలుగుదేశం ప్రభుత్వ దగాకోరు విధానాలను, రుణమాఫీ మాయాజాలంతో రైతులను, డ్వాక్రా మహిళలను నట్టేట ముంచిన చంద్రబాబు నయవంచన తీరును నిరసిస్తూ వైఎస్ జగన్ చేపట్టిన రెండురోజుల నిరశన దీక్షకు తొలి రోజైన శనివారం అంచనాలకు మించి జనం పోటెత్తారు. మహిళలైతే ఉవ్వెత్తున తరలివచ్చారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన రైతన్నలు, మహిళలతో తణుకు పట్టణం కిక్కిరిసిపోయింది. శనివారం ఎక్కడ చూసినా జగన్ చేపట్టిన దీక్షకు స్వచ్ఛందంగా తరలివస్తున్న రైతులే కనిపించారు. ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల నుంచి రైతులు, యువకులు శుక్రవారానికే తణుకు వచ్చేశారు. పట్టణంలో లాడ్జిలు, కల్యాణ మంటపాలు, ఆడిటోరియాలు, హాళ్లు అన్నీ నిండిపోవడంతో దీక్షకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు సభావేదిక వద్దే సేదతీరారు. శనివారం ఉదయం 9గంటలకే సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తణుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోగా, వేదికపైకి ఎక్కేందుకు 20 నిమిషాలు పట్టింది. వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు రైతులు. యువకులు పోటెత్తడంతో కాన్వాయ్ అడుగు మేర ముందుకు కదలడానికి పది నిమిషాలు పట్టింది. వైఎస్ జగన్ వేదిక మీదకు వెళ్లిన తర్వాత అభిమానులు ఆయనను దగ్గరుండి చూసేందుకు వెల్లువలా ముందుకు రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసులు దీక్ష జరిగే ప్రాంతానికి నలువైపులా బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేసినా ఇవేమీ జనం రాకకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఆర్టీసీ బస్సులను కేటాయించకుండా పాలకులు దిగజారుడుతనాన్ని ప్రదర్శించినా జనం రాకను అడ్డుకోలేకపోయారు. మోటార్ సైకిళ్లు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో రాత్రి పొద్దు పోయే వరకు వివిధ ప్రాంతాల నుంచి జనం వస్తూనే ఉన్నారు. చప్పట్లతో సంఘీభావం తొలుత పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ఆళ్ల నాని ప్రారంభ ఉపన్యాసం చేస్తూ వైఎస్ జగన్ దీక్ష చరిత్రాత్మకమన్నారు. చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, రైతు విభాగం అధ్యక్షుడు ఏఎస్వీ నాగిరెడ్డి, నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, కారుమూరి నాగేశ్వరరావు తదితర నేతలు విరుచుకుపడినప్పుడు ప్రజలు చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు. బాబు మోసంతో తనువు చాలించిన రైతులకు నివాళి బాబు రుణమాఫీ మోసానికి, అప్పులపాలై తీర్చే దారిలేక రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలి కాలంలో 86 మంది రైతులు మృత్యువాత పడ్డారు. వీరిలో ఆత్మహత్యకు పాల్పడ్డవారు కొందరైతే గుండెపోటుతో ప్రాణాలొదిలిన వారు మరికొందరు. వీరందరి ఆత్మశాంతి కోసం తొలుత రెండు నిమిషాలు సభలో మౌనం పాటించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించగా, సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పశ్చిమ నుంచే మొదలైన తిరుగుబాటు ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపుతో అధికార పక్షానికి పెట్టని కోటగా భావిస్తున్న పశ్చిమ నుంచే వైఎస్ జగన్ రైతు దీక్షతో చంద్రబాబు సర్కారుపై తిరుగుబాటు తీవ్రస్థాయిలో మొదలైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.వైఎస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం ప్రభుత్వ ఆగడాలపై రాజీలేని పోరాటంతో పాటు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతర ఉద్యమాలకు శ్రీకారం చుడతామని పార్టీ నేతలు పిలుపునివ్వడం శ్రేణులకు కొత్త ఊపునిచ్చింది. జగన్ దీక్షకు నార్వే మాజీ మంత్రి సంఘీభావం తణుకు టౌన్ : తణుకులో రైతు దీక్ష పేరుతో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని నార్వే దే శానికి చెందిన మాజీ మేజిస్ట్రేట్ (మాజీ మంత్రి) స్వోలాఫ్రిడ్ స్వీసన్, మరో ముగ్గురు సభ్యుల బృందం కలిసి ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. సేవా కార్యక్రమాల నిమిత్తం రాజమండ్రి వెళుతున్న నార్వే బృందం మార్గమధ్యంలో తణుకులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి దీక్ష చేస్తున్న విషయం తెలుసుకుని శిబిరం వద్దకు వెళ్లి ఆయనను కలసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్వీడన్ మాజీ మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ తనకు ఎంతో సన్నిహితుడుని, ఆయనతో అనుబంధం మరువలేనిదన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడానికి నిరసనగా ప్రభుత్వం తీరుపై జగన్మోహన్రెడ్డి నిరాహారదీక్ష చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రుణమాఫీని అమలు చేసి రైతులకు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేకూర్చాలని ఆమె పేర్కొన్నారు. ఈ బృందంలో నార్వేకు చెందిన రిటైర్డ్ టీచర్ కాలీజీ స్త్విక్, ఓఎన్జీ ఇంజనీర్ హరాల్డ్, ఆయిల్ కంపెనీ మేనేజర్ గున్నార్ తదితరులు ఉన్నారు. సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకే.. జన నేత ప్రసంగానికి మిన్నంటిన జగన్ నినాదాలు ‘రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు వాగ్దానాలతో మోసపోయిన రైతన్నలకు, మహిళలకు తోడుగా ఉండేందుకు ఈ దీక్ష చేపట్టాను. ముందు మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాం. ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టాం. ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రస్థాయి మహాధర్నాకు ఇక్కడకు వచ్చాం’ అని వైఎస్ జగన్ మాట్లాడగానే చప్పట్లతో దీక్ష ప్రాంతం దద్దరిల్లిపోయింది. ‘అక్కచెల్లెమ్మలు, రైతన్నలు పడుతున్న అవస్థలు, బాధలు చూడలేక వారి తరఫున పోరాటం చేస్తున్నాం. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడకు వచ్చిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు మీరంతా మాట్లాడండి. రేపు సాయంత్రం నేను సుదీర్ఘంగా మాట్లాడతాను’ అని అందరికీ అభివాదం చేసి వైఎస్ జగన్ దీక్షలో కూర్చున్నారు. జగన్ మాట్లాడుతున్నంత సేపూ ‘జై జగన్.. జయహో జగన్’ అనే నినాదాలు మార్మోగాయి. -
నయవంచన ఎన్నాళ్లు బాబూ..
‘మారిన మనిషినన్నావు.. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయనన్నావ్.. రుణమాఫీ చేస్తానన్నావ్.. రుణాలు కట్టవద్దని చెప్పి నేడు నయవంచన చేశావు. ఇంకెన్నాళ్లు ఈ మోసాలు చేస్తావు చంద్రబాబూ’ అంటూ తణుకు రైతు దీక్షలో వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు, మహిళలు నిలదీశారు. రుణమాఫీకి డబ్బు లేదంటూనే కోట్లు ఖర్చు చేసి విదేశాలు తిరగడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. - తణుకు బాబు మెడలు వంచేందుకే దీక్ష చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలు జిల్లాలోనే అధికంగా ఉన్నారు. బాబు మెడలు వంచేందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డికి దీక్ష చేపట్టారు. ఈ దీక్ష రైతులు, మహిళలకు ధైర్యాన్నిస్తోంది. ఇటీవల జిల్లాకు వచ్చిన చంద్రబాబు రుణమాఫీని మరిచిపోండి, పిల్లల్ని కనండి అని చెప్పటం సిగ్గు చేటు. ఎన్టీఆర్ విగ్రహానికి మొక్కి బాబుకు మంచి బుద్ధి ఇమ్మని అడగాలి. రుణమాఫీ చేయమని కోరాలి. జిల్లా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని మా ముందుకు వచ్చిన వైఎస్ జగన్‌కు అభినందనలు తెలుపుతున్నాను. - ఆళ్ల నాని, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నయవంచనకు బాబు మారుపేరు చంద్రబాబు మాటలు నమ్మి రాష్ట్రంలోని రైతులు అన్యాయమైపోయారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. అదీ లేకుండా పోయింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానని, రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి వాటిని పక్కాగా అమలు చేశారు. చంద్రబాబు మాత్రం కోటయ్య కమిటీపై సంతకం చేసి రుణమాఫీని కృష్ణార్పణం చేశాడు. నయవంచనకు మారురూపంగా ప్రజలు బాబును భావిస్తున్నారు. - కారుమూరి నాగేశ్వరరావు, తణుకు నియోజకవర్గ కన్వీనర్ ఆంక్షలతో రైతులకు కష్టాలు రుణమాఫీకి రకరకాల ఆంక్షలు విధించటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి రాకముందు అసలు ఆధార్‌కార్డు ఎందుకన్నారు చంద్రబాబు. ఇప్పుడేమో ప్రతి పథకానికి ఆధార్‌లింక్ పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో 16 లక్షల మంది పింఛన్లు తొలగించి వారి పొట్టగొట్టావు. రాజధాని పేరుతో విజయవాడలో ల్యాండ్ ఫూలింగ్ చేస్తూ 30 వేల ఎకరాల్లో భూకబ్జాలు, భూదందాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు నీచమైన ఆలోచనలు చూసి జనం చీకొడుతున్నారు. జీతాలకు డబ్బులు లేవంటూనే విదేశాలు ఎలా పర్యటిస్తున్నావ్. - వంగవీటి రాధా, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ఒక్క కార్యక్రమమైనా సజావుగా చేశావా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఎలాగుండేదో అందరికీ తెలుసు. ఆయన కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేశారు. అతిథి గృహానికి కోట్లు ప్రజాధనం కుమ్మరించారు. రూ.87 వేల కోట్లు రుణాల మాఫీకి రూ.5 వేల కోట్లు కేటాయించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఇస్తానన్న నిధులు సైతం విడుదల చేయకుండా నియోజకవర్గాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. 8 నెలలు గడిచినా ఒక్క కార్యక్రమం అయినా చేయకుండా తాత్సారం చేస్తున్నారు. - ముస్తఫా, గుంటూరు ఎమ్మెల్యే బాబుపై 420 కేసు పెట్టాలి ఎన్నికల్లో ప్రజలు ఎంత మోసపోయారో ఇప్పుడే తెలుస్తుంది. రుణాలు మాఫీ చేయకుండా కప్పదాటు కుట్రలు చేస్తున్నారు. ఆఖరికి పింఛన్లు ఇవ్వటానికి కూడా షరతులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మోసాలకు పాల్పడుతున్న చంద్రబాబుపై 420 కేసు పెట్టాలి. ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అమలు సాధ్యం కాని వాగ్ధానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టడం దారుణం. చంద్రబాబూ ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడతావు. రుణమాఫీకి నిధులు లేవంటూనే విదేశీ పర్యటనలు, ఆడంబరాలకు ఖర్చు చేయడం ఎంతవరకు సబబో నువ్వే చెప్పాలి. ఎంతకాలం కుదరదు. - డి.ఈశ్వరి, ఎమ్మెల్యే అధికారమే పరమావధిగా.. అధికారమే పరమావధిగా మోసపూరిత వాగ్ధానాలు చేశారు. ప్రజల్ని ఎలా మోసం చేయాలో ఇప్పటికీ ఆలోచిస్తున్నారు. కుటిలనీతితో పాలిస్తున్నారు. ఇప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడకపోవటం దారుణం. నగలపై తీసుకున్న రుణాలు చెల్లించకపోవటంతో వాటిని వేలం వేసేందుకు బ్యాంకులు సిద్ధపడుతున్నాయి. రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు చేతపట్టుకుని రైతులు రోడ్లుపై తిరుగుతున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని యువతను ఆకర్షించి గెలిచాడు. జిల్లాకు ఇన్నిసార్లు వచ్చినా ఒక్క అభివృద్ధి పథకాన్ని కూడా ప్రారంభించలేదు. - మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ చంద్రబాబు మాట నమ్మి.. ఉండ్రాజవరం ఇండియన్ బ్యాంకులో లక్షాయాభై వేలు లోను తీసుకున్నాను. చంద్రబాబు రుణమాఫీ హామీతో ఆనందపడ్డాను. హామీ ఇచ్చి నట్టేట ముంచారు. ఇప్పుడు అప్పటి నుంచి వడ్డీ కట్టాల్సి వస్తోంది. రుణమాఫీ చేయకపోతే ఆత్మహత్యే మాకు దిక్కు. కనీసం పింఛన్ కూడా రావడంలేదు. - కంటూరి జానకిరావు, వేలివెన్ను బ్యాంక్ నుంచి నోటీసులు నేను కూలీనాలీ చేసుకుని బతుకుతాను. డ్వాక్రా గ్రూపులో ఉన్నాను. మా గ్రూపులో 15 మంది సభ్యులు కలిపి 5 లక్షలు తీసుకున్నాం. రుణమాఫీని నమ్మి రుణం పెంచుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియడంలేదు. నాకు బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయి. - సరుదు లక్ష్మి, తాటిపర్రు, ఉండ్రాజవరం మండలం మా నోట్లో మట్టికొట్టాడు రుణమాఫీ చేస్తారని ఎదురు చూస్తూ ఇప్పటి వరకూ రెండు లక్షలు కట్టాం. ఇంకా లక్ష రూపాయలు కట్టాలి. ఇంకెప్పుడు చేస్తారు రుణమాఫీ అంటే అప్పు మొత్తం కట్టేశాక చేస్తారేమో. గ్రూపులోని అందరం కూలి పనులు చేసుకునే వారమే. హామీల మీద హామీలిచ్చి ఆడపడుచలందరి నోట్లో చంద్రబాబు మట్టికొట్టాడు. - నెల్లి చిట్టెమ్మ, వెంకట్రామన్నపాలెం, పెనుగొండ మండలం ఇంత మోసమా నాకున్న 4 ఎకరాల్లో మొక్కజొన్న, వరిసాగు చేయడానికి మా ఊరి స్టేట్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ. 46 వేలు రుణం తీసుకున్నాం. టీడీపీ నాయకులు రుణమాఫీ చేసేస్తాం అని ఇచ్చిన హామీలన్నీ వట్టి మాటలే. చంద్రబాబు మాటలు నమ్మినందుకు అవ్వకు చెడ్డాం.. బువ్వకు చెడ్డాం. ఇంత మోసమా? - రాచపోలు ఫ్రాన్సీస్, కొత్తపల్లి, లింగపాలెం మండలం రైతుల కడుపుకొట్టాడు చంద్రబాబు కట్టొద్దని చెబితే తీసుకున్న వ్యవసాయ రుణం కట్టడం మానేశా. ఇప్పుడు బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి. చంద్రబాబు హామీలు నమ్మి మేము రోడ్డున పడ్డాం. మాకు ఆత్మహత్యలే శరణ్యం. రుణమాఫీ అంటూ రైతుంలందరి కడుపుకొట్టాడు. ఏ హామీని నెరవేర్చలేదు. - కాపగ రామకృష్ణ, వల్లూరుపల్లి, పెంటపాడు మండలం దొంగోడి చేతికి తాళాలిచ్చారు జగనొస్తే నాకు న్యాయం జరుగుద్దనుకున్నా. జనాలు దొంగోడి చేతిలో తాళాలు పెట్టారు. మోసం చేసేవాడికే పదవి ఇచ్చారు. ఇప్పుడేడుత్తున్నారు. నా ఇన్ని సంవత్సరాల కాలంలో టీడీపీ మహిళలకు చేసిన న్యాయం ఒక్కటి కూడా లేదు. నాకు రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పింఛను వచ్చేది ఇప్పుడు తీసేశారు. - బొమ్మిడి మాణిక్యమ్మ, దువ్వ, తణుకు మండలం రూ.2 వేలు మాఫీ నాకున్న అరవై సెంట్ల వ్యవసాయ భూమితో పాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. నాకున్న బంగారంతో రూ.1.50 లక్షలు రుణం తీసుకున్నా. చంద్రబాబు రుణమాఫీ హామీతో సంబరపడ్డాను. రెండు వేలు మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. - శకనాల రంగారావు, తణుకు మండలం, కోనాల గ్రామం మహిళల్ని వంచించాడు మహిళలంటే ఎంతో గౌరవమని చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళలను వంచించాడు. మాఫీ హామీతో నమ్మి ఓట్లేశాం. ఇప్పుడు గ్రూపు అంతటికీ కలిపి రూ.10 వేలు మాఫీ చేస్తామంటూ చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రుణాలు కట్టవద్దంటే కట్టలేదు. ఇప్పుడు వడ్డీలకే వేలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. - పువ్వుల రతీదేవి, డ్వాక్రా మహిళ -
‘దీక్షాధారి’ దారిలో.. ఉప్పొంగిన అభిమాన ఝరి
తమ పక్షాన పోరాడే యోధునికి జనం సైదోడన్నారు. తమ మేలు కోరే వాడికి మనసారా జేజేలు పలికారు. ఎక్కడైనా, ఎన్నడైనా.. తమ కోసం నిలిచే, తాము పిలిస్తే పలికే ఆ జననేతపై తాము పెంచుకున్న గురిని అడుగడుగునా చాటారు. ‘రైతుదీక్ష’ చేపట్టడానికి.. మధురపూడి విమానాశ్రయం నుంచి తణుకు వెళ్లిన జగన్‌పై దారి పొడవునా జనం జేజేలు పలికారు. వాగూవంకా, చెలమాఏరూ కలిసి నదిగా విస్తరించినట్టు.. 16వ నంబరు జాతీయ రహదారిపై సాగిన ఆయన కాన్వాయ్ తణుకు చేరే సరికి అఖండ జనవాహినిగా గోచరించింది. సాక్షి, రాజమండ్రి :అన్నదాతలకు, ఆడపడుచులకు అన్యాయం చేస్తే ఊరుకోనంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం రెండు రోజుల దీక్షను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ఆయన విమానంలో ఉదయం 10.45 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో తణుకు బయలుదేరి వెళ్లారు. రుణమాఫీ చేస్తానని ఆశలు కల్పించి, అధికారం వచ్చాక దగా చేసిన చంద్రబాబు తీరును ఎండగట్టేందుకు, రైతులు,మహిళల పక్షాన నిలిచి పోరాటం చేసేందుకు దీక్షోన్ముఖుడైన జననేతకు మద్దతు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలి వచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారితో విమానాశ్రయం పరిసరాలు కిక్కిరిశాయి. వారంతా వెంట రాగా ఉదయం 11.00 గంటలకు విమానాశ్రయం నుంచి బయలు దేరి జగన్ రాజమండ్రి, వేమగిరి, రావులపాలెం మీదుగా తణుకు చేరుకున్నారు. మార్మోగిన జేజేలు.. రావులపాలెం దాటాక గోపాలపురం జంక్షన్ వద్ద కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా రైతులు, మహిళలు, అభిమానులు జగన్‌కు స్వాగతం పలికారు. జిల్లాకు చెందిన నేతలతో కలిసి ఉన్న జగన్ వాహన సముదాయం గోపాలపురం రాగానే అభిమానులు బిగ్గరగా ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ ఎదురేగారు. అక్కడి నుంచి 500 ఆటోలు, 100 మోటారు సైకిళ్లు, 50 కార్లలో సుమారు ఐదు వేల మంది జగన్ వెంట భారీ ర్యాలీగా తణుకు చేరుకున్నారు. దీంతో 16వ నంబరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఒక్కసారిగా జామ్ అయింది. జగన్‌కు స్వాగతం చెప్పడానికి వచ్చిన సందర్భంగా విమానాశ్రయంలో పార్టీ శాసన సభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు. నాడు బాబును నమ్మి నేడు మోసపోయామని వేదనతో ఉన్న రైతులు, మహిళల పక్షాన నిలబడేందుకే జగన్ తణుకులో 48 గంటల దీక్ష చేపట్టారన్నారు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరిని విడమరిచేందుకు తమ పార్టీ అధ్యక్షులు దీక్ష బూనారన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ తమ పార్టీ.. ప్రజలు, రైతులు, డ్వాక్రా సంఘాల పక్షాన పనిచేస్తోందన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారన్నారు. జగన్‌కు స్వాగతం పలికిన నేతలు కోరుకొండ : మధురపూడి విమానాశ్రయంలో జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన నేతలు జగన్‌కు స్వాగతం పలి కారు. వీరిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యులు జ క్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, కొల్లి నిర్మల కుమారి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, కుడుపూడి చిట్టబ్బాయి, అధికార ప్రతినిధులు పి.కె.రావు, గొల్లపల్లి డేవిడ్, రాజు, నియోజక వర్గ కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, బొంతు రాజేశ్వరరావు, వివిధ విభాగాల రాష్ట్ర కమిటీ సభ్యులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, మాసా రాంజోగ్, వివిధ జిల్లా సెల్ల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయ్‌భాస్కర్, శెట్టిబత్తుల రాజబాబు, యనమదల మురళీకృష్ణ, మార్గన గంగాధర్, రాజమండ్రి నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మే డపాటి షర్మిలారెడ్డి, జిల్లా నేతలు విప్పర్తి వేణుగోపాల్, మిండగుదిటి మోహన్, నక్కా రాజబాబు, అల్లూరు కృష్ణంరాజు, రావిపాటి రామచంద్రరావు, గిరజాల బాబు, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, అడపా హరి, చెల్లుబోయిన శ్రీ ను, గుర్రం గౌతమ్, కానుబోయిన సాగర్, శెట్టిబత్తుల రా జబాబు, వట్టికూటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దీక్షలో నేడు జిల్లా నేతలు.. తణుకులో జగన్ చేపట్టిన దీక్షలో రెండోరోజైన ఆదివారం జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లోని పార్టీనేతలు, అభిమానులు పాల్గొననున్నారు. వీరితో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు కూడా దీక్షలో జగన్‌కు మద్దతు పలికేందుకు బయలుదేరుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ జిల్లా సెల్ల కన్వీనర్లు, నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు, ఇతర జిల్లా నేతలు ఈ మేరకు శనివారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తి చేశారు. -
జననేతకు సంఘీభావం
జగన్ దీక్షకు పెద్ద ఎత్తున తరలిన ఎంపీ, ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా తరలివె ళ్లిన నేతలు, కార్యకర్తలు, మహిళలు దీక్షా ప్రాంగణంలో మాట్లాడిన ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో చేపట్టిన దీక్షకు చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ముఖ్య నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. ముఖ్యంగా దీక్షకు తరలివెళ్లిన వారిలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా, పార్టీ ప్రజాసేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్, సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, ట్రేడ్ యూనియన్ నాయకుడు బీరేంద్రవర్మ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి చక్రపాణిరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మిద్దెల హరి, మైనారిటీ సెల్ కార్యదర్శి సిరాజ్ బాష, జాయింట్ సెక్రటరీ విద్యాధర్‌రెడ్డి, భాస్కర్‌నాయుడు, జాయింట్సెక్రటరీలు బాబ్జాన్, రెడ్డిశేఖర్, జింకా వెంకటాచలపతి, విద్యార్థి నాయకుడు హరినాథ్‌రెడ్డి, తిరుపతి నేత వై.సురేష్ ఉన్నారు. రాజధాని పేరుతో కాలయాపన : ఎమ్మెల్యే రోజా తొలి రోజు దీక్షా ప్రాంగణంలో నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి గట్టెక్కి రాజధాని పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన గొంతుక వినిపించేందుకే జగన్ దీక్ష చేపట్టారన్నారు. జగన్ దీక్షపై పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజా సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ చూపుతోందని నిలదీశారు. ప్రజా సమస్యలను విస్మరించి రాజధాని పేరుతో రైతులను, మహిళలను చంద్రబాబు దగా చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో: ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం అనేక హామీలు గుప్పించి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో ఎన్నికల్లో గ ద్దెక్కారని ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. జగన్ దీక్షకు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, రైతులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివెళ్లారు. -
‘తూర్పు’న ఘనస్వాగతం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రైతు దీక్ష చేపట్టేందుకు శనివారం జిల్లాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అడుగడుగునా ఆదరాభిమానాలు చూపించారు. హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం ఉదయం మధురపూడికి చేరుకున్న జగన్‌కు జిల్లా నలుమూలల నుంచీ తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వారంతా విమానాశ్రయంలో పార్టీ అధినేతను కలుసుకున్నారు. అక్కడ నుంచి జగన్ తణుకు బయలుదేరారు. రావులపాలెం సమీపంలో గోపాలపురం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన రైతులు, మహిళలు, పార్టీ నేతలు ఎదురేగి జగన్‌కు స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మోటార్‌సైకిళ్లు, ఆటోలతో ర్యాలీగా తణుకులోని దీక్షాస్థలికి తరలివెళ్లారు. జగన్మోహన్రెడ్డి వెంట జ్యోతుల నెహ్రూతో పాటు ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యేలు కుడుపూడి చిట్టబ్బాయి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, అల్లూరు కృష్ణంరాజు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, జడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లు తణుకు వెళ్లారు. -
రైతు దీక్షలో జిల్లా నేతలు
శ్రీకాకుళ అర్బన్, టెక్కలి: రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసిన టీడీపీ సర్కారు దుర్నీతిని ఎండగట్టేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతుదీక్షలో జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరుగుతున్న ఈ దీక్షల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, ఎమ్మేల్యేలు తరలి వెళ్లారు. శుక్రవారం సాయంత్రమే పలువురు వెళ్లగా.. శనివారం ఉదయం ఇంకొందరు వెళ్లారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగానే జగన్మోహనరెడ్డి చేపట్టిన రెండు రోజుల ఈ దీక్షకు పాతపట్నం, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, పార్టీ నాయకులు బగ్గు రామకృష్ణ, అంబటి శ్రీనివాసరావు, బహుదూర్ జానీ, మెండ రాంబాబు, కరిమి రాజేశ్వరరావు, శ్యామ్, రొక్కం సూర్యప్రకాశరావు, పేడాడ తిలక్, కోరాడ రమేష్, తంగుడు నాగేశ్వరరావు, గుడ్ల మల్లేశ్వరరావు, పి. సౌజన్య తదితరులు పాల్గొన్నారు. అలాగే టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంపతిరావు రాఘవరావు, చింతాడ ధర్మారావు, జనార్ధన్‌రెడ్డి,జి. మోహన్‌రెడ్డి, ఎన్.ఆనందరావు, ఎన్.పుష్కరరావు, బి.లోకనాథం, ఎమ్.శంకర్, ఎన్.సింహాచలం, వై.పున్నయ్య, తాడి చందు, ఇ.జయరాంతో పాటు నాలుగు మండలాల నుంచి నాయకులు శనివారం ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. -
చంద్రబాబు చరిత్ర మోసాలమయమే
రైతు దీక్షలో ధ్వజమెత్తిన నేతలు అధికార దాహంతో హామీలు గుప్పించి.. సీఎం అయ్యాక ప్రజలను దగా చేశారు ప్రజల పక్షాన పోరాటంలో ప్రతిపక్ష నేతగా జగన్ తన బాధ్యత నిర్వర్తిస్తున్నారు బాబుపై రైతు దీక్షలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతల మండిపాటు తణుకు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్‌కు చెయ్యిచ్చి తెలుగుదేశం పార్టీ పంచన చేరిన అవకాశవాది చంద్రబాబు.. కూతుర్నిచ్చి పెళ్లి చేసి, పదవులు ఇచ్చి గౌరవం పెంచిన మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని కాజేసిన చరిత్ర హీనుడు చంద్రబాబు.. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను వంచించి పదేళ్ల విరామం తరువాత అధికార దాహంతో హామీలు గుప్పించి తీరా సీఎం కుర్చీ ఎక్కాక ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు చరిత్ర మొత్తం మోసాలమయమే’’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పలువురు నేతలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు హామీల అమలు కోరుతూ రైతులు, మహిళలకు బాసటగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శనివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టిన రైతుదీక్షలో పలువురు నేతలు మాట్లాడుతూ.. చరిత్రలో నిలచిపోయే రాజధాని నిర్మిస్తానని చెబుతున్న చంద్రబాబు.. వాస్తవానికి ప్రజలను మోసంచేయడంలో చరిత్రలో నిలిచిపోతాడంటూ ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాటంలో ఎంత కష్టమైనా వెన్నుచూపని, మడమతిప్పని జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంటే.. పాలక టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టి అవాకులు చెవాకులు పేలుతున్నారని వారు మండిపడ్డారు. నిరంతరం ప్రజల తరఫున నిలిచి పోరాడే తత్వం వై.ఎస్.రాజశేఖరరెడ్డి వారసుడైన జగన్క్త్రంలోనే ఉందని ఉద్ఘాటించారు. ఆయా నేతల ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు వారి మాటల్లోనే... బాబు మారలేదు ‘‘తాను మారానని గతంలో చేసిన తప్పులు చేయననీ, తనను నమ్మాలని ఎన్నికల్లో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ మాత్రం మారలేదు. రైతులు, మహిళలను తేలిగ్గా మోసం చేయొచ్చనే భావనతోనే చంద్రబాబు రుణ మాఫీ హామీలు ఇచ్చారు. మోసపోయిన ప్రజలు కన్నెర్ర చేస్తే ఆగ్రహంతో కొట్టుకుపోతారని చంద్రబాబుకు ప్రజలు తెలియచేయాలి.’’ - ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి సీమలో ఎన్నడూ లేనంత కరువు ‘‘రాయలసీమలో గతంలో ఎన్నడూ లేనంత కరువు వుంది. వరి మద్దతు ధర దారుణంగా పడిపోయింది. వేరు శెనగ ధరా అలానే వుంది. బ్యాంకులు ఈ సీజన్‌కు రూ. 55 వేల కోట్ల రుణ లక్ష్యాన్ని పెట్టుకుంటే 10 శాతం కూడా ఇవ్వలేకపోయారు. రుణ మాఫీ తీరే ఇందుకు కారణం. అనంతపురం జిల్లాలోనే రూ. 700 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ రైతులు కోల్పోయారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం కావాలి.’’ - విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే జగన్‌పైనే జనం నమ్మకం ‘‘చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దీక్ష చేపట్టడం ప్రజల కు భరోసా ఇచ్చినట్లయింది. చంద్రబాబు కుటిల రాజకీయాలు అందరికీ అర్థం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ మీదే జనం నమ్మకం పెట్టుకున్నారు.’’ - ఎంఎల్సీ మేకా శేషుబాబు జనం కోసం జగన్ దీక్ష ‘‘ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాజధాని జపం చేస్తున్న చంద్రబాబుకు కనువిప్పు కలిగేలా జగన్మోహన్రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. ఆయన దీక్షను చూసి కంగారు పడిన టీడీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. అధికారం కోసం అనేక హామీలు గుప్పించిన బాబు మెడలు వంచేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు చేసేందుకు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి తన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను వదిలి చంద్రబాబు రాజధాని, యోగా అంటూ కొంగజపం చేస్తున్నారు. తట్టలో రాయి తీయలేని వాడు.. నోట్లోకి వెళ్లిన రాయిని తీస్తాలే అన్నట్టుగా ఉంది చంద్రబాబు తీరు. ఉద్యోగులకు జీతాలు లేవంటూనే మంత్రుల విదేశీ విహారయాత్రలు, బాబు ప్రత్యేక విమానాల యాత్రలకు డబ్బులు దుబారా చేయడానికి ఎలా వస్తున్నాయో ఆయన ప్రజలకు చెప్పాలి. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్, మలేసియా, జపాన్‌లు తిరుగుతున్న చంద్రబాబు తెలుగు రాష్ట్రంలోని తెలుగువారి పరువు తీస్తున్నారు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న బాబు ఏడు నెలల కాలంలోనే ప్రజలకు రాక్షస పాలన చూపిస్తున్నారు.’’ - ఆర్.కె.రోజా, ఎమ్మెల్యే హామీల చంద్రబాబు గౌరవంగా తప్పుకోవాలి ‘‘అధికారంలోకి వస్తే చాలనే ఆలోచనతో హామీలు గుప్పించిన చంద్రబాబు వాటిని తాను అమలు చేయలేనని చేతులెత్తేసి గౌరవంగా తప్పుకోవాలి. రుణ మాఫీ చేయకుండా చేసినట్లు సన్మానాలు చేయించుకోవడం, అభివృద్ధిని పక్కకు పెట్టి యోగాలు, డ్యాన్సులు చేయడం చంద్రబాబుకే చెల్లింది. జగన్ ప్రజల కోసం దీక్షచేపట్టడం రాష్ట్రానికి వరం.’’ - కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే అబద్ధాల్లో చంద్రబాబు రికార్డు ‘‘అబద్ధాల్లోను, మాట మార్చడంలోను చంద్రబాబు రికార్డు నెలకొల్పారు. బాబు నోట నిజం మాట రాదు. అబద్ధాల బాబు, వాగ్ధానాల బాబు, ఆల్ ఫ్రీ బాబుగా ఆయనకు ఎన్నో బిరుదులు ఇవ్వొచ్చు. పిల్లనిచ్చిన మామను మోసం చేసి పదవిని లాక్కున్నాడు. ఇప్పుడు తనకు ఇదే ఆఖరి అవకాశం అనుకుని నోటికొచ్చిన వాగ్దానాలు చేసి, తీరా గెలిచాక వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాడు. మాట ఇస్తే నెరవేర్చాలన్న కార్యశుద్ధి వైఎస్ తనయుడు జగన్‌లో చూశాను. జగన్మోహన్రెడ్డికి వస్తున్న జనాదరణను చూసి బాబుకు గుండెల్లో దడ పుడుతోంది. రుణమాఫీ అమలు చేయడం చేతకాని బాబు ఇప్పుడు రాజధాని పేరుతో రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములను లాగేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అన్నదాతలు ఆగ్రహిస్తే.. మహిళామ తల్లులు ఆక్రోశిస్తే బాబు అడ్రస్ గల్లంతే. రైతు దీక్షకు వచ్చిన స్పందన చూస్తే ఇక రోజూ మాకు ధర్నాలు, దీక్షలు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.’’ - నందమూరి లక్ష్మీపార్వతి దగాపడ్డ రైతులు, మహిళల కోసం దీక్ష ‘‘చంద్రబాబు మోసాలతో దగా పడిన రైతులు, మహిళలను ఆదుకోవడానికే జగన్ దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకే ఈ దీక్ష జరుగుతోంది. చంద్రబాబు హామీలను నమ్మి మోసపోయిన పశ్చిమగోదావరి జిల్లా వాసులకు అండగా నిలిచేందుకు జగన్ దీక్ష చేయడం అభినందనీయం.’’ - ఆళ్ల నాని, వైఎస్సార్ సీపీ ప.గో. జిల్లా అధ్యక్షుడు బాబొచ్చాడు.. జాబు పోయింది ‘‘బాబొస్తే జాబు వస్తుంది అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఆయన సీఎం అయ్యాక ఉన్న జాబులు కూడా పోయాయి. రైతు రుణ మాఫీ కోసం తొలి సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు కోటయ్య కమిటీని వేసి హామీలను కృష్ణార్పణం చేశారు.’’ - కారుమూరు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిలో బాబు తెల్లముఖం ‘‘ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదు. తెల్లకాగితాలు (శ్వేత పత్రాలు) విడుదల చేసి గొప్పలు చెప్పుకున్న సీఎం చంద్రబాబు అభివృద్ధిలో తెల్లముఖం వేస్తున్నారు. బాబు మోసపూరిత హామీలపై ఇంటింటికీ తీసుకు వెళ్లి ప్రచారం చేయాలి.’’ - మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వ్యవసాయాన్ని ఆదుకుంది ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌లే ‘‘రాష్ట్రంలో వ్యవసాయానికి ఉతమిచ్చి రైతును ఆదుకుంది ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌లే. వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు అపహాస్యం చేశారు. వైఎస్ వ్యవసాయాన్ని పండగ చేస్తే చంద్రబాబు దండగ అన్నారు. రుణ మాఫీపై రోజుకో మాట మార్చి రైతులను చంద్రబాబు దగా చేశారు.’’ - ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు బాబు నిజం చెప్పరు ‘‘చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పరు. ఆ అలవాటే ఆయనకు లేదు. అందుకే జనాన్ని మోసగించే హామీలు ఇచ్చి సీఎం అయ్యారు. ఇప్పుడు జగన్ దీక్షను చూసి టీడీపీ నేతలు గుబులు చెందుతున్నారు.’’ - గౌస్ లాజం, వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ కార్యదర్శి హామీల్లో చంద్రబాబుది ప్రపంచ రికార్డు ‘‘అధికారం కోసం ఎన్ని హామీలైనా ఇవ్వొచ్చని నిరూపించి చంద్రబాబు వరల్డ్ రికార్డు నెలకొల్పారు. మోసాల్లో ఆరితేరిన చంద్రబాబు బండారం రెండు నెలల్లోనే బయటపడింది. రుణ మాఫీ సక్రమంగా అమలు చేయలేక రాజధాని, ఇతర సాకులతో కాలయాపన చేస్తున్నారు.’’ - కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు రైతులు, మహిళా సంఘాల ఆవేదన బాబు నిజస్వరూపం తెలిసింది... ‘‘మా ఇంట్లో డ్వాక్రా, పంట రుణాలు మూడున్నా యి. ఇందులో ఒక్కటి కూ డా మాఫీ కాలేదు. మూడు లోన్లకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి ఆయన సీఎం అవుతూనే అప్పులన్నీ మాఫీ చేస్తారని నమ్మి మోసపోయాము. బాబు నిజ స్వరూపం ఏమిటో ఇప్పుడు తెలిసింది. ఇది డ్వాక్రా మహిళలందరికీ గుణపాఠం కావాలి. బాబును దించేవరకు మనం నిద్ర పోకూడదు.’’ - జానకి, చింతలపూడి ,డ్వాక్రా మహిళా సంఘం సభ్యురాలు నమ్మించి నట్టేట్లో ముంచారు... ‘‘డ్వాక్రా రుణ మాఫీ అని చంద్రబాబు మమ్మల్ని మో సం చేశారు. ఎన్నికలప్పుడు మా అప్పులున్నీ మాఫీ చేస్తానని చెప్పడంతో మహిళలు ఆయనకు ఓట్లేశారు. ఎన్నికలయ్యాక దీని గురించి పట్టించుకోకుండా జ పాన్, సింగపూర్ అంటూ తిరుగుతున్నారు. రుణా లు మాఫీ చేస్తే నాకు కొంతైనా మేలు జరుగుతుం దని అనుకున్నాను. చంద్రబాబు నన్ను కూడా నమ్మించి నట్టేట్లో ముంచారు. మాఫీ చేయకపోతే బాబును మహిళలు ఇక జన్మలో నమ్మరు.’’ - గంపల బ్రహ్మవతి, ఏలూరు,డ్వాక్రా సభ్యురాలు రాజధాని పేరుతో భూ దందా ‘‘విజయవాడను రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో 35 వేల ఎకరాలు సేకరించి రైతులను దగా చేస్తున్నారు. సొంత మనుషుల కోసం భూ దందాలు, కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయ భూములను కాజేయడం చాలా దారుణం. ’’ - వంగవీటి రాధా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు బ్రిటిష్ వాళ్లే నయం ‘‘చంద్రబాబు పాలన కంటే బ్రిటిష్ పాలనే న యంగా ఉంది. ప్రజా వ్యతిరేక విధానాల్లో బ్రి టిష్ వాళ్ల కంటే చంద్రబాబు అపఖ్యాతి మూ టగట్టుకున్నారు. రైతులు, మహిళలు, అన్ని వర్గా ల వారిని మోసం చేశారు.’’ - తెల్లం బాలరాజు, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అందర్నీ హోల్‌సేల్‌గా మోసం చేశారు... ‘‘మోసం, దగా, కుట్ర చంద్రబాబునాయుడు నైజం. రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ అంద ర్నీ హోల్‌సేల్‌గా మోసం చేశారు. రాజధాని లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. చంద్రబాబు మోసాన్ని చూసి ఒక రైతుగా ఎంతో బాధపడుతున్నాను. జగన్ దీక్ష చూసైనా చంద్రబాబు మారి హామీలను అమలు చేయాలి.’’ - కుమార్, రైతు నిడదవోలు, పశ్చిమగోదావరి జిల్లా -
అన్నదాత.. తణుకు బాట
వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలంతా అక్కడే నేడు భారీగా తరలివెళ్లేందుకు ఏర్పాట్లు విజయవాడ : అన్నదాతలను, మహిళలను ప్రభుత్వం వంచిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం చేపట్టిన రెండు రోజుల రైతు దీక్షకు సంఘీభావంగా జిల్లాలోని రైతులు, మహిళలు భారీగా తరలి వెళ్లారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి రైతులు స్వచ్ఛందంగా బస్సులు, కార్లలో తణుకుకు వెళ్లి దీక్ష చేస్తున్న జగన్మోహన్రెడ్డిని కలిసి నీరాజనాలు పలికారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వందల సంఖ్యలో వాహనాలు పశ్చిమగోదావరి జిల్లాకు తరలి వెళ్లడంతో జాతీయ రహదారి వాహనాలతో కిటకిటలాడింది. రోడ్డు పొడుగునా పండుగ వాతావారణం నెలకొంది. జిల్లా నుంచి వెళ్లిన రైతుల్లో అనేక మంది ఆదివారం సాయంత్రం వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకోగా, కొంతమంది రైతులు శనివారం రాత్రి జిల్లాకు వచ్చి ఆదివారం ఉదయం తిరిగి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. ముఖ్య నేతలంతా తణుకులోనే... వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్య నేతలంతా శనివారం తణుకులోనే ఉన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ అక్కడే ఉండి దీక్ష ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథితోపాటు జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు జగన్ దీక్షకు సంఘీభావంగా పాల్గొన్నారు. శనివారం రాత్రి జిల్లాకు తరలివచ్చిన రైతులు, మహిళలు రైతు దీక్షల విశేషాలను ఇక్కడి ప్రజలకు వివరిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి జగన్ దీక్షకు మద్దతు పలుకుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల్ని, మహిళల్ని చేస్తున్న వంచనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో రైతుల రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కమిటీలు, వాయిదాలంటూ రైతుల్ని మోసం చేస్తున్న వైనంపై దీక్షా శిబిరంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని రైతులు, మహిళలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వివరిస్తున్నారు. నేడు భారీగా తరలివెళుతున్న నేతలు... ఆదివారం ఉదయం జిల్లా నుంచి పెద్ద ఎత్తున నేతలు, రైతులు తణుకు తరలి వెళుతున్నారు. మహిళలు, రైతులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తణుకు వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లను నియోజకవర్గ ఇన్చార్జిలు చేస్తున్నారు. కార్లు, బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల నుంచే సుమారు 200 కార్లలో తరలి వెళుతున్నారని సమాచారం. ఇక నగరంలోని కార్పొరేటర్లు, మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు, సభ్యులు కూడా తమ సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక పార్టీ అనుబంధ సంఘాల నేతల కూడా తణుకు వెళ్లి సంఘీభావం ప్రకటిస్తున్నారు. -
తణుకుకు తరలిరండి
నేటి నుంచి జగన్ రైతుదీక్ష విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపు గుంటూరు సిటీ : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన ప్రశ్నించడానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో తలపెట్టిన రైతు దీక్షను విజయవంతం చేసేందుకు తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరు లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ కాలేదు. కొత్త రుణాలు పుట్టే అవకాశమే లేదు. మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇక రాష్ట్రంలో రైతు బతికేదెలాగని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన రుణమాఫీ హామీనే మాఫీ చేసిన ఘనుడని సీఎం చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు సైతం రద్దు చేయకుండా మహిళల ఉసురుపోసుకున్నారని ధ్వజమెత్తారు. సీఆర్డీఏ చట్టాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రతిపాదిత గ్రామాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే బాధ్యత గల ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శని, ఆదివారాలు రైతుదీక్ష చేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు సీఎం సాధించిందేమీ లేదని, అయినప్పటికీ ఏదో ఊడబొడిచేసినట్లుగా నాలుగు రోజుల పాటు పాలనకు బ్రేక్ వేసి మంత్రులు, అధికారులు యోగా సాధకులుగా మారిపోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ దీక్ష దేనికని మంత్రులతో ప్రశ్నింపజేస్తున్న చంద్రబాబు తన యోగా దేనికో ముందు సెలవీ యాలని మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
మోసం ఆయన నైజం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం ఆయన నైజమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత తీరును నిరసిస్తూ ... రైతుల పక్షాన నిలబడి వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శనివారం చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. హామీలిచ్చి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. ముఖ్యంగా రైతులకు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ జరగ లేదు సరికదా వడ్డీ రాయితీని, పంటల బీమాను రైతులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చని, 30ఏళ్లు పాటు ఈ రాష్ట్రానికి సేవలందిస్తానని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారే తప్ప మామను వెన్నుపోటు పొడిచినట్టుగా ప్రజల్ని వెన్నుపొడిచి అధికారంలోకి వస్తామని అనలేదన్నారు. వెన్నుపోటు పొడటంలో చంద్రబాబు దిట్టని, రైతులకు, డ్వాక్రా మహిళలకు చేసిందదేనని దుయ్యబట్టారు. ఎంతసేపు జగన్‌పై ఈ కేసులు, ఆ కేసులున్నాయని చెబుతూ కాలంగడుపుతున్నారని, అలాకాకుండా తన కేసులపై తెచ్చుకున్న స్టేలను ఎత్తివేయించుకుని, విచారణ జరిపించుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. రాజకీయ దురద్దేశంతో కాంగ్రెస్ పెట్టిన కేసుల్ని పట్టుకుని చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారన్నారు. మారాను..మారాను అంటే అందరూ నమ్మారని, తీరా ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేసే వాడిగా మారారన్న విషయం అర్థమయ్యిందన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటే ఉన్న ఉద్యోగాలను తీసేసి చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నిత్యం ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజాభిమానంతోనే అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు దీక్ష శిబిరంలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్చార్జులు కడుబండి శ్రీనివాసరావు, జమ్మాన ప్రసన్నకుమార్, నెక్కల నాయుడుబాబు, పెనుమత్స సురేష్‌బాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శులు పరీక్షిత్‌రాజు, ఎస్. బంగారునాయుడు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములనాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ చలమల రమణ, తదతర నాయకులు పాల్గొన్నారు. -
రైతు దీక్షకు సంఘీభావం
భారీగా తణుకు తరలివెళ్లిన జిల్లా నేతలు, అభిమానులు విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దీక్షకు జిల్లా బాసటగా నిలిచింది. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ హామీ అమలులో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఆయన చేపట్టిన దీక్షకు జిల్లా సానుకూలంగా స్పందిం చింది. తణుకులో వై.ఎస్.జగన్ శనివారం చేపట్టిన రెండురోజుల దీక్షకు జిల్లా నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా జిల్లా నుంచే జగన్ సమరశంఖం పూరించిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 5న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. ఆ పోరాటపంథానే కొనసాగిస్తూ ఆయన తణుకులో రెండురోజుల దీక్షను చేపట్టా రు. ఈ దీక్షకు కూడా జిల్లా నుంచి భారీ స్పందన లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కదలివెళ్లిన జిల్లా: వై.ఎస్.జగన్ తణుకులో చేపట్టిన దీక్షకు జిల్లా వెన్నంటి నిలిచింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తణుకుకు తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి నుంచి రైళ్లు, బస్సులతోపాటు ప్రత్యేక వాహనాల్లో భారీ సంఖ్యలో తణుకు పయనమయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్సీ డి.సూర్యనారాయణరాజు తమ కార్యకర్తలతో కలసి దీక్షా ప్రాంగణానికి శనివారం ఉదయమే చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, కర్రి సీతారాం, తైనాల విజయ్‌కుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమశంకర్ గణేష్, ప్రగడ నాగేశ్వరరావు తమ కార్యకర్తలతో కలసి హాజరయ్యారు. పార్టీ నేతలు బొడ్డేటి ప్రసాద్, కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ, కంపా హనోక్, శ్రీకాంత్‌రాజు, పక్కి దివాకర్, రవిరెడ్డి తదితరులతోపాటు జిల్లాలోని పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల పార్టీ కన్వీనర్లు, పట్టణ పార్టీ కన్వీనర్లు తణుకు తరలివెళ్లారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ దీక్ష సభలో ప్రసంగించి ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. జిల్లా నుంచి వెళ్లిన ముఖ్య నేతలు అందరూ దీక్ష చేస్తున్న అధినేత వై.ఎస్.జగన్‌ను కలసి మాట్లాడారు. అందర్నీ ఆయన పేరుపేరున పలకరించారు. జిల్లా నుంచి ఇంకా పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో శనివారం రాత్రి తణుకు బయలుదేరి వెళుతున్నారు. -
వైఎస్ జగన్ రైతుదీక్ష
-
పాలకులకు చెంపపెట్టులా వైఎస్ జగన్ దీక్ష
-
సంఘీభావం..
రైతు దీక్షకు భారీగా తరలివెళ్లిన జిల్లా నేతలు కర్నూలు : చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల మోసపోయిన రైతులు, మహిళలు, ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నుంచి రెండు రోజులపాటు చేపట్టనున్న నిరాహార రైతు దీక్షకు సంఘీభావంగా జిల్లా నుంచి ఆ పార్టీ నేతలు, అభిమానులు శుక్రవారం తణుకుకు బయలుదేరారు. 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీతోపాటు అనేక హామీలు అమలు చేయలేదు. అధికారంలోకి రాగానే కేవలం పంట రుణాలకు మాఫీ పేరిట కాలయాపన చేసి.. రైతులపై వడ్డీ భారం మోపిన వైనాన్ని ఎండగట్టేందుకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగన్ ఈ దీక్ష చేపట్టారని పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జగన్ దీక్షకు అన్ని వర్గాల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరుతున్నారు. కాగా ఆదోని, మంత్రాలయం, ఆలూరు ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో కలిసి శుక్రవారమే రైలులో బయలుదేరారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీతోపాటు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి కూడా ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు సొంత వాహనాల్లో బయలుదేరారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నందికొట్కూరు ఐజయ్యలు శనివారం బయలుదేరుతున్నారు. జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పత్తికొండ రామచంద్రారెడ్డి, బుడ్డా శేషారెడ్డి శుక్రవారమే దీక్షా స్థలికి తరలివెళ్లారు. -
వంచనపైనే జగన్ పోరాటం
చంద్రబాబు రైతులను, మహిళలను ఘోరంగా మోసగించారు వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నిడదవోలు : రుణమాఫీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు వాగ్దానాలు ఇచ్చి చివరకు వారిని ఘోరంగా వంచించిన చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో దీక్ష చేపట్టారని పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసారుురెడ్డి అన్నారు. నిడదవోలు మండలం పురుషోత్తపల్లిలో పార్టీ నాయకుడు ముళ్లపూడి శ్రీనివాస చౌదరి ఇంటి వద్ద శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజ లకు, రైతులకు జరిగిన మోసానికి నిరసనగా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ తణుకు పట్టణంలో రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నారని వివరించారు. దీక్షకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సుమారు 9లక్షల మంది రైతులు ఉన్నారని, వారికి రూ.7,200 కోట్ల రుణాలను మాఫీ చేయూల్సి ఉండగా, ఇంతవరకు రూ.329 కోట్ల కేటారుుంచి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్నారు. ఆ సొమ్ము కూడా నేటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయలేదన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన పార్టీ కోసం కాదని.. ప్రజలు, రైతులు, మహిళలకు మేలు చేకూర్చేందుకు, ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల అమలు చేరుుంచేందుకేనని స్పష్టం చేశారు. ఇంత మోసమా.. చంద్రబాబూ.. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఓట్లు వేసిన రైతులను, మహిళలను దారుణంగా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత పాలనలో చంద్రబాబు హైటెక్ సిటీకి ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వలేదని గుర్తు చేశారు. నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు హామీలను నమ్మిన రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదన్నారు. ఇప్పుడు వడ్డీలు కట్టలేక ఇబ్బం దులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ దీక్షకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు జీఎస్‌రావు, జెడ్పీటీసీ ముళ్ళపూడి శ్రీసత్యకష్ణ, ఆత్కూరి దొరయ్య, ఎంపీపీ మన్యం సూర్యనారాయణ, జిల్లా మైనారీ ్టసెల్ కన్వీనర్ ఎండీ అస్లాం, సుంకవల్లి శ్రీహరి, గజ్జరపు రమేష్, కస్తూరి సాగర్, యాళ్ల రామారావు, నక్కా మంగన్న, ప్రభు, కత్తినొక్కుల మురళీకృష్ణ, వి.పోలయ్య, యు.కాశీ, జి.వెంకటరత్నం, పి.రాకేష్, పి.రామారావు పాల్గొన్నారు. -
నీ రాక కోసం..
రైతు దీక్షకు తణుకులో సర్వం సిద్ధం పాలకులకు చెంపపెట్టులా వైఎస్ జగన్ దీక్ష వైఎస్సార్ సీపీ శ్రేణుల ఉద్యమపథం జననేత కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న రైతులు, మహిళలు ఏలూరు : సర్కారుపై రణభేరికి సర్వం సిద్ధమైంది. టీడీపీ నయవంచక పాలనలో నిలువునా దగాపడిన రైతులు, మహిళలు, యువకులతోపాటు అన్నివర్గాల ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు తణుకులో దీక్ష బూనుతున్నారు. జాతీయ రహదారి పక్కన బెల్లం మార్కెట్ సమీపంలో శని, ఆదివారాల్లో చేపట్టనున్న రైతు దీక్షకు సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఎండగట్టేందుకు, సీఎం చంద్రబాబు నాయుడు నయవంచక స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్ జగన్ చేపట్టే దీక్ష చరిత్రాత్మకంగా నిలిచిపోయేలా పార్టీ నేతలు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేశారు. దగాకోరు పాలనపై ‘పశ్చిమ’ నుంచే మడమ తిప్పని పోరు మొదలు పెట్టాలని వైఎస్సార్ సీపీ నాయకులు తలంచారు. ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిచామని విర్రవీగుతున్న టీడీపీ నేతలకు చెంపపెట్టులా ఉండే విధంగా రైతు దీక్షను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్న నేతలు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం 8 నెలల ప్రజాకంటక పాలనపై విసుగెత్తిన ప్రజల ఆగ్రహావేశాలను ఈ దీక్ష ద్వారా సర్కారుకు చూపిం చాలని నేతలు భావిస్తున్నారు. మా కోసమే జగన్ నిరశన పశ్చిమ రైతులు, మహిళల భావోద్వేగం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆందోళనలు, దీక్షలు కొత్తకాదన్న విషయంప్రజలందరికీ తెలిసిందే. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకునేందుకు, ఓదార్పునిచ్చేం దుకు ఆయన ఎంతదూరమైనా వెళ్తారన్నది జగద్విదితం. ఇప్పుడు కూడా అదే రీతిలో చంద్రబాబు పాలనలో దారుణంగా మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళల పక్షాన నిలిచేందుకు రెండు రోజుల నిరశన దీక్ష చేపట్టారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ జగన్ చేస్తున్న రైతు దీక్షకు ఈ జిల్లాను ఎంచుకోవడం పశ్చిమ ప్రజల గుండెలను తాకింది. తమ కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న రైతు దీక్ష ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ఉండాలనేది జిల్లా ప్రజల ఆకాంక్ష. నమ్మక ద్రోహానికి మారుపేరుగా నిలిచిన చంద్రబాబు నాయుడుకు ఈ దీక్ష ద్వారా గుణపాఠం చెప్పాలని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకే స్వచ్ఛం దంగా దీక్షకు మద్దతు పలికేందుకు తరలివస్తున్నారు. రాష్ట్రానికే అన్నపూర్ణగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో తాము మోసపోయినంతగా చంద్రబాబు చేతిలో ఎవరూ మోసపోలేదని రైతులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై తుపాకులు ఎక్కుపెట్టి కాల్పించిన చంద్రబాబు తాను మారానంటే నమ్మిన జిల్లా రైతులు, ప్రజలు టీడీపీకి పట్టం కడితే కనీసం ఇక్కడి ప్రజలకు కూడా బాబు ఒరగబెట్టిందేమీ లేదని కొద్ది నెలల్లోనే గ్రహించారు. ఎన్నికల్లో బ్రహ్మరథం పడితే అధికారంలోకి వచ్చాక బ్యాంకుల ద్వారా నోటీసులు పంపి తీవ్రంగా అవమానించడాన్ని రైతులు, డ్వాక్రా మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ చేపట్టనున్న దీక్ష వారిలో జవసత్వాలను కూడగట్టి కార్యోన్ముఖులను చేస్తోంది. ప్రభుత్వంపై పోరాటానికి దిగిన వైఎస్ జగన్‌కు మద్దతుగా తామూ ఈ దీక్షలో పాల్గొని జిల్లా రైతుల సత్తాను చంద్రబాబుకు చూపేందుకు సన్నద్ధమవుతున్నారు. కదంతొక్కిన నేతలు.. విస్తత ఏర్పాట్లు రైతు దీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి మూడు రోజులుగా నియోజకవర్గ కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. దీక్షా స్థలి ఎంపిక నుంచి అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న విజయసాయిరెడ్డి స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిందిగా నేతలు, కార్యకర్తలను సూచనలు చేశారు. వారం, పది రోజులుగా పార్టీ జిల్లా సారథి ఆళ్ల నాని జిల్లావ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ విస్తృతంగా పర్యటించి శ్రేణులతో భేటీ అయ్యారు. రైతుదీక్ష సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ రాష్ర్ట కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఐదు రోజులుగా తణుకులోనే మకాం వేసి దీక్ష ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు బైక్ ర్యాలీలు, పడవల ర్యాలీలతో క్యాడర్లో ఓ ఊపు తీసుకువచ్చారు. ఇక తాను పార్టీ సమన్వయకర్తగా ఉన్న తణుకులో వైఎస్ జగన్ దీక్ష చేపట్టడంతో కారుమూరి నాగేశ్వరరావు అత్యంత ప్రతిష్టాత్మతంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. తణుకులో వైఎస్ జగన్ దీక్ష చారిత్రాత్మకంగా నిలిచిపోవాలనే లక్ష్యంతో ఆయన దీక్ష విజయవంతం కోసం అహరహం శ్రమిస్తున్నారు. ఇక జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు తమ తమ ప్రాంతాల నుంచి భారీ జన సమీకరణతో దీక్షాస్థలికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. -
అన్నదాత నేస్తం ! మీ వెంటే మేమంతా..
జగన్ రెండురోజుల దీక్షకు సైదోడు కానున్న జిల్లా పార్టీ రహితంగా మద్దతు పలుకుతున్న రైతులు నేడు మధురపూడి చేరుకుని, తణుకు వెళ్లనున్న వైఎస్సార్ సీపీ అధినేత కాకినాడ : రుణమాఫీ హామీతో ప్రలోభపెట్టి, గద్దెనెక్కి, ఆనక అన్నదాతలను హతాశులను చంద్రబాబు సర్కార్ వంచనను ఎండగట్టేందుకు తణుకులో చేపట్టనున్న రెండురోజుల దీక్షాసమరంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సైదోడుగా నిలిచేందుకు ‘తూర్పు’ పార్టీ శ్రేణులు, రైతులు, అభిమానులు సన్నద్ధమయ్యారు. ఇంతవరకు జగన్‌ప్రజల పక్షాన చేపట్టిన అన్ని ఆందోళనల్లోనూ జిల్లా వెన్నంటి నిలుస్తూనే ఉంది. అదే వరవడి తణుకు దీక్ష సందర్భంగానూ కొనసాగనుంది. జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం ఉదయం 10 గంటలకు మధురపూడి ఎయిర్‌పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి రైతులు, పార్టీ నేతలు వెంట రాగా తణుకులో దీక్షా శిబిరానికి చేరుకుంటారు. రైతుపక్షపాతిగా వారికి జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపి సంపూర్ణ రుణమాఫీ అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో జగన్ చేయనున్న దీక్షకు పార్టీరహితంగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా నేతలు మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకుని జగన్ వెంట దీక్షా శిబిరానికి వెళ్లనున్నారు. రుణమాఫీ మోసంపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, మండల, గ్రామ కన్వీనర్లు, ద్వితీయ శ్రేణి నేతలు గ్రామాల్లో విస్తృతంగాప్రచారం నిర్వహించి రైతుల కు అవగాహన కల్పించారు. పలు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. దీక్షకు మొదటి రోజు శనివారం కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు, నాయకులు, పార్టీ శ్రేణులు తరలివెళ్లనున్నారు. దీక్షతో సర్కారుకు వణుకు ఖాయం : జ్యోతుల రైతులను మోసగించిన చంద్రబాబు సర్కార్ మెడలు వంచైనా అన్ని వ్యవసాయ రుణాలనూ మాఫీ చేయించే లక్ష్యంతోనే జగన్ తణుకులో దీక్షకు ఉపక్రమిస్తున్నారని శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తొలిరోజైన శనివారం కొత్తపేట నియోజకవర్గం నుంచి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారితో పాటు జిల్లానేతలు తణుకు తరలివెళ్లనున్నారని చెప్పారు. రెండో రోజు ఆదివారం జిల్లావ్యాప్తంగా రైతులు, పార్టీ శ్రేణులు తరలి వెళ్లి జగన్‌కు సైదోడుగా ఉంటాయన్నారు. చంద్రబాబు హామీని నమ్మి మోసపోయిన రైతులు.. పార్టీలను, జెండాలను పక్కనబెట్టి జగన్ దీక్షకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేతగా జగన్ రుణమాఫీ కోసం రైతులు, డ్వాక్రా మహిళల పక్షాన నిరంతరం పోరాడుతున్నారన్నారు. అసెంబ్లీలో కూడా ఈ విషయంలో చంద్రబాబు సర్కార్ మోసాన్ని ఆయన ఎండగట్టినందునే దీక్షకు రైతులు పార్టీరహితంగా మద్దతు ఇస్తున్నారన్నారు. రెండు రోజుల దీక్షతో చంద్రబాబు సర్కార్ వెన్నులో వణుకుపుట్టడం ఖాయమన్నారు. -
రైతు చూపు.. తణుకు వైపు
నేటి రైతుదీక్షకు స్వచ్ఛందంగా తరలివెళుతున్న అన్నదాతలు, మహిళలు వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీశ్రేణుల పయనం ఏర్పాట్లలో జిల్లా నేతలు విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు దీక్షకు జిల్లా మద్దతు పలుకుతోంది. ఎన్నికల హామీలను గాలి కొదిలేసిన అధికారపార్టీ రైతులను, మహిళలను వంచిస్తున్న తీరుపై ఉద్యమబాట పట్టిన వైఎస్సార్ సీపీకి మద్దతుగా తరలివెళ్లేందుకు ప్రతిఒక్కరూ సమాయత్తమయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శని, ఆదివారాల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించనున్న రైతు దీక్షను విజయవంతం చేసేందుకు రైతులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివెళుతున్నారు. పార్టీ నేతలు, శ్రేణులు పెద్దసంఖ్యలో ప్రదర్శనగా తణుకు వెళ్లటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హామీలు విస్మరించి కాలం గడుపుతున్నారు.. అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల రుణాలు కూడా పూర్తిగా మాఫీ చేస్తామని విస్తృత ప్రచారం చేసింది. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ దీనిని చేర్చడంతో రైతులు, మహిళలు బాబు మాటలు నమ్మి ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం హామీలను పూర్తిగా విస్మరించి కాలంగడుపుతోంది. రుణమాఫీ అమలుకు కమిటీ అని, విడతల వారీగా రుణమాఫీ అని, స్కేల్ ఆఫ్ పైనాన్స్ అని రకరకాలుగా మాటలు చెబుతుండటంతో అన్నదాతలు, మహిళల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, రైతుల పక్షాన నిలిచి దశలవారీగా పోరాటం సాగిస్తోంది. ఇప్పటికే రుణమాఫీ అమలు చేయాలనే డిమాండ్‌తో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహశీల్దారు కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు, ధర్నాలు నిర్వహించి రైతుల పక్షాన పోరు సాగిస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో రెండురోజుల దీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచి నేతల పయనం... జగన్ దీక్షకు జిల్లా నుంచి ముఖ్య నేతలు తణుకు పయనమయ్యారు. ఇప్పటికే అక్కడ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ గత ఐదు రోజులుగా ఉండి దీక్షా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా పార్టీ సమన్వయకర్తలు సామినేని ఉదయభాను, పేర్ని నాని, వంగవీటి రాధాక ృష్ణ తదితరులు గత మూడు రోజులుగా అక్కడే ఉండి దీక్షల నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటున్నారు. గత నాలుగు రోజుల్లో జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, రక్షణనిధి, మేకా వెంకట ప్రతాప అప్పారావు తదితరులు ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి దీక్షలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కార్యకర్తలకు వివరించారు. పార్టీ దక్షిణ క ృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి దీక్షకు తరలివెళ్లేలా శ్రేణులను సమాయత్తం చేశారు. ప్రభుత్వం ఆటంకాలు మరోపక్క ప్రజలు కూడా జిల్లాలోని పలు గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలివెళ్లటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోంది. పార్టీ కార్యకర్తలు తణుకు వెళ్లటానికి ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వాలని కోరిన క్రమంలో అనేక బస్సు డిపోల్లో మేనేజర్లు బస్సులు అద్దెకు ఇవ్వటానికి నిరాకరించారు. తమకు దీక్షకు బస్సులు ఇవ్వటానికి అనుమతి లేదని చెబుతున్నారు. -
జగన్ దీక్షకు సర్వం సిద్ధం
* ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరాహార దీక్ష * తణుకులో నేడు, రేపు కొనసాగనున్న దీక్ష.. పూర్తయిన ఏర్పాట్లు * చంద్రబాబు మోసపూరిత చర్యలను ప్రజల పక్షాన ప్రశ్నించనున్న ప్రతిపక్ష నేత * జననేత కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు, ప్రజలు * జనసంద్రమైన తణుకు పట్టణం.. శుక్రవారం నుంచే తరలి వస్తున్న జనసందోహం సాక్షి ప్రతినిధి, ఏలూరు, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు ప్రజలను మోసపుచ్చుతూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల నిరాహార దీక్షను చేపట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తణుకు హైవే పక్కన ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు జగన్ దీక్ష కొనసాగిస్తారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో మోసపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మిహ ళలు, ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష నేత ఈ దీక్షకు దిగుతున్నారు. ఈ సందర్భంగా గత ఎనిమిది నెలల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టనున్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ అంశాల్లో ప్రభుత్వ కప్పదాటు వైఖరితో ఇతరత్రా సర్కారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై వైఎస్సార్సీపీ గత నవంబర్‌లో మూడు దశల ఆందోళనలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. మొదటి దశలో భాగంగా నవంబర్ మొదటివారంలో పార్టీ శ్రేణులు అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించగా.. రెండవ దశలో డిసెంబర్ మొదటివారంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేశారు. మూడవ దశలో అధినేత జగన్మోహన్రెడ్డి స్వయంగా శనివారం రెండు రోజుల దీక్షకు దిగుతున్నారు. దీక్షలో పాల్గొనేందుకుగాను వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి విమానమార్గంలో రాజమండ్రికి చేరుకుని.. రోడ్డుమార్గాన తణుకు చేరుకుంటారు. అభిమానులతో నిండిపోయిన తణుకు స్వాతంత్య్రోద్యమం నుంచి ఎన్నో ప్రజా ఉద్యమాలకు కేంద్రమైన తణుకు నుంచే ప్రజానేత టీడీపీ ప్రభుత్వంపై ఎడతెగని పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నారు. తణుకులో జాతీయ రహదారి పక్కన బెల్లం మార్కెట్ సమీపంలో శని, ఆదివారాల్లో చేపట్టనున్న ఈ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రుణమాఫీ కొర్రీలతో రైతులను, మహిళలను, నిరుద్యోగ భృతి కల్పిస్తామని యువతను, మరోవైపు రూ.వెయ్యి పెన్షన్ ఇస్తామని చెప్పి.. సగానికి సగం మంది లబ్ధిదారులను తగ్గించి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను దారుణంగా వంచించిన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్ చేపడుతున్న దీక్షకు ప్రజలనుంచి భారీ మద్దతు లభిస్తోంది. శుక్రవారం నుంచే భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నమ్మి నిండా మునిగిన రైతన్నలు జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తణుకు పట్టణానికి చేరుకున్నారు. ఎటుచూసినా జగన్ దీక్షకు స్వచ్ఛందంగా తరలివస్తున్న రైతులే కనిపిస్తున్న పరిస్థితి. రైతులతోపాటు మరోవైపు యువకులు కూడా భారీఎత్తున తణుకు చేరుకున్నారు. దీంతో కనీవినీ ఎరుగనిరీతిలో తణుకు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని లాడ్జీలు, కల్యాణ మండపాలు, ఆడిటోరియాలు, హాళ్లు నిండిపోవడంతో ఇతరప్రాంతాల నుంచి వచ్చినవారు సభావేదికవద్దే సేదతీరుతున్నారు. రాజధాని ప్రాంతం నుంచీ.. రైతు దీక్షకు రాజధాని ప్రాంత రైతులూ పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. రాజధాని నిర్మాణానికి తమ భూములిచ్చేందుకు సిద్ధంగా లేని రైతులు ఇప్పటికే అక్కడి వైఎస్సార్సీపీ నేతల అండతో ఆందోళన చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ చేపట్టిన దీక్షకు భారీఎత్తున తరలివెళ్లడం ద్వారా పాలకులకు తమ నిరసనల తీవ్రతను తెలపాలన్నది అక్కడి రైతుల ఉద్దేశంగా కనిపిస్తోంది. అంతేగాక ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తమకు అండగా ఉన్నారన్న సంకేతాన్ని పంపాలన్నది ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, రాయపూడి, వెంకటాపురం, ఉద్దండరాయపాలెం తదితర గ్రామాల రైతుల ఆలోచన. దీక్షతో పాలకుల్లో వణుకు పుడుతోంది: ఆళ్ల నాని తణుకు హైవే పక్కన ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్ష చేపట్టనున్నారని వైఎస్సార్సీపీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్ ఆళ్ల నాని శుక్రవారం తెలిపారు. దీక్షావేదికపైనుంచి జగన్ ఏం మాట్లాడతారోనంటూ రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, పాలకుల్లో వణుకుపుడుతోందన్నారు. -
జనం కోసం జగనన్న దీక్ష
తిరుపతిరూరల్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతోందని ఆ పార్టీ ప్రజాసేవాదళ్ రాష్ర్ట అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం తిరుపతిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ తమ అధినేత జగన్మోహన్రెడ్డి చేపడుతున్న రైతు దీక్షకు రైతులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్నది వైఎస్ఆర్సీపీ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, ఉపాధ్యక్షుడు వాసు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మల్లారపు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు అండగా..
ఏలూరు (ఆర్ఆర్ పేట) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తణుకులో ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తలపెట్టిన రైతుదీక్ష వివిధ వర్గాల్లో ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి వైఎస్ జగన్ చేస్తున్న రైతు దీక్షను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు వారికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. మహిళలు మరొకడుగు ముందుకేసి ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆడపడుచులను దీక్షను విజయవంతం చేయాలని ఆహ్వానిస్తున్నారు. యువకులు బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్గిస్తున్నారు. వైఎస్ జగన్ రైతుల కోసం చేస్తున్న దీక్షకు జిల్లాను ఎంచుకోవడం వెనుక ఇక్కడి ప్రజలపై ఆయనకున్న అచంచల విశ్వాసం, అవ్యాజమైన ప్రేమే కారణమని వివరిస్తున్నారు. గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో యువకుల ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. కాగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి దీక్షా శిబిరాన్ని పరిశీలించి రైతు దీక్షను విజయవంతం చేయడానికి వచ్చేవారికి అవసరమై సౌకర్యాలు కల్పించే విషయంలో నాయకులకు సూచనలు చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని, పార్టీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, మాజీ మంత్రి నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు, ముఖ్య నాయకులు కారుమూరి నాగేశ్వరరావు, వంక రవీంద్రనాథ్, లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా తణుకు పట్టణంలో ముస్లింలు ఇంటింటికీ తిరిగి రైతు దీక్షపై ప్రచారం నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని నారాయణపురం, ఉప్పాకపాడు, కంసాలికుంట, నిడమర్రు మండలం బువ్వనపల్లిలో పార్టీ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో మండల నాయకులు, కార్యకర్తలు ఇంటింట ప్రచారం నిర్వహించారు. బుట్టాయగూడెంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షుడు తెల్లం బాలరాజు, పార్టీ నాయకులు పోల్నాటి బాబ్జి, ఆరేటి సత్యనారాయణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. జన సమీకరణపై సమీక్షించారు.పోలవరంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు వందనపు సాయిబాల పద్మ విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా మహిళలు అత్యధిక సంఖ్యలో దీక్షకు హాజరై దీక్షను బలపరచాలని పిలుపునిచ్చారు. మొగల్తూరులో పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. భీమవరంలో సానబోయిన వెంకటరమణ ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి రైతు దీక్షకు ఆహ్వానించారు. పెరవలి మండలంలో నిడదవోలు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ స్థానిక నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు, గంధం చంటి, మారిశెట్టి జగన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోల్నాటి బాబ్జి చింతలపూడి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి జన సమీకరణపై ఆరా తీశారు. కార్యకర్తలకు, నాయకులకు రూట్ మ్యాప్‌ను వివరించారు. ఆకివీడులో పార్టీ నాయకుడు గుండా సుందర రామినాయుడు ఇంటింటా ప్రచారం నిర్వహించగా, పాలకోడేరులో చిగురుపాటి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. -
తణుకులో రేపటి నుంచి రెండు రోజులు వైఎస్ జగన్ దీక్ష
ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజల పక్షాన ప్రశ్నించనున్న ప్రతిపక్ష నేత నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మహిళలకు అండగా నిలవడమే లక్ష్యం ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయని చంద్రబాబు పైగా సంక్షేమ పథకాలకు కోత..ప్రజలపై ఆర్థిక భారం సర్కారు వైఖరిని ఎండగ ట్టనున్న వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: గడిచిన ఎనిమిది నెలల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన ప్రశ్నించడానికి, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండురోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో ఆయన దీక్ష కొనసాగించనున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల మోసపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మహిళలు, ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో జగన్మోహన్రెడ్డి ఈ ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజున చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. పైగా ఎనిమిది నెలల పాలనలో వరుసగా సంక్షేమ పథకాల్లో కోత విధించడమే కాకుండా ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న వైనాన్ని ఈ దీక్ష సందర్భంగా జగన్ ఎండగట్టనున్నారు. 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీతో పాటు అనేక హామీలు అమలు చేయలేదు. అధికారంలోకి రాగానే కేవలం పంట రుణాలకు మాఫీ అంటూ అందులోనూ కోతలు పెట్టి గడిచిన ఎనిమిది నెలలుగా రకరకాల సాకులతో కాలయాపన చేస్తున్న కారణంగా రైతాంగంపై మోయలేనంత అపరాధ వడ్డీ భారం పడింది. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయనితీరును ఎత్తిచూపడంతో పాటు అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రజా సమస్యలను పట్టించుకోని తీరును ఈ దీక్ష ద్వారా జగన్ ఎండగడతారని పార్టీ నేతలు చెప్పారు. ప్రజల పక్షాన గొంతెత్తడానికి జగన్ దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రైతులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీపై చంద్రబాబు మాట మార్చినందుకు నిరసనగా 2014 జూన్ 24 నుంచి మూడు రోజుల పాటు నరకాసుర వధ పేరిట ఆందోళనను వైఎస్సార్సీపీ నిర్వహించింది. అదే ఏడాది నవంబర్ 5న ప్రభుత్వ విధానాలకు నిరసనగా 661 మండల కార్యాలయాల వద్ద నిరసన ధర్నాలు జరిగాయి. డిసెంబర్ 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు జరిగాయి. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో జగన్ స్వయంగా పాల్గొన్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తణుకులో జగన్ నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు.. జగన్ గతంలో ప్రజల పక్షాన లక్ష్యదీక్ష, జలదీక్ష, రైతు దీక్ష, ఫీజుపోరు వంటి అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అతి పెద్ద ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీ పలు సందర్భాల్లో ప్రజా సంక్షేమ పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. చంద్రబాబు సంక్షేమ పథకాల్లో కోత విధించడం, హామీలను అమలు చేయకపోవడం వంటివి ఒక ఎతై్తతే, కొత్త రాష్ట్రంలో టీడీపీ అధికారపగ్గాలు చేపట్టీ పట్టక ముందునుంచే.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై హింసాకాండ ప్రారంభమైంది. తొలి మూడు నెలల్లోనే డజను మందికిపైగా వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ హింసకు బలైతే, వందలాది మంది గాయపడ్డారు. వీటితో పాటు అక్రమ కేసుల బనాయింపునకు పాల్పడుతున్న సమయాల్లో పార్టీ తీవ్ర నిరసన గళం వినిపించింది. -
'ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయి'
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న రైతు దీక్ష ఏర్పాట్లను గురువారం వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శనివారం ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షను ప్రారంభిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు. రైతు దీక్షకు ప్రజలు భారీగా తరలి వచ్చి మద్దతు పలకాలని ఆయన కోరారు. వెన్నుపోటు పొడవడం అనేది చంద్రబాబు నాయుడు నైజమని విజయసాయి రెడ్డి విమర్శించారు. అధికారం కోసం ఆనాడు ఎన్టీఆర్ ను, నేడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. మోసపూరిత వాగ్ధానాలపై ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసే వరకు ప్రజలకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల దీక్ష చేస్తున్నారు. -
ఉద్యమ పథం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : సర్కారు చేతిలో నయవంచనకు గురైన అన్నదాతల గోడును సర్కారుకు వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తణుకులో తలపెట్టిన రైతు దీక్ష జిల్లా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతిపక్ష నేతగా చరిత్రాత్మక ఘట్టానికి తెరలేపుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై చేయనున్న పోరాటాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న ఉత్సుకత వివిధ వర్గాల ప్రజల్లో బలంగా నాటుకుంది. రైతు దీక్షను విజయవంతం చేయడానికి వైఎస్సార్ సీపీ నాయకులు కార్యోన్ముఖులు కాగా, వారిలో ఉత్సాహం నింపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు నాయకులు జిల్లాలో పర్యటిస్తూ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు. బుధవారం వివిధ నియోజకవర్గాల్లో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పర్యటనలు జరిపారు. బైక్ ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలతో టీడీపీ నాయకుల్లో ైరైతుదీక్ష ఫీవర్ ప్రారంభమైంది. ఊరూరా ఉత్సాహంగా.. వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ రాష్ట్ర నాయకులు వంగవీటి రాధా, పేర్ని నాని, చిర్ల జగ్గిరెడ్డి, తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు కారుమూరి నాగేశ్వరరావు, వంక రవీంద్రనాథ్, చీర్ల రాధయ్య తదితరులు బుధవారం తణుకులో బైక్ ర్యాలీ నిర్వహించి నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం సభాస్థలిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, తిరుమల అమరనాథ్, కర్రి పాపారాయుడు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయూలని సామినేని ఉదయభాను భీమవరంలో జరిగిన ముఖ్యనాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు. పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ నివాసంలో నాయకులతో ఆయన సమావేశమయ్యూరు. ఆయన వెంట పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధ, నరసాపురం నియోజకవర్గం ఇన్చార్జి పేర్ని నాని, పాతపాటి సర్రాజు తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, తానేటి వనిత ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించి దీక్ష విజయవంతం చేయడానికి సూచనలు ఇచ్చారు. పోలవరం నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర ఎసీ ్టసెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు, పోల్నాటి బాబ్జి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. దేవరపల్లిలో పార్టీ నాయకులు తలశిల రఘురామ్, తలారి వెంకట్రావు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి జగన్ దీక్ష విజయవంతం చేయడంలో ప్రజలను, రైతులను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. ఉంగుటూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆద్వర్యంలో నల్లమాడు, గోపాలపురం, నిడమర్రు గ్రామాల్లో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, నియోకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పెనుమంట్రలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ముదునూరి ప్రసాదరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చెల్లం ఆనంద ప్రకాష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆచంట మండలం కొడమంచిలి, వల్లూరు, పెదమల్లం గ్రామాల్లో పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి రైతు దీక్షను విజయవంతం చేయాలని ప్రచారం చేశారు. -
‘నయ వంచన’పై జగన్ పోరాటం
భీమవరం అర్బన్ : మోసపూరిత హామీలిచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నయవంచనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పో రాటం చేస్తున్నారని, దీనిలో భాగంగా తణుకులో ఈనెల 31, వచ్చేనెల 1న ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. దీక్షకు సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం బుధవారం భీమవరం వచ్చిన నాయకులు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ రుణమాఫీ హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచి లక్షలాది మందికి పెన్షన్ అందకుండా చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్మోహన్రెడ్డి తలపెట్టిన దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిలువునా ముంచారు మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని మాట్లాడుతూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని, పంట కోసం తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని చెబుతూ సీఎం చంద్రబాబు రైతులను వంచిస్తున్నారన్నారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీలిచ్చి కేవలం రూ.10 వేలు రివాల్వింగ్ ఫండ్‌గా ఇస్తామనడం తగదన్నారు. బాబు వస్తే జాబు, నిరుద్యోగుల భృతి అంటూ ఊదరగొట్టిన టీడీపీ నాయకులు వాటి అమలుకు ప్రయత్నించడం లేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు ప్రజా సమస్యలపై యువత ప్రశ్నిం చడం లేదని, మౌనంగా ఉండిపోతోందని చెబుతున్న సినీ నటుడు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో సమస్యలపై, అమలుకాని చంద్రబాబు హామీలపై ఎందుకు ప్రశ్నించడం లేదని భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తొలి సంతకం అంటూనే రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధ, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు, వేగేశ్న కనకరాజు సూరి, మచిలీపట్నం మునిసిపాలిటీ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా, నాయకులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి, ముదునూరి సుబ్బరాజు, కోడే యుగంధర్, మద్దాల సత్యనారాయణ పాల్గొన్నారు. -
జగన్ దీక్ష.. టీడీపీ పతనానికి నాంది
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యద ర్శి లేళ్ల అప్పిరెడ్డి తణుకు : రైతుల కోసం వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే దీక్ష టీడీపీ పతనానికి నాంది అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తణుకులో దీక్షాస్థలి వద్ద ఆయన మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఇలా దగాపడ్డ వారి తరఫున పోరాడటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నద్ధమయ్యారన్నారు. రైతులు ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలలో వారికి బాసటగా ఉండేందుకే తణుకును దీక్షాస్థలిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ‘జగనన్నా.. మేమంతా మోసపోయాం.. మాకు నీ అండ కావాలన్నా’ అని రాష్ట్రంలో ఏప్రాంతానికెళ్లినా జగన్మోహన్రెడ్డి వెంట ప్రజలు నడచి వస్తున్నారన్నారు. చదువుకోండి ఉన్నతోద్యోగాలు అన్న చంద్రబాబు ఆ విషయాన్నే మర్చారన్నారు. చదువుకుంటే ఉద్యోగం మాట అలా ఉంచితే, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న బాబు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కూడా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రైతు దీక్షను విజయవంతం చేయాలనే సంకల్పంతో ప్రజలు ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా దీక్షకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. దీక్షా ప్రాంగణం వద్ద కొబ్బరి కాయ కొట్టి శాస్త్రోక్తంగా పనులు ప్రారంభించారు. దీక్షను విజయవంతం చేసే బాధ్యతను తీసుకున్న నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వంక రవీంద్ర, నియోజకవర్గ సమన్వయకర్తలు చీర్ల రాధయ్య, కారుమూరి వెంకటనాగేశ్వరరావు శ్రేణులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. రుణమాఫీ పూర్తిగా చేస్తానని కాణిపాకంలో ప్రమాణం చేస్తావా చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ నేత తలశిల సవాల్ తాడేపల్లిగూడెం : రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని కాణిపాకం వినాయకుని ఎదుట ప్రమాణం చేస్తావా బాబూ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బూటకపు వాగ్దానాలతో ప్రజలను బురిడి కొట్టించిన చంద్రబబాబు ఇటీవల చెబుతున్న కబుర్లు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పవర్ ఉందని, తాకితే చాలు పుణ్యం వస్తుందన్నట్టుగా మాట్లాడుతున్న చంద్రబాబు అదే ఎన్టీఆర్ విగ్ర హాన్ని తాకితే పది కిలోమీటర్ల అవతల పడతారన్నారు. మామను వెన్నుపోటు పొడిచి ఆయనకు మానసిక ప్రశాంతత లేకుండా క్షోభకు గురిచేసిన చంద్రబాబు గురువింద మాదిరిగా ఎన్టీఆర్ బొమ్మను అడ్డంపెట్టుకుని నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్రెడ్డికి రైతుల పక్షాన, డ్వాక్రా మహిళల పక్షాన దీక్షలు చేసే అర్హత లేదన్న విధంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. రైతుకు ఏకష్టం వచ్చినా.. ముందుండే జగన్మోహన్రెడ్డికి కాకుండా దీక్షలు చేసే అర్హత, వారి బాధల గురించి మాట్లాడే అర్హత మరెవ్వరికుంటాయని ప్రశ్నించారు. పాలనను కార్పొరేటీకరణ చేసి, అభివృద్ధి సంక్షేమాన్ని గాలి కొదిలి వ్యాపారం కోణంలో పాలన చేస్తున్న, ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మేలని ఆయన హితవు పలికారు. నేడు తణుకులో బైక్ ర్యాలీ తణుకు టౌన్ : తణుకులో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని పెరవలి వైజంక్షన్ వద్దగల ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల నుంచి ఈ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గోవాలని కోరారు. -
సమరోత్సాహం
ఏలూరు (ఆర్ఆర్ పేట) :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1న తణుకులో చేపట్టనున్న రైతు దీక్ష కోసం పార్టీ నాయకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. దీక్షను విజయవంతం చేసేందుకు వివిధ హోదాల్లోని నాయకులంతా జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ నాయకులు, కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేశారు. హామీల పరంపరతో అధికారంలోకి వచ్చి.. ఆనక రైతులను, డ్వాక్రా మహిళలను, అన్నివర్గాల ప్రజలను వంచనకు గురిచేస్తున్న చంద్రబాబు తీరు, సర్కారు విధానాలపై సమరశంఖం పూరించేం దుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో రైతు దీక్షకు శ్రీకారం చుడుతున్నారనే విషయాన్ని చాటుతున్నారు. రైతు దీక్షను మన జిల్లాలోనే చేపట్టడానికి గల కారణాలను సైతం వివరిస్తున్నారు. పార్టీ జిల్లా సారథి పిలుపు మేరకు రైతు దీక్షను విజయవంతం చేయడానికి కార్యకర్తలు ఇప్పటికే చొరవ తీసుకోగా, మంగళవారం జిల్లావ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నాయకులంతా ఒక్కటై.. రైతు దీక్షను విజయవంతం చేసేందుకు జిల్లాలోని పార్టీ నాయకులంతా ఏకతాటిపై నడుస్తూ.. ఎవరికి వారు ప్రత్యేక బాధ్యతలను భుజాన వేసుకున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వంక రవీంద్రనాథ్, పార్టీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య తదితరులు దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్టీ ఎస్టీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు, మండల కమిటీ కన్వీనర్లు ఎవరికి వారు రైతు దీక్షకు సంబంధించి ప్రచారం కొనసాగిస్తూ రైతులను చైతన్యవంతుల్ని చేసే పనిలో నిమగ్నమయ్యారు. తణుకులో దీక్షాస్థలి వద్ద మంగళవారం భూమిపూజ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు వంక రవీంద్రనాథ్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య పాల్గొన్నారు. అనంతరం రేలంగిలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఏలూరులో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు ఆళ్ల నాని ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు చెందిన నాయకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. నరసాపురంలో పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మంగళవారం నరసాపురం కాలువలో పడవలతో ర్యాలీ నిర్వహించి, రైతు దీక్షకు తరలిరావాలని రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యం లో నిడమర్రులో సమావేశం నిర్వహించగా, నారాయణపురంలో కార్యకర్తలు కరపత్రాలు పంపిణీ చేసి రైతు దీక్షపై రైతులకు అవగాహన కల్పించారు. తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపిని దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పోలవరంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, చింతల పూడి, లింగపాలెం మండలాల్లో ఆళ్ల నాని, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ఘంటా మురళీరామకృష్ణ, భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, పాలకొల్లులో మేకా శేషుబాబు ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. పెనుమంట్ర, మార్టేరు, ఆచంటలో ముదునూరి ప్రసాదరాజు, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మేడపాటి చంద్రమౌళీశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. -
జగన్ దీక్షాస్థలికి భూమిపూజ
పశ్చిమగోదావరి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1న చేపట్టబోయే రైతు దీక్షకు సంబంధించి మంగళ వారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర పాలకమండలి పరిశీలకులు వంకా రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుమూరి వెంకట నాగేశ్వరరావు, గుంటూరు పార్టీ పరిశీలకులు లేళ్ల అప్పి రెడ్డి, తణుకు కన్వీనర్ చీర్ల రాధయ్య పర్యవేక్షించారు. -
జగన్ దీక్షకు మద్దతుగా పాదయాత్ర ప్రారంభం
ఉరవకొండ: పశ్చివు గోదావరి జిల్లా తణుకులో ఈనెల 31 నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టే 48 గంటల దీక్షకు, అనంతపురం జిల్లాలో హంద్రీ-నీవా ప్రాజెక్టు కాలువ నిర్మాణం త్వరగా పూర్తి చేయూలని కోరుతూ ఈ నెల 28, 29 తేదీల్లో ఉరవకొండలో తన సోదరుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టే 25 గంటల దీక్షకు సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై. వుధుసూదన్‌రెడ్డి సోవువారం ఉరవకొండ నుంచి పాదయూత్ర చేపట్టారు. అనంతపురంలో ఈ యూత్ర ముగుస్తుంది. -
రైతు దీక్షా బద్ధులై
సాక్షి ప్రతినిధి, ఏలూరు : టీడీపీ సర్కారు నయవంచన పాలనపై సమరభేరి మోగించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో తణుకులో తలపెట్టిన చరిత్రాత్మక దీక్షకు పార్టీ నేతలు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్న పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరానున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది నెలల ప్రజాకంటక పాలనపై విసుగెత్తి ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఎవరికి వారే దీక్షకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. పార్టీ జిల్లా సారధి ఆళ్ల నాని ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి నేతలను, కార్యకర్తలను సమాయత్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కొన్నిరోజులుగా జిల్లాలోనే మకాం వేసి పార్టీ నేతలను సమన్వయ పరుస్తూ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా, పార్టీ అధిష్టానం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు పర్యవేక్షకులను నియమించింది. ఈ మేరకు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధా, పార్టీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు పేర్ని నాని, కొయ్య ప్రసాదరెడ్డిలు మంగళవారం జిల్లాకు రానున్నారు. -
‘బాబు’ వంచనను ఎండగట్టడమే లక్ష్యం
జగన్ దీక్షను విజయవంతం చేయండి భారీగా తణుకుకు తరలి రండి రైతుల కోసం ఉద్యమం కొనసాగిద్దాం వైఎస్సార్ సీపీ శ్రేణులకు జ్యోతుల పిలుపు జగ్గంపేట : అధికారం కోసం తప్పుడు హామీలను ఇచ్చి తరువాత ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వంచనను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో చేపట్టనున్న నిరశన దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1న చేపట్టే దీక్షను విజయవంతం చేసేందుకు ఇక్కడి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులతో సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. జ్యోతుల మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల వాగ్దానాలు, వైఫల్యాలపై రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు జగన్ దీక్షను చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయానికి సంబంధించి వనరులు, ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా ఉండడంతో తణుకు ఎంచుకున్నామని, ఫిబ్రవరి 1న తూర్పుగోదావరి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని పేర్కొన్నారు. జిల్లాలో 5 గురు ఎమ్మెల్యేలు ఉన్నందున ఎక్కువ మంది జనం హాజరవుతారనే నమ్మకం ఉందన్నారు. రైతు రుణమాఫీపై అసెంబ్లీలో గంటా 45 నిమిషాలు మాట్లాడిన చంద్రబాబు రాజధాని అనే సమస్యను సృష్టించి పక్కదారి పట్టించారని, సమస్యల నుంచి తప్పించుకునేందుకు జపాన్, సింగపూర్ వంటి దేశాలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ సమావేశాలు 40 రోజులు జరిగితే నిధుల కేటాయింపునకు ఆస్కారం ఉంటుందని, 16 రోజులకు కుదిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ దీక్ష ద్వారా యావత్ రాష్ట్రాన్ని కదిలిస్తామని, రెండు రోజులతోనే ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టండి.. టీడీపీ నాయకులు కొందరు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని, తాను ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని జ్యోతుల స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వంపై దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రచారాన్ని కార్యకర్తలు, నాయకులు తిప్పి కొట్టాలన్నారు. జెడ్పీటీసీలు జ్యోతుల నవీన్ కుమార్, వీరంరెడ్డి కాశీబాబు, బోస్‌బాబు, వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు. -
జగన్ దీక్షకు రండి
గుంటూరు సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీని కాంక్షిస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి 1న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో చేపడుతున్న రైతుదీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా నేతలు పిలుపునిచ్చారు. గుంటూరు అరండల్‌పేటలోని జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన రుణమాఫీ హామీని తుంగలో తొక్కే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని సమస్యలను గాలికొదిలేసి కేవలం రాజధాని అంశం చుట్టూనే తిరుగుతూ మరోమారు ప్రజలను మోసం చేసేందుకు సన్నద్ధమయ్యారని మండిపడ్డారు. దీనికి నిరసనగా జగన్ చేపట్టిన రైతుదీక్షను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో దొడ్డిదారిన సీఎం అయిన చంద్రబాబుకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉందనుకోవడం భ్రమే అవుతుందన్నారు. రైతులు, మహిళలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారినీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబన్నారు. ప్రస్తుతం రాజధాని పేరుతో మరో నాటకానికి నిస్సిగ్గుగా తెర తీశారనీ, ఇప్పటికైనా ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టి నిజమైన పాలన చేయాలని ఎమ్మెల్యే హితవు పలికారు. జగన్ దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఓ పక్క రుణం మాఫీ కాక, మరో పక్క కొత్త రుణం పుట్టక, గిట్టుబాటు ధర దక్కక రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ, మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి పీఠమె క్కిన బాబు ప్రస్తుతం ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. రుణమాఫీ సంగతి దేవుడెరుగు పంటలకు గిట్టుబాటు ధర కూడా దక్కక రైతులు అల్లాడుతున్నారన్నారు. దీనికి నిరసనగా జగన్ చేపట్టిన రైతుదీక్షకు అందరూ సంఘీభావం ప్రకటించాల్సి ఉందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, రైతులు, మహిళలతో పాటు విద్యార్థులు, యువజనులను కూడా చంద్రబాబు ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు అని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు యువతకు ముఖం చాటేస్తున్నారన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితరాలకు రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని ముల్లుగర్ర పెట్టి లేపే రీతిలో జగన్ తలపెట్టిన రైతుదీక్షను జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం జగన్ రైతు దీక్ష పోస్టర్‌ను పార్టీ నేతలు ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగం కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుని శివకుమార్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, సేవాదళ్ కన్వీనర్ కొత్త చిన్నపరెడ్డి, మైనారిటీ సెల్ కన్వీనర్ సయ్యద్ మాబు, ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, ఎస్టీ సెల్ కన్వీనర్ మీరాజ్యోత్ హనుమంతునాయక్, రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, విద్యార్థి విభాగం కన్వీనర్ ఉప్పుటూరి నర్సిరెడ్డి, మండెపూడి పురుషోత్తం, యనమల ప్రకాష్, సిద్ధయ్య, మేరువ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ దీక్ష పోస్టర్ విడుదల
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష పోస్టర్‌ను విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్ శనివారం విడుదల చేశారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న మోసపూరిత విధానాలను నిరసిస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు రోజుల పాటు తణుకులో వైఎస్ జగన్ దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ దీక్షకు భారీగా పార్టీ శ్రేణులు తరలి వెళ్లనున్నాయని తెలిపారు. కాగా ఈ నెల 27న వైఎస్ జగన్ ...సింహాద్రి అప్పన్నను దర్శించుకుని, శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారన్నారు. వచ్చే నెల 8న కార్పొరేట్ స్థాయిలో జిల్లా వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభిస్తామని అమర్నాథ్ తెలిపారు. -
రైతు దీక్షను విజయవంతం చేద్దాం
తాడేపల్లిగూడెం : చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలిచ్చి రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను తీవ్ర ఇక్కట్ల పాలు చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) విమర్శించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ నివాసంలో ఆయన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. రైతుల బాధలు తీర్చడానికి, వారిలో భరోసా కల్పించి, వారి పక్షాన పోరు చేయడానికి ఈనెల 31, ఫిబ్రవరి ఒకటో తేదీన తణుకులో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దీక్ష చేపడుతున్నారన్నారు. వివిధ రూపాలలో ఇబ్బందులు పడుతున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా జిల్లాలో జరుగుతున్న దీక్షను పార్టీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి మాట్లాడుతూ అబద్దాల వాగ్దానాలతో ఎన్నికల సమయంలో ప్రజలు నిలువునా ముంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందని, రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ హామీతో సీఎం మోసం చేశారని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడటంలో ఎప్పుడూ ముందుండే జగన్మోహన్రెడ్డి తణుకులో చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయాలని, నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు కదిలిరావాలని కోరారు. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు యెగ్గిన నాగబాబు, జిల్లా కమిటీ సభ్యులు రాజా త్రినాథ్ పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ బలాన్ని నిరూపించాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని నిరూపించడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త చొరవ చూపాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి తణుకులో నిర్వహించనున్న రైతు దీక్షను విజయవంతం చేసే అంశంపై నగరంలోని పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు రామచంద్రరావు నివాసంలో గురువారం ఆ నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా రైతుల రుణమాఫీ అమలు చేయించడం కోసం ప్రభుత్వంతో బహిరంగ పోరాటానికి దిగిన ఏకైక నాయకుడు జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకునిగా తొలిసారి చేస్తున్న రైతు దీక్షకు జిల్లాను వేదికగా ఎంచుకోవడం ఆయనకు జిల్లా ప్రజలపై ఉన్న అపార నమ్మకమే కారణమన్నారు. దీక్షను జయప్రదం చేయాలని, దీనిపై రైతుల్లో, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలను కోరారు. ముఖ్యనాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు కొఠారు రామచంద్రరావు, అప్పన ప్రసాద్, ఘంటా ప్రసాదరావు, మెట్టపల్లి సూరిబాబు, అక్కినేని సతీష్, మొరవనేని భాస్కరరావు, ఎంవీఎస్ఎన్ ప్రసాద్ (జానంపేట బాబు), చల్లగుళ్ళ తేజ, వీవీఎంజీహెచ్ కే ప్రసాద్ (మున్ని), తేరా ప్రసాద్, అబ్బదాసు సౌరి, చల్లారి సత్యనారాయణ, పొన్నూరి సత్యనారాయణ, షేక్ బుజ్జి పాల్గొన్నారు. -
నిరసన దీక్షను విజయవంతం చేయండి
కాకినాడ : రైతు, డ్వాక్రా రుణమాఫీ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న మోసపూరిత విధానాలను నిరసిస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు రోజుల పాటు తణుకులో ైవె ఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టనున్న నిరసన దీక్షను విజయవంతం చేయాలని శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. స్థానిక గొడారిగుంటలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కార్యాలయంలో గురువారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ తలశిల రఘురామ్, సీజీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు. దీనిపై రైతులు, మహిళలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇచ్చిన హామీ అమలు కోసం ఆయా వర్గాలకు అండగా జగన్మోహన్రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల పాటు దీక్ష చేస్తున్నారన్నారు. నేతలతో సమీక్ష పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్లజగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్య నేతలతో దీక్షపై సమీక్షించారు. ఆయా నియోజకవర్గాల నేతలకు బాధ్యతలు అప్పగించారు. దీక్షను విజయవంతం చేసేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లాలని నేతలు నిర్ణయించారు. అలాగే జిల్లా కమిటీ ఎంపికపై కూడా నేతలు కసరత్తు చేశారు. నియోజక వర్గాలవారీగా ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పతిపాదనలు కూడా స్వీకరించారు. సమావేశంలో మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, కర్రినారాయణరావు, వివిధ నియోజక వర్గాల కో- ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, తోట సుబ్బారావునాయుడు, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, గుత్తుల సాయి, ఆకుల వీర్రాజు, జిల్లా వాణిజ్య, ఎస్సీ, ప్రచార, సేవాదళ్ కమిటీ కన్వీనర్లు కర్రి పాపారాయుడు, శెట్టిబత్తుల రాజబాబు, రావూరి వెంకటేశ్వరరావు, మార్గాని గంగాధర్, కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ అల్లి రాజబాబు, రాజమండ్రి కార్పొరేషన్ పార్టీ ప్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు మిండ గుదిటి మోహన్, అత్తిలి సీతారామస్వామి, ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరభద్రారెడ్డి ఉన్నారు. -
వైఎస్ జగన్ రైతుదీక్షను జయప్రదం చేయండి : ఆళ్ల నాని
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీలలో చేపట్టనున్న రైతు దీక్షను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. తణుకులో బుధవారం జరిగిన రైతు దీక్ష సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీక్షా స్థలి దగ్గర ఏర్పాట్ల పై ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాంతో ఆయన చర్చించారు. దీక్షను విజయవంతం చేయాలని రైతులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం కన్వీనర్ వంక రవీంద్రతో పాటు పార్టీ నాయకులు చీర్ల రాధయ్య, కారుమూరి వెంకటనాగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. -
జగన్ దీక్ష చరిత్రాత్మకం
నరసాపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ఎన్నికల హామీలు అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో చేపట్టనున్న దీక్ష చరిత్రాత్మకమైందని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. నరసాపురంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జగన్మోహన్రెడ్డి చేపట్టబోయే దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు, వికలాంగుల కోసం జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం గద్దెనెక్కి ఏడు నెలలు దాటుతున్నా హామీల అమలులో ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో జగన్మోహన్రెడ్డి పోరాడేందుకు సిద్ధమయ్యారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అన్నం లేని వాడికి భోజనం పెట్టడం మానేసి సింగపూర్, జపాన్, మలేషియా జపంతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ గందరగోళమయంగా మారిందన్నారు. ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని చెప్పారు. ప్రజలను సమీకరించి వైఎస్సార్ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ప్రభుత్వం మెడలు వంచైనా హామీలను అమలు చేయిస్తామని హెచ్చరించారు. ముందుగా నియోజకవర్గ శ్రే ణులతో కొత్తపల్లి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్రెడ్డి దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ ర్యాలీ సాగింది. అడుగడుగునా ప్రజలనుంచి మద్దతు లభించింది. వైఎస్సార్ సీపీ పార్టీ జిల్లా క్రమశిక్షణా కమిటీ కన్వీనర్ సాయినాథ్‌ప్రసాద్, పాలంకి ప్రసాద్, దొంగ గోపి, షేక్ బులిమస్తాన్, మావూరి సత్యనారాయణ, యర్రంశెట్టి బాబులు, పప్పులరామారావు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ దీక్షను జయప్రదం చేయండి
గురజాల: ప్రజల సమస్యలపై పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ైవె ఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే దీక్షను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గురజాల మాజీ శాసనసభ్యుడు జంగా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అన్ని రకాల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. మొదటి విడత జాబితాలో 20శాతం మందికి కూడ పూర్తిగా రుణమాఫీ కాలేదని ,రెండో విడత జాబితా అసంపూర్తిగా విడుదల చేసి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులు మొదట్లో ఇచ్చిన పత్రాలనే పదేపదే బ్యాంకుల్లో, తహశీల్దార్ కార్యాలయాల్లో ఇవ్వమని కాళ్లరిగేలా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన ప్రతిసారి మాట్లాడనీయకుండా తెలుగుతమ్ముళ్లు అడ్డుకున్నారన్నారు. తణుకులో ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జగన్మోహన్రెడ్డి చేపట్టే దీక్ష కు పార్టీ నాయకులు,కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివెళ్లాలని సూచించారు. -
బాబు మెప్పు కోసం వైఎస్ జగన్‌పై విమర్శలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దీక్ష చేపడతారని ఆ పార్టీ నేత పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు మెప్పు పొందేందుకే టీడీపీ నేతలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు 8 నెలల పాలనలో ప్రజలు మోసపోతున్నారని పార్థసారథి చెప్పారు. టీడీపీ నేతలకు వ్యవసాయ, పంట రుణాలకు తేడా తెలియదన్నారు. హైదరాబాద్‌లో ఆధార్ కార్డున్న చంద్రబాబు... ఏపీకి సీఎం అవ్వొచ్చు కానీ, మరో రాష్ట్రంలో ఆధార్ కార్డున్న రైతులకు రుణమాఫీ ఎందుకు చేయరని పార్థసారథి ప్రశ్నించారు. -
రైతుల కన్నీళ్లు తుడవడానికే జగన్ దీక్ష
తణుకు టౌన్/తాడేపల్లిగూడెం : రైతుల కన్నీళ్లు తుడవటానికి.. రైతులను, మహిళలను ఇబ్బం దులు పెడుతున్న సర్కారు తీరుపై పోరాడేం దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో రైతు దీక్ష చేపడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని చెప్పారు. స్థానిక బెల్లం మార్కెట్ వద్ద ఏర్పాట్లపై సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతు దీక్ష పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఆళ్ల నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో రైతులు, మహిళలు ఎలా పరాభవించబడుతున్నారో అందరికీ తెలుసన్నారు. రుణ విముక్తులవుదామని చంద్రబాబును గెలి పిస్తే, వాగ్దానాలను అమలు చేయకుండా మోసగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మోసానికి గురైన బాధితుల పక్షాన నిల బడి పోరాడేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దీక్ష చేపడుతున్నారని చెప్పారు. జిల్లా ప్రజ లందరికీ తణుకు పట్టణం దగ్గరగా ఉండటం, గ్రామీణ నేపథ్యంతోపాటు గ్రామీణ నియోజకవర్గాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం, తూర్పుగోదావరి జిల్లాకు అందుబాటులో ఉండటంతో వైఎస్ జగన్ ఇక్కడ దీక్ష చేపడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను చూస్తున్న ప్రజలు, రైతులు దీక్షలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. ప్రజా పోరాటం చేస్తున్న ఆయనకు అందరూ అండగా నిలబడదామన్నారు. పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల ప్రజల అండదండలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. వీరి సహకారంతో అధికారం చేజిక్కించుకుని వారినే మోసం చేస్తారని అనుకుని ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదన్నారు. ప్రస్తుత పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయన్నారు. రైతులు, మహిళలు, దళిత సమాజానికి జరుగుతున్న అన్యాయంపై పోరా టం సాగించి ఆయా వర్గాలకు బాసటగా నిలబ డాలని పిలుపునిచ్చారు. నరసాపురం పార్లమెం టరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని చంద్రబాబు స్తుప్తచేతనావస్థలో ఉంచారన్నారు. హామీల మీద హామీ లు ఇవ్వడం, వాటికి గడవులు విధించడం అన్యాయమన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 10 వేల పరిశ్రమలు ఖాయిలా పడ్డాయన్నారు. వీటిని పునరుద్ధరిస్తే పది లక్షల మం దికి ఉపాధి కలుగుతుందని అన్నారు. ఇలాంటి వాటిని విస్మరించి సింగపూర్, జపాన్, అమెరికా నుంచి పరిశ్రమలంటున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ముదునూరి ప్రసాదరాజు, ముఖ్య నాయకులు ధర్మాన కృష్ణదాసు, తానేటి వనిత, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, వందనపు సాయిబాలపద్మ, గూడూరి ఉమాబాల, పినిపే విశ్వరూప్, ఎస్.రాజీవ్‌కృష్ణ, పుప్పాల వాసుబాబు, తోట గోపి, చీర్ల రాధయ్య, తలారి వెంకట్రావు, ఘంటా మురళి, నాయకులు లంకా మోహన్‌బాబు, ముప్పిడి సంపత్‌కుమార్, కారుమంచి రమేష్, దాట్ల రంగావతి, దండు సూర్యనారాయణరాజు, నందిగం భాస్కర రామయ్య, వెలగల సాయిబాబారెడ్డి, కడియాల సూర్యనారాయణ, నార్గన సత్యనారాయణ, బూరుగుపల్లి సుబ్బారావు పాల్గొన్నారు. ఎత్తిపోతలతో ప్రమాదం వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ తణుకు : కృష్ణా బేసిన్‌కు, రాయలసీమకు నీరంటూ ప్రభుత్వం ప్రతిపాదించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఉభయగోదావరి జిల్లాలకు ప్రమాదం పొంచి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసససభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు. తణుకులో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ వనరుల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రారంభించారన్నారు. 11 మంది శంకుస్థాపన చేసి వదిలేసిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ హయాంలో రూపుదిద్దుకుందన్నారు. ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మళ్లించుకుపోతే రెండో పంటకే కాదు, మొదటి పంటకే మోసం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రెండు జిల్లాలు ప్రమాదంలో పడతాయన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను విస్తరిస్తే రాయలసీమకు మంచినీటిని ఇవ్వవచ్చన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇటీవల ఖరారు చేసిన టెండర్లలో ఈ పనులను 18 నెలల కాలంలో పూర్తి చేయాలని మార్పులు చేశారన్నారు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి ఎత్తిపోతలను 18 నెలలల్లోనే పూర్తిచేయాలనడంలో ఆంతర్యం ఏమిటో గ్రహించాలన్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును అడ్డుకోడానికి సుప్రీం కోర్టులో పర్యావరణ పరిరక్షణ పేరుతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు కోర్టులకు వెళ్లాయని గుర్తు చేశారు. వీటికి బలం చేకూర్చే విధంగా చంద్రబాబు చేపడుతున్న ఎత్తిపోతల పథకాలు వ్యవహారాలు ఉన్నాయని విమర్శించారు. సెప్టెంబర్ నాటికి గోదావరిలో 72 వేల క్యూసెక్కుల నీరు ఈ ప్రాంత ఆయకట్టుకు అవసరం అవుతుందని పేర్కొన్నారు. కొంతాలపల్లి, దుమ్ముగూడెం వంటి 11 ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని మళ్లిస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఒక్కచుక్క నీరుకూడా రాదని, రెండు జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపచేసైనా సరే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం. వెలుగు, గాలేరు, నగరి ప్రాజెక్టులకు నిధులు కేటాయించగలిగితే రాయలసీమకు నీటిని పంపించవచ్చని స్పష్టం చేశారు. -
'చంద్రబాబు మోసాలను బయటపెడతాం'
ఏలూరు: కష్టాల్లో ఉన్న ప్రజలకు మద్దతు తెలిపేందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండురోజుల దీక్ష చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు మోసపూరిత విధానాలకు బయటపెట్టడమే తణుకు దీక్ష ప్రధాన లక్ష్యమన్నారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు వ్యక్తిత్వం అని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టో లో ఉన్న ఒక్క హామీని టీడీపీ నెరవేర్చలేదన్నారు. రైతులు , డ్వాక్రా సంఘాలు, యువత...ఇలా అన్ని వర్గాలను మోసం చేసని ఘనత చంద్రబాబుదే అని ఆయన విమర్శించారు. ప్రజలకు అండగా పోరాటాలు చేయడమే వైఎస్ఆర్ సీపీ ఎజెండా అని విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. -
జగన్ దీక్షతోనైనా ప్రభుత్వం దిగిరావాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సాక్షి, ఒంగోలు: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షతోనైనా ప్రభుత్వం దిగొస్తుందని భావిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఒంగోలులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతగా జగన్‌కు నిరసన తెలియజేసే హక్కు ఉందన్నారు. నాలుగు రోజులు యోగాలో ఉండటం వల్ల ప్రభుత్వమంతా కోమాలోకి పోయిందని ఎద్దేవా చేశారు. యోగాకు తాము వ్యతిరేకం కాదని, అది వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు. మహాత్మా గాంధీని హత్యచేసిన గాడ్సేను ప్రజలు అసహ్యించుకుంటుంటే ప్రస్తుత ప్రభుత్వాలు విగ్రహాలు ప్రతిష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శివసేన, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు లౌకికవాదానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ సమగ్రతా దినోత్సవాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు.