
జననేతకు సంఘీభావం
జగన్ దీక్షకు పెద్ద ఎత్తున తరలిన ఎంపీ, ఎమ్మెల్యేలు
స్వచ్ఛందంగా తరలివె ళ్లిన నేతలు, కార్యకర్తలు, మహిళలు
దీక్షా ప్రాంగణంలో మాట్లాడిన ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి
తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టిన దీక్షకు చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ముఖ్య నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. ముఖ్యంగా దీక్షకు తరలివెళ్లిన వారిలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా, పార్టీ ప్రజాసేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్, సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, ట్రేడ్ యూనియన్ నాయకుడు బీరేంద్రవర్మ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి చక్రపాణిరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మిద్దెల హరి, మైనారిటీ సెల్ కార్యదర్శి సిరాజ్ బాష, జాయింట్ సెక్రటరీ విద్యాధర్‌రెడ్డి, భాస్కర్‌నాయుడు, జాయింట్‌సెక్రటరీలు బాబ్‌జాన్, రెడ్డిశేఖర్, జింకా వెంకటాచలపతి, విద్యార్థి నాయకుడు హరినాథ్‌రెడ్డి, తిరుపతి నేత వై.సురేష్ ఉన్నారు.
రాజధాని పేరుతో కాలయాపన : ఎమ్మెల్యే రోజా
తొలి రోజు దీక్షా ప్రాంగణంలో నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి గట్టెక్కి రాజధాని పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన గొంతుక వినిపించేందుకే జగన్ దీక్ష చేపట్టారన్నారు. జగన్ దీక్షపై పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజా సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ చూపుతోందని నిలదీశారు. ప్రజా సమస్యలను విస్మరించి రాజధాని పేరుతో రైతులను, మహిళలను చంద్రబాబు దగా చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.
బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో: ఎమ్మెల్యే చెవిరెడ్డి
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం అనేక హామీలు గుప్పించి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో ఎన్నికల్లో గ ద్దెక్కారని ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. జగన్ దీక్షకు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, రైతులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివెళ్లారు.