
వైఎస్ జగన్ రైతు దీక్షకు భారీగా తరలివస్తున్న ప్రజలు
తణుకు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు దీక్ష రెండో రోజుకు చేరింది. పశ్చిమగోదావరి జల్లా తణుకులో చేపట్టిన ఈ దీక్షకు ఆదివారం ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.
వైఎస్ జగన్కు రైతులు, మహిళలు మద్దతు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు.