
జగన్ బాటలోనే మేము..సైతం
తూర్పుగోదావరి (పెద్దాపురం): అన్నదాత కష్టాలను మరిచి సింగపూర్ చక్కర్లు కొడుతున్న చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ అధినేత తలపట్టిన రైతు దీక్షకు పెద్ద ఎత్తున ప్రజామద్దతు లభిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రారంభించిన దీక్షకు మద్దతుగా ఆదివారం పెద్దాపురం నుంచి 25 బస్సులు తరలి వెళ్లాయి. పెద్దాపురం నియోజకవర్గం ఇన్‌చార్జ్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో వందలాది మంది తమ అభిమాన నాయకుడు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలపడానికి బయలుదేరారు.