
టీడీపీకి ఓట్లు వేసినవారు బాధపడుతున్నారు
తణుకు: టీడీపీ ఓటు వేసిన వాళ్లు బాధపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు.
పశ్చిమగోదావరి జల్లా తణుకులో చేపడుతున్న ఈ దీక్షలో భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు దొరికింది దొరికినట్టు దోచుకుంటున్నారని ఆరోపించారు.