రైతు దీక్షకు మేము సైతం | We also have a farmer protest | Sakshi
Sakshi News home page

రైతు దీక్షకు మేము సైతం

Published Sun, Feb 1 2015 5:51 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

రైతు దీక్షకు మేము సైతం - Sakshi

రైతు దీక్షకు మేము సైతం

  •  జిల్లానుంచి హాజరైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • ఒంగోలు: రైతు దీక్షకు మేము సైతమంటూ జిల్లా నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదిలివెళ్లాయి. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శని, ఆదివారాలలో రైతు దీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

    ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావంగా ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, రాష్ట్ర అధికారప్రతినిధి, సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్, యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావు, అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్‌లు జగన్‌మోహన్‌రెడ్డిని దీక్షావేదిక వద్ద కలుసుకొని సంఘీభావం ప్రకటించారు.

    వీరితోపాటు జిల్లాలో రైతుల సమస్యలను కూడా జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ప్రస్తావించారు. ఇక కొండపి , చీరాల, పర్చూరు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జులైన వరికూటి అశోక్‌కుమార్, యడం బాలాజీ, గొట్టిపాటి భరత్, బొర్రా మధుసూదన్‌యాదవ్‌లు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement