
'భూములు ఇవ్వకపోతే బ్రతక లేరని బెదిరిస్తున్నారు'
తణుకు: భూములు ఇవ్వకపోతే బ్రతక లేరని తమను బెదిరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ ప్రాంత రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్ జగన్ చేపట్టిన రైతు దీక్ష సభాస్థలికి వచ్చి సంఘీభావం ప్రకటించారు.
పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని రైతులు చెప్పారు. తమ భూములు బలవంతంగా లాక్కొంటున్నారని వెల్లడించారు. తమ భూములను తీసుకోవద్దని రైతులు కోరారు. ఈ విషయంలో వైఎస్ జగన్ తమకు సాయం చేయాలని విన్నవించారు.