
రైతులు సమ్మె చేస్తే ప్రభుత్వమే స్తంభిస్తుంది
తణుకు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు సమ్మె చేస్తే ప్రభుత్వమే స్తంభించిపోతుందని హెచ్చరించారు. బాబు హామీలను నమ్మి రైతులు మోసపోయారని సీతారాం విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టిన రైతు దీక్షలో ఆయన ప్రసంగించారు.
రైతులను రోడ్డుమీద నిలబెట్టిన ఘనత బాబుదేనని సీతారాం మండిపడ్డారు. బ్యాంక్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని చెప్పారు. పరిపాలించడమెలాగో దివంగత మహానేత, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలనను చూసి నేర్చుకోవాలని సీతారం హితవు పలికారు. చంద్రబాబు పాలన ఇలాగే కొనసాగితే బడుగు, బలహీన వర్గాలు, రైతులు, మహిళలు ఎదురుతిరిగే రోజు వస్తుందని హెచ్చరించారు.