ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : సర్కారు చేతిలో నయవంచనకు గురైన అన్నదాతల గోడును సర్కారుకు వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తణుకులో తలపెట్టిన రైతు దీక్ష జిల్లా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతిపక్ష నేతగా చరిత్రాత్మక ఘట్టానికి తెరలేపుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై చేయనున్న పోరాటాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న ఉత్సుకత వివిధ వర్గాల ప్రజల్లో బలంగా నాటుకుంది. రైతు దీక్షను విజయవంతం చేయడానికి వైఎస్సార్ సీపీ నాయకులు కార్యోన్ముఖులు కాగా, వారిలో ఉత్సాహం నింపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు నాయకులు జిల్లాలో పర్యటిస్తూ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు. బుధవారం వివిధ నియోజకవర్గాల్లో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పర్యటనలు జరిపారు. బైక్ ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలతో టీడీపీ నాయకుల్లో ైరైతుదీక్ష ఫీవర్ ప్రారంభమైంది.
ఊరూరా ఉత్సాహంగా..
వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ రాష్ట్ర నాయకులు వంగవీటి రాధా, పేర్ని నాని, చిర్ల జగ్గిరెడ్డి, తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు కారుమూరి నాగేశ్వరరావు, వంక రవీంద్రనాథ్, చీర్ల రాధయ్య తదితరులు బుధవారం తణుకులో బైక్ ర్యాలీ నిర్వహించి నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం సభాస్థలిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, తిరుమల అమరనాథ్, కర్రి పాపారాయుడు పాల్గొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయూలని సామినేని ఉదయభాను భీమవరంలో జరిగిన ముఖ్యనాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు. పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ నివాసంలో నాయకులతో ఆయన సమావేశమయ్యూరు.
ఆయన వెంట పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధ, నరసాపురం నియోజకవర్గం ఇన్‌చార్జి పేర్ని నాని, పాతపాటి సర్రాజు తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, తానేటి వనిత ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించి దీక్ష విజయవంతం చేయడానికి సూచనలు ఇచ్చారు. పోలవరం నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర ఎసీ ్టసెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు, పోల్నాటి బాబ్జి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. దేవరపల్లిలో పార్టీ నాయకులు తలశిల రఘురామ్, తలారి వెంకట్రావు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి జగన్ దీక్ష విజయవంతం చేయడంలో ప్రజలను, రైతులను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
ఉంగుటూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆద్వర్యంలో నల్లమాడు, గోపాలపురం, నిడమర్రు గ్రామాల్లో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, నియోకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పెనుమంట్రలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ముదునూరి ప్రసాదరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చెల్లం ఆనంద ప్రకాష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆచంట మండలం కొడమంచిలి, వల్లూరు, పెదమల్లం గ్రామాల్లో పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి రైతు దీక్షను విజయవంతం చేయాలని ప్రచారం చేశారు.
ఉద్యమ పథం
Published Thu, Jan 29 2015 3:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement