వైఎస్ జగన్ రైతుదీక్షను జయప్రదం చేయండి : ఆళ్ల నాని | ysrcongress party president ys jagan mohan reddy strike in eluru | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ రైతుదీక్షను జయప్రదం చేయండి : ఆళ్ల నాని

Published Wed, Jan 21 2015 4:56 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ రైతుదీక్షను జయప్రదం చేయండి : ఆళ్ల నాని - Sakshi

వైఎస్ జగన్ రైతుదీక్షను జయప్రదం చేయండి : ఆళ్ల నాని

తణుకు:  పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీలలో చేపట్టనున్న రైతు దీక్షను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. తణుకులో బుధవారం జరిగిన రైతు దీక్ష సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

దీక్షా స్థలి దగ్గర ఏర్పాట్ల పై  ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాంతో ఆయన చర్చించారు. దీక్షను విజయవంతం చేయాలని రైతులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం కన్వీనర్ వంక రవీంద్రతో పాటు పార్టీ నాయకులు చీర్ల రాధయ్య, కారుమూరి వెంకటనాగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement