మీరే సారథులు.. మీ జగన్‌ సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్‌ | CM Jagan Slams Chandrababu At YSRCP Eluru Siddham Sabha | Sakshi
Sakshi News home page

మీరే సారథులు

Published Sun, Feb 4 2024 4:44 AM | Last Updated on Sun, Feb 4 2024 12:03 PM

CM Jagan Slams Chandrababu At YSRCP Eluru Siddham Sabha - Sakshi

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన సిద్ధం సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

జరగబోయే ఎన్నికల రణ క్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు, మీ అందరికీ తోడు అర్జునుడిలా నేను.. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మన అస్త్రాలుగా మల్చుకుని, కౌరవ సైన్యం మీద యుద్ధం చేద్దాం. ఎన్నికల యుద్ధంలో మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి, అభివృద్ధి మీదే వాళ్ల దాడి ఉంటుంది. పేద వాడి భవిష్యత్, సంక్షేమం, గ్రామ గ్రామాన అభివృద్ధి, సామాజిక వర్గాల అభివృద్ధి మీద, మనందరి ప్రభుత్వం రాబోయే తరం కోసం అమలు చేస్తున్న విద్యా విధానం మీద ఈ పెత్తందారులు దాడి చేస్తున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్‌ కాలేజీలు, నాడు–నేడుతో మారుతున్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ దండయాత్ర చేస్తోంది. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి చెండాడటానికి మళ్లీ మనం సిద్ధమవుదాం.

మేనిఫెస్టో రిలీజ్‌ చేయడం, తర్వాత మోసం చేయడం, దాన్ని చెత్తబుట్టలో పడేయడం.. సంప్రదాయంగా వస్తోంది. మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. మేనిఫెస్టోను చూపించి 99 శాతం వాగ్దానాలను అమలు చేసింది మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. ఇవన్నీ కనిపిస్తున్నా, కళ్లుండీ ఈర్ష్యతో చూడలేని కబోదులు టీవీ చానళ్లు, పేపర్ల రూపంలో ఉన్నాయి. మనల్ని తిట్టే వాళ్ల నోరు మంచిది కాదు. వాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. అబద్ధాల పునాదుల మీద వారు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా అన్నదే కొలమానంగా తీసుకోవాలి. 
– సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్‌ను మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమా? పేదల భవిష్యత్‌ను, పేదలని కాటేసే ఎల్లో వైరస్‌ మీద కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతు­ష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి ప్రతి ఒక్కరూ సిద్ధమేనా?’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అశేష జనవాహినిని ప్రశ్నించారు.

పేదల భవిష్యత్తును, సంక్షేమాన్ని నిర్దేశించే ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి గడపకూ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి, అందులో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చిన తరుణంలో ఈ ఎన్నికల సంగ్రామానికి మీరే సారథులు అని స్పష్టం చేశారు. మంచి కొనసాగాలంటే మళ్లీ మనందరి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభలో పాల్గొని ప్రసంగించారు.

రామాయ­ణం, మహాభారతం.. ఈ రెండింటిలో ఉన్న విలన్లంతా.. ఓ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి రూపంలో, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టుల రూపంలో ఉన్నారన్నారు. ఇంత మంది తోడేళ్లలా ఏకమై మీ జగన్‌ చుట్టూ బాణాలు పట్టుకుని రెడీగా ఉన్నారని చెప్పారు. ‘వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుందంటే.. ఇన్ని తోడేళ్ల మధ్య జగన్‌ ఒంటరి వాడిలా కనిపిస్తాడు. కానీ ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్‌కు మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ గుండెల్లో ఉంచుకు­న్నారన్నదే నిజం.

జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఎల్లో పత్రికలు, టీవీలు, పొత్తుల సైన్యం తోడుగా ఉంటే నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న ఆ దేవుడు, నన్ను గుండెల్లో పెట్టుకున్న మీరు. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకంతో పుట్టిన సైన్యం. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారు అంటే వాళ్ల స్పందన, ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న నా అన్నదమ్ములు, అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యమే నిదర్శనం’ అని అన్నారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..


14 ఏళ్లు సీఎంగా ఉండీ ఏం చేశారని అడగండి
► గోదారమ్మ సీమలో నిలబడి మనకు, ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించడానికి మీ వద్దకు వచ్చాను. ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామంలో మనం తెచ్చిన మార్పు, లంచాలు, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ, చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం.. వీటన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేరాఫ్‌ అడ్రస్‌. ఈ మాటను ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగరేసి చెప్పడా­నికి, కావాల్సినన్ని అంశాలు పంచుకోవడా­నికి, తిరు­గులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు.. 25కు 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు మీ వాడిగా, మీ ముందుకు వచ్చి నా మనసు పంచుకుంటున్నా. నా మాటలు అన్నింటినీ ప్రతి ఇంటికీ తీసుకువెళ్లి ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. 

► 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజల కోసం ఏం చేశాడు? అని గ్రామాల్లోకి వెళ్లినప్పుడు అమ్మ, అక్క, అన్న, తమ్ముళ్లను అడ­గండి. గత 10 ఏళ్లుగా వారి బ్యాంకు అకౌంటు వివరా­లను వారినే చూడమని చెప్పి అడ­గండి. ఆ పదేళ్లు.. అంటే చంద్ర­బాబు 
5 సంవత్స­రాలు, మీ బిడ్డ జగన్‌ పాలనలో 5 సంవత్స­రాలు.. బ్యాంకు అకౌంటు వివరాల్లో అక్క­చెల్లె­మ్మ­ల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బు­లు పడిందన్నది వారినే చూడ­మనండి. 1994, 1999, 2014లో ఇచ్చిన టీడీపీ మేనిఫెస్టోలో ఏనాడైనా 10 శాతం అమలు చేశాడా అని అడగండి.

ఈ మార్పును ప్రతి ఇంటా వివరించాలి
► మీ బిడ్డ జగన్‌ 57 నెలల్లో ఏం చేశారనేది ప్రతి ఇంట్లో వివరించండి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామం తీసుకున్నా, అభివృద్ధి కళ్లకు కనిపిస్తుంది. విలేజ్‌ సెక్రటేరియట్‌.. పట్టణంలో వార్డు సెక్రటేరియట్‌ కనిపిస్తుంది. సచివాలయాల ద్వారా 540 రకాల సేవలు అందిస్తూ, 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ప్రతి నెలా 1వ తేదీ ఉదయాన్నే ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి.. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు.. ఇలా ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరించి, వారి చేతిలో 3 వేల పెన్షన్‌ పెడుతున్నది మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. 

► లంచాలు, వివక్షకు నాటి జన్మభూమి కమిటీలు మారుపేరు. ఈ రోజు ఏ గ్రామంలో కూడా అలా లంచాలు, వివక్ష లేకుండా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తెచ్చింది మీ జగనే. డీబీటీ ద్వారా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతున్నదీ మీ జగన్, మీ ప్రభుత్వమే. 

మీ గ్రామంలో గవర్నమెంట్‌ బడి, ప్రభుత్వ ఆస్పత్రి మారటానికి నాడు–నేడు చేసినది, చేస్తున్నది మీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. గవర్నమెంట్‌ బడిలో ఇంగ్లిషు మీడియం, బైలింగ్వల్‌ టెక్ట్స్‌ బుక్కులు, చిన్నారుల చేతుల్లో ట్యాబ్‌లు, డిజిటల్‌ బోధన, క్లాస్‌ రూముల్లో ఐఎఫ్‌పీలు, సీబీఎస్‌ఈ, ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగనే.

► రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయి పట్టుకుని నడిపించేదీ మీ వైఎస్సార్సీపీనే. పేదలు, రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్‌ భూముల మీద, 22ఏ భూములు 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది మీ జగనే. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ ఈ 57 నెలల్లో అందించిన రూ.2.55 లక్షల కోట్లలో ఏకంగా 75 శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశంలోనే రికార్డు సృష్టించింది మీ జగన్‌ ప్రభుత్వమే. 

► నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్‌ యార్డులు, కార్పొరేషన్‌ చైర్మన్లు, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం పోస్టులు చట్టం చేసి మరీ ఇచ్చింది మీ ప్రభుత్వమే. కేబినెట్‌లో 68 శాతం మంత్రి పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు దక్కాయి. నలుగురికి డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్‌ పర్సన్‌ మొదలు.. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ కనీవినీ ఎరుగని రీతిలో, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందీ మీ బిడ్డ జగన్‌ పాలనలోనే.

2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం 
► గత ప్రభుత్వ హయాంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే.. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. అందులోనూ  80 శాతం నేను నా.. నా.. అని పిలుచుకొనే నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు కనిపిస్తున్నారు. అక్కచెల్లెమ్మలను లక్షాధికా­రులుగా చేయాలని, వారికి గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిందీ మీ జగనే. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నదీ మన ప్రభుత్వమే. అక్కచెల్లె­మ్మలు పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు వారికి తోడుగా ఉంటూ.. అమ్మ ఒడి, పిల్లలకు అండగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన, అక్కచెల్లెమ్మలకు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, దిశ యాప్‌.. మొత్తంగా మహిళా సాధికారత.. ఇవన్నీ మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. 

► ప్రతి గ్రామంలో ఇవాళ ఒక మహిళా పోలీస్, విలేజ్‌ క్లినిక్‌ కనిపిస్తుంది. ఆ గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్‌ వచ్చారు. ప్రతి ఇంట్లోనూ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ, వైద్యం చేసి, మందులిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే. 108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్న­లకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌­మెంట్‌ వంటి పథకాలు తీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైఎస్‌ రాజశేఖర­రెడ్డి అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది మీ బిడ్డ హయాంలోనే. 

► రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నాలుగు సీ పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, కొత్త ఎయిర్‌ పోర్టులు వస్తున్నాయి. ఉన్న చోట విస్తరణ పనులు జరుగుతు­న్నా­యి. పారి­శ్రా­మిక కారిడార్లలో ఉరుకులు పరుగులతో పనులు జరుగు­తు­న్నాయి. పారిశ్రామిక వేత్తలతో పాటు సంస్థలు మన రాష్ట్రం వైపు లైను కడుతున్నాయి. ఈ వాస్తవాలను ప్రతి ఇంటికీ తీసు­కెళ్లాలి. 2019లో మనం అధికారంలోకి రాకపోయింటే ఇవన్నీ సాధ్యమయ్యేవా? ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిæలంచాలు లేకుండా, కులం, మతం, ప్రాం­తం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా అర్హతే ప్రామా­ణి­కంగా ప్రతి ఒక్క­రికీ అందుతున్నది ఒక్క జగనన్న పాలనలోనే దేశానికే చూపించగలిగాం.

ప్రతి ఇంటి నుంచి స్టార్‌ క్యాంపెయినర్‌
► ఈ ఎన్నికలు ఎంత ముఖ్యం అనేది ప్రతి అవ్వాతా­తకు, అక్కాచెల్లెమ్మకు, అన్నదమ్ములందరికీ చెప్పాలి. కేవలం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకొనే ఎన్ని­కలు కావు. 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించనున్న ఎన్నికలని ప్రతి ఇంట్లో వివరించాలి. ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి ప్రాంతం భవి­ష్యత్, రైతన్న భవిష్యత్, అక్కచెల్లెమ్మల సంక్షేమం, ఇంటింటా అభివృద్ధి, పిల్లల భవిష్యత్‌ అన్నీ ఈ ఎన్ని­­కలతో ముడిపడి ఉన్నాయని గమనించండి. చదువు, వైద్యం కోసం పేదవాడు అప్పు­ల­పాలు కాకుండా ఉండాలన్నా అది మనందరి ప్రభుత్వమే ఆ పని చేయగలదని ఇంటింటికీ వెళ్లి చెప్పండి.  

► అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు అందుకుంటున్న వారు, ఇలా ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్టార్‌ క్యాంపెయినర్లుగా రావాలని చెప్పండి. బయటకొచ్చి ప్రతి ఒక్కరూ కనీసం 100 మందితో జరుగుతున్న మంచి గురించి చెప్పాలని వివరించండి. మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, సొంతిల్లు.. ఇవన్నీ కొనసాగాలంటే అక్క­చెల్లె­మ్మలే స్టార్‌ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి.

పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పండి. రైతు భరోసా కొనసాగాలన్నా, ప్రతి రైతన్నకూ మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్‌ రావాలన్నా, ఇన్‌పుట్‌ సబ్సిడీ దొరకా­లన్నా, పగటి­పూటే ఉచిత విద్యుత్, దళారీ వ్యవస్థ పోయి రైతన్న­కు మద్దతు ధర అందాలన్నా.. కేవలం జగనన్న మాత్రమే చేయగలడని.. ప్రతి రైతన్న స్టార్‌ క్యాంపెయినర్‌ కావాలని చెప్పండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement