జనం కోసం జగనన్న దీక్ష | ys jagan Inmates for people | Sakshi
Sakshi News home page

జనం కోసం జగనన్న దీక్ష

Published Fri, Jan 30 2015 2:07 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

జనం కోసం జగనన్న దీక్ష - Sakshi

జనం కోసం జగనన్న దీక్ష

తిరుపతిరూరల్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతోందని ఆ పార్టీ ప్రజాసేవాదళ్ రాష్ర్ట అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం తిరుపతిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ  తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న రైతు దీక్షకు రైతులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్నది వైఎస్‌ఆర్‌సీపీ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, ఉపాధ్యక్షుడు వాసు,  జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మల్లారపు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement