
'చంద్రబాబు మోసాలను బయటపెడతాం'
కష్టాల్లో ఉన్న ప్రజలకు మద్దతు తెలిపేందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండురోజుల దీక్ష చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి తెలిపారు.
ఏలూరు: కష్టాల్లో ఉన్న ప్రజలకు మద్దతు తెలిపేందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండురోజుల దీక్ష చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు మోసపూరిత విధానాలకు బయటపెట్టడమే తణుకు దీక్ష ప్రధాన లక్ష్యమన్నారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు వ్యక్తిత్వం అని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టో లో ఉన్న ఒక్క హామీని టీడీపీ నెరవేర్చలేదన్నారు. రైతులు , డ్వాక్రా సంఘాలు, యువత...ఇలా అన్ని వర్గాలను మోసం చేసని ఘనత చంద్రబాబుదే అని ఆయన విమర్శించారు. ప్రజలకు అండగా పోరాటాలు చేయడమే వైఎస్ఆర్ సీపీ ఎజెండా అని విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు.