నిరసన దీక్షను విజయవంతం చేయండి
కాకినాడ : రైతు, డ్వాక్రా రుణమాఫీ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న మోసపూరిత విధానాలను నిరసిస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు రోజుల పాటు తణుకులో ైవె ఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టనున్న నిరసన దీక్షను విజయవంతం చేయాలని శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. స్థానిక గొడారిగుంటలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కార్యాలయంలో గురువారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ తలశిల రఘురామ్, సీజీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు. దీనిపై రైతులు, మహిళలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇచ్చిన హామీ అమలు కోసం ఆయా వర్గాలకు అండగా జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల పాటు దీక్ష చేస్తున్నారన్నారు.
నేతలతో సమీక్ష
పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్లజగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ముఖ్య నేతలతో దీక్షపై సమీక్షించారు. ఆయా నియోజకవర్గాల నేతలకు బాధ్యతలు అప్పగించారు. దీక్షను విజయవంతం చేసేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లాలని నేతలు నిర్ణయించారు. అలాగే జిల్లా కమిటీ ఎంపికపై కూడా నేతలు కసరత్తు చేశారు. నియోజక వర్గాలవారీగా ఇన్‌చార్జిలు, ముఖ్యనేతలతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
పతిపాదనలు కూడా స్వీకరించారు. సమావేశంలో మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, కర్రినారాయణరావు, వివిధ నియోజక వర్గాల కో- ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, తోట సుబ్బారావునాయుడు, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, గుత్తుల సాయి, ఆకుల వీర్రాజు, జిల్లా వాణిజ్య, ఎస్సీ, ప్రచార, సేవాదళ్ కమిటీ కన్వీనర్లు కర్రి పాపారాయుడు, శెట్టిబత్తుల రాజబాబు, రావూరి వెంకటేశ్వరరావు, మార్గాని గంగాధర్, కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ అల్లి రాజబాబు, రాజమండ్రి కార్పొరేషన్ పార్టీ ప్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు మిండ గుదిటి మోహన్, అత్తిలి సీతారామస్వామి, ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరభద్రారెడ్డి ఉన్నారు.