
రైతు దీక్షలో జిల్లా నేతలు
శ్రీకాకుళ అర్బన్, టెక్కలి: రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసిన టీడీపీ సర్కారు దుర్నీతిని ఎండగట్టేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతుదీక్షలో జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరుగుతున్న ఈ దీక్షల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, ఎమ్మేల్యేలు తరలి వెళ్లారు. శుక్రవారం సాయంత్రమే పలువురు వెళ్లగా.. శనివారం ఉదయం ఇంకొందరు వెళ్లారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగానే జగన్‌మోహనరెడ్డి చేపట్టిన రెండు రోజుల ఈ దీక్షకు పాతపట్నం, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ,
విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, పార్టీ నాయకులు బగ్గు రామకృష్ణ, అంబటి శ్రీనివాసరావు, బహుదూర్ జానీ, మెండ రాంబాబు, కరిమి రాజేశ్వరరావు, శ్యామ్, రొక్కం సూర్యప్రకాశరావు, పేడాడ తిలక్, కోరాడ రమేష్, తంగుడు నాగేశ్వరరావు, గుడ్ల మల్లేశ్వరరావు, పి. సౌజన్య తదితరులు పాల్గొన్నారు. అలాగే టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంపతిరావు రాఘవరావు, చింతాడ ధర్మారావు, జనార్ధన్‌రెడ్డి,జి. మోహన్‌రెడ్డి, ఎన్.ఆనందరావు, ఎన్.పుష్కరరావు, బి.లోకనాథం, ఎమ్.శంకర్, ఎన్.సింహాచలం, వై.పున్నయ్య, తాడి చందు, ఇ.జయరాంతో పాటు నాలుగు మండలాల నుంచి నాయకులు శనివారం ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు.