
వంచనపైనే జగన్ పోరాటం
చంద్రబాబు రైతులను, మహిళలను ఘోరంగా మోసగించారు
వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
నిడదవోలు : రుణమాఫీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు వాగ్దానాలు ఇచ్చి చివరకు వారిని ఘోరంగా వంచించిన చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో దీక్ష చేపట్టారని పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసారుురెడ్డి అన్నారు. నిడదవోలు మండలం పురుషోత్తపల్లిలో పార్టీ నాయకుడు ముళ్లపూడి శ్రీనివాస చౌదరి ఇంటి వద్ద శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజ లకు, రైతులకు జరిగిన మోసానికి నిరసనగా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ తణుకు పట్టణంలో రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నారని వివరించారు. దీక్షకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సుమారు 9లక్షల మంది రైతులు ఉన్నారని, వారికి రూ.7,200 కోట్ల రుణాలను మాఫీ చేయూల్సి ఉండగా, ఇంతవరకు రూ.329 కోట్ల కేటారుుంచి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్నారు. ఆ సొమ్ము కూడా నేటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయలేదన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన పార్టీ కోసం కాదని.. ప్రజలు, రైతులు, మహిళలకు మేలు చేకూర్చేందుకు, ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల అమలు చేరుుంచేందుకేనని స్పష్టం చేశారు.
ఇంత మోసమా.. చంద్రబాబూ..
చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఓట్లు వేసిన రైతులను, మహిళలను దారుణంగా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత పాలనలో చంద్రబాబు హైటెక్ సిటీకి ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వలేదని గుర్తు చేశారు. నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు హామీలను నమ్మిన రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదన్నారు. ఇప్పుడు వడ్డీలు కట్టలేక ఇబ్బం దులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ దీక్షకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు జీఎస్‌రావు, జెడ్పీటీసీ ముళ్ళపూడి శ్రీసత్యకష్ణ, ఆత్కూరి దొరయ్య, ఎంపీపీ మన్యం సూర్యనారాయణ, జిల్లా మైనారీ ్టసెల్ కన్వీనర్ ఎండీ అస్లాం, సుంకవల్లి శ్రీహరి, గజ్జరపు రమేష్, కస్తూరి సాగర్, యాళ్ల రామారావు, నక్కా మంగన్న, ప్రభు, కత్తినొక్కుల మురళీకృష్ణ, వి.పోలయ్య, యు.కాశీ, జి.వెంకటరత్నం, పి.రాకేష్, పి.రామారావు పాల్గొన్నారు.