జగన్ దీక్షాస్థలికి భూమిపూజ
పశ్చిమగోదావరి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1న చేపట్టబోయే రైతు దీక్షకు సంబంధించి మంగళ
వారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర పాలకమండలి పరిశీలకులు వంకా రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుమూరి వెంకట నాగేశ్వరరావు, గుంటూరు పార్టీ పరిశీలకులు లేళ్ల అప్పి రెడ్డి, తణుకు కన్వీనర్ చీర్ల రాధయ్య పర్యవేక్షించారు.