సాక్షి, వరంగల్: రాష్ట్రంలో నవంబర్ లేదా.. డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హ్యట్రిక్ ముఖ్యమంత్రి అయి మళ్లీ బాధ్యతలు చేపడతారని, ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చెప్పే చిల్లరమల్లర మాటలను కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చా రు.
వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో ఉన్న కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కులో కొరియాకు చెందిన యంగ్‌వన్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న యూనిట్‌కి భారత్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్‌ఈ చంగ్ జే బాక్‌తో కలసి శనివారం మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందన్నారు.
కేంద్రం కాపీ కొట్టింది..
వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్రం అమలుచేస్తున్న పీఎం మిత్ర పథకానికి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కే స్ఫూర్తి అని కేటీఆర్ అన్నారు. 2017లో మెగాటెక్స్‌టైల్ పార్కుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు కేంద్రం దానిని కాపీకొట్టి పీఎం మిత్ర తీసుకొచ్చిందన్నారు.
ఫామ్ టు ఫ్యాషన్ అనే లక్ష్యంతో ఇక్కడే సమగ్రంగా వ్రస్తాలు తయారు కావాలన్న సంకల్పంతోపాటు గతంలో ఆజంజాహి మిల్లు ఉన్న సమయంలో వరంగల్‌కు ఉండే పేరు ప్రతిష్టలను మళ్లీ ప్రపంచానికి చాటి చెప్పేలా సీఎం కేసీఆర్ కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇక్కడ తయారయ్యే దుస్తులు దేశం కోసమే కాదు.. అమెరికా, యూరప్, కొరియా వంటి ప్రపంచ మార్కెట్‌లోకి వెళతాయన్నారు. మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ పరకాల, మేడ్ ఇన్ వరంగల్ పేరుతో ప్రపంచ మార్కెట్లలోకి అమ్మకాలు ఉంటాయని చెప్పారు.
యంగ్‌వన్ ద్వారా 21,000, కిటెక్స్ ద్వారా 12,000, గణేశ ద్వారా 1,000 మందికి ఉపాధి కలుగుతుందని.. దీనికి రెట్టింపుగా పరోక్ష ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే 99 శాతం ఉద్యోగాలు ఉంటాయని, ముఖ్యంగా మహిళలకు 80 నుంచి 85 శాతం ఉద్యోగాలు క ల్పించే దిశగా ఆయా కంపెనీలతో మాట్లాడామన్నారు. నిర్మాణం పూర్తి చేసుకుంటున్న కిటెక్స్ కంపెనీని సీఎం కేసీఆర్ సెపె్టంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభిస్తారని తెలిపారు.
తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది
తెలంగాణ నేడు ఆచరిస్తున్నది.. దేశం రేపు అనుసరిస్తదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చే చాలా పథకాలకు తెలంగాణనే దిక్సూచి అయిందన్నారు. అంతకుముందు కొరియా రాయబారి హెచ్‌ఈ చంగ్ జే బాక్ మాట్లాడుతూ.. వస్త్ర పరిశ్రమకు తెలంగాణ పెద్ద కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శ న్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, యంగ్‌వన్ కంపెనీ సీఈఓ కీహాక్ సంగ్ పాల్గొన్నారు.
గిరిజనుల గుండెచప్పుడు కేసీఆర్
స్వరాష్ట్ర సాధన కల నెరవేర్చడంతో పాటు గిరిజనులు, ఆదివాసీల చిర కాల డిమాండు ‘మా తండాల్లో మా రాజ్యం’ అనే స్వయం పాలన కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని ] ుంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు తెలుపుతూ కేటీ ఆర్ ట్వీట్ చేశారు. గిరిజనుల గుండెచప్పుడు, ఆదివాసీల ఆత్మబంధువు కేసీఆర్ అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment