సాక్షి,ఎర్రవల్లి: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వo అంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు సోమవారం (డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గజ్వేల్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ ఎల్పీ ఆదివారం సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నేతలకు కీలక సూచనలు జారీ చేశారు. ‘‘అసెంబ్లీ, మండలి సమావేశాలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలి. సమావేశాల్లో అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. నాడు రైతుబంధు తీసుకొచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి.
బీఆర్‌ఎస్ ఎల్పీలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఘత్వం. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా?. సమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ.. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా?’’ అని ప్రశ్నించారు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాల్లో ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ వివరించాలి. నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలి.
ఫార్మాసిటీ ఎందుకు ప్రతిపాదించింది. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. నిర్భంద పాలన గురించి సమావేశాల్లో ప్రస్తావించాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయమై నిలదీయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలి. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం, పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం, కొత్త కమిటీల నియామకం, భారీ బహిరంగ సభ నిర్వహించేలా బీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేతలతో కేసీఆర్ చర్చించారు.
చదవండి👉 తెలంగాణలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ సేవలు
Comments
Please login to add a commentAdd a comment