సాక్షి, హన్మకొండ: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతోంది. దీంతో, దేశమంతా రామనామ స్మరణ వినపడుతోంది. మరోవైపు.. కొందరు కళాకారులు రాముడిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ కళాకారుడు బియ్యం గింజలతో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడి బొమ్మలు వేసి తన భక్తిని చాటుకున్నాడు.
వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే ఒప్పంద ఉపాధ్యాయుడు బియ్యం గింజలతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అయోధ్య ఆలయము నిర్మించి చూపర్లను ఆకట్టు కుంటున్నాడు. బియ్యం గింజలతో వారు చిత్రాలను గీసి రంగులు అద్దాడు. దీంతో, స్వామి వారి ఫొటో ఎంతో అందంగా కనిపిస్తోంది.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుమారు 130 కోట్ల ప్రజలు నివసిస్తున్న శ్రీరామచంద్ర ప్రభు జన్మించిన అయోధ్యలో రాముడి విగ్ర ప్రతిష్ట ప్రారంభ మహోత్సవం జరుగుతోంది. హిందూ ప్రజల కళలు నెరవేరుతున్న సందర్భంగా హిందువుల ఆరాధ్య దైవం రాముడిని స్మరించుకుంటున్నాను. ఉడతా భక్తితో ఈ పేదవాడు బియ్యపు గింజలతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అయోధ్య ఆలయంను నిర్మించి భగవంతునికి సమర్పిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment