Rice grains
-
అబ్బా ఇదేం రికార్డు.. చాప్‌స్టిక్స్‌తో జస్ట్ ఒక్క నిమిషంలో..!
వరల్ రికార్డ్సు సృష్టించడం కోసం చాలా మంది విభిన్న రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది భారీగా టాస్క్‌లు పెట్టుకుని ఆశ్చర్యం కలిగిస్తే..కొందరూ భలే ఈజీగా మనం రోజూ చూసే వాటితో క్లిష్టమైన టాస్క్‌లను చేసి రికార్డులు సృష్టిస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే బంగ్లాదేశ్‌కు చెందిన ఈ మహిళ. ఏం చేసి రికార్డు సృష్టించిందో వింటే ఆశ్చర్యపోతారు. చైనా వాళ్లు ఆహారం తినేందుకు ఉపయోగించే చాప్‌స్టిక్స్‌తో బియ్యం గింజలు తిని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఫిబ్రవరి 17, 2024న బంగ్లాదేశ్ మహిళ సుమైయా ఖాన్ బియ్యం గింజలను చాప్‌స్టిక్స్‌తో తినడం అనే ఛాలెంజ్‌ని స్వీకరించింది. అయితే సుమైయా చాప్‌స్టిక్‌లతో జస్ట్ ఒక నిమిషంలో దాదాపు 37 గింజలు తిని టాస్క్‌ని పూర్తి చేసింది. టాస్క్ పూర్తి అయ్యిన వెంటనే ఆనందంగా సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రపంచ గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ఇన్స్టాగ్రామ్ వేదికగా నెట్టింట షేర్ చేసింది. గతంలో ఈ రికార్డు కాలిఫోర్నియాకు చెందిన టెలాండ్ లా అనే వ్యక్తి పేరిట ఉంది. అప్పడు టెలాండ్ ఒక నిమిషంలో 27 బియ్యం గింజలు తిని రికార్డు సృష్టించగా..దాన్ని సుమైయా బ్రేక్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: అధునాత రాతి కోట..! దేనిపై నిర్మిస్తున్నారో తెలుసా..?) -
Ayodhya: బియ్యపు గింజలతో సీతారాముడు, అయోధ్య..
సాక్షి, హన్మకొండ: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతోంది. దీంతో, దేశమంతా రామనామ స్మరణ వినపడుతోంది. మరోవైపు.. కొందరు కళాకారులు రాముడిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ కళాకారుడు బియ్యం గింజలతో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడి బొమ్మలు వేసి తన భక్తిని చాటుకున్నాడు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే ఒప్పంద ఉపాధ్యాయుడు బియ్యం గింజలతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అయోధ్య ఆలయము నిర్మించి చూపర్లను ఆకట్టు కుంటున్నాడు. బియ్యం గింజలతో వారు చిత్రాలను గీసి రంగులు అద్దాడు. దీంతో, స్వామి వారి ఫొటో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుమారు 130 కోట్ల ప్రజలు నివసిస్తున్న శ్రీరామచంద్ర ప్రభు జన్మించిన అయోధ్యలో రాముడి విగ్ర ప్రతిష్ట ప్రారంభ మహోత్సవం జరుగుతోంది. హిందూ ప్రజల కళలు నెరవేరుతున్న సందర్భంగా హిందువుల ఆరాధ్య దైవం రాముడిని స్మరించుకుంటున్నాను. ఉడతా భక్తితో ఈ పేదవాడు బియ్యపు గింజలతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అయోధ్య ఆలయంను నిర్మించి భగవంతునికి సమర్పిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
ధాన్యం అమ్మాలన్నా.. నగదు అందాలన్నా..రోడ్డెక్కాల్సిందేనా..?
మంచిర్యాలఅగ్రికల్చర్: యాసంగి ధాన్యం అమ్ముకోవడమే కాదు.. ఆ నగదు జమ కావాలన్నా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ధాన్యం విక్రయించి నెల రోజులు గడిచినా నగదు అందక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అప్పు చెల్లించడానికి, సాగు పెట్టుబడికి నగదు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామ రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు. జిల్లాలో 262 కొనుగోలు కేంద్రాల్లో 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ నెల 16వరకు జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ముగిసాయి. తరుగు, మిల్లర్ల తిరకాసు, గన్ని సంచులు, లారీల కొరత, అకాల వర్షాలతో అరిగోస పడ్డారు. క్వింటాల్‌కు ఐదు నుంచి పది కిలోల వరకు కోతలు పెట్టారు. ధర్నాలు, ఆందోళనలతో రోడ్డెక్కి ధాన్యం విక్రయించినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే నగదు జమ చేస్తామని అధికారులు, పాలకులు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. నగదు కోసం మరోసారి ఆందోళనలు చేపట్టాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. నగదు రూ.147.33 కోట్లు పెండింగ్ ఈ సీజన్లో 25,088 మంది రైతుల నుంచి 1,80,483.040 టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు గాను రూ.353,74,67,584 రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఇప్పటివరకు 16,578 మందికి గాను రూ.206,41,63,488 ఖాతాల్లో జమైంది. ఇంకా 8,510 మందికి రూ.రూ.147,33,04,096 అందా ల్సి ఉంది. బుక్ కీపర్లు రైతుల నుంచి కొనుగోలు చే సిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లో అప్లోడ్ చేసిన 48 గంటల్లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ నెల గడుస్తున్నా డబ్బులు అందక రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సాగు పనులు చేపట్టారు. నగదు అందని రైతులు ఇంకెప్పుడు చెల్లింపులు చేస్తారోనని ఆందోళనలో ఉన్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచే డబ్బులు రాలేదని, జమ అయిన వరకు రైతులకు బది లీ చేశామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. నెలరోజులు దాటింది.. ధాన్యం విక్రయించి నెల రోజులు దాటింది. అయినా డబ్బులు ఖాతాలో జమ కాలేదు. 239 బస్తాలు తూకం వేసినా డబ్బుల చెల్లింపు లేకపోవడం దారుణం. రెండు రోజులలో పడుతయని చెప్పి నెల రోజులుగా తిప్పతున్నారు. సెంటర్ నిర్వాహకులను అడిగితే మిల్లు ట్యాగింగ్ కాలేదని చెబుతున్నారు. వానాకాలం సాగు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు చేతిలో పైసలు లేక తిప్పలు పడుడు అయితంది. – రైతు శివలాల్, గ్రామం: లింగపూర్, మం:దండేపల్లి ధాన్యం డబ్బుల కోసం రైతుల రాస్తారోకో దండేపల్లి: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం విక్రయించిన 40రోజులు దాటినా నగదు చె ల్లించకపోవడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. మండలంలోని లింగా పూర్ గ్రామనికి చెందిన పలువురు రైతులు స్థాని కంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధా న్యం విక్రయించారు. ఖాతాలో నగదు జమ కాకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మా ట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెబుతున్నారని, 40 రోజు లు గడుస్తున్నా ఖాతాలో జమ కావడం లేదని ఆరోపించారు. సహకార సంఘం కార్యాలయాని కి వెళ్లి అడిగితే మిల్లు ట్యాగింగ్ కాలేదని చెబుతున్నారని అన్నారు. వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సై ప్రసాద్ రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
కంటిలో నుంచి బియ్యపు గింజలు.. బాలిక నరకయాతన..
-
కొండబారిడి దంపుడు బియ్యానికి గుర్తింపు
కురుపాం: కురుపాం మండలానికి మారుమూలన ఉన్న కొండబారిడి గిరిజన మహిళల శ్రమకు ఫలితం దక్కేరోజు వచ్చింది. వ్యాపారం మరింత వృద్ధిచేసుకునే అవకాశం కలిగింది. గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు దంపుడు బియ్యాన్ని వ్యాపారంగా మలచుకున్నారు. 2019లో సత్యగాంధీ దంపుడు బియ్యం కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. గ్రామంలో సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యాన్ని రోళ్లలో దంచి బియ్యంగా మలస్తున్నారు. కిలో ప్యాకెట్ల రూపంలో ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తి చేస్తున్నారు. వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్న మహిళల విజయగాథపై ఈ నెల 24న “దంపుడు బియ్యానికి కేరాఫ్ కొండబారిడి’ శీర్షికన “సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. మహిళల శ్రమను, కొత్త ఆలోచనను ప్రశంసించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈనెల 26న తన ట్విట్టర్ ఖాతాలో “పార్వతీపురం మన్యం జిల్లాలోని కొండబారిడి మహిళలు దంపుడు బియ్యంతో వినూత్న వ్యాపారాన్ని మొదలు పెట్టారు. సభ్యులంతా కలిసి రోళ్లలో దంచిన బియ్యాన్ని విక్రయిస్తూ లాభం పొందుతున్నారు. గిరిజన మహిళలు ఒక ఉపాధి మార్గాన్ని సృష్టించుకుని మైదాన ప్రాంత ప్రజలకు సరఫరా చేయడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. దీనికి స్పందించిన గిరిజన సహకార సంస్థ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉద్యోగులను కొండబారిడి గ్రామానికి గురువారం పంపించారు. గిరిజన మహిళలకు గిట్టుబాటు ధర చెల్లించి దంపుడు బియ్యాన్ని కొనుగోలు చేసి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా కొంత నగదును మహిళలకు చెల్లించినట్టు జీసీసీ అధికారులు తెలిపారు. జీసీసీ ఆధ్వర్యంలో కొండబారిడి దంపుడు బియ్యాన్ని మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: దంపుడు బియ్యానికి c/o కొండబారిడి) -
దంపుడు బియ్యానికి c/o కొండబారిడి
దంపుడు బియ్యంలో పోషకాలు అధికం. ఆరోగ్యానికి మేలు. అందుకే మార్కెట్లో గిరాకీ ఉంది. నాణ్యమైన దంపుడు బియ్యం వినియోగించేందుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. దీనినే ఓ మారుమూల గిరిజన గ్రామ మహిళలు ఆదాయవనరుగా మలచుకున్నారు. కొండ జక్కరతో సేంద్రియ పద్ధతిలో పండించే ధాన్యాన్ని ‘జట్టు’గా రోకళ్లతో దంచి బియ్యంగా మార్చుతున్నారు. కిలోల చొప్పున ప్యాక్‌చేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. గ్రామాన్ని దంపుడు బియ్యానికి కేరాఫ్‌గా మార్చిన కొండబారిడి గిరిజన గ్రామ మహిళల విజయగాథకు ‘సాక్షి’ అక్షర రూపం. కురుపాం(పార్వతిపురం మాన్యం): కొండబారిడి.. కురుపాం మండలానికి మారుమూలన ఉన్న చిన్న గిరిజన గ్రామం. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగుచేస్తున్నారు. వరిని సైతం అదే దారిలో పండిస్తున్నారు. ధాన్యాన్ని మరపట్టించాలంటే కొండపైనుంచి కిందకు దించాలి. వ్యయప్రయాసలకోర్చాలి. అందుకే.. ఏ ఇంటిలో చూసినా ఏ రోజు తిండిగింజలను ఆ రోజు రోకళ్లతో దంచి బియ్యంగా మార్చడం మహిళల దినచర్య. మరోవైపు దంపుడు బియ్యంతో ఆరోగ్యం సిద్ధిస్తోంది. వీటికి మార్కెట్లో గిరాకీ ఉంది. దీనిని కొందరు మహిళలు గుర్తించారు. ఒక అడుగు ముందుకు వేశారు. ‘జట్టు’ సంస్థ సాయంతో 2019లో సత్యగాంధీ దంపుడు బియ్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీని నిర్వహణలో అన్నపూర్ణ, శాంతి, ఏకలవ్య, శ్రీ కృష్ణ, శ్రీ భగవాన్, మిత్ర, సావిత్రి సంఘాలకు చెందిన మహిళలు భాగస్వాములయ్యారు. స్థానికంగా లభ్యమైన ధాన్యాన్ని దంచి దంపుడు బియ్యంగా మార్చుతున్నారు. కిలో ప్యాకెట్లుగా మార్చి తెలంగాణాలోని హైదరాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు బీఎంపీఎస్ ట్రావెల్స్‌లో సరఫరా చేస్తున్నారు. ఆర్డర్ల ప్రకారం ఎగుమతి చేస్తున్నారు. కొండబారిడి గ్రామం శతశాతం సేంద్రియ వ్యవసాయ గ్రామంగా ఎంపిక కావడం, అక్కడ పండే ధాన్యాన్ని దంపుడు బియ్యంగా మార్చి విక్రయిస్తుండడంతో కొనుగోలుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. దంపుడు బియ్యంతో బోలెడు ప్రయోజనాలు ► దంపుడు బియ్యంలో గోధుమ రంగులో ఉండే సెలీనియం పెద్ద పేగుకు కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ► దంపుడు బియ్యంలో ఉండే పీచుపదార్థం జీర్ణ వ్యవస్థలో ఉండే కేన్సర్ కారకాల రసాయానాలను బయటకు పంపుతూ పెద్ద పేగుకు కేన్సర్ రాకుండా కాపాడుతుంది. ► గోధుమ రంగులో ఉండే పైటోన్యూట్రిన్స్ లిగ్నాట్ రొమ్ము కేన్సర్, గుండె జబ్బులను అడ్డుకునేందుకు సహాయ పడుతుంది. ► వయస్సు మళ్లిన మహిళలపై జరిగిన అధ్యయనంలో దంపుడు బియ్యం (ముడి బియ్యం) తినడం వల్ల ఎంట్రోలాక్ట్స్ స్థాయి పెరిగి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. గుండె జబ్బులు దరిచేరవు. ► దంపుడు బియ్యంలో పీచు పదార్థాలు అధికంగా ఉండడంతో ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండేలా చూస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉండదు. శరీర బరువు సాధారణంగా ఉంటుంది. ► ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన మెగ్నీషియం 21 శాతం వరకు దంపుడు బియ్యంలో పుష్కలంగా లభిస్తాయి. ► రోగనిరోధక శక్తిని పెంపొందించి, రక్తం గడ్డకట్టకుండా ఉపయోగ పడుతుంది. జీర్ణవ్యవస్థ ద్వారా వ్యర్థాలను బయటకు పంపుతుంది. ► గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్–2 డయాబెటీస్ ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. ఆదాయం బాగు.. ►2019లో ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో స్వయంగా దంపుడు చేసిన 1000 కేజీల బియ్యంను కేజీ రూ.45 చొప్పున విక్రయించి రూ.45,000 వేలు ఆదాయం ఆర్జించారు. ►2020–21 సంవత్సరాల్లో 2000 కేజీల బియ్యంను రూ.50 చొప్పున విక్రయించగా ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. మూడున్నర సంవత్సరాలుగా లక్షా 35వేల పెట్టుబడితో రూ.లక్ష ఆదాయం పొందినట్టు మహిళా సంఘ సభ్యులు తెలిపారు. మార్కెట్లో గిరాకీకి తగ్గట్టుగా దంపుడు బియ్యం సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషకాలు మెండు ముడి బియ్యంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పోలేట్ (పోలిక్ యాసిడ్), బి–విటమిన్లు శరీరానికి కొత్త కణాలను ఏర్పరచేందుకు సహాయపడతాయి. పుట్టకతో వచ్చే లోపాలు తగ్గుతాయి. బియ్యంలో అధికంగా ఉండే పీచుపదార్థం రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. – ఎ. ప్రసన్నరాణి, కృషివిజ్ఞాన కేంద్రం, విస్తరణ విభాగ శాస్త్రవేత్త, రస్తాకుంటుబాయి, కురుపాం మండలం తెలిసిన వ్యాపారం.. బియ్యం దంచడం మాకు నిత్యకృత్యం. దంపుడు బియ్యానికి మార్కెట్లో డిమాండ్ ఉన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఏడు సంఘాల మహిళలం ఏకమయ్యాం. ప్రతిరోజూ ధాన్యాన్ని దంచుతూ బియ్యం తయారు చేస్తున్నాం. నాణ్యమైన బియ్యం కావడంతో డిమాండ్ పెరుగుతోంది. ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం కిలో రూ.65కు విక్రయిస్తున్నాం. – పత్తిక సుశీల, గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు, కొండబారడి, కురుపాం మండలం కొండబారిడి గ్రామంలో ఉన్న సత్యగాంధీ దంపుడు బియ్యం కేంద్రం -
బియ్యపుగింజపై భగవద్గీత.. వెంట్రుకలపై రాజ్యాంగ పీఠిక
హైదరాబాద్ సిటీలో ఎందరో చిత్రకారులు ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొంతమంది గీసిన బొమ్మలోని భావాలు మనసు లోతుల్లోకి చేరుతాయి. కొందరి చిత్రాలు సమాజంలో అన్యాయాన్ని ఎత్తి చూపిస్తాయి. మరికొందరి చిత్రాలు ‘వారెవా.. భలే ఆర్ట్’ అనిపిస్తుంది. మూడో కోవకు చెందిన యువతే స్వారిక రామగిరి. ప్రముఖుల ముఖచిత్రాలు గీసినా బియ్యం గింజపై భగవద్గీత రాసినా.. తనకు తానే సాటిగా నిలుస్తూ నేటితరం అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది స్వారిక. – హిమాయత్‌నగర్ హైదరాబాద్ ఉప్పుగూడకు చెందిన రామగిరి శ్రీనివాసచారి, శ్రీలత కుమార్తె స్వారిక. హైకోర్టులో లాయర్‌గా ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చిన్నతనం నుంచే ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఓరోజు తన అన్న చంద్రకాంత్‌చారి పేపర్‌తో వినాయకుడిని చేశాడు. ఆ ఆర్ట్‌కు ఇంట్లో, బయటా మంచి ప్రశంసలు దక్కాయి. అంతే.. ఆ సమయాన స్వారిక మనసులో ఓ ఆలోచన తట్టింది. ‘నేనెందుకు కొత్తగా బొమ్మలు గీయడం మొదలు పెట్టకూడదు, నేనెందుకు అందరి ప్రశంసలు అందుకోకూడదు’ అని ప్రశ్నించుకుంది. అలా అనుకున్నదే తడవుగా మొదటిసారి బియ్యపుగింజపై వినాయకుడి బొమ్మ గీసింది. దీనిని అందరూ మెచ్చుకోవడంతో ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. జాతీయజెండా, భారతదేశపు చిత్రపటం, ఎ టు జెడ్ ఆల్ఫాబెట్స్ వేసి అందరి మన్ననలను అందుకుంది. ఆ తర్వాత బియ్యపుగింజపై భగవద్గీతను రాసి చరిత్రను లిఖించింది స్వారిక రామగిరి. ప్రముఖుల ఆర్ట్‌కు కేరాఫ్.. ప్రముఖుల చిత్రాలను మైక్రో ఆర్ట్‌గా గీయడంలో స్వారిక ‘ది బెస్ట్’అని చెప్పాల్సిందే. ఎందుకంటే.. వారి నుంచి ఆమె అందుకున్న ప్రశంసలే దీనికి నిదర్శనం. ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల ముఖచిత్రాలను స్వారిక మైక్రో ఆర్ట్‌గా గీసింది. వాటిని వారికి పంపించగా స్వారికను అభినందిస్తూ సందేశాలు కూడా తిరిగి పంపారు. వీరి పుట్టినరోజు సందర్భంగా స్వారిక గీసిన మైక్రో ఆర్ట్‌లను పలువురు వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పుకోవడం గమనార్హం. 2005కిపైగా చిత్రాలు.. కళాఖండాలు స్వారిక ఐదేళ్ల ప్రాయంలో మొదలుపెట్టిన తన ఆర్ట్ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2005కుపైగా చిత్రాలు వేసింది. వీటిలో ప్రధానంగా మిల్క్ ఆర్ట్, పేపర్ కార్వింగ్, బాదంపప్పుపై ఆర్ట్, చింతగింజలపై ఆర్ట్, నవధాన్యాలు, బియ్యపుగింజలు, పాలమీగడ, నువ్వులగింజలు వంటి వాటిపై బొమ్మలు గీసింది. వెంట్రుకలపై రాజ్యాంగ పీఠిక స్వారిక తన తలలోని ఐదు వెంట్రుకలపై బొమ్మలు గీసి తనలోని అద్భుత నైపుణ్యాన్ని చాటుకుంది. కేవలం ఆరుగంటల్లో ఆ వెంట్రుకలపై రాజ్యాంగ పీఠికను రూపొందించి చరిత్ర సృష్టించింది. ఈ ఆర్ట్‌ను చూసిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్వారికను రాజ్‌భవన్‌కు పిలిపించి సన్మానం చేశారు. అంతేకాదు బాదంపప్పుపై గీసిన ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటం చూసి తమిళిసై ముగ్ధులయ్యారు. మోదీకి అందిస్తానని గవర్నర్ ఆ చిత్రపటాన్ని తీసుకోవడం గమనార్హం. స్వారిక టాలెంట్ గురించి తమిళిసై తన ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్ చేయడం విశేషం. నువ్వుల గింజలపైనా అద్భుత చిత్రాలను గీసింది స్వారిక. ఈఫిల్ టవర్, తాజ్‌మహాల్, చార్మినర్, వరంగల్ ఫోర్ట్, ఏ టు జెడ్ ఆల్ఫాబెట్ వంటి వాటిని వేసి ఔరా అనిపించింది. పాలమీగడపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్‌రావు తదితరుల చిత్రపటాలను వేసింది. (చదవండి: యాదాద్రికి ‘బంగారు’ విరాళాలు) -
బియ్యపు గింజలపై భగవద్గీత
సాక్షి, హైదరాబాద్ : బియ్యపుగింజలపై కేవలం 150 గంటల్లోనే భగవద్గీత రాసి యువతి రికార్డ్ సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన రామగిరి స్వారిక అనే లా స్టూడెంట్ ఈ అరుదైన ఘనతను సాధించి అందరి ప్రశంసలు అందుకొంటుంది. భగవద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలను మొత్తం 36,378 అక్షరాలతో కూడిన 9,839 పదాలతో 4,042 బియ్యపు గింజలపై రాశారు. చిన్నతనం నుంచే తనకు కళలపై ఆసక్తి ఎక్కువని గత కొన్నేళ్లుగా మైక్రో ఆర్ట్ చేస్తున్నానని వివరించింది. 2017లో ఒకే బియ్యపు గింజపై ఆంగ్ల అక్షరమాల రాసినందుకు గాను అత్యత్తుమ మైక్రో ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్వారిక చోటు సంపాదించుకున్నారు. స్వారిక ప్రతిభకు గానూ గతేడాది నార్త్ దిల్లీ కల్చరల్ అసోసియేషన్ రాష్ట్రీయ పురస్కార్‌ను ప్రధానం చేసింది. ఇప్పటివరకు వెయ్యికి పైగా మైక్రో డిజైనింగ్ చేసి పలు సత్కారాలు అందుకొంది. Telangana: A law student & a micro artist in Hyderabad has written 'Bhagavad Gita' on 4,042 rice grains. Ramagiri Swarika, artist says, "It took me 150 hrs to complete this. I've created over 2,000 micro artworks. I also do milk art, paper carving, drawing on sesame seeds etc." pic.twitter.com/KYYVRVsDks — ANI (@ANI) October 19, 2020 -
రైతన్నకు ‘అకాల’ దెబ్బ
సాక్షి, నెట్వర్క్: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం అకాలవర్షం అన్నదాతలను దెబ్బతీసింది. భారీ వర్షం కురవడంతో వరిధాన్యం నీటిపాలుకాగా, పత్తి తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అల్పపీడన ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కురిసిన వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరిధాన్యం, కోతకు వచ్చిన వరిపంట, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడవకుండా ఉండేందుకు రైతులు« ఎన్ని కవర్లు కప్పినా ఫలితం లేకుండా పోయింది. సుమారు ఐదు వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయింది. పొలాల్లో కోసి ఉన్న వరి మెదలు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి, ఇంటి ఆవరణలో నిల్వ ఉంచిన పత్తి తడిసి ముద్దయింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండాల్సి వచ్చిందని, ఇప్పుడు వర్షంలో తడిసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరబెట్టి తీసుకొచ్చినా తేమ సాకుతో, గన్నిసంచుల కొరత, లారీలు రావడం లేదని రకరకాల కారణాలతో పదిరోజులు వరకు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచాల్సి వచ్చిందని, వర్షంలో ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రైతులకు అధికంగా నష్టం జరిగింది. అలాగే.. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి, ధర్మపురి, గొల్లపల్లి, వెల్గటూర్ ప్రాంతాల్లో సుమారు 20 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం ఈ కాల వర్షానికి తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, బోయినపల్లి తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి. కరీంనగర్ జిల్లా చొప్పదండి, మానకొండూర్, సైదాపూర్ మండ లంలో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షంతోపాటు ఈదురుగాలుల ప్రభావంతో మొక్కజొన్న నువ్వుల పంటలు నేలకొరిగాయి. పెద్దపల్లి జిల్లాలో కురిసిన వర్షానికి గోదావరిఖనిలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. -
సారాంశం
రెండవ బహుమతి పొందిన కథ అర్థం కావు. చాలా విషయాలు అర్థం కావు. మనిషికి కన్నీళ్లు అర్థం కావు. దుఃఖం అర్థం కాదు. చుట్టూ ఉన్న సమాజం అర్థం కాదు. మనుషులు అర్థం కారు. ప్రకృతి అర్థం కాదు. వర్షం ఎందుకు కురుస్తుందో... తుఫాన్లు ఎందుకొస్తాయో... రవ్వంత అగ్ని ఎక్కడో ఒక బిందువుగా పుట్టి అరణ్యాలకు అరణ్యాలనే ఎందుకు దహిస్తుందో అర్థం కాదు. తను చిన్నగా... పదేళ్ల వయస్సులో ఒళ్లో కూర్చుండబెట్టుకుని నాన్న ఆప్యాయంగా తల నిమిరినప్పుడు... బడికి వెళ్లొస్తుంటే చిటపట చినుకులు ఒంటిపై కురుస్తున్నప్పుడు... ఊరికే అలా ఖాళీ ఆకాశంలోకి చూస్తూ గంటలకు గంటలు కూర్చున్నప్పుడు... పిడికెడు గుండెలో పొంగిన ఆనంద మహాసముద్రాలు అర్థమయ్యాయా? ఉహు... అస్సలేం అర్థం కాలేదు. వర్తమానంలోకి దూసుకొస్తున్నకొద్దీ గతం అర్థం కాలేదు. గతంలో నుండి భవిష్యత్తును అంచనా వేసుకోవాలంటే వర్తమానమూ అర్థం కావడం లేదు. నలభై అయిదేండ్ల అచల పొద్దుటి నుండి కారణాలను వెదికేందుకు ప్రయత్నిస్తోంది. భర్త. తనకూ ఆయనకూ నడుమ ఒక సముద్రమంత అంతరం. కారణం ఏమిటి? అభిరుచుల తేడా... వ్యక్తిత్వాల తేడా... తత్వాల తేడా. యినుము ఇత్తడితో అతకదు. కారణం ఏమిటి? ఇక పిల్లలు. రెక్కలొచ్చి... ఎగిరి... ఆకాశం విశాలం... బతుకులు విశాలం... ఎవరి దారి వారిది. ఎవరి జీవితం వారిది. కుటుంబం, సమూహం... విచ్ఛిన్నమై... ఎవరికి వారే ఒంటరి. కారణం ఏమిటి? పైకి ఒక ఇల్లు. లోపల... మనుషులు ఎవరి అరలో వాళ్లు. మధ్యలో అభేద్యమైన గోడలు. బైటికెళ్తే... పెద్ద ప్రపంచంలో ఒక చిన్న తను. లోపలికొస్తే ఒక చిన్న తనలోనే ఒక పెద్ద ప్రపంచం. నిరంతరం... అంతరాగ్నితో ఘర్షించే ప్రపంచం. ‘కి... కి.. కిచ్...’ చప్పుడు. ఉలిక్కిపడింది అచల. జ్ఞాపకాల తుఫానులో నుండి తెప్పరిల్లి కిందికి చూచింది. హాల్లో తను కూర్చున్న కుర్చీ ప్రక్కన... నేలమీద... చిన్న కోడిపిల్ల. పదిహేను రోజుల వయసున్న కోడిపిల్ల. నల్లనిది. అందమైంది. చురుకైంది. ప్రేమ గలది. తనవైపే చూస్తోంది. మిలమిల్లాడే చిన్న కళ్లతో... నిశ్శబ్దంగా, దీనంగా కూడా. కళ్లు చిన్నవే. చీమవి. పక్షివి. పామువి. ఏనుగువి. కాని చూపు మాత్రం చిన్నది కాదు. చూపు నిశితమైంది. చూపు తీక్షణమైంది. చూపు సూటిగా హృదయాన్ని తాకేది. చూపు నిండా కరుణ, దయ, వాత్సల్యాన్ని నింపుకునేది. అచల కాళ్లపై రైటింగ్ ప్యాడ్ పెట్టుకుని రాసుకుంటున్నప్పుడల్లా రాయడం ఆపి... కోడిపిల్ల దిక్కు మరింత పరిశీలనగా చూచింది. కొద్ది దూరంలో ఒక అరగంట క్రితం తను దానికోసం నేలపై పోసిన పిడికెడు బియ్యపు గింజలు, చిన్న సత్తుగిన్నెలో పోసిపెట్టిన నీళ్లు. అలాగే ఉన్నాయి. వాటిని విడిచి, వచ్చి తన ముందర అలా నిలబడి... తన వైపే చూస్తూ. దానికి తన ఆహారంపైనా, ఆకలి దప్పులపైనా ధ్యాస లేదు. తనపై... మనిషిపై... ఏదో అజ్ఞాతంగా అల్లుకుంటున్న మమకారం పైననే మక్కువ. దాన్ని ప్రేమ అంటారా? బంధం అంటారా? ఋణం అంటారా? ప్చ్... ఏమో! అచల మనసులో పదిహేను రోజుల కిందటి ఘటన కళ్లముందు కదిలింది. ఉదయం ఆరు గంటలు కూడా కాలేదు. ఆ రోజు ఒకటే వర్షం. మూడు రోజులుగా ఒకటే ముసురు. లేచి కళ్లు నులుముకుంటూ ఇంటి వెనక ఉన్న నీళ్లగది దిక్కు నడుస్తూంటే... పక్కనే రేకుల షెడ్డు కింద పారేసిన పాత సామాన్ల కుప్పలో నుండి ఏదో శబ్దం వినబడింది అచలకు. దగ్గరికెళ్లి చూస్తే... విరిగిన కుర్చీల పక్కనున్న దళసరి అట్టపెట్టెలో ఒద్దికగా కూర్చుని ఒక కోడిపెట్ట కొక్కుబట్టి ఉంది. మత్తుగా... బద్ధకంగా... గురగురలాడ్తూ... ఒంటి పైనున్న ఈకలను రిక్కిస్తూ. దగ్గరగా వెళ్లినా... అది కదిలి... భయపడి పారిపోలేదు. సరికదా ఇంకా ముడుచుకుని కడుపు కింద ఏదో దాచుకున్నట్టు సర్దుకుని కూర్చుంది. చేతితో తట్టి... లేబట్టి చూచింది తను. దాని కడుపు కింద ఐదారు గుడ్లు. వాటిపైన కూర్చుంది... వెచ్చగా. అంటే... యిది గుడ్లను పొదుగుతున్నట్టా? ఎప్పట్నుండి పొదుగుతోంది? అసలీ కోడి ఎక్కడిది? ఎవరిది? ఎలా వచ్చింది తమ యింటికి? ఊరి బయట... కొత్తగా ఏర్పడ్తున్న కాలనీలో... ఈ మధ్యనే కట్టుకున్న ఇల్లు తమది. అక్కడో ఇల్లు యిక్కడో ఇల్లు. కోళ్లు... కుక్కలు... ఎవరికెవరివో ఎక్కడెక్కడో తిరుగుతూండడం మామూలే. కోడిపెట్ట భయం భయంగా... బెరుకుగా కూర్చుంది. అచల వైపు ఎంతో ప్రాధేయ పూర్వకంగా చూచింది... ‘ప్లీజ్... డిస్టర్బ చేయకు’ అన్నట్లు. అచల దాన్నక్కడే... అలాగే విడిచిపెట్టి... వాకిట్లోకి వచ్చి... బాత్రూమ్కు వెళ్లింది. కాని... ఆమెకు తెలియకుండానే ఆమె మనసు ఆ కోడిపెట్ట అట్టపెట్టెలో చిక్కుకు పోయింది. అప్పట్నుంచీ గంట రెండు గంటలకొకసారి అటు వెళ్లి... కోడిపెట్టను డిస్టర్బ చేయకుండానే గమనించేది. ఎన్ని రోజులైందో.. కోడిపెట్ట గుడ్లను పొదుగుతూ. మర్నాడు ఉదయం లేవగానే ఉత్సుకతలో నిశ్శబ్దంగా వెళ్లి గమనిస్తే... చిన్న కోడిపిల్లల కిచకిచల చప్పుడు వినిపించింది. ఆశ్చర్యం! ధైర్యంగా కోడిపెట్టను చేత్తో పట్టుకుని పెకైత్తి చూస్తే నాల్గు పిల్లలు ఉన్నాయి. రెండు నల్లవి. ఒకటి గవ్వలది. ఒకటి బూడిద రంగు. అన్నీ ముద్దొస్తున్నాయి. అప్పుడూ వర్షమే. జాగ్రత్తగా తల్లి కోడినీ... నాల్గు పిల్లలనూ... ఇంట్లోకి తెచ్చింది. హాలులోకి తెచ్చి... బియ్యపు గింజలేసి... నీళ్లు పెట్టింది. ఒక కొత్త సందడి. ఐదు జీవులు. ఇంట్లో ఉన్న రెండు మానవ జీవాలకు అదనంగా. తామిద్దరు. భార్య, భర్త మాటలు ఉండని... హృదయాలు కలవని... సంబంధాలు లేని... లోకం దృష్టిలో ఏకస్తులే ఐనా ఒకరికొకరు ఏమీ కాని పూర్తి పరస్పర పరాయి మనుషులు. యిప్పుడు... ఈ ఐదు ప్రాణాలు. కొక్కొక్కొకో... కిచ్ కిచ్ కిచ్... ఇల్లంతా కోడిపిల్లలు, తల్లికోడి తిరుగుడు. సందడి. అటు ఇటు నడకలు... పరుగులు. చిన్న చిన్న రెక్కలు... తోక... సూది మొనలా ముక్కులు... చిన్ని చిన్ని కాళ్లు... ఎంత ముద్దో. భగవత్ సృష్టిలో జీవి ఏదైనా... దేని అందం దానిదే. దేని ఆకర్షణ దానిదే. చీమైనా... కోడిపిల్లయినా... ఖడ్గ మృగమైనా... శిశు సింహమైనా! ఒకరోజు... రెండు రోజులు... అచల దాదాపు బైటికి పోవడం మానేసింది. తల్లికోడి... పిల్లలు... అవే తన లోకమై పోయాయి. పాలవాడు... పేపర్‌వాడు... పనిమనిషి లచ్చమ్మ... అందరూ... ఆసక్తిగా వాటిని గమనించి... ఉచిత సలహాలు ఇస్తున్నారు. ‘ఊర్కే యింట్లోనే ఉంటే ఎలాగమ్మా. బైటి గాలి తగలాలి గదా. అలా ఇంటెనక పెరట్లోకి తీసుకెళ్లండి. కాని జాగ్రత్తమ్మో. పిల్లి.. గ్రద్ద...’ ఇలా. అచల రెండ్రోజుల తర్వాత... కోడిపెట్టనూ, పిల్లలనూ, జాగ్రత్తగా యింటి వెనుక పెరట్లో వదిలి... ప్రక్కనే ఓ కుర్చీ వేసుకుని, చేతిలో ఓ పొడుగాటి కర్ర పట్టుకుని వాటికి కాపలాగా కూర్చుంది. అచల పేపర్ చదువుకుంటూ... చుట్టూ అటూ ఇటూ తిరుగుతూ... పైకి ఆకాశంలోని గ్రద్దల దిక్కూ... యింటి ఫెన్సింగ్ వైపు పిల్లి జాడ దిక్కూ... చూస్త. ఐదవరోజు... దాహమేస్తే అచల వంటగదిలో కొచ్చి... మంచినీళ్లు తాగుతుండగా. బయట పెరట్లో గోల గోల వినబడింది. కోడి కొట్టుకుంటున్నట్టు... ఏదో పెనుగులాడు తున్నట్టు గలాటా... చప్పుడు... ఏదో దాడి. తీరా ఒక్క అంగలో పరిగెత్తి చూస్తే... పెద్ద మగ ఊరకుక్క. ఎదురింటి ఇక్బాల్ వాళ్లది. తల్లి కోడిని నోట్లో కరుచుకుని... ఒకటే పరుగు. పాపం... కోడిపిల్లలు... నాల్గు... పరుగెత్తుకొచ్చినై యింట్లోకి భయంతో... వచ్చి నక్కి నక్కి దాక్కున్నాయి. వాటిని దగ్గరికి తీసుకుంది అచల. దోసిట్లోకి తీసుకుని ఎంతో ప్రేమగా నిమిరింది. నీళ్లు తాగించింది. ఎందుకో అచలకు దుఃఖం, బాధ... విలవిల్లాడ్తూ... కడుపులో ఎవరో దేవుతున్నట్టు. మర్నాడు పెరటి దిక్కు దర్వాజకు... ఓ యినుప జాలీ అడ్డం పెట్టింది. పిల్లలు యింట్లోనే... మంచిగానే... సందడి సందడిగా అటూ ఇటూ ఎంతో హుషారుగా తిరుగుతున్నాయి. పదవరోజు... పదురుకున్నట్టు... రెండు గండు పిల్లులు వచ్చాయి. వరుసగా ఒకదాని వెంట ఒకటి... వీధి దర్వాజాలో నుండి విడిచిన బాణంలా ఉరికొచ్చి చెరో కోడిపిల్లనూ తన్నుకుపోయినై. మళ్లీ మనసంతా బోసిపోయి... విలవిల... దుఃఖం మౌనక్షోభ. యిక రెండు పిల్లలు మిగిలినై. ఒకటి నలుపు... మరొకటి బూడిద రంగు. చాలా జాగ్రత్తలు తీసుకుంది అచల ఆ రెండింటినీ ఎలాగైనా రక్షించాలని. ఆమెకు తెలియకుండానే ఆమె మనసు నిండా కోడిపిల్లలు... వాటిని ఎలా కాపాడాలి... పిల్లి, కుక్క దాడి నుండి ఎలా వాటిని రక్షించాలి. ఇవే ఆలోచనలు. పాపం... రెండు కోడిపిల్లలూ ఆమె వెంటనే తిరిగేవి కిచకిచలాడ్తూ. ఎటు పోతే అటు... కిచెన్‌లోకి, బెడ్రూంలోకి, హాల్లోకి అన్నిట్లోకీ పోతుండేవి. భాషకందని ఏదో బంధం ఏర్పడినట్టు అర్థమైంది అచలకు... తనకూ వాటికీ. రెండ్రోజుల క్రితం... ఏమైందో ఏమో... గంప కింద కమ్మిన కోడిపిల్లలను పొద్దున లేవగానే ఆతురతగా చూస్తే... బూడిద రంగు పిల్ల చచ్చిపోయి బిగుసుకుని ఉంది. చచ్చిన దాని శరీరం నిండా గుంపులు గుంపులుగా చీమలు పట్టేశాయి. తీసుకెళ్లి బైటపడేసింది కాలువలో... చచ్చిన కోడిప్లిలను బరువెక్కిన హృదయంతో. అచల భర్త... ఈ కోడిపిల్లల తతంగాన్నీ, వాటి క్రమానుగత మరణాలనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా గమనిస్తూ... సంతోషపడ్తూ... వెకిలిగా దేహ భాషను ప్రదర్శిస్తున్నాడు. అతని పైశాచికానందం అచలకు చిర్రెత్తించింది. బహుశా... అందువల్లనేనేమో. మిగిలిన ఒక్క నల్లరంగు కోడిపిల్లపై అచలకు అచంచలమైన ప్రేమ ఇనుమడించింది. ‘‘బుజ్జిముండా.. నీకు నేనున్నానుగదే’’ అంది అచల ఆ రోజు. దోసిట్లోకి కోడిపిల్లను తీసుకుని ప్రేమగా నిమిరింది అచల. చేతుల్లో... వెచ్చగా... మెత్తగా పట్టు వలె బూరు. ఎత్తుకుంటే అవది దోసిలి నిండా ఉంది. పదిహేను రోజుల్లో కాస్త సైజు పెరిగి... చక్కగా ఎదిగిందిది. అలవాటైంది అచలక్కూడా. యింట్లో అటు ఇటూ తిరుగుతూ... పక్కనే వెంట నడిచి వచ్చే కోడిపిల్లను గమనిస్తూ ఆనందించడం... ముచ్చటపడ్డం. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నా... వంటగదిలో స్టౌ ముందు నిలబడి ఏదైనా వండుతున్నా, బాత్రూమ్కు వెళ్తే, బయటికి రాగానే డోర్ దగ్గరే... వెంట నీడలా వచ్చేది కోడిపిల్ల. వైరి భర్త... అర్థంలో నెరిసిన జుట్టును దువ్వుకుంటూ... ‘కోళ్లమీదున్న ప్రేమ మనుషుల మీదుంటే ఎంత బాగుండునో’ అని బిగ్గరగా గొణుగుతూ... పిచ్చి ఆనందంతో ఈల వేసుకుంటూ... ఓ వెటకారపు చూపును... కోడిపిల్లపై అచలమై విసుర్తూ తిరుగుతున్నాడతను. ఆ రోజు... అతను వీధి గుమ్మం తెరిచి... బైటికి కదుల్తూండగా... ఎప్పటినుండి పొంచి చూస్తోందో పిల్లి మాటేసి... మెరుపులా ఉరికొచ్చి కోడిపిల్లను నోట కరుచుకుని లిప్తలో పరుగుతీస్తూ మాయమైంది. కోడిపిల్ల చావుకేక... అరుపు... దాని నల్లని బూరు... ఈకలు. క్షణంలో... ఏదో బీభత్సం... నేలపై... ఐదారు రక్తపు బొట్లు. దూరమౌతున్న కోడిపిల్ల ఆర్తనాదపు... అరుపు... సన్నగా. అచల దిగ్గున లేచి... పిల్లి పరుగెత్తిన దిక్కు ఉరికింది. కాని లిప్తకాలంలో అంతా అయిపోయింది. ‘‘వెల్డన్. మంచి పనైంది. డర్టీ చిక్...’’ అతనంటున్నాడు... గుమ్మంలో నిలబడి సంతోషంగా నవ్వుతూ అన్నాడు భర్త. పిచ్చి ఆనందం అతనిలో. అచల తలలో ఎందుకో చటుక్కున ఏదో బాంబు పేలినట్టయింది. ఒళ్లూ... మనసూ... హృదయం... కంపించి బ్రద్దలైనట్టుగా ఉంది. అతని వంక... పరమ అసహ్యంగా చూచి... పిచ్చిదానివలె చిర్రెత్తి... పక్కన టీపాయ్ పైనున్న గాజు ఫ్లవర్‌వేజ్‌ను తీసి కోపంతో నేలకేసి కొట్టింది. ఫ్లవర్‌వాజ్ భళ్లున చిట్లి... ముక్కలు ముక్కలై ఎగిసింది. హాలు నిండా గాజు పెంకులే. క్షణకాలం... తల్లికోడి... పిల్లలు నాలుగూ ఒక్కొక్కటి... వరుసగా... కుక్కకు... పిల్లులకు.. బలైపోయాయి. దాడి... నిస్సహాయ జీవులపై బలమైన జంతువుల దాడి. నిర్విరామ దాడి. అన్నీ మనసులో మెదుల్తూండగా... ఎందుకో దుఃఖం ముంచుకొచ్చింది అచలకు. ముఖాన్ని దోసిట్లో దాచుకుని చిన్నపిల్లలా భోరున ఏడ్చింది. మనిషికి దుఃఖం అర్థం కాదు. - పి.అమరజ్యోతి